వెండితెరపై ‘రామాయణం’.. నేనెప్పుడూ సంతృప్తి చెందలేదు: రాజమౌళి

Eenadu icon
By Entertainment Team Updated : 12 Oct 2026 09:24 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్: భారతీయ ఇతిహాసాలను తెరకెక్కించే విధానంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. వెండితెరపై వాటిని చూపిన తీరుపై తాను ఎప్పుడూ సంతృప్తి చెందలేదని ఆయన ( SS Rajamouli) పేర్కొన్నారు.

ఎన్నో క్లాసిక్ పౌరాణిక చిత్రాలు తనకు ఇష్టమైనప్పటికీ, గొప్ప గొప్ప గ్రంథాలకు మాత్రం తెరపై పూర్తి న్యాయం జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం గురించి వివరిస్తూ ఇతిహాసాలు రాసిన విధానానికి, వాటిని తెరపై చూపించిన దానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఈ లోటే తనను చాలా ఏళ్లుగా ఆలోచింపజేసిందని, చివరికి దాన్ని తానే ఒక సవాల్‌గా స్వీకరించానని రాజమౌళి తెలిపారు. ‘‘ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? వాటిని ఎలా చూపించబోతున్నావు?’’ అని తనను తాను ప్రశ్నించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ స్వీయ సవాలే ‘వారణాసి’ సినిమాకు ప్రధాన పాయింట్‌ అయిందని తెలిపారు.

ఇప్పటికే ‘వారణాసి’లో (Varanasi) రామాయణానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు రాజమౌళి గతంలో తెలిపారు. ఇప్పుడీ కామెంట్స్‌తో ఆ సన్నివేశాలపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. మహేశ్‌ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్‌లలో విడుదల కానుంది.

  • ప్రేక్షకులు ట్రోల్ చేసేలోపే.. మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి: కిరణ్ అబ్బవరం

ఆ సినిమా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: రాజమౌళి

తన దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని రాజమౌళి తెలిపారు. ‘‘అది నాకు అత్యంత ఇష్టమైన చిత్రం. ఎందుకంటే నేను చేసిన అత్యంత పెద్ద ప్రయోగం అదే. ఈ రోజు కూడా ఒక ఈగను ప్రధాన పాత్రధారిగా పెట్టి ఒక సినిమా తీయాలనే ఆలోచనే కొత్తగా అనిపిస్తోంది. ఆ కథలోని భావోద్వేగాలు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. అందరూ రాజమౌళి అంటే.. సాధారణంగా బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని చూస్తుంటారు. కానీ వ్యక్తిగతంగా, నేను నన్ను ఈగకు ముందు తర్వాత దర్శకుడిగా భావిస్తాను’’ అని ఆయన వెల్లడించారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 08:40 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రామోజీ ఫిల్మ్‌ సిటీలో డ్రాగన్‌ యాక్షన్‌ ‘డ్రాగన్‌’ అవతారంలో అలరించడానికి సన్నద్ధమవుతున్నారు అగ్రహీరో ఎన్టీఆర్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్నారు.
  • జయమ్మ పాత్ర ప్రేరణతో… 400 కుటుంబాలకు సాయం! ‘రణబాలి’ సినిమాలో పోషించిన జయమ్మ పాత్ర స్ఫూర్తితో కథానాయిక రష్మిక 400 కుటుంబాలను దత్తత తీసుకున్నారు.
  • హిందీలో... ఓ ప్రేమకథతో! తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న కృతిశెట్టి త్వరలోనే హిందీలో కథానాయికగా పూర్తిస్థాయి చిత్రం చేయబోతున్నారు.
  • బాధ్యతలు చేపట్టిన సావిత్రి ‘‘అబ్జెక్షన్‌ ఓవర్‌రూల్డ్‌..! సావిత్రి బాధ్యతలు చేపట్టారు.. అది కూడా అద్భుతమైన శైలిలో’’ అంటూ ‘సత్యవాన్‌ సావిత్రి’ ప్రపంచాన్ని పరిచయం చేసింది చిత్రబృందం.
  • రెండున్నరేళ్ల తర్వాత తాము నమ్మిన కథల కోసం కథానాయకులు ఎంతైనా శ్రమిస్తుంటారు. ఎన్ని రోజులు కేటాయించడానికైనా వెనకాడరు.
  • అమ్మ కదిలి వచ్చేనమ్మా నవరాత్రి ఉత్సవాలతో ముడిపడిన అమ్మవారి గీతంతో ‘భరతవర్ష’ సినిమా సంగీత ప్రచారం ఊపందుకుంది.
  • దశావతారాల గుడి నేపథ్యంలో... హైందవ ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేట్రికల్‌గా ప్రత్యేకమైన అనుభవాన్ని పంచే సినిమాలు ఎంతో ముఖ్యం.
  • హృదయం నిండుగా కథానాయకుడు ప్రభాస్‌ పంపిన విందు భోజనాన్ని చూపుతూ ‘హృదయం, కడుపు ఎప్పటికీ నిండుగా...’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు కథానాయిక ఇమాన్వి.
  • సంక్షిప్త వార్తలు (4) విభిన్నమైన జానర్‌లలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఎప్పటికప్పుడూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు కథానాయిక కృతిసనన్‌.
  • కుటుంబాలకు భరోసా.. నిత్యావసరాలకు అండగా రష్మిక ‘ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ’ ప్రముఖ నటి రష్మిక దేవరకొండ తన దాతృత్వాన్ని చాటనున్నారు. 400 కుటుంబాలను ఏడాది పాటు దత్తత తీసుకునేందుకు ‘ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ’ కార్యక్రమాన్ని చేపట్టారు.
  • హీరోయిన్‌ బర్త్‌డేకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌.. చూస్తే కడుపునిండిపోద్ది ప్రభాస్‌తో (Prabhas) కలసి పనిచేసిన నటులంతా ఆయన ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. ఇంటి నుంచి సెట్‌కు రకరకాల వంటకాలు తెప్పించి, అందరికీ ప్రేమగా వడ్డించడమంటే ఆయనకెంతో ఇష్టం.
  • రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కాంబోపై బిగ్‌ అప్డేట్‌ రంగస్థలం’ లాంటి ఘనవిజయం తరువాత రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కాంబోలో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
  • పాఠ్యపుస్తకాలు చెప్పని వాస్తవాలను ‘రణబాలి’ చెబుతోంది: అన్నామలై బ్రిటిషర్లు దాచేసిన దేశ చరిత్రలోని పలు అంశాలపై మాజీ ఐపీఎస్‌ అధికారి, రాజకీయ నాయకుడు అన్నామలై, న్యాయవాది జె.సాయిదీపక్‌లతో విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ సాంకృత్యాన్‌ సంభాషించారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేసింది. 
  • ఇమ్రాన్‌ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం..! బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి షూటింగ్‌లో త్రుటిలో ప్రమాదం తప్పింది.
  • రజనీకాంత్‌తో ఆ సన్నివేశం.. ఎంతో భయపడ్డా: విద్యాబాలన్‌ ఎంత స్టార్‌డమ్‌ ఉన్నప్పటికీ రజనీకాంత్‌ చాలా సింపుల్‌గా ఉంటారని నటి విద్యాబాలన్‌ అన్నారు. అలా ఉండడం వల్లే ఆయన చాలామందికి నచ్చుతారని తెలిపారు.
  • సీజేపీ నిరసనలు.. ఆ నటుడిపై దాడి చేస్తామంటూ బెదిరింపులు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ షోరేను హత్య చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం చర్చనీయాంశంగా మారింది.
  • రామ్‌చరణ్‌ కోసం... రంగంలోకి దిగేదెవరో? రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కలయికలో సినిమా పట్టాలెక్కేందుకు ఇంకాస్త సమయం ఉంది కానీ, పూర్వ నిర్మాణ పనులకు సంబంధించిన పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ‘రంగస్థలం’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు ఎప్పట్నుంచో కొనసాగుతూ వచ్చాయి.
  • నవ్విస్తూ.. సందేశమిచ్చే సినిమా శివాజీ ప్రధాన పాత్రధారిగా బాలాజీ వీఆర్‌ దర్శకత్వంలో ‘ఎం3’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎస్‌.టి.బి.ఎల్‌ సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. రవికృష్ణ, భరణ్, ఖుష్బూ, కసిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
  • ఆ పరీక్షలన్నీ దాటి సక్సెస్‌ అయ్యాడు మా బ్యాచిలర్‌ లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ కేవలం నవ్వించే సిరీస్‌ మాత్రమే కాదు. ఆలోచింపజేస్తుంది.. విలువల గురించి చెప్తుంది. జీవితం, ఆత్మన్యూనతల గురించి చర్చిస్తుంది’’ అన్నారు నటుడు హర్ష చెముడు.
  • ఈ పండక్కి స్వీట్‌ లాంటి చిత్రం మాది ఆద్యంతం నవ్విస్తూ.. అందర్నీ అలరించే సినిమా ‘క్రేజీ కళ్యాణం’’ అన్నారు హీరో అఖిల్‌ రాజ్‌. ఇప్పుడాయన.. అనుపమ పరమేశ్వరన్, నరేశ్, తరుణ్‌ భాస్కర్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రాన్ని భద్రప్ప గాజుల తెరకెక్కించారు.