కొనసాగిన నిరసనల హోరు

Eenadu icon
By National News Desk Updated : 12 Oct 2026 06:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా దిల్లీలో చేపట్టిన ఉద్యమం వరుసగా రెండోరోజూ కొనసాగింది. ఆదివారం జంతర్‌ మంతర్‌వైపు వెళ్తున్న సుమారు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినా దిల్లీలో వేర్వేరు చోట్ల నిరసనలు కొనసాగాయి. దీనిలో సీజేపీతో పాటు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. తొలిరోజు దిల్లీ విమానాశ్రయంలో అరెస్టయిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతలు అభిజీత్‌ దీప్కే, అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌లను ఆదివారం దిల్లీ కంటోన్మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి, న్యాయమూర్తి ఆదేశాలపై రూ.50 వేల పూచీకత్తు మీద విడుదల చేశారు. ఏడాదిపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడబోమనే షరతుపై వారిని వదిలినట్లు పోలీసులు వెల్లడించారు. నేతల విడుదల.. తాము న్యాయపరంగా సాధించిన ఘన విజయమని సీజేపీ పేర్కొంది. ఉద్యమాన్ని మరింత ముమ్మరం చేస్తామని ప్రకటించింది. ‘‘మొత్తానికి దిల్లీ పోలీసులు మా నేతల్ని విడుదల చేయాల్సి వచ్చింది. బొద్దింకలు ఎప్పటికీ చావవు’’ అని ఎక్స్‌లో ప్రకటించింది. 

సొంత ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం మారిందని, నిరసనలపై నియంత్రణ విధించే బదులు ఒక ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచి ఉండాల్సిందని సౌరవ్‌ దాస్‌ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎలాంటి రసీదు ఇవ్వకుండా పోలీసులు తమ మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, వాటిని హ్యాక్‌ లేదా క్లోన్‌ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. వాటిలో ఏమైనా పత్రాలను చొప్పించి, తర్వాత వాటినే తమకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా పోలీసులు చూపించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ‘‘మోదీ సర్కారు దిల్లీలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం సృష్టిస్తోంది. అయినా మా ఆందోళన కొనసాగుతోంది. దిల్లీలోనే కాకుండా దేశమంతటా నిరసనలు ఉంటాయి. జ్ఞానేశ్‌ రాజీనామా చేసేవరకు ఇవి ఆగవు. ఏడాదిపాటు శాంతికి భంగం కలిగించవద్దని మాకు చెప్పారు. శాంతిని ఉల్లంఘించినవారు ప్రధాని మోదీ, అమిత్‌ షా, జ్ఞానేశ్‌కుమార్‌’’ అని చెప్పారు. 2024 ఎన్నికల్లో వారణాసిలో ఒక దశలో మోదీ వెనుకబడిపోయారని, తర్వాత గెలిచారని, అది ఎలా జరిగిందో జ్ఞానేశ్‌కు తెలుసా అని ప్రశ్నించారు. జంతర్‌ మంతర్‌వద్ద శాంతియుత నిరసనకు తేదీని ఇవ్వాల్సిందిగా కోరేందుకు సోమవారం తామంతా పోలీసులను కలుస్తామని చెప్పారు. 

శనివారం సాదాదుస్తుల్లో వచ్చిన పోలీసులు తనను కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో తిప్పారని, ఫోను అందుబాటులో లేకుండా చేశారని యూ ట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ తెలిపారు. 

ఇకపై నిరసనలు చేయబోమనే బాండుపై తాను ఎలాంటి సంతకం చేయలేదని దీప్కే నాగ్‌పుర్‌లో తెలిపారు. తనను వందసార్లు ఖైదు చేసినా మోదీ, అమిత్‌ షాలకు భయపడేది లేదన్నారు. ‘మీ (మోదీ) చర్యలకు మేం భయపడం. మీ నియంతృత్వాన్ని అంతం చేస్తాం’ అని స్పష్టంచేశారు.  

  • ఆందోళన కవరేజీకి వెళ్లిన పలువురు పాత్రికేయులు తమ గుర్తింపు పత్రాలు చూపిస్తున్నా పోలీసులు నిర్బంధంలో తీసుకున్నారు. దీనిని పాత్రికేయుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బేషరతుగా వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశాయి. 
  • ఆదివారం దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లను తెరిచారు. లుట్యెన్స్‌ ప్రాంతంలో పెద్దగా ట్రాఫిక్‌ ఆంక్షలేవీ విధించలేదు. అటువైపు దారితీసే ప్రధాన రహదారుల్లో భారీ బ్యారికేడ్లు పెట్టారు. అఖిలభారత విద్యార్థి సంఘం అధ్యక్షురాలు నేహా బోరాను విజయ్‌చౌక్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. 
  • కాషాయ దుస్తులు ధరించి, లాఠీలు చేతబట్టిన పలువురు కనాట్‌ ప్లేస్‌లో తిరుగుతూ ఆందోళనకారుల్ని బెదిరించడం కలకలం సృష్టించింది. వారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

సీపీఎంకు చెందిన రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిటాస్‌నూ నిర్బంధించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీనిపై తాను రాష్ట్రపతికి, రాజ్యసభ ఛైర్మన్‌కు, సీజేఐకి ఫిర్యాదు చేసినట్లు బ్రిట్టాస్‌ తెలిపారు.  

శనివారం నాటి ఆందోళనలకు సంబంధించి 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పోలీసు సిబ్బందిపై దాడులు, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. ఒక మహిళ ఫొటోలను మార్ఫింగ్‌ చేశారనే ఆరోపణకు సంబంధించిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీజేపీ నేతలకు దిల్లీ పోలీసులు తాజా నోటీసులు జారీచేశారు. 

శనివారం బంగ్లా సాహిబ్‌ గురుద్వారాలో కార్యకలాపాలకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలువురిపై దిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘గురు గృహా’న్ని రాజకీయ కార్యకలాపాలకు వాడుకుని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 06:35 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తండ్రికి కాలేయదానం కోసం 20 కిలోలు తగ్గిన కుమారుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని జిల్లా కేంద్రం బాందాలో తీవ్రమైన కాలేయవ్యాధితో బాధపడుతున్న తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడు పడిన తపన ఫలించింది.
  • మోదీ గుడి నిర్మించేదాకా.. రాముడు 400 ఏళ్లు గుడారంలోనే ఉన్నాడు: బిహార్‌ సీఎం ప్రధాని మోదీ అయోధ్యలో ఆలయం కట్టించేవరకూ శ్రీరాముడు 400 ఏళ్ల పాటు టెంట్‌లోనే ఉన్నాడని బిహార్‌ సీఎం సమ్రాట్‌ చౌధరీ వ్యాఖ్యానించారు.
  • కనుపాప సమస్య ఉన్న వారికి బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ ఎలా? రాయితీతో కూడిన వంట గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌కి బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడాన్ని సవాల్‌ చేస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.
  • అకోయిజంను అరెస్ట్‌ చేయాలి: ఏబీవీపీ లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) నుంచి తొలగింపునకు గురైన మణిపుర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అంగోమ్చా బిమోల్‌ అకోయిజంను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్‌ బుధవారం జేఎన్‌యూ వద్ద నిరసనలు ప్రారంభించింది.
  • ఫోన్‌ రిపేర్‌కు రూ.300 లంచం తీసుకున్న అధికారికి ఏడాది జైలు ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ రిపేర్‌ కోసం రూ.300 లంచం తీసుకున్నందుకు హైదరాబాద్‌కు చెందిన టెలికాంశాఖ అధికారిపై సీబీఐ నమోదుచేసిన కేసులో కింది కోర్టులు విధించిన ఏడాది జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారుచేసింది.
  • ఆరాంకో ప్రధాన కార్యాలయంపై హూతీల దాడి సౌదీలోని అతి పెద్ద చమురు సంస్థ ఆరాంకో ప్రధాన కార్యాలయంపై మంగళవారం రాత్రి హూతీలు దాడులు చేశారు.
  • పోటీ భోజనంబు.. అహహ్హ నేనే ముందు! ఈ చిత్రంలోని మహిళలంతా ఏదో వేడుకలో విందారగిస్తున్నారనుకుంటే పొరపాటే! వీరంతా రాగి ముద్దలు తినే పోటీలో పాల్గొంటున్నారు.
  • సన్యాసదీక్షలో ఉన్న క్యాథలిక్‌ ఫాదర్ల సంపాదన కుటుంబానికి చెందదు మతపరంగా సన్యాసదీక్ష స్వీకరించిన తర్వాత క్యాథలిక్‌ చర్చి ఫాదర్ల సంపాదన వారి వారసులకు చెందదని, సదరు మత సంస్థకే వెళ్తుందని మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది.
  • ‘సర్‌’ లేనప్పుడూ ఓడారు...2029లోనూ ఓడిపోతారు ఓట్ల సవరణకు ఉద్దేశించిన ‘సర్‌’ లేనప్పుడు కూడా కాంగ్రెస్‌ ఓడిపోయిందని... 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారీ ఆ పార్టీకి ఓటమేనని ఎద్దేవా చేశారు.
  • న్యాయ వ్యవస్థను నమ్ముతున్నాం న్యాయ వ్యవస్థపై తమకు అపార గౌరవం ఉందని, ప్రస్తుత ఓట్ల చోరీ వ్యవహారంలో ఆ వ్యవస్థకో పాత్ర ఉందని, దానిని సమర్థంగా పోషిస్తుందని నమ్ముతున్నామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.
  • క్యాబినెట్‌ను మోదీ విస్తరిస్తారా? తమిళనాడుకు చెందిన కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాలశాఖల సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ మంగళవారం మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
  • భద్రతావలయాన్ని ఛేదించుకుని జంతర్‌మంతర్‌లో ఆందోళన యత్నం ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) మంగళవారం యత్నించింది.
  • ఎన్నికల్లో గెలవలేకే.. రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్‌ విమర్శలు ఎన్నికల్లో గెలవలేకే కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల మద్దతు లేకపోవడంతో ఓడిపోతున్న కాంగ్రెస్‌కు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఎలా బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
  • బాల్య వివాహాలు అరికట్టడంలో భారత్‌ కృషి అద్భుతం: ఐరాస బాల్య వివాహాలు అరికట్టడం, బాలికల హక్కులను బలోపేతం చేయడంలో భారత్‌ చేస్తున్న కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.
  • మీరు కాదన్నా లద్దాఖ్‌ మాదే: భారత్‌ లద్దాఖ్‌లో 28 వ్యూహాత్మక ప్రదేశాలకు, భౌగోళిక ఆకృతులకు భారత్‌ నామకరణం చేయడంతోపాటు తన అధికారిక పటంలో వాటిని గుర్తించడాన్ని చైనా మంగళవారం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్‌ తిరస్కరించింది.
  • సమాచార హక్కు చట్టానికి 21 ఏళ్లు దేశంలోని 28 సమాచార కమిషన్ల పరిధిలో జూన్‌ 30 నాటికి 3.85 లక్షల అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచార హక్కు చట్టంపై పనిచేస్తున్న సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ (ఎస్‌ఎన్‌ఎస్‌) వెల్లడించింది.
  • మతం మారాలని కోరడం... మరొకరి విశ్వాసాలను అవమానించినట్లు కాదు మతం మారాలంటూ కోరడాన్ని మరొక వర్గం వారి విశ్వాసాలను అవమానించినట్లుగా పరిగణించరాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్‌ ధర్మాసనం పేర్కొంది.
  • బిహార్‌లో పడవ ప్రమాదం 14 మంది మృతి బిహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 20 మందితో వెళ్తోన్న పడవ గంగా నదిలో బోల్తా పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. 14 మంది మృతి చెందారు. వీరిలో అత్యధికులు చిన్నారులు.
  • పరీక్ష రోజే ప్రశ్నపత్రం తయారీ దేశంలో సంప్రదాయంగా ఒకే ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసే విధానానికి స్వస్తిపలకాలని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని సూచించారు.  ప్రశ్నపత్రాల లీకేజీ కట్టడి, పరీక్షల సంస్కరణలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌కు నీలేకని నేతృత్వం వహిస్తున్నారు.
  • దేశంలోనే తొలిసారిగా కేరళం అసెంబ్లీలో వృద్ధుల సంరక్షణ బిల్లు వృద్ధుల సంరక్షణ నిమిత్తం దేశంలోనే తొలిసారిగా ఒక సమగ్రమైన బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్రంగా కేరళం నిలిచింది.