నీరు, విద్యుత్ కొరత తప్పదు.. యాసంగిలో వరి సాగు వద్దు: సీఎం రేవంత్

- A
- A+
- A++

హైదరాబాద్: ఎల్‌నినో విషయంలో శాస్త్రవేత్తలు ఊహించినట్లుగానే పరిస్థితులు చేయిదాటి పోయేలా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ( Revanth Reddy) అన్నారు. నీరు, విద్యుత్ కొరతను తీవ్రంగా ఎదుర్కోబోతున్నట్లు తెలిపారు. ప్రజల దైనందిన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితులపై మంత్రులతో చర్చించిన అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
వరి సాగు వాయిదా వేసుకోండి..
‘‘గతేడాది ఈ సమయానికి రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి 400 టీఎంసీలకుపైగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది 209 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఈ నీళ్లనే పొదుపుగా వాడుకోవాలి. వచ్చే ఎనిమిది నెలలు అత్యంత కీలకం. మళ్లీ వర్షాలు వచ్చేవరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్‌కు నీరందించే జలాశయాలూ ఎండిపోతున్నాయి. రైతులు పెద్దమనసు చేసుకుని.. ఒక వరి సీజన్‌ను వాయిదా వేసుకోవాలి. యాసంగిలో వరి పంట వేయొద్దు. రైతులను ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
కేంద్రం ఆదుకోవాలి..
ఎండల తీవ్రత వల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. సగటుపై అదనంగా 5 వేల మెగావాట్ల విద్యుత్ వాడకం పెరిగింది. అక్టోబరులో ఈ స్థాయి విద్యుత్ వినియోగం చరిత్రలో ఎప్పుడూ లేదు. మార్కెట్లో విద్యుత్ ఏ ధరకు దొరికినా కొనేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రానికి అదనపు విద్యుత్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. విద్యుత్‌పై ఇచ్చే సబ్సిడీలను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్‌నినో కష్ట కాలంలో రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవాలి. కేంద్ర-రాష్ట్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర నిధుల వాటా పెంచాలి.
విపక్షాలు కలిసి రావాలి..
సమస్యను పరిష్కరించేందుకు కేబినెట్ సబ్‌కమిటీ వేస్తున్నాం. దసరా తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తాం. కేంద్రం నుంచి అధిక నిధులు పొందేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించాం. విపక్షాలు కూడా రాజకీయం చేయకుండా ప్రభుత్వంతో కలిసి రావాలి. ప్రకృతి విపత్తును జయించేందుకు అందరి సహకారం కావాలి. దుష్ప్రచారాలను నమ్మకుండా అందరూ సంయమనంతో ఉండాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 19:59 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- LIVE: ఎల్‌నినో పరిస్థితులు.. భవిష్యత్తు ప్రణాళికలపై సీఎం రేవంత్ ప్రెస్‌మీట్ ఎల్‌నినో కారణంగా తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం.
- ఊబకాయం.. జీవనశైలితో ‘తేలిక’వుదాం ఊబకాయం పిల్లల నుంచి పెద్దల దాకా పెను సమస్యై కూర్చుంది. దీన్ని తగ్గించుకోవడానికి జనం పడే తంటాలు అన్నీఇన్నీ కావు.
- ‘రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి’.. సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు కుంభకోణం ఆపాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.
- ఎల్‌నినో కోరలు చాచింది.. విద్యుత్తు వృథాకు బ్రేకులు వేద్దాం! ఎల్‌నినో తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం ప్రభావం క్రమంగా ఒక్కో రంగంపై కనిపించడం మొదలైంది.
- వీడియో: బల్కంపేట ఎల్లమ్మకు గాజులతో ప్రత్యేక అలంకరణ దేవీ నవరాత్రుల సందర్భంగా ఐదోరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లిని గాజులతో అందంగా అలంకరించారు.
- 24 లక్షల ఎకరాల అటవీభూములు ఏమయ్యాయి?: మహేశ్వర్‌రెడ్డి రాష్ట్రంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.
- రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌రెడ్డి అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
- ప్రతి మార్కెట్ యార్డులో సోలార్ వ్యవస్థలు: మంత్రి తుమ్మల ప్రతి మార్కెట్ యార్డులో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
- HYDలో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్.. 9 నెలల్లో 13.1 లక్షల చదరపు అడుగులు వేగంగా అభివృద్ధి చేందుతున్న భాగ్యనగరంలో అనేక దిగ్గజ సంస్థలు కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి
- మ్యూల్ ఖాతాలతో తప్పదు మూల్యం ‘‘బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు మాకు ఇస్తే చాలు.. ఇక నెలనెలా కనక వర్షమే అన్న సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఆశపడ్డాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు.
- ‘సింగరేణి’ని ప్రైవేటీకరణ చేయబోం.. చేయబోనివ్వం: మంత్రి శ్రీధర్‌బాబు సింగరేణి సంస్థను దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు ఆక్షేపించారు.
- ‘ఎల్‌నినో’పై అఖిలపక్ష సమావేశం.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఎల్‌నినో ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- డిసెంబర్ 18 నుంచి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన(39వ) డిసెంబరు 18 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది.
- డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ తనిఖీలు నగర పరిసరాల్లోని డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ తనిఖీలు చేపట్టింది.
- యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సీఈపై సస్పెన్షన్ వేటు దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం చీఫ్ ఇంజినీర్ సురేశ్ నాయక్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
- అభయమివ్వమ్మా.. దుర్గమ్మా.. ఆలయాల్లో దేవీ నవరాత్రి శోభ! తెలుగు రాష్ట్రాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు ఆలయాల్లో అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా, స్కంధమాతగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి దేవిని దర్శించుకుంటున్నారు.
- విద్యుత్ సమస్యలను అధికారులపై నెట్టడం సరికాదు: హరీశ్‌రావు తప్పు చేసి అధికారులపై నెపం నెట్టడం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు పరిపాటిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు.
- కారులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజిగూడ పైవంతెన వద్ద కారులో మంటలు చెలరేగాయి.
- మోసం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఆరేడుగురు సీనియర్ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి మోసం ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు.
- మెరుస్తూ ఉంటాం.. 3 వారాల్లో మరణిస్తాం.. మెరుగుపెట్టిన మరకతంలా..తల, ఉదర భాగం పచ్చ రంగులో.. మెరుస్తున్న రెక్కలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకాన్ని పల్లె వాసులు ‘బింగన్న’గా, బంగారు పురుగు లేదా జీరంగ పురుగు’గా పిలుస్తారు.