సౌదీలోని దమ్మామ్ ఎయిర్‌పోర్టుపై హూతీల భీకరదాడి

- A
- A+
- A++

ఇంటర్నెట్‌డెస్క్: సౌదీ అరేబియా( Saudi Arabia)లోని దమ్మామ్‌లోని కింగ్ ఫహాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుపై ఆదివారం అర్ధరాత్రి హూతీ రెబల్స్ క్షిపణులతో విరుచుకుపడ్డారు. దమ్మామ్‌లో జరిగిన దాడిలో నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు రియాద్‌లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా రెండో విడత దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
దమ్మామ్ విమానాశ్రయం రియాద్‌కు 410 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అరేబియన్ గల్ఫ్ తీరంలో కీలక పారిశ్రామిక నగరం. దీనికి తోడు ఇక్కడి ఎయిర్‌పోర్టు కీలక ఏవియేషన్ హబ్.
సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టులకు వెళ్లొద్దు: హూతీలు
సౌదీ అరేబియా ఎయిర్‌పోర్టులకు ప్రయాణికులు, విమానాలు వెళ్లొద్దని హూతీలు హెచ్చరికలు జారీ చేశారు. తమపై సౌదీ దాడులు నిలిపివేసే వరకు తాము వెనక్కి తగ్గమన్నారు. సౌదీకి మరింత భయానక పరిస్థితి రానుందని పేర్కొన్నారు.
చర్చలతోనే పరిష్కారం: ఇరాన్
సౌదీ-హూతీలు చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరాన్ ( Iran) విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. తమకు పొరుగుదేశాలతో యుద్ధాలు చేయాలన్న కోరికలేదని పేర్కొన్నారు. హూతీలు పూర్తిగా స్వతంత్ర వైఖరితోనే పనిచేస్తున్నారన్నారు. సౌదీపై దాడులకు ఇరాన్ ప్రోత్సహించిందన్న వాదనలు వస్తున్న నేపథ్యంలో అరాగ్చీ స్పందించారు.
రియాద్ ఎయిర్‌పోర్ట్‌పై దాడిని తుర్కియే తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకమని పేర్కొంది. వీటిని తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేసింది. సౌదీకి తాము పూర్తిగా అండగా నిలుస్తామని ప్రకటించింది.
సౌదీకి అత్యవసరమైతే తప్ప తమ దేశ ప్రజలు వెళ్లొద్దని యూకే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా జెడ్డా, దమ్మామ్, మదీనా ఎయిర్‌పోర్టులకు వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 08:38 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఇరాన్ వ్యూహాల్లో మరో టర్నింగ్ పాయింట్.. రంగంలోకి స్పాటర్లు Iran: అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమై హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో నౌకల లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇరాన్ (Iran) కొత్త వ్యూహాలు పన్నుతోంది.
- 12.5 కోట్ల ఏళ్ల నాటి ఈ మాంసాహార డైనోసార్ గురించి తెలుసా? సరికొత్త మాంసాహార జాతి డైనోసార్ (Dinosaur)ని గుర్తించిన బ్రిటన్ శాస్రవేత్తలు.
- హర్మూజ్‌లో సీమైన్‌ను ఢీకొని మునిగిన నౌక హర్మూజ్‌లో సీమైన్లను ఢీకొని ఓ చమురు ట్యాంకర్ మునిగిపోయింది.
- ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్- బీబీ రహస్య చర్చలు! ఇరాన్‌పై త్వరలోనే దాడులు ప్రారంభించేందుకు ట్రంప్-నెతన్యాహు ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
- కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికన్ల నుంచి నిధులు: సింగర్ ఆరోపణలు Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ (American singer) ఆరోపించారు.
- ఓపెన్ఏఐ మీటింగ్ హాల్లో గూఢచర్య పరికరాలు..! ఓపెన్ఏఐ సంస్థలో పని చేస్తూ.. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
- బాలికను అసభ్యంగా తాకిన రోబో.. షాకింగ్ ఘటన జర్మనీ (Germany)లో ఓ రోబో.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు యువకులు దాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుగా ప్రవర్తించేలా చేసినట్లు పోలీసులు తెలిపారు.
- ప్రపంచం కోసమే రష్యా డీజిల్ కొనుగోలు: ట్రంప్ విచిత్ర వివరణ Donald Trump: డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
- సౌదీకి షాక్: అరామ్కో ప్రధాన కార్యాలయంపై హూతీల దాడి సౌదీ అరేబియాలో దాడులు తీవ్రమయ్యాయి. ధహ్రాన్ నగరంలోని చమురు సంస్థ అరాంకో(Aramco) కార్యాలయపై హూతీలు(Houthis) బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు.
- గాంధీ తొలి కార్యక్షేత్రం డర్బన్‌లో ఆయుర్వేద మూలికల ఉద్యానం యువ న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నపుడు మహాత్మాగాంధీ 1904లో డర్బన్‌లో ప్రారంభించిన సమష్టి ఆశ్రమం ‘ఫీనిక్స్ సెటిల్మెంట్’లో సంప్రదాయ ఆయుర్వేద మూలికల ఉద్యానవనం ఏర్పాటైంది.
- ‘ఫ్లైదుబాయ్’ కూల్చివేత కుట్రలో.. ఇద్దరు మాల్దీవియన్ పైలట్ల అరెస్ట్ ‘ఫ్లైదుబాయ్’ విమానాన్ని హైజాక్ చేసి, కూల్చివేసేందుకు ఒమన్ కోపైలట్ ఇటీవల పన్నిన కుట్రలో భాగంగా భావిస్తున్న ఇద్దరు మాల్దీవియన్ పైలట్లను యూఏఈ పోలీసులు అరెస్టు చేశారు.
- ప్రభుత్వంపై పోరాటానికి రూ.967 కోట్ల వ్యయం సంపన్నులపై పన్ను విధించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై కోర్టులో పోరాడటానికి గూగుల్ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ ఏకంగా రూ.967 కోట్లు ఖర్చు పెట్టారు.
- 11 ఏళ్ల పగ! యెమెన్‌లోని అంతర్యుద్ధంపై సౌదీ అరేబియా వేసుకున్న లెక్కలు తప్పాయా.. ఆ దేశం ఎరక్కపోయి ఇరుక్కుందా.. గల్ఫ్‌లో తమ దేశాన్ని అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య హబ్‌గా మార్చాలనుకునే క్రమంలో యెమెన్‌పై తీసుకున్న నిర్ణయాలు బెడిసికొడుతున్నాయా.. అంటే ప్రస్తుతం హూతీలు చేస్తున్న దాడులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
- రాయిలాంటిదనుకుంటే.. రాచకుటుంబ స్మారకమైంది కాలం కలిసొస్తే రాయి కూడా రత్నమవుతుందంటారు. లండన్‌లోని ఓ వ్యక్తి ఓ ఛారిటీ దుకాణంలో రూ.1,890 చెల్లించి తను ఒక ఉంగరం కొన్నాడు.
- హూతీల దెబ్బకు ప్యాలెస్‌లు మార్చుతున్న సౌదీ యువరాజు! దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఎప్పుడు ఏ రాజభవనంలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
- న్యూయార్క్ విమానాశ్రయంలో యూనస్‌కు ‘అవామీలీగ్’ అవహేళన షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వ్యవహరించిన మహమ్మద్ యూనస్ న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ విమానాశ్రయంలో అవహేళనలు ఎదుర్కొన్నారు.
- అవినీతి ఆరోపణలతో… గ్రీసు దేశ అమెరికా రాయబారి రాజీనామా గ్రీసు దేశంలో అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించిన కింబర్లీ గిల్‌ఫాయిల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
- సౌదీలో అప్రమత్తంగా ఉండండి సౌదీ అరేబియాలో మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివాసం ఉంటున్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
- సంక్షిప్త వార్తలు (3) ఊపిరితిత్తుల్లో చిన్న కణితి ఉన్నట్లు తెలియడంతో శస్త్రచికిత్స నిమిత్తం పోప్ లియో-14 మంగళవారం రోమ్‌లోని జెమెలీ ఆసుపత్రిలో చేరారు.
- యువరాజు కలలు ఫలిస్తాయా..? ఆ దేశంలో ఎక్కువ భాగం ఎడారి.. కానీ ప్రపంచంలోనే పెట్రోల్ నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి.. కానీ ఎప్పటికైనా పెట్రోలియం నిల్వలు కరిగిపోతాయి.