
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంధన వనరుల కాల్పుల విరమణ

- A
- A+
- A++
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య తక్షణమే ఇంధన వనరుల కాల్పుల విరమణ (ఎనర్జీ సీజ్ఫైర్) అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. విద్యుత్, చమురు, గ్యాస్ వంటి ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పర దాడుల నిలిపివేతకు ఇరుపక్షాలూ అంగీకరించాయని తెలిపారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ఇరుపక్షాలకు సూచించారు. ఈ మేరకు ఆయన ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్టు పెట్టారు.
‘‘ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై మేం చర్చించాం. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ మద్దతు ఇస్తుంది. అదేవిధంగా దీనికి రష్యా మద్దతు అవసరం. అమెరికా నుంచి మరిన్ని వివరాల కోసం ఎదురు చూస్తున్నాం’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తమ ఇంధన సదుపాయాలపై రష్యా దాడులను నిలిపివేస్తే.. ఆ దేశ చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని మరో సందర్భంలో జెలెన్స్కీ ప్రకటించారు. ఇదిలా ఉండగా ట్రంప్ ప్రకటనపై రష్యా నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనా రాకపోవడం గమనార్హం.
వాషింగ్టన్: రష్యా డీజిల్‌పై ఆంక్షలు ఎత్తివేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తానని రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు బ్రియాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ ప్రకటించారు. ఇందుకోసం ఓ ద్వైపాక్షిక బిల్లును తీసుకువస్తానని వెల్లడించారు. ప్యాట్రిక్ ప్రతిపాదనను మరో రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు డాన్ బెకాన్ సమర్థించారు. అయితే ప్రతినిధుల సభ పదవీకాలం జనవరితో ముగిసిపోనున్న కారణంగా బిల్లు ఆమోదానికి తగిన సమయం ఉండదు. ఈ కారణంగా వీరి ప్రయత్నం నామమాత్రంగా మిగిలిపోనుంది.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 06:23 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పడేనా ట్రంప్ కార్డు! అంతర్జాతీయ పరిణామాలతో భారమైన జీవన వ్యయాలకు తోడు... అమెరికాలో ఎన్నికల కాక మొదలైంది.
- కోలుకుంటున్న పోప్ ఊపిరితిత్తుల్లో పెరిగిన క్యాన్సర్ కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్ లియో-14 మెల్లగా కోలుకుంటున్నారు.
- కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నిధులు భారత్‌లో ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపించారు.
- ఉక్రెయిన్‌కు స్టార్‌లింకూ మొండిచేయి? రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే... ఎలాన్ మస్క్ కూడా ఉక్రెయిన్ను దెబ్బకొట్టారు.
- జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
- మందుపాతర పేలి నౌక మునక హర్మూజ్ జల సంధిలో ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఒక వాణిజ్య నౌక మునిగిపోయిందని ఇరాన్ బుధవారం పేర్కొంది.
- గాంధీ తొలి కార్యక్షేత్రం డర్బన్‌లో ఆయుర్వేద మూలికల ఉద్యానం యువ న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నపుడు మహాత్మాగాంధీ 1904లో డర్బన్‌లో ప్రారంభించిన సమష్టి ఆశ్రమం ‘ఫీనిక్స్ సెటిల్మెంట్’లో సంప్రదాయ ఆయుర్వేద మూలికల ఉద్యానవనం ఏర్పాటైంది.
- ‘ఫ్లైదుబాయ్’ కూల్చివేత కుట్రలో.. ఇద్దరు మాల్దీవియన్ పైలట్ల అరెస్ట్ ‘ఫ్లైదుబాయ్’ విమానాన్ని హైజాక్ చేసి, కూల్చివేసేందుకు ఒమన్ కోపైలట్ ఇటీవల పన్నిన కుట్రలో భాగంగా భావిస్తున్న ఇద్దరు మాల్దీవియన్ పైలట్లను యూఏఈ పోలీసులు అరెస్టు చేశారు.
- ప్రభుత్వంపై పోరాటానికి రూ.967 కోట్ల వ్యయం సంపన్నులపై పన్ను విధించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై కోర్టులో పోరాడటానికి గూగుల్ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ ఏకంగా రూ.967 కోట్లు ఖర్చు పెట్టారు.
- 11 ఏళ్ల పగ! యెమెన్‌లోని అంతర్యుద్ధంపై సౌదీ అరేబియా వేసుకున్న లెక్కలు తప్పాయా.. ఆ దేశం ఎరక్కపోయి ఇరుక్కుందా.. గల్ఫ్‌లో తమ దేశాన్ని అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య హబ్‌గా మార్చాలనుకునే క్రమంలో యెమెన్‌పై తీసుకున్న నిర్ణయాలు బెడిసికొడుతున్నాయా.. అంటే ప్రస్తుతం హూతీలు చేస్తున్న దాడులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
- రాయిలాంటిదనుకుంటే.. రాచకుటుంబ స్మారకమైంది కాలం కలిసొస్తే రాయి కూడా రత్నమవుతుందంటారు. లండన్‌లోని ఓ వ్యక్తి ఓ ఛారిటీ దుకాణంలో రూ.1,890 చెల్లించి తను ఒక ఉంగరం కొన్నాడు.
- హూతీల దెబ్బకు ప్యాలెస్‌లు మార్చుతున్న సౌదీ యువరాజు! దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఎప్పుడు ఏ రాజభవనంలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
- న్యూయార్క్ విమానాశ్రయంలో యూనస్‌కు ‘అవామీలీగ్’ అవహేళన షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వ్యవహరించిన మహమ్మద్ యూనస్ న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ విమానాశ్రయంలో అవహేళనలు ఎదుర్కొన్నారు.
- అవినీతి ఆరోపణలతో… గ్రీసు దేశ అమెరికా రాయబారి రాజీనామా గ్రీసు దేశంలో అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించిన కింబర్లీ గిల్‌ఫాయిల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
- సౌదీలో అప్రమత్తంగా ఉండండి సౌదీ అరేబియాలో మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివాసం ఉంటున్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
- సంక్షిప్త వార్తలు (3) ఊపిరితిత్తుల్లో చిన్న కణితి ఉన్నట్లు తెలియడంతో శస్త్రచికిత్స నిమిత్తం పోప్ లియో-14 మంగళవారం రోమ్‌లోని జెమెలీ ఆసుపత్రిలో చేరారు.