శ్రమే దైవం

Eenadu icon
By Editorial Team Published : 13 Oct 2026 06:36 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

సృష్టిలోని ప్రతి జీవికీ శ్రమతోనే ఆనందం లభిస్తుంది. దాంతోనే జీవితంలో ఏదైనా సాధించగలం. శ్రమ అంటే కేవలం శారీరక కష్టం కాదు. ఒక తపస్సు, ఒక యజ్ఞం, ముక్తికి మార్గం.

శ్రమకు నిర్వచనం అనవచ్చు భగీరథుణ్ని. సగర పుత్రుల మోక్షం కోసం గంగను భూమికి తేవాలని సంకల్పించాడు. వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. గంగ ప్రవాహ వేగాన్ని భరించేందుకు శివుడి కోసం మళ్లీ తపస్సు చేశాడు. అతడి పట్టుదలకు మెచ్చిన శివుడు గంగను జటాజూటంలో బంధించి నెమ్మదిగా విడిచాడు. అందుకే అనుకున్నది సాధించేవరకు వదలకుండా చేసే కృషిని ‘భగీరథ ప్రయత్నం’ అంటారు. పరమశివుణ్ని పతిగా పొందడానికి పార్వతీదేవి దీర్ఘకాలం తీవ్రంగా తపస్సు చేసింది. అంతఃపురంలో రాజభోగాలు వదిలి కొండలమీద ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆకులు కూడా తినక ‘అపర్ణ’ అయ్యింది. ఆ నిరంతర దీక్షతోనే శివుడి హృదయాన్ని గెలిచింది. అర్ధనారీశ్వరి అయ్యింది. ప్రేమ కూడా శ్రమతోనే పరిపూర్ణమవుతుందని పార్వతి నిరూపించింది. రాముడి విజయం వెనుక అసంఖ్యాక వానరుల శ్రమ ఉంది. లక్ష్మణుడు మూర్ఛపోతే, హనుమంతుడు సంజీవని మూలిక కోసం మొత్తం పర్వతాన్నే పెకిలించి తెచ్చాడు. శ్రమలో తెలివితేటలు, సమయస్ఫూర్తి కూడా ఉండాలని హనుమ చాటిచెప్పాడు. కృష్ణుడు భగవద్గీతలో ‘కర్మణ్యేవాధికారస్తే’ అన్నాడు. పని మీద దృష్టి పెట్టి, ఫలితం నాకు వదిలేయమన్నాడు. 

శ్రమ వల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది. ‘ఇది నా కష్టార్జితం’ అని చెప్పుకోవడంలో ఉన్న తృప్తికి మరేదీ సాటిరాదు. సన్మార్గంలో కష్టపడే మనిషికి చెడు ఆలోచనలు, ఈర్ష్య, ద్వేషం, దిగులు ఉండవు. శ్రమించే శరీరం ఎప్పుడూ దృఢంగా ఉంటుంది. శ్రమే మనిషికి ఉత్తమమైన వ్యాయామం. సోమరులకు అదృష్టం ఎప్పుడూ కలగదు. ఎందుకంటే కష్టపడేవాడి చెమట చుక్కలోనే అదృష్టం దాగి ఉంటుంది. శ్రమతో, ఒక్కొక్క మెట్టు ఎక్కి సాధించిన విజయం అనిర్వచనీయమైన ఆనందాన్ని అందిస్తుంది. చేసే పనిని నిజాయతీగా భక్తిగా చేస్తే, ఆ పనే పూజ అవుతుంది. శ్రమలోనే దేవుడు కనిపిస్తాడు. 

బద్ధకంగా చేస్తే శ్రమ బరువవుతుంది. ఇష్టంగా చేస్తే అదే హాయి గొలుపుతుంది. శ్రమ ఒంటరితనాన్ని పోగొడుతుంది. అనవసర ఆలోచనలను దరికి రానీయదు. శిల శిల్పం కావాలంటే ఉలి దెబ్బలు తినాలి. మనిషి మహనీయుడు కావాలంటే శ్రమించాలి. మన పురాణాలు ఇచ్చే సందేశం ఇదే. మన కలలను నిజం చేసేది శ్రమించే శరీరంపై మెరిసే స్వేద బిందువులే. ‘కృషితో నాస్తి దుర్భిక్షమ్‌’ అన్నారు కదా పెద్దలు! కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. పని చేసినపుడు కలిగే తృప్తి, ఆత్మవిశ్వాసం మనిషిని శక్తిమంతుణ్ని చేస్తాయి. ప్రతి ఒక్కరి శారీరక శ్రమ దేశ ఆర్థిక ప్రగతికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. శ్రమించిన వాడికి సాధ్యం కానిది ఏదీ లేదు. శ్రమే దైవం, శ్రమతో వచ్చేదే శాశ్వతం.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • శ్రీమంతుడు జీవన ప్రయాణంలో మనిషికి నీడలా... మనుగడ, ఆశ కలిసి ప్రయాణం సాగిస్తాయి. సృష్టిలో ఏ జీవికీ లేనన్ని అవసరాలు, కోరికలు మనిషి మనసులో పుడుతుంటాయి. వాటి నుంచి విముక్తి పొందడం అంత తేలిక కాదు. అవి తీరని కోరికలైనప్పుడు దుఃఖం, కోపం వంటి అరిషడ్వర్గాలు మెండై, మనిషిని వేదన వైపు నడిపిస్తాయి.
  • మనోపరిణతి చిన్న మొక్క మహావృక్షంగా ఎదిగి ఫలాలను అందించి, అలసినవారికి నీడనిచ్చినప్పుడే దానికి సార్థకత. చంద్రుడు క్రమంగా కళలను పెంచుకుని పూర్ణత్వాన్ని పొందినప్పుడే పున్నమి వెన్నెల అలరిస్తుంది.
  • రెండు వేళ్ల రహస్యం కృష్ణుడంటే గోపికలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఎన్నో కథలున్నాయి. అయితే యశోదమ్మ ప్రేమకు బంధితుడైన బాలకృష్ణుడి ఘట్టం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని దాచుకుంది.
  • విజయం దిశగా పయనం అమ్మ పండుగకు వేళయింది. ఈ అమ్మ - అందరి అమ్మల మూలపుటమ్మ, ఆమె అనుగ్రహాన్ని విరివిగా పంచే మహిమాన్విత మాసం- ఆశ్వయుజం.
  • నిత్య సంకల్పం నిత్యపూజతో సహా ఏ శుభకార్యం ప్రారంభించినా ‘ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం’ అని సంకల్పం చెబుతాం. ఇది మనిషి సంపూర్ణ జీవితాన్ని సాధించడానికి అవసరమైన నాలుగు సూత్రాలను రోజూ గుర్తుచేసే మహత్తర జీవనదృష్టి.
  • తస్మై శ్రీ తరువే నమః చెట్టులో పుట్టలో దైవత్వాన్ని దర్శించుకునే తత్వం భారతీయులది. వృక్ష మూలం బ్రహ్మకు, మధ్య భాగం విష్ణువుకు, కొన భాగం సదాశివుడికి ఆలయాలని ‘మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతశ్శివరూపాయ’ అనే శ్లోకం వివరిస్తుంది.
  • ప్రకృతి - పురుషుడు సృష్టికర్త కూడా తోడుగా శక్తి లేనిదే సృష్టి చేయలేడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు తమ ‘సౌందర్యలహరి’ మొదటి శ్లోకంలోనే... శివుడైనా శక్తి చెంతనున్నప్పుడే సృష్టిని కొనసాగించగలడని, ఆ శక్తి లేకపోతే చలించడానికి కూడా ఆయనకు సాధ్యం కాదనే పరమ సత్యాన్ని చాటారు.
  • పతనానికి తొలి మెట్టు మనసులో మొదలయ్యే చిన్న కాలుష్యం అసూయ. అది పైకి కనిపించదు కానీ లోపలి నుంచి మనిషిని తొలిచేస్తుంది. ఒకరి ఆనందాన్ని చూసి సంతోషించలేకపోవడం, ఒకరి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడమే అసూయ.
  • గురుకృప త్రిమూర్తుల తత్వ స్వరూపుడు గురువు. ఈశ్వరుడికీ గురువుకూ మూర్తి భేదమే కానీ ఆత్మ ఒక్కటే. సద్గురువుల విశ్వాసాలు, విధానాలు, బోధనలు వేరైనా వారి లక్ష్యం లోకకల్యాణమే. ప్రజలను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, మృత్యువు నుంచి అమృతత్వానికి నడిపించడమే వారి ధ్యేయం.
  • మౌన స్నేహితుడు ముండకోపనిషత్తులోని ఒక అద్భుతమైన మంత్రం మన జీవితంలోని అతి పెద్ద సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
  • గమ్యం ఒకటే! ‘ఆధ్యాత్మికత’ అన్నది ఎంతో విశాలమైన భావన. దాన్ని ఒక నిర్వచనానికి, నిర్దిష్ట ఆచారాలకు, సంప్రదాయాలకు మాత్రమే పరిమితం చేయలేం. మౌలికంగా చూస్తే.. ఆధ్యాత్మిక ప్రయాణం వ్యక్తిగతమైనది. అందుకే, స్వభావానికి తగిన మార్గాన్ని ఎంచుకోవడం కీలకం. 
  • వేలాడుతున్న మనిషి పెద్దలు చెప్పిన కొన్ని పిట్టకథలు లోతైన తాత్వికసత్యాలను సులువుగా అర్థమయ్యేట్టు చేస్తాయి. 
  • అహింసా పరమో ధర్మః ‘అహింసా పరమో ధర్మస్తథాహింసా పరో దమః/ అహింసా పరమం దాన మహింసా పరమం తపః’ అంటుంది మహాభారతం. అహింసే పరమధర్మమని, దానికి మించిన తపస్సు లేదని చెబుతుంది.
  • విచక్షణ విచక్షణ అనేది తెలివికి సంబంధించింది మాత్రమే కాదు, అంతర్గతంగా ఉండే ఒక ఆధ్యాత్మిక శక్తి…. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆ వివేకం అవసరం.
  • మెఱమెచ్చులు లోకుల మెప్పు పొందడానికి ప్రతివారు ప్రయత్నిస్తారు. మెఱమెచ్చు(మితిమీరిన పొగడ్త)లకు మురిసిపోనివారు తక్కువ. స్వలాభం కోసం స్తుతించేవారిని ముద్దుచేసేవారు కొందరైతే- తమకు తాముగానే డాబులకు పోయేవారు మరికొందరు!
  • జడ భరతుడు ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటే సరిపోదు. మనసులోని కోరికలను, మమకారాన్ని కూడా జయించాలి.  భరతుడు ధర్మబద్ధంగా పరిపాలించి చివరికి రాజ్యాన్ని వదిలి అడవిలో తపస్సు చేస్తుంటాడు.
  • గ్రంథగ్రంథులు నవనీతం అంటే వెన్న. ఇది సామాన్యమైన అర్థం. దాన్ని ఏ భాగవత గ్రంథానికో విశేషణంగా చేర్చి ‘భాగవత నవనీతం’ అన్నప్పుడు- నవ అంటే ‘తాజాగా’ నీతం అంటే ‘భూమికి తెచ్చిన అమృతం’ అనే విశేషార్థం స్ఫురిస్తుంది.
  • విజయతీరాలు జీవితంలో విజయం అనేది ఆకస్మికంగా వరించే అదృష్టం కాదు. అది మనం అనునిత్యం తీసుకునే నిర్ణయాల ప్రతిఫలం.
  • జితేంద్రియులు సుఖదుఃఖాలు అస్థిరాలు. వాటి గురించి వ్యథ చెందడం వ్యర్థం. విషయవాసనలతో కూడిన ప్రపంచంలో ఉండి కూడా ఎవరు వాటిని అంటించుకోరో వారే జితేంద్రియులు. అంటే, ఇంద్రియాలను జయించిన వారు అని అర్థం.
  • పరమ హితులు సకల జీవుల ఆనందమే ధ్యేయంగా సాగేది ప్రకృతి చైతన్యం. దాంతో మనిషి సమన్వయం సాధించినప్పుడే సంతోషకరమైన సార్థకజీవనం సాధ్యమవుతుంది.