‘ఏఐ’తో గుండె పదిలం

Eenadu icon
By Telangana News Desk Published : 12 Oct 2026 04:43 IST Ee Font size
  • A
  • A+
  • A++
6 min read

ఈసీజీని పరీక్షించి.. ఒక వ్యక్తి గుండె సామర్థ్యం ఎలా ఉందనేది ఏఐ సాయంతో 92-93 శాతం కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యమేనని నారాయణ హృదయాలయ ఛైర్మన్, ప్రముఖ గుండె శస్త్రచికిత్స వైద్యనిపుణులు డాక్టర్‌ దేవిశెట్టి స్పష్టం చేశారు. ఈసీజీని ఏఐతో విశ్లేషించడం ద్వారా సడన్‌ కార్డియాక్‌ అరెస్టును కూడా ముందస్తుగా గుర్తించగలిగే అవకాశం ఉంటుందని అన్నారు. డిజిటల్‌ ప్లాట్‌ఫాం ద్వారా అతి వేగంగా సమాచార మార్పిడి జరుగుతుందని, ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా వేగం, కచ్చితత్వంతో కూడిన చికిత్సను అందింవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే పదేళ్లలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని, చికిత్సలో సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవాల్సిన సందర్భాల్లో దాని నుంచే స్వీకరించే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అయితే అది స్మార్ట్‌ అయినా.. దానికంటే స్మార్టర్‌ డాక్టరే అని.. అంతిమ నిర్ణయం వైద్యుడిదే అని డాక్టర్‌ దేవిశెట్టి స్పష్టంచేశారు. వైద్యరంగంలో కృత్రిమ మేధ పాత్రపై ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.

మెడికల్‌ ఎర్రర్‌ను ఏఐతో తగ్గించడం సాధ్యమవుతుందా?

మనం ఏం ట్రీట్‌మెంట్‌ ఇచ్చినా.. ప్రతి ఒక్కటీ రికార్డవుతుంది. ఐసీయూలో కిడ్నీ సమస్య బార్డర్‌లైన్‌లో ఉన్నవారికి ‘జెంటామైసిన్‌’ ఇంజెక్షన్‌ ఇచ్చామనుకోండి.. ఇది ‘నెఫ్రోటాక్సిక్‌’ ఇంజెక్షన్‌. కిడ్నీని దెబ్బతీస్తుంది. డాక్టర్‌ పేపర్‌పైన రాస్తే.. నర్సు ఇస్తారు. అదే ఏఐతో ఉన్న స్మార్ట్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో అయితే.. మీరు ‘జెంటామైసిన్‌’ అని రాయడం పూర్తి చేయగానే అది ‘పేషెంట్‌ క్రియాటిన్‌ 2.5 ఉంది.. ఇవ్వడానికి వీలు లేదు’ అని చెబుతుంది. అది ఏఐకి ఉన్న పవర్‌. పేషెంట్‌ హెల్త్‌కేర్‌ను ఇది సురక్షితం చేస్తుంది.

నారాయణ హృదయాలయ కొన్నేళ్లుగా ఏఐని వినియోగిస్తోంది కదా? మీ అనుభవాలేంటి

ఏఐకి డిజిటల్‌ సమాచారం అవసరం. స్ట్రక్చర్డ్‌ డేటా కూడా కావాలి. పేషెంట్‌కు సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే.. హెల్త్‌కేర్‌లో అత్యంత కీలకమైనది డయాగ్నొసిస్‌. మానవ మేదస్సు ఒకసారి పది నుంచి 15 డేటా పాయింట్లను పరిశీలించగలదు. కానీ ఏఐ.. 60 నుంచి 100 డేటా పాయింట్లు ఉంటే కూడా విశ్లేషించగలదు. మా ఆసుపత్రిలో ఎనిమిది సంవత్సరాల క్రితమే డిజిటల్‌ ప్లాట్‌ఫాం ప్రారంభించాం. 50 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో కూడిన నారాయణ హృదయాలయ బృందం.. ఏఐ టూల్స్‌ తయారు చేసింది. మా టీములోని 20 మంది డాక్టర్లకు ఈ యాప్‌ ఉంటుంది. ఉదాహరణకు ‘డెడ్లీ బ్యాక్టీరియా’ ఉన్నట్లు తేలగానే డ్యూటీలో ఉన్నా లేకున్నా వైద్యులకు సమాచారం వెళ్లిపోతుంది. పేషెంట్‌ బెడ్‌ దగ్గర ఉన్న డాక్టర్‌ కచ్చితంగా చూస్తారు. అవసరమైతే మిగిలిన వైద్యులూ స్పందిస్తారు. వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తారు. అలాగే ఐసీయులో కొన్ని గంటలకోసారి బ్లడ్‌గ్యాస్‌ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్ష ఫలితాలు మా టీములోని 20 మంది డాక్టర్లు, నర్సుల ఫోన్‌లో ఉన్న యాప్‌నకు వస్తాయి. మామూలుగా కొద్దిమంది నర్సులు మాత్రమే ఈ రిపోర్ట్‌ను ఇంటర్‌ప్రిటేషన్‌ చేయగలరు. కొద్దిగా సంక్లిష్టమైనది. మా ఆసుపత్రిలో బ్లడ్‌ గ్యాస్‌ రిపోర్టుతో పాటు.. ఏఐ ద్వారా ఇంటర్‌ప్రిటేషన్‌ కూడా వస్తుంది. దాంతో ప్రస్తుతం అంతా నిపుణులయ్యారు. వైద్యులను, నర్సులను ఏఐ పనికిరాకుండా చేస్తుందనే వాదన ఉంటే.. దానికి భిన్నంగా ఏఐ వల్ల స్మార్టర్‌గా తయారయ్యారు. స్మార్ట్‌ ఈఎంఆర్‌ వల్ల మెరుగైన స్మార్టర్‌ డయాగ్నొసిస్‌ వస్తుంది. సమీప భవిష్యత్తులో సుమారు ఐదు నుంచి పది సంవత్సరాల లోపు కచ్చితంగా ఏఐ  నుంచి సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవడం చట్టపరంగా కూడా తప్పనిసరనే పరిస్థితి వస్తుంది. 

గుండె సమస్యలను కూడా ఏఐ ద్వారా ముందస్తుగా గుర్తించవచ్చా?

కార్డియాక్‌ అరెస్టుకు ఆరు నుంచి ఎనిమిది గంటల ముందు కొన్ని సిగ్నల్స్‌ కనిపిస్తాయి. హార్ట్‌ రేట్‌ పెరుగుతుంది. బీపీ తగ్గుతుంటుంది. మూత్రం ఔట్‌పుట్‌ క్రమంగా తగ్గుతూ వస్తుంది. కార్డియాక్‌ అరెస్టుకు ముందు 67 రకాల అంశాలకు సంబంధించి డేటా పాయింట్లను విశ్లేషించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏఐ కీలకంగా పని చేస్తుంది. మానవ మేదస్సు పనిచేసే దానికంటే భిన్నంగా పనిచేస్తుంది. మా బృందం ఓ అప్లికేషన్‌ను తయారు చేసింది. ఈసీజీని చూసి ఏ డాక్టరైనా ‘గుండె పనితీరు సామర్ధ్యం(ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌)’ చెప్పగలరా? ఆ సైన్స్‌ ఇంకా లేదు. కానీ ఏఐకి మా సిస్టమ్‌లోని లక్షల ఈసీజీలతో యాక్సెస్‌ ఉంది. సేమ్‌ పేషెంట్స్‌ ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌తో కూడా యాక్సెస్‌ ఉంది. కాబట్టి ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ గురించి దాదాపుగా చెప్పగలదు. మా అధ్యయనంలో 92 నుంచి 93 శాతం కచ్చితత్వం ఉన్నట్లు తేలింది. ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ తక్కువగా ఉంటే.. పేషెంట్‌కు ఏదో రకమైన హార్ట్‌ అటాక్‌ లేదా ఏదో జబ్బు ఉన్నట్లు. ఆ పేషెంట్‌కు తదుపరి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఏఐ టూల్స్‌తో కార్డియాక్‌ విశ్లేషణ జరిగితే.. కనీసం 70 నుంచి 80 శాతం కార్డియాక్‌ అరెస్టులు ‘యాంటిసిపేటెడ్‌ కార్డియాక్‌ అరెస్టులు’గా మారతాయి. ఇది ఐసీయూ మేనేజ్‌మెంట్‌లో గేమ్‌ఛేంజర్‌ అవుతుంది.

ఏఐ సూచించిందే అంతిమమా?

ఏఐ.. టూల్‌ మాత్రమే. అయితే వైద్యుడికి అన్నిసార్లు సరిపోను సమయం ఉండదు. ఉదాహరణకు యాంజియోగ్రామ్‌ చూసినపుడు హార్ట్‌సర్జన్‌గా నా కోణం అంతా.. బైపాస్‌ సర్జరీ వైపే ఉంటుంది. అదే యాంజియోగ్రామ్‌ను కార్డియాలజిస్ట్‌ చూస్తే.. యాంజియోప్లాస్టీ గురించి ఆలోచిస్తారు. వీలుకాదనుకుంటే బైపాస్‌కు పంపుతారు. అంతిమంగా ఏం చేయాలో నిర్ణయించే ఏజెంట్‌ ఏఐ కాదు. అదెప్పటికీ జరగదు. అన్ని వేళలా డాక్టర్‌ మాత్రమే నిర్ణయిస్తారు. 

వైద్య రంగంలో ఏఐ వినియోగం ఎలా ఉండాలి?

చిన్న పిల్లలు హోంవర్క్‌ చేయాలి. చాట్‌ జీపీటీని అడిగి రాస్తే.. అది దుర్వినియోగం చేయడమే. అలాగే కొందరు వైద్యులు వాళ్ల బ్రెయిన్‌ను వినియోగించకుండా ఏఐ ఏం చెబితే అది చేస్తున్నారు. అలాకాకుండా ఏఐ విశ్లేషణను అర్థం చేసుకొని వాస్తవ పరిస్థితులకు అన్వయించుకొని వైద్యులు నిర్ణయాలు తీసుకోవాలి.

ప్రధాన నగరాల్లో ఉండేవారికి తప్ప.. గ్రామీణ ప్రాంతాల్లోని పేషెంట్లకు ఏఐ పెద్దగా ఉపయోగపడదనే అభిప్రాయాలపై మీరు ఏమంటారు?

భారీగా డిజిటల్‌ హెల్త్‌కేర్, డిజిటల్‌ ప్లాట్‌ఫాంపైన వ్యయం చేయగలిగిన పెద్ద ఆసుపత్రులకు మాత్రమే ప్రస్తుతానికి ఏఐ పరిమితమైంది. పటిష్ఠమైన డిజిటల్‌ ప్లాట్‌ఫాం లేని ఆసుపత్రులు ఏఐని వినియోగించలేవు. సమయం పడుతుంది. 

ఏఐ తప్పుడు వైద్యాన్ని సూచిస్తే ఎవరు బాధ్యులు?

వైద్యుడిదే బాధ్యత. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఏఐ.. వైద్యులకు సహాయపడే టూల్‌ మాత్రమే. వైద్యులు తప్పు చేయకుండా నివారిస్తుంది. మన మైండ్‌కు రాని ప్రత్యామ్నాయ ట్రీట్‌మెంట్‌ను సూచిస్తుంది. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఏఐ వల్ల పేషెంట్లకు సురక్షితమైన హెల్త్‌కేర్‌ అందుతుంది.

వైద్య చికిత్సలో ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డులు (ఈఎంఆర్‌) విధానానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటి?

అమెరికన్‌ ఆసుపత్రుల్లో చేరడమంటేనే.. సురక్షితమైన ఆసుపత్రుల్లో చేరినట్లుగా పలువురు భావిస్తారు. అలాంటి చోట కూడా మెడికల్‌ ఎర్రర్‌కు ఆస్కారం ఉంటోంది. ఉదాహరణకు అక్కడ ఓ ఆసుపత్రిలో 200 మంది పేషెంట్లు ఒక రాత్రి ఉంటే.. అందులో ఒకరు మెడికల్‌ ఎర్రర్‌తో చనిపోతున్నారు. అమెరికాలో కూడా చాలా హాస్పిటల్స్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈఎంఆర్‌ వినియోగించడంలేదు. పేపర్లపై రాసిన డేటా ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితంగా చికిత్సపై సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిన వైద్యుల వద్దకు ఈ సమాచారం సకాలంలో చేరదు. ఫలితంగానే మెడికల్‌ ఎర్రర్స్‌ చోటుచేసుకుంటాయి. ఉదాహరణకు ఒక నర్సింగ్‌ టీం డ్యూటీ ముగిసే సమయంలో ఒక పేషెంట్‌కు సంబంధించిన రక్త పరీక్షలో ‘డెడ్లీ బ్యాక్టీరియా’ ఉందని రిపోర్టు వస్తే.. వచ్చే టీము చూసి వైద్యులకు అందజేస్తారని వెళ్లిపోతారు. తర్వాత డ్యూటీకి వచ్చిన వారికి ఆ రిపోర్టు చూడడంలో.. ఆ సమాచారాన్ని వైద్యులకు చేర్చడంలో ఆలస్యం కావొచ్చు. అప్పుడు ‘ఈ-కొలి’ బ్యాక్టీరియా ఉందని ట్రీట్‌మెంట్‌ ప్రారంభించినా పేషెంట్‌ను సాధారణ స్థితికి తీసుకురావడం కష్టమవుతుంది. ఎందుకంటే ‘ఈ-కొలి’ బ్యాక్టీరియాకు నాలుగైదు గంటల సమయం దొరికితే శరీరమంతా వ్యాపిస్తుంది. అదే డిజిటల్‌ ప్లాట్‌ఫాం ఉంటే.. డాక్టర్లందరి మొబైల్‌ ఫోన్‌కు ఈ సమాచారం వస్తుంది. వెంటనే సంబంధిత డాక్టర్‌ లేదా అందరు డాక్టర్లు చూస్తారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రేచుకుక్క వేటకి.. వేగమే ఆయుధం! పెద్దపులి కాదు.. బలమైన పంజాలు లేవు. భయపెట్టించే ఆకారమూ కాదు. చిన్న శరీరం, పొడవాటి కాళ్లు, సన్నని దేహం, గుబురుగా ఉండే తోక.
  • నీటి సంరక్షణలో ‘శం షేర్‌’పల్లి! ఇక్కడ యంత్రంతో కలుపు తీస్తున్న శేర్పల్లి(హెచ్‌)కు చెందిన రైతు పేరు గోవర్ధన్‌. గతంలో వరి, జొన్న, మొక్కజొన్న సాగుచేసేవారు.
  • బీసీల విద్యాభివృద్ధికి కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలి బీసీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్రాలకు.. కేంద్రం 60 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.
  • రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్‌కు ఎసరు: హరీశ్‌రావు రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్రకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరలేపుతోందని భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఓ ప్రకటనలో విమర్శించారు. రైతు డిస్కం ఏర్పాటు చేస్తూ జీవో 17 జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
  • రూ.2,000 మించిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఎండీఆర్‌ వాయిదా రూ.2,000కు మించిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) విధింపు నిర్ణయాన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వాయిదా వేసింది.
  • ఎల్‌నినో, ఐవోడీ పరస్పర చర్యలతో రుతుపవనాల్లో మార్పులు ఎల్‌నినో సదరన్‌ ఆసిలేషన్‌(ఈఎన్‌ఎస్‌వో), హిందూ మహాసముద్ర డైపోల్‌(ఐవోడీ)ల మధ్య జరిగే సంక్లిష్టమైన చర్యలు భారతీయ రుతుపవనాల గమనాన్ని నిర్దేశించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఐఐటీ ఖరగ్‌పుర్‌ ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌ గుప్తా అన్నారు.
  • 32 నెలలు.. 3.77 కోట్ల ట్రాఫిక్‌ ఉల్లంఘనలు హెల్మెట్‌ పెట్టుకోకపోవడం.. రాంగ్‌ రూట్‌లో దూసుకెళ్లడం.. పరిమితికి మించిన వేగం.. మద్యం మత్తులో స్టీరింగ్‌ పట్టడం.. డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడటం రహదారులపై మృత్యుపాశాలుగా మారుతున్నా ఈ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు ఏ మాత్రం తగ్గడం లేదు.
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని, గెలుపే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ దిశానిర్దేశం చేశారు.
  • నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం.. అద్భుతం అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు ప్రశంసించారు.
  • పట్టభద్రుల ఓటు కోసం ఫారం-18 నింపాల్సిందే! మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటరు జాబితాలో పేర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.
  • సంక్షిప్త వార్తలు(21) రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ)కు బడ్జెట్‌లో భాగంగా ప్రభుత్వం తాజాగా రూ.296.60 కోట్ల కేటాయింపులకు పాలనాపరమైన అనుమతిస్తూ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ టీకే శ్రీదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
  • సెమీకండక్టర్ల పరిశోధనకు ఐఐటీ హైదరాబాద్‌-జపాన్‌ వర్సిటీ ఒప్పందం పరస్పర సహకారంతో విద్య, పరిశోధన, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్, జపాన్‌లోని ఎంఐఈ విశ్వవిద్యాలయం చేతులు కలిపాయి.
  • కాంగ్రెస్‌ రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తోంది: రామచందర్‌రావు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ శ్రేణులు తాజాగా సుప్రీంకోర్టు వద్ద ప్రదర్శించిన నాటకీయ వైఖరిని దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పేర్కొన్నారు.
  • నీటి పొదుపుపై 60 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు: సీఎస్‌ ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై 60 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎస్‌ సంజయ్‌ జాజు తెలిపారు.
  • మరోసారి ఎమ్మెల్సీ బరిలో రామచందర్‌రావు? హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావును బరిలో దించేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
  • త్వరలో హైదరాబాద్‌లోనూ మార్చ్‌.. సభ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించేవరకు కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే ఉద్యమం ఆగదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు.
  • ఏళ్ల తరబడి భద్రంగా సర్టిఫికెట్‌ మీ సేవ ఆధ్వర్యంలో రూపకల్పన ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.
  • ఆర్బిట్రేటర్లుగా అవకాశం కొందరికే ప్రపంచీకరణ నేపథ్యంలో వర్తక, వాణిజ్య, ఒప్పందాల ఉల్లంఘనల్లో ఆర్బిట్రేషన్‌(మధ్యవర్తిత్వం)కు అధిక ప్రాధాన్యమిస్తుండగా..ఆర్బిట్రేటర్లుగా కొందరికే అవకాశాలు లభిస్తున్నాయంటూ నల్సార్‌ వర్సిటీ ఆధ్వర్యంలోని మిలన్‌ కె.బెనర్జీ సెంటర్‌ ఫర్‌ ఆర్బిట్రేషన్‌ లా రూపొందించిన నివేదిక వెల్లడించింది.
  • ఫ్యూచర్‌ సిటీలో ఎన్‌ఐయూఎం ప్రాంగణం తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పనిచేసే పట్టణాభివృద్ధి పరిశోధన సంస్థ ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐయూఎం)’ నూతన ప్రాంగణాన్ని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్మించనున్నారు.
  • యుద్ధప్రాతిపదికన హ్యామ్‌రోడ్ల పనులు: మంత్రి సీతక్క రాష్ట్రంలో చేపట్టిన 7,448 కి.మీ. హ్యామ్‌ రోడ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.