మనోపరిణతి

- A
- A+
- A++

చిన్న మొక్క మహావృక్షంగా ఎదిగి ఫలాలను అందించి, అలసినవారికి నీడనిచ్చినప్పుడే దానికి సార్థకత. చంద్రుడు క్రమంగా కళలను పెంచుకుని పూర్ణత్వాన్ని పొందినప్పుడే పున్నమి వెన్నెల అలరిస్తుంది. ప్రకృతిలో ఏదైనా క్రమంగా వికసించి పరిపూర్ణతను సాధించినప్పుడే దాని అసలైన సౌందర్యం, ప్రయోజనం వెలుగులోకి వస్తాయి. మనిషి మనసుకూ ఇదే వర్తిస్తుంది.
విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లే ప్రతి మనిషిలోనూ జ్ఞానం, ప్రేమ, కరుణ, వివేకం, సృజనాత్మకత, ఆధ్యాత్మిక చైతన్యం దాగి ఉంటాయి. నిరంతర సాధన, అనుభవం, ఆత్మపరిశీలన, క్రమశిక్షణ, సత్సాంగత్యం ద్వారా అవి క్రమంగా వికసిస్తాయి. పుస్తక జ్ఞానం మాత్రమే సంపూర్ణ జ్ఞానం కాదు. దాన్ని ఆచరణలో పెట్టి, అనుభవంతో సానబెట్టి, తప్పుల నుంచి నేర్చుకున్నప్పుడే అది ప్రజ్ఞగా మారుతుంది. అలాగే- పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, దీపం, ధూపం, నైవేద్యాలతో చేసే పూజ భక్తికి బాహ్యరూపం. కానీ, బయట దీపం వెలిగించినంత మాత్రాన లోపల జ్ఞానజ్యోతి వెలగదు. మనసును ఒకచోట నిలపడం సాధనలో మొదటి మెట్టు. పూజలో భగవంతుడి విగ్రహాన్ని కేవలం రాతి లేదా లోహపు రూపంగా కాక, సాక్షాత్తు దైవసన్నిధిగా భావించాలి. మనసా, వాచా, కర్మణా పరమాత్మను స్మరించాలి. పూజలోని ప్రతి క్రియ మనలో మార్పును కలిగించాలి. దీపం వెలిగించిన తరవాత మనలోని చీకటి తగ్గాలి. పుష్పం సమర్పించాక హృదయంలో ప్రేమ వికసించాలి. నైవేద్యంతో పాటు అహంకారాన్ని కూడా భగవంతుడి పాదాల చెంత సమర్పించగలగాలి.
పూజ ఎంతసేపు చేశాం, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పూజా సామగ్రి ఉపయోగించాం అన్నదాని కంటే, ఆ పూజ మన మనసును ఎంతగా మార్చిందన్నదే ముఖ్యం. పరమాత్మను చేరడానికి ఆడంబరం కాదు, నిర్మలమైన మనసే దారి. ప్రశాంతమైన తటాకంలో ఆకాశం స్పష్టంగా ప్రతిబింబించినట్లే, అలజడి తగ్గిన మనసులో పరమాత్మ తత్వం గోచరిస్తుంది. మనోవికాసం ఒక్కరోజులో సంభవించదు. ఒక్కో దోషాన్ని తొలగించుకుంటూ, ఒక్కో సద్గుణాన్ని పెంపొందించుకుంటూ ఎదగాలి. కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండగలగడం, నష్టం జరిగినా ధర్మాన్ని విడిచిపెట్టకపోవడం, ఇతరుల సంతోషానికి ఆనందించడం, తన తప్పును గుర్తించి సరిదిద్దుకోవడం, ‘నేను’ అనే అహంకారాన్ని విడనాడి ‘మనం’ అనే భావాన్ని పెంచుకోవడం మనోపరిణతికి గుర్తులు. పూజ అనేది- కృతజ్ఞతను వ్యక్తపరిచే పవిత్ర అవకాశం. మానవ జన్మను, జ్ఞానాన్ని, విచక్షణను ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం మన ధర్మం.
మనిషి ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగాడో పూజలను బట్టి కాదు; అతడి మనసులోని ప్రశాంతతను, మాటల్లోని మాధుర్యాన్ని, ప్రవర్తనలోని కరుణను, సాధుతత్వాన్ని బట్టి తెలుసుకోవాలి. మనసు వికసిస్తే జీవితం వికసిస్తుంది. జీవితం వికసిస్తే కుటుంబం వికసిస్తుంది. కుటుంబంతో సమాజం వికసిస్తుంది. చివరికి ‘నేను’ అనే భావం కరిగిపోయి ‘అంతా పరమాత్మ’ అనే అనుభూతి మాత్రమే మిగిలినప్పుడు, అదే మనోపరిణతికి పరమావధి.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శ్రమే దైవం సృష్టిలోని ప్రతి జీవికీ శ్రమతోనే ఆనందం లభిస్తుంది. దాంతోనే జీవితంలో ఏదైనా సాధించగలం. శ్రమ అంటే కేవలం శారీరక కష్టం కాదు. ఒక తపస్సు, ఒక యజ్ఞం, ముక్తికి మార్గం. శ్రమకు నిర్వచనం అనవచ్చు భగీరథుణ్ని. సగర పుత్రుల మోక్షం కోసం గంగను భూమికి తేవాలని సంకల్పించాడు. వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు.
- రెండు వేళ్ల రహస్యం కృష్ణుడంటే గోపికలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఎన్నో కథలున్నాయి. అయితే యశోదమ్మ ప్రేమకు బంధితుడైన బాలకృష్ణుడి ఘట్టం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని దాచుకుంది.
- విజయం దిశగా పయనం అమ్మ పండుగకు వేళయింది. ఈ అమ్మ - అందరి అమ్మల మూలపుటమ్మ, ఆమె అనుగ్రహాన్ని విరివిగా పంచే మహిమాన్విత మాసం- ఆశ్వయుజం.
- నిత్య సంకల్పం నిత్యపూజతో సహా ఏ శుభకార్యం ప్రారంభించినా ‘ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం’ అని సంకల్పం చెబుతాం. ఇది మనిషి సంపూర్ణ జీవితాన్ని సాధించడానికి అవసరమైన నాలుగు సూత్రాలను రోజూ గుర్తుచేసే మహత్తర జీవనదృష్టి.
- తస్మై శ్రీ తరువే నమః చెట్టులో పుట్టలో దైవత్వాన్ని దర్శించుకునే తత్వం భారతీయులది. వృక్ష మూలం బ్రహ్మకు, మధ్య భాగం విష్ణువుకు, కొన భాగం సదాశివుడికి ఆలయాలని ‘మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతశ్శివరూపాయ’ అనే శ్లోకం వివరిస్తుంది.
- ప్రకృతి - పురుషుడు సృష్టికర్త కూడా తోడుగా శక్తి లేనిదే సృష్టి చేయలేడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు తమ ‘సౌందర్యలహరి’ మొదటి శ్లోకంలోనే... శివుడైనా శక్తి చెంతనున్నప్పుడే సృష్టిని కొనసాగించగలడని, ఆ శక్తి లేకపోతే చలించడానికి కూడా ఆయనకు సాధ్యం కాదనే పరమ సత్యాన్ని చాటారు.
- పతనానికి తొలి మెట్టు మనసులో మొదలయ్యే చిన్న కాలుష్యం అసూయ. అది పైకి కనిపించదు కానీ లోపలి నుంచి మనిషిని తొలిచేస్తుంది. ఒకరి ఆనందాన్ని చూసి సంతోషించలేకపోవడం, ఒకరి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడమే అసూయ.
- గురుకృప త్రిమూర్తుల తత్వ స్వరూపుడు గురువు. ఈశ్వరుడికీ గురువుకూ మూర్తి భేదమే కానీ ఆత్మ ఒక్కటే. సద్గురువుల విశ్వాసాలు, విధానాలు, బోధనలు వేరైనా వారి లక్ష్యం లోకకల్యాణమే. ప్రజలను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, మృత్యువు నుంచి అమృతత్వానికి నడిపించడమే వారి ధ్యేయం.
- మౌన స్నేహితుడు ముండకోపనిషత్తులోని ఒక అద్భుతమైన మంత్రం మన జీవితంలోని అతి పెద్ద సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
- గమ్యం ఒకటే! ‘ఆధ్యాత్మికత’ అన్నది ఎంతో విశాలమైన భావన. దాన్ని ఒక నిర్వచనానికి, నిర్దిష్ట ఆచారాలకు, సంప్రదాయాలకు మాత్రమే పరిమితం చేయలేం. మౌలికంగా చూస్తే.. ఆధ్యాత్మిక ప్రయాణం వ్యక్తిగతమైనది. అందుకే, స్వభావానికి తగిన మార్గాన్ని ఎంచుకోవడం కీలకం.
- వేలాడుతున్న మనిషి పెద్దలు చెప్పిన కొన్ని పిట్టకథలు లోతైన తాత్వికసత్యాలను సులువుగా అర్థమయ్యేట్టు చేస్తాయి.
- అహింసా పరమో ధర్మః ‘అహింసా పరమో ధర్మస్తథాహింసా పరో దమః/ అహింసా పరమం దాన మహింసా పరమం తపః’ అంటుంది మహాభారతం. అహింసే పరమధర్మమని, దానికి మించిన తపస్సు లేదని చెబుతుంది.
- విచక్షణ విచక్షణ అనేది తెలివికి సంబంధించింది మాత్రమే కాదు, అంతర్గతంగా ఉండే ఒక ఆధ్యాత్మిక శక్తి…. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆ వివేకం అవసరం.
- మెఱమెచ్చులు లోకుల మెప్పు పొందడానికి ప్రతివారు ప్రయత్నిస్తారు. మెఱమెచ్చు(మితిమీరిన పొగడ్త)లకు మురిసిపోనివారు తక్కువ. స్వలాభం కోసం స్తుతించేవారిని ముద్దుచేసేవారు కొందరైతే- తమకు తాముగానే డాబులకు పోయేవారు మరికొందరు!
- జడ భరతుడు ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటే సరిపోదు. మనసులోని కోరికలను, మమకారాన్ని కూడా జయించాలి. భరతుడు ధర్మబద్ధంగా పరిపాలించి చివరికి రాజ్యాన్ని వదిలి అడవిలో తపస్సు చేస్తుంటాడు.
- గ్రంథగ్రంథులు నవనీతం అంటే వెన్న. ఇది సామాన్యమైన అర్థం. దాన్ని ఏ భాగవత గ్రంథానికో విశేషణంగా చేర్చి ‘భాగవత నవనీతం’ అన్నప్పుడు- నవ అంటే ‘తాజాగా’ నీతం అంటే ‘భూమికి తెచ్చిన అమృతం’ అనే విశేషార్థం స్ఫురిస్తుంది.
- విజయతీరాలు జీవితంలో విజయం అనేది ఆకస్మికంగా వరించే అదృష్టం కాదు. అది మనం అనునిత్యం తీసుకునే నిర్ణయాల ప్రతిఫలం.
- జితేంద్రియులు సుఖదుఃఖాలు అస్థిరాలు. వాటి గురించి వ్యథ చెందడం వ్యర్థం. విషయవాసనలతో కూడిన ప్రపంచంలో ఉండి కూడా ఎవరు వాటిని అంటించుకోరో వారే జితేంద్రియులు. అంటే, ఇంద్రియాలను జయించిన వారు అని అర్థం.
- పరమ హితులు సకల జీవుల ఆనందమే ధ్యేయంగా సాగేది ప్రకృతి చైతన్యం. దాంతో మనిషి సమన్వయం సాధించినప్పుడే సంతోషకరమైన సార్థకజీవనం సాధ్యమవుతుంది.
- యద్భావం తద్భవతి భారతీయ సనాతన ధర్మంలోని అత్యంత శక్తిమంతమైన, ఆచరణీయమైన సూత్రాలలో ‘యద్భావం తద్భవతి’ ఒకటి.