ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా!

Eenadu icon
By Telangana News Desk Published : 15 Oct 2026 04:34 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్‌నినో నేపథ్యంలో వ్యవసాయ సీజన్‌కు వచ్చే 20 రోజులు అత్యంత కీలకమని, రాష్ట్రంలో పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సరఫరాలో అంతరాయాలను సహించేది లేదని, పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్తు కోతలు ఉండరాదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేస్తే ఐఏఎస్‌లను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. ఎల్‌నినో..కొవిడ్‌ లాంటి విపత్తు అని, దీనిని ఎదుర్కొనేందుకు జూన్‌ వరకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ఎంసీహెచ్‌ఆర్డీలోని బోధిభవన్‌లో బుధవారం సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిచారు. 

విద్యుత్తు అధికారులపై ఆగ్రహం 

ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయాలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘విద్యుత్తు సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితిలో ఎందుకు మార్పు రావడం లేదు?రాబోయే రోజుల్లో విద్యుత్తు కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి  విద్యుత్తు ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్తు సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోను’’ అని సీఎం అధికారులను హెచ్చరించారు. వైఫల్యాలపై విద్యుత్తు శాఖ స్పెషల్‌ సీఎస్, జెన్‌కో సీఎండీ..సంబంధిత విభాగపు ఐఏఎస్‌లను సస్పెండ్‌ చేస్తానన్నారు. విద్యుత్తు అంతరాయాలకు రోజుకో కారణం చెప్పొద్దన్నారు.

అప్రమత్తం కావాలి:‘‘ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై శాఖలు అప్రమత్తం కావాలి. ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు సమస్యగా కనిపిస్తోంది. మున్ముందు సంక్షోభంగా మారుతుంది. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఎల్‌నినో ప్రభావాన్ని లోతుగా అంచనా వేయాలి. సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలి. మళ్లీ వానలు వచ్చే వరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలి. తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బందులు రాకుండా చర్యలుతీసుకోవాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిర్మాణ రంగంతో పాటు ఇతర అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో  శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలి’’ అని సీఎంఆదేశించారు

ప్రతి మండలానికి ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు  

‘‘ఎల్‌నినో ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్‌1, గ్రూప్‌2 స్థాయి అధికారులను నియమించాలి. ఆయా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్తు, తాగునీటి సరఫరా, పంటలు, పశుగ్రాసం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించాలి. మండలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి నివేదించాలి.   

ప్రజలకు అవగాహన కల్పించాలి  

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు ఎల్‌నినో విపత్తు తీవ్రతను చెప్పాలి. గ్రామసభలు, కళాజాతలతో అవగాహన కల్పించాలి. దీని ప్రభావం, రాబోయే సంక్షోభ పరిస్థితులను చెప్పాలి. నీరు, విద్యుత్తు పొదుపుతో పాటు తీసుకోవాల్సిన చర్యలను వివరించాలి’’ అని సీఎం సూచించారు. సమావేశానికి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఎల్‌నినోపై కార్యాచరణకు సంబంధించి చర్చించేందుకు గురువారం మంత్రులందరితో సమావేశమవ్వాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రేచుకుక్క వేటకి.. వేగమే ఆయుధం! పెద్దపులి కాదు.. బలమైన పంజాలు లేవు. భయపెట్టించే ఆకారమూ కాదు. చిన్న శరీరం, పొడవాటి కాళ్లు, సన్నని దేహం, గుబురుగా ఉండే తోక.
  • నీటి సంరక్షణలో ‘శం షేర్‌’పల్లి! ఇక్కడ యంత్రంతో కలుపు తీస్తున్న శేర్పల్లి(హెచ్‌)కు చెందిన రైతు పేరు గోవర్ధన్‌. గతంలో వరి, జొన్న, మొక్కజొన్న సాగుచేసేవారు.
  • బీసీల విద్యాభివృద్ధికి కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలి బీసీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్రాలకు.. కేంద్రం 60 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.
  • రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్‌కు ఎసరు: హరీశ్‌రావు రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్రకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరలేపుతోందని భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఓ ప్రకటనలో విమర్శించారు. రైతు డిస్కం ఏర్పాటు చేస్తూ జీవో 17 జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
  • రూ.2,000 మించిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఎండీఆర్‌ వాయిదా రూ.2,000కు మించిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) విధింపు నిర్ణయాన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వాయిదా వేసింది.
  • ఎల్‌నినో, ఐవోడీ పరస్పర చర్యలతో రుతుపవనాల్లో మార్పులు ఎల్‌నినో సదరన్‌ ఆసిలేషన్‌(ఈఎన్‌ఎస్‌వో), హిందూ మహాసముద్ర డైపోల్‌(ఐవోడీ)ల మధ్య జరిగే సంక్లిష్టమైన చర్యలు భారతీయ రుతుపవనాల గమనాన్ని నిర్దేశించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఐఐటీ ఖరగ్‌పుర్‌ ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌ గుప్తా అన్నారు.
  • 32 నెలలు.. 3.77 కోట్ల ట్రాఫిక్‌ ఉల్లంఘనలు హెల్మెట్‌ పెట్టుకోకపోవడం.. రాంగ్‌ రూట్‌లో దూసుకెళ్లడం.. పరిమితికి మించిన వేగం.. మద్యం మత్తులో స్టీరింగ్‌ పట్టడం.. డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడటం రహదారులపై మృత్యుపాశాలుగా మారుతున్నా ఈ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు ఏ మాత్రం తగ్గడం లేదు.
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని, గెలుపే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ దిశానిర్దేశం చేశారు.
  • నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం.. అద్భుతం అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు ప్రశంసించారు.
  • పట్టభద్రుల ఓటు కోసం ఫారం-18 నింపాల్సిందే! మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటరు జాబితాలో పేర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.
  • సంక్షిప్త వార్తలు(21) రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ)కు బడ్జెట్‌లో భాగంగా ప్రభుత్వం తాజాగా రూ.296.60 కోట్ల కేటాయింపులకు పాలనాపరమైన అనుమతిస్తూ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ టీకే శ్రీదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
  • సెమీకండక్టర్ల పరిశోధనకు ఐఐటీ హైదరాబాద్‌-జపాన్‌ వర్సిటీ ఒప్పందం పరస్పర సహకారంతో విద్య, పరిశోధన, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్, జపాన్‌లోని ఎంఐఈ విశ్వవిద్యాలయం చేతులు కలిపాయి.
  • కాంగ్రెస్‌ రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తోంది: రామచందర్‌రావు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ శ్రేణులు తాజాగా సుప్రీంకోర్టు వద్ద ప్రదర్శించిన నాటకీయ వైఖరిని దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పేర్కొన్నారు.
  • నీటి పొదుపుపై 60 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు: సీఎస్‌ ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై 60 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎస్‌ సంజయ్‌ జాజు తెలిపారు.
  • మరోసారి ఎమ్మెల్సీ బరిలో రామచందర్‌రావు? హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావును బరిలో దించేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
  • త్వరలో హైదరాబాద్‌లోనూ మార్చ్‌.. సభ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించేవరకు కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే ఉద్యమం ఆగదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు.
  • ఏళ్ల తరబడి భద్రంగా సర్టిఫికెట్‌ మీ సేవ ఆధ్వర్యంలో రూపకల్పన ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.
  • ఆర్బిట్రేటర్లుగా అవకాశం కొందరికే ప్రపంచీకరణ నేపథ్యంలో వర్తక, వాణిజ్య, ఒప్పందాల ఉల్లంఘనల్లో ఆర్బిట్రేషన్‌(మధ్యవర్తిత్వం)కు అధిక ప్రాధాన్యమిస్తుండగా..ఆర్బిట్రేటర్లుగా కొందరికే అవకాశాలు లభిస్తున్నాయంటూ నల్సార్‌ వర్సిటీ ఆధ్వర్యంలోని మిలన్‌ కె.బెనర్జీ సెంటర్‌ ఫర్‌ ఆర్బిట్రేషన్‌ లా రూపొందించిన నివేదిక వెల్లడించింది.
  • ఫ్యూచర్‌ సిటీలో ఎన్‌ఐయూఎం ప్రాంగణం తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పనిచేసే పట్టణాభివృద్ధి పరిశోధన సంస్థ ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐయూఎం)’ నూతన ప్రాంగణాన్ని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్మించనున్నారు.
  • యుద్ధప్రాతిపదికన హ్యామ్‌రోడ్ల పనులు: మంత్రి సీతక్క రాష్ట్రంలో చేపట్టిన 7,448 కి.మీ. హ్యామ్‌ రోడ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.