ఎల్‌నినోను ఎదుర్కొందాం పద

- A
- A+
- A++

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్ : నీరు లేని జీవితం ఊహించలేనిది. పచ్చని చెట్లపై గొడ్డలి వేటుతో పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు తరలివెళ్లిపోయాయి. వర్షపాతం లోటు కనిపిస్తోంది. చలికాలంలో పొద్దంతా వేడి, రాత్రంతా ఉక్కపోత ఎదుర్కొంటున్నాం. జీవజాలం నిలకడగా ఉంటేనే మానవ మనుగడ సాధ్యం కానుంది. ఇకనైనా మేల్కొంటేనే ఎన్‌నినో సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చు.
ఒడిసిపడితే జల సిరి
ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఎల్‌నినో పరిస్థితులు అధిగమించేందుకు వీబీజీరాంజీ పథకంలో జలసిరిలో పంట కుంట 2,560, వ్యక్తిగత మరుగుదొడ్లు 23,479, సామూహిక మరుగుదొడ్లు 2,083, రీఛార్జి బావులు/బోర్లు 538 మంజూరు కాగా.. పనులు ప్రగతిలో కొనసాగుతున్నాయి. పంట కుంట నిర్మాణానికి రైతులు ముందుకు రావడంలేదు. ప్రతి నీటి బొట్టును నీటిలో ఇంకిస్తేనే భూగర్భ జలాలు వృద్ధిలోకి రానున్నాయి.
ప్లాస్టిక్ నివారణ
ప్లాస్టిక్ భూతం కలవర పెడుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు నిత్యం 5 వేల టన్నుల వ్యర్థాలు సేకరిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు అటకెక్కింది. భూమిలో కరిగేందుకు వందల ఏళ్లు పట్టనుంది. జీవరాశులకు ముప్పుగా పరిణమిస్తోంది. వాయు కాలుష్యం పెరుగుతోంది. పరిశ్రమలు, రైసుమిల్లులు ఎత్తైన పొగ గొట్టాలు ఏర్పాటు చేయడంలేదు.
తరుగుతున్న జల సంపద
ఉమ్మడి జిల్లాలో 2,43,347 హెక్టా మీటర్లలో భూగర్భ జలాల లభ్యం ఉంది. ఇందులో 1,04,305 హె.మీ వినియోగిస్తున్నారు. గోదావరి, మానేరు, గోదావరి, వాగుల పరీవాహక ప్రాంతాల్లో బోర్ల సాయంతో నీటిని తోడేస్తున్నారు. అత్యధికంగా సాగు కోసం 94,588 హె.మీ, గృహవసరాలు 5,190 హె.మీ, పరిశ్రమలకు 4,527 హె.మీ వాడుతున్నారు. 2.78 లక్షల వ్యవసాయ మోటార్లు నిరంతరాయంగా పని చేయడంతో నీరు వృథా అవుతోంది.
అటవీ విస్తీర్ణంపై ఆందోళన
ఉమ్మడి జిల్లాలో 9,091.17 చ.కి.మీ అడవులకు 1,284.08 చ.కి.మీ అడవులు మాత్రమే ఉన్నాయి. పోడు పేరిట అడవులు అంతరించిపోతున్నాయి. వన మహోత్సవంలో ఏటా 83 లక్షల మొక్కలు నాటినా.. సంరక్షణ గాలి కొదిలేస్తున్నారు. అదే స్థాయిలో చెట్లను నరికేస్తున్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణంలో అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. ఒక్క మొక్కను నరికితే పది మొక్కలు సంరక్షిస్తేనే వానలు సమృద్ధిగా కురవనున్నాయి.
ఇలా చేస్తే మేలు
- నీరు, అడవుల సంరక్షణలో అధికారులు పౌర భాగస్వామ్యం చేసి బాధ్యతలను వివరించాలి.
- బాల్యదశలో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి.. ప్రతి ఒక్కరూ కనీసం అయిదు మొక్కలు నాటేలా ప్రోత్సహించాలి.
- ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలి. వృథా నీటిని భూమిలోకి ఇంకించాలి.
- వ్యవసాయ మోటార్లకు అటోమెటిక్ స్టాటర్లను బిగించుకోవాలి

గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కొత్తగట్టు టోల్ ప్లాజా ప్రారంభం.. [ 15-10-2026] కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద 563వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాను గురువారం ఉదయం నిర్వాహకులు అధికారికంగా ప్రారంభించారు.
- సింగరేణి ప్రైవేటీకరణ అవాస్తవం: మంత్రి లక్ష్మణ్ [ 15-10-2026] బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులు మరణిస్తే ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించని ఆ పార్టీ కార్యనిర్వాహణాధికారి కేటీఆర్.. ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
- సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ: పెద్దపల్లి డీసీపీ [ 15-10-2026] సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట పడుతుందని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి అన్నారు.
- ఆస్తి కోసం తగాదా.. మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం [ 15-10-2026] ఆస్తి కోసం కుటుంబ సభ్యులు మానవత్వాన్ని మంటగలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకరైన వృద్ధుడు చనిపోయాడనే బాధను వ్యక్తపర్చకుండా ఆస్తి పంపకాల కోసం గొడవకు దిగారు.
- చోరీ చేస్తారు.. సరిహద్దు దాటేస్తారు! [ 15-10-2026] ఈనెల 8న ఎన్టీపీసీ జ్యోతినగర్‌లో ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తులు నడుచుకొంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.
- చిక్కరు.. దొరకరు.. దస్త్రం కదలదు [ 15-10-2026] కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ముందుకొస్తున్నా.. అనుమతులు మాత్రం రావడం లేదు. ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఫీజులు చెల్లించిన తర్వాత దరఖాస్తుదారులు ముప్పుతిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- ఆశల ‘కోట’.. నిర్లక్ష్యం మేట [ 15-10-2026] ఎల్లంపల్లి ఎత్తిపోతల ప్యాకేజీ-2లో చివరిది కలికోట సూరమ్మ జలాశయం.. కుడి, ఎడమ కాల్వల తవ్వకాలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలకు ఇటీవల 518.01 ఎకరాల భూ సేకరణకు రూ.55 కోట్ల పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయి.
- వరి.. కల్లాల్లో సిరి [ 15-10-2026] మునుపెన్నడూ లేనివిధంగా వరి ధాన్యానికి ఈ సారి బహిరంగ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఎల్‌నినో పరిస్థితులతో వానాకాలంలో అరకొర పంటలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధరకు మించి ధర అందుతుండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- ధ్వంసం చేసి.. దర్జాగా పూడ్చేసి! [ 15-10-2026] కోరుట్ల పట్టణ శివారులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని జాతీయ రహదారి పక్కనే శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు చెందిన ఉపకాలువను ధ్వంసం చేసి ఆక్రమించారు. పట్టణ శివారులోని ఎస్సారెస్పీ డీ-40 కాలువ నుంచి ఈ ఉపకాలువల ద్వారా కోరుట్ల, వెంకటాపూర్ ఆయకట్టు వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది.
- సింగరేణిలో జోష్ నింపిన కేటీఆర్ సభ [ 15-10-2026] గోదావరిఖనిలో బుధవారం నిర్వహించిన భారాస కార్మిక గర్జన సభ పార్టీతో పాటు తెబొగకాసం శ్రేణుల్లో జోష్ నింపింది. సింగరేణి సంస్థకు జరుగుతున్న నష్టాన్ని, కుంభకోణాల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ప్రసంగం కార్మికుల్లో ఉత్సాహం నింపింది.
- వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ [ 15-10-2026] యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రైతులకు సూచించారు.
- కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై.. నేటి నుంచి టోల్ వసూలు [ 15-10-2026] వరంగల్-కరీంనగర్ మార్గంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఎన్‌హెచ్-563పై వాహనాల రాకపోకలు ప్రారంభం కావడంతో టోల్ వసూల్ చేయడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) అధికారులు సిద్ధమయ్యారు.
- ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో ఇరుక్కొని డ్రైవర్.. [ 15-10-2026] ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మున్సిపల్ పరిధి పెద్దూరు దుప్యానాయక్ తండాకు చెందిన తిరుపతి నాయక్(30) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
- టైల్స్ గుత్తేదారు దారుణ హత్య [ 15-10-2026] గృహాల్లో టైల్స్ వేసే గుత్తేదారు దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఖేరాగఢ్ తహసీల్ పరిధిలోని గుగావండ్కు చెందిన జాటమ్ పవన్‌సింగ్(32)ను కత్తితో పొడిచి హతమార్చారు.
- బావిలో పడి ఇద్దరు యువకుల మృతి [ 15-10-2026] ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు కథలాపూర్ మండలం చింతకుంటలో వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది.
- కరీంనగర్లో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు [ 14-10-2026] రామగుండంలో జరిగే సింగరేణి పరిరక్షణ సభలో పాల్గొనేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద..
- కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తరలించాలి [ 14-10-2026] గ్రామాల్లో ముందస్తుగా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోకి వరి ధాన్యాన్ని తరలించుకోవాలని మెట్పల్లి సింగిల్ విండో ఛైర్మన్ గాజుల మహేష్ గౌడ్ రైతులకు సూచించారు.
- నీటిని విడుదల చేయాలని ఆందోళన [ 14-10-2026] చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లోని కాలువలకు నీటిని విడుదల చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
- వ్యవసాయ బావిలో పడి.. ఇద్దరు గుంటూరు జిల్లా వాసుల మృతి [ 14-10-2026] జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల పరిధిలోని చింతకుంట గ్రామ శివారులో ఉన్న ఒక వ్యవసాయ బావిలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
- యాప్ ఉండగా.. లెక్కల బాధ లేదిక [ 14-10-2026] గ్రామాల్లో వ్యవసాయ పనులు చేయడానికి నిత్యం ట్రాక్టర్లను వినియోగించే రైతులకు ఇక లెక్కల పద్దు చిట్టా తయారు చేయడానికి పుస్తకాలు అవసరం లేదు.
- కూపీ లాగితేనే.. నిజాలు వెలుగులోకి [ 14-10-2026] హుజూరాబాద్ బల్దియాలో టెండర్ల నుంచి బిల్లుల చెల్లింపు వరకు వివాదాస్పదంగా మారుతోంది. టెండర్ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలపై విజిలెన్సు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదులు అందడం చర్చనీయాంశమైంది.
- సామాన్యుడిపై ‘ధరా’ఘాతం [ 14-10-2026] ‘నా భార్య, నేను ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నాం. ఇద్దరికీ కలిపి నెలకు రూ.40 వేల వరకు వేతనం వస్తుంది. ముగ్గురు పిల్లలతో కూడిన కుటుంబం ఈ ఆదాయంతో ఆరు నెలల కిందటి వరకు బాగానే నడిచింది.
- రూ.20 లక్షల నగదు మాయం [ 14-10-2026] తిమ్మాపూర్ బ్రాంచ్ తపాల కార్యాలయంలో అక్రమాలు వెలుగు చూశాయి. పోస్ట్‌మాస్టర్ రూ.20 లక్షలు నగదును మాయం చేసినట్లు ఖాతాదారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు వివరాల ప్రకారం..
- పదేళ్లుగా.. పారకం లేని కాలువలు [ 14-10-2026] రామడుగు మండలంలో నిర్మించిన పారకం కాలువలు పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో సాగు నీరు అందక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- దసరా వేళ.. ఉపాధిసం‘క్రాంతి’ [ 14-10-2026] తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అక్కడి పేదలకు పంపిణీ చేసే చీరల ఆర్డర్లు మన సిరిసిల్ల మరమగ్గాలపై ఉత్పత్తి అవుతున్నాయి. పండగకు నాలుగు నెలల ముందు జిల్లాకు 6 లక్షల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు వచ్చాయి.
- అండర్‌పాస్ నిర్మించకుంటే రహదారి దిగ్బంధం [ 14-10-2026] కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల ప్రజల సౌకర్యార్థం ఎన్హెచ్ఏఐ నిర్వాహకులు అండర్‌పాస్ నిర్మించకుంటే జాతీయ రహదారి దిగ్బంధంతో ఆందోళన తీవ్రతరం చేస్తామని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు.
- కాకులగుట్ట మట్టి.. అంతా ఖాళీ [ 14-10-2026] ఏడో నంబరు రాష్ట్ర రహదారిని ఆనుకొని కూత వేటు దూరంలో ఉన్న కప్పారావుపేట శివారులోని కాకుల గుట్ట మట్టిని అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తున్నారు.
- 8 నెలల గడువు.. అడుగులు పడని పనులు [ 14-10-2026] వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల్లో భాగంగా గోదావరి తీరం వెంట ఏర్పాటు చేసే పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
- మానేరు వంతెన కలేనా? [ 14-10-2026] ముత్తారం మండలం ఓడేడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కలికోటపల్లి గ్రామాల మధ్య మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నాయి.
- కరెంటు తొలగించి.. బియ్యం తరలించి [ 14-10-2026] మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు, పోలీసులు తరచూ దాడులు చేస్తూ పట్టుకుంటున్నా మార్పు రావడం లేదు.
- పల్లెలకు పోటెత్తి.. దళారులకే సం‘పత్తి’ [ 14-10-2026] ఈ ఏడాది ఉత్సాహంగా తెల్ల బంగారం సాగు చేసిన రైతులను వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది.