రాష్ట్రంలో మార్పు కనిపిస్తోంది

- A
- A+
- A++

ఈనాడు, రాజమహేంద్రవరం, మండపేట, రాజానగరం, బొమ్మూరు, న్యూస్‌టుడే: ‘నేను ఏపీకి వచ్చి చాలా కాలమైంది. ఇక్కడ పరిపాలన ఎలా ఉంది? రోడ్లు ఎలా ఉన్నాయి? అని ప్రయాణంలో మాట్లాడుకున్నాం. గతానికి, ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి. మంచి రోడ్లు వచ్చాయి. ఎక్కడో 23, 25వ స్థానాల్లో ఉన్న పంచాయతీరాజ్ ఇప్పుడు దేశంలో నంబర్ వన్‌గా నిలిచింది. నెమ్మదిగా అన్నీ బాగుపడుతున్నాయి. సత్యకుమార్ ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖ మెరుగుపడుతోంది. రాష్ట్రం అభివృద్ధి పథం వైపు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా‘ అని సినీనటుడు చిరంజీవి పేర్కొన్నారు.
ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో జీఎస్ఎల్ వైద్య కళాశాల, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ కలిపి ఏర్పాటుచేసిన హెల్త్‌కేర్ సెంటర్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డా.నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ కళాశాలను, రాజనగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలోని స్మార్ట్ల్యాబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నేను ఇంత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండడానికి కారణం అభిమానుల ప్రేమే. మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని అన్నారు.
డా.నాగేశ్వరరెడ్డికి నేను అభిమానినని చెప్పడానికి గర్వపడతానని చెప్పారు. ఆయన రోజుకు 18 గంటలు రోగుల సేవల్లోనే ఉంటారని, ఆయన సూచనలు, సలహాలతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ క్యాన్సర్‌పై అవగాహన అవసరమని, ముందుగా గుర్తించగలిగితే ఆ రక్కసిని జయించవచ్చని చిరంజీవి అన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి మనమంతా దూరంగా ఉండాలని కోరారు. వైద్య విద్యార్థులకు సమాజంపై బాధ్యత, వ్యక్తిగత క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఇంట్లో వండిన ఆహారమే మేలు
ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డా.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘ఇటీవల ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్ వంటి మెటబాలిక్ వ్యాధులూ కనిపిస్తున్నాయి. 40 ఏళ్ల లోపు యువతలోనూ క్యాన్సర్ కేసులు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్యాక్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం అతిగా తినడం సరికాదు. రసాయనాలు, ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు అధికంగా ఉండే ఆహారం కాకుండా ఇంట్లో వండిన సహజమైన ఆహారాన్ని తినాలి.
చిరంజీవిని చూడండి. ఆయన వయసు కనిపించదు. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆహార నియమాలు, వ్యాయామాలు, ఆరోగ్యకరమైన అలవాట్లే అతన్ని అంత ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. అలా పాటిస్తే మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు’ అని ఉదహరించారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ జీవీబీ చౌదరి, జీఎస్ఎల్ ఛైర్మన్ డా.గన్ని భాస్కరరావు, డా.సందీప్, డా.సాధిక, డా.గోగినేని తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చీలిక పెదవి.. చింతను తగ్గించొచ్చు! ఆరోగ్యాన్నే కాకుండా, ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీసే సమస్య గ్రహణ మొర్రి. దీనిపై అనేక మూఢనమ్మకాలూ ఉన్నాయి.
- ద్విచక్ర వాహనమూ స్మార్ట్ అవుతోంది ఒకప్పుడు కార్లకే పరిమితమైన ఆధునిక ఫీచర్లు, సాంకేతికతలు ఇప్పుడు ద్విచక్ర వాహనాల్లోకీ వచ్చేశాయి. కార్లతో పోటీగా ధీటైన సౌకర్యాలతో మార్కెట్లోకి వస్తున్నాయి.
- అక్కడ బంగారం దొరుకుతుంది.. సైలెంట్‌గా తెచ్చేద్దాం! యూట్యూబ్‌లో రీల్స్ చూసి యాభై ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి బంగారం వేట కోసం వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
- నౌకా నిర్మాణ హబ్‌గా ఏపీ ఆంధ్రప్రదేశ్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.
- కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరించలేం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనేక ఏళ్లుగా అమలులో ఉన్న విధానమే ఇప్పుడూ అమలు చేస్తున్నామని.. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోలేమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
- యువశక్తే దేశానికి దిక్సూచి భారత యువత ఉత్సాహం, పరుగులు పెడుతున్న సాంకేతికతతో 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
- మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎంతో తెలుసా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లలో మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో, ఎంత మందికి సంక్షేమ...
- దుర్గమ్మను దర్శించుకున్న విజయ్ తొలుత ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దర్శించుకున్నారు.
- మీది ద్రోహం.. మాది భరోసా! స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి తగ్గించి వైకాపా తీవ్ర అన్యాయం చేస్తే, కూటమి ప్రభుత్వం 40 శాతానికిపైగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ భరోసా ఇస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
- జడ్పీ ఛైర్పర్సన్ పదవుల్లో బీసీలకు 6.. ఎస్సీలకు 5 జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులకు ప్రభుత్వం మంగళవారం రిజర్వేషన్లు ప్రకటించింది.
- ఎన్సీసీ ఛైర్మన్ ఏవీఎస్ రాజు కన్నుమూత ఎన్సీసీ లిమిటెడ్ వ్యవస్థాపకులు, సంస్థ గౌరవ ఛైర్మన్ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్ రాజు) (89) హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.
- మేయర్ అభ్యర్థుల నామినేషన్ డిపాజిట్ రూ. 3,000 నగరపాలక సంస్థల్లో మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నామినేషన్ డిపాజిట్ (ధరావతు)ను ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
- పల్లెపండగ 3.0లో మరిన్ని రహదారులు పల్లెపండగ 3.0లో రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 161 డొంక రోడ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు.
- కొరియన్ కనకరాజుల ముందు షూపు! బూట్లు, చెప్పులు ఏంటి.. ఇలా వరుసగా ఉన్నాయనుకుంటున్నారా? ఓ కొరియన్ రెస్టారెంట్లో ఈ పద్ధతి పాటిస్తున్నారు.
- అంతర్జాతీయ సాంకేతిక హబ్‌గా అమరావతి అమరావతిని అంతర్జాతీయ సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
- ఏపీఈఆర్సీ సభ్యుడిగా పాండురంగారావు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సభ్యుడిగా (న్యాయవిభాగం) అంచా పాండురంగారావును నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఐటీ చట్టంలోని సెక్షన్ 147(ఏ) రాజ్యాంగ విరుద్ధం ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్ 147(ఏ) రాజ్యాంగ విరుద్ధమని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. దానిని కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.
- గవర్నర్ ఉదారత గవర్నర్ అబ్దుల్ నజీర్ నిరుపేద రోగుల పట్ల ఉదారత చాటారు. జీజీహెచ్‌లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఆయన సొంత నిధులు రూ.12.65 లక్షలతో...
- ఆహార వ్యర్థాలతో ఆహా.. అనేలా! ఈ చిత్రంలో కనిపిస్తోంది బయోగ్యాస్ ప్రొడక్షన్ ఫ్రం ఫుడ్ వేస్ట్ ప్లాంట్. బాపట్ల వ్యవసాయ కళాశాలలో దీని సాయంతో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు.
- రాష్ట్రంలో కొత్తగా 22 డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వైద్యసేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం (పీఎంఎన్డీపీ) కింద కొత్తగా 22 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.