నిరసనల వేదికగా జంతర్‌మంతర్‌ తొలగింపుపై కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు

Eenadu icon
By National News Team Updated : 15 Oct 2026 19:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: జంతర్‌మంతర్‌ (Jantar Mantar)ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ( Supreme Court)లో గురువారం విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, దిల్లీ పోలీసుల(Delhi Police) వివరణ కోరుతూ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వారి సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసింది. గతంలో తాము చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని జంతర్‌మంతర్‌ను నిరసన వేదికగా తొలగించారా? లేక స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదని, ఇందుకోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగానే ఈ మార్పు చేసినట్లు సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు.

నిరసనలకు ప్రత్యామ్నాయ వేదికలుగా రామ్‌లీలా మైదాన్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్‌ ప్రాంతాలను పోలీసులు ప్రకటించారు. అక్టోబరు 11న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కొత్తగా గుర్తించిన ప్రదేశాలకు వెళ్లడం ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కష్టమవుతుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. 

  • దిల్లీలో ఇంటర్నెట్‌ నిలిపివేత.. సుప్రీంకు హోంశాఖ కార్యదర్శి క్షమాపణలు
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 14:46 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అబ్దుల్ కలాం వేషధారణలో 100 మందికిపైగా విద్యార్థులు తమిళనాడు (Tamilnadu)లో మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం (Abdul kalam) జయంతి సందర్భంగా గురువారం కుంభకోణం సమీపంలోని తిరునాగేశ్వరంలో 100 మందికిపైగా విద్యార్థులు ఆయనలా వేషధారణ ధరించి, వీధుల్లో నడుస్తూ ఘన నివాళులర్పించారు.
  • అమెరికాలో ఆలయంపై దాడికి కుట్ర.. స్పందించిన భారత్‌ Hindu Temple Shooting Plot: అమెరికా (USA)లో హిందూ ఆలయంలో 19 ఏళ్ల యువకుడు కాల్పులకు కుట్రపన్నిన ఘటనపై భారత ప్రభుత్వ విదేశాంగశాఖ స్పందించింది
  • జర్నలిస్టులా.. రీల్స్‌ చేసేవాళ్లా? తెలియట్లేదు: దిల్లీ ఆందోళనలపై కేంద్రం Delhi Protests: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఇటీవల దిల్లీలో జరిగిన ఆందోళనల సమయంలో కొందరు మహిళా జర్నలిస్టులపై వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
  • 50 వేల పిన్నులతో దుర్గామాత.. దుబాయి తరహాలో మండపం.. ఇంకా ఒడిశాలోని భువనేశ్వర్‌లో దుబాయిలోని ఆకాశహర్మ్యాలు, ప్రముఖ కట్టడాలను ప్రతిబింబించేలా దుర్గా మాత (Maa Durga) మండపాన్ని ఏర్పాటు చేశారు.
  • సుప్రీం వరకు పాదయాత్రలా.. వెంటనే సమాధానం చెప్పండి: రాహుల్ గాంధీపై కోర్టు ఆగ్రహం Supreme Court March: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్టోబర్ 12న ఇండియా కూటమి నేతలతో కలిసి రాహుల్ సుప్రీంకోర్టు వరకు పాదయాత్రగా వెళ్లి, అక్కడ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
  • దిల్లీలో ఇంటర్నెట్‌ నిలిపివేత.. సుప్రీంకు హోంశాఖ కార్యదర్శి క్షమాపణలు Delhi protests: దిల్లీ ఆందోళనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో కేంద్ర హోంశాఖ సెక్రటరీ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు.
  • వెనకబాటుతనాన్ని బదిలీ చేయలేం: మతమార్పిడి రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు Supreme Court: మతమార్పిడి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి మారినవారు.. కేవలం మతమార్పిడి ఆధారంగా వెనకబడిన తరగతుల (BC) కోటాను క్లెయిమ్ చేసుకోలేరని స్పష్టం చేసింది.
  • జమ్మూకశ్మీర్‌లో మంచు సోయగాలు జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లో మంచు దుప్పటి (Snow fall) చూపరులను ఆకర్షిస్తోంది.
  • మళ్లీ వార్తల్లోకి అంకిత కేసు.. ఇండియా గేట్ వద్ద తల్లిదండ్రుల నిర్బంధం Ankita Bhandari murder: ఒక రిసార్టులో రిసెప్షనిస్టుగా చేరిన నెలరోజులకే అదృశ్యమై కెనాల్‌లో విగతజీవిగా కనిపించిన అంకితా భండారీ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.
  • కేఫ్ యజమాని మృతి.. మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్ కోసం గాలింపు.. కేఫ్ యజమాని అనుమానాస్పద మృతి కేసులో మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శ్రద్ధా దూబే (Shraddha Dubey) కోసం పోలీసులు గాలిస్తున్నారు.
  • ఆ హైకోర్టు దుస్థితి ఎలా ఉందో చూడండి: సుప్రీంకోర్టు ‘న్యాయవిద్య కళాశాలల్లో తొలి ఏడాదే విద్యార్థులకు నేర్పే న్యాయసూత్రాలివి. ఇలాంటి తీర్పులు మా వద్దకు రావడం ఇదే తొలిసారి కాదు.
  • ‘నీలి డ్రమ్ము’ హత్యకేసులో ఆమెకు, ప్రియుడికి మరణశిక్ష దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘నీలి డ్రమ్ము’ హత్య కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
  • పండగ వ్యాపారాన్ని కాపాడండి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ సాగుతున్న నిరసనోద్యమం సందర్భంగా ప్రజా నియంత్రణలపై దేశంలోని వర్తక సంఘాలు ఆందోళన వ్యక్తంజేశాయి.
  • తిహాడ్‌ జైలుకు సీజేపీ నేతలు కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌దాస్, అశుతోష్‌ రాంకాలకు ఐదురోజుల జైలుశిక్ష విధించారు.
  • రైల్వే ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.17,951 బోనస్‌ రాబోయే దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రైల్వేలోని 11,40,770 మంది ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్‌ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • విద్యార్థులకు అడ్డు రావొద్దు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విద్యార్థులకు అడ్డు రావొద్దని ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ హితవు పలికారు.
  • ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు? మీరు దేనినైతే పదే పదే పునరావృతం చేస్తారో, మీ మెదడు ఆ విషయంలో మరింత నైపుణ్యం సాధిస్తుంది.
  • సంక్షిప్త వార్తలు (7) ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, దీనిని ఆసరాగా చేసుకుని నిరాధార ఆరోపణలతో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, పార్లమెంటు వంటి రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దాడి చేయడం సరికాదని హార్వర్డ్‌ విద్యావేత్తల బృందం పేరుతో విడుదలైన ఒక ప్రకటన పేర్కొంది.
  • డేటా సెంటర్ల అనుమతులకు పంచ సూత్రాలు రాష్ట్రాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతిచ్చే సమయంలో ఐదు సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలని నీతి ఆయోగ్‌ సూచించింది.
  • పరిహారం కోరే హక్కు ఆ కుటుంబాలన్నిటికీ ఉంది రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొని మృతి చెందిన భారతీయుల కుటుంబాలు పరిహారం, సహాయం కోరేందుకు ముందుకు వచ్చేలా బహిరంగ నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించింది.