
రీ సస్టైనబిలిటీ కొనుగోలుకు ఐ స్క్వేర్డ్-వియోలియా పోటీ

- A
- A+
- A++
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వ్యర్థాల నిర్వహణ సంస్థ రీ సస్టైనబిలిటీ కొనుగోలుకు అమెరికాకు చెందిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్, ఫ్రాన్స్కు చెందిన వియోలియా సంస్థల కన్సార్షియం ఆసక్తి చూపిస్తోంది. రీ సస్టైనబిలిటీ విలువను సుమారు రూ.10,000-11,000 కోట్లుగా అంచనా వేస్తూ ఆ కన్సార్షియం ప్రాథమిక ప్రతిపాదనలు అందించినట్లు ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. రీ సస్టైనబిలిటీలో 60% వాటా కలిగిన పెట్టుబడి సంస్థ కేకేఆర్ మాత్రం కనీసం రూ.14,000-16,000 కోట్ల విలువ లభిస్తుందని ఆశిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభానికి 13-15 రెట్లు అధిక విలువ లభిస్తేనే విక్రయించాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తాజా ప్రతిపాదనతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలనూ కేకేఆర్ పరిశీలిస్తోందని సమాచారం. రీ సస్టైనబిలిటీ భారత్పాటు, సింగపూర్, యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా వంటి 100కు పైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థలో దాదాపు 22,000 మంది సిబ్బంది ఉన్నారు. 2025-26లో ఈ సంస్థ రూ.2,700 కోట్ల ఆదాయం, రూ.930 కోట్ల నిర్వహణ లాభాన్ని గడిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,400 కోట్ల ఆదాయంపై రూ.1,100 కోట్ల నిర్వహణ లాభం సాధిస్తామని అంచనా వేస్తోంది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మన మార్కెట్లోకి భారీగా అమెరికా డబ్బులు భారత సెక్యూరిటీలలో (ఈక్విటీలు, బాండ్లు) అమెరికా పెట్టుబడులు పదేళ్ల వ్యవధిలో మూడు రెట్లు పెరిగాయి.
- ‘బీమా’లో డిజిటల్ రిజిస్ట్రీ దేశ ప్రజలందరికీ బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) సరికొత్త అడుగు వేసింది.
- ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో, దేశీయ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. అధిక ముడిచమురు ధరలు, అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతలు ప్రతికూల ప్రభావం చూపాయి.
- చక్కెర నిల్వల గరిష్ఠ పరిమితి 2,000 క్వింటాళ్లకు తగ్గింపు దేశంలో చక్కెర ధరలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిల్వల గరిష్ఠ పరిమితి 4 వేల క్వింటాళ్ల నుంచి 2 వేల క్వింటాళ్లకు తగ్గించింది.
- ఎయిర్ ట్యాక్సీ ‘శూన్య’ అభివృద్ధి బెంగళూరుకు చెందిన అంకురం సర్లా ఏవియేషన్ రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ‘శూన్య’ ప్లాట్ఫామ్ అభివృద్ధి కోసం డిజైన్, సాంకేతిక సేవల సంస్థ టాటా ఎలెక్సీ చేతులు కలిపింది.
- ఎల్ఐసీ నుంచి రెండు కొత్త పాలసీలు దేశంలో తక్కువ బీమా వ్యాప్తి, ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న గృహాదాయాలు, పెరిగిన ఆర్థిక అవగాహన, సుదీర్ఘ ఆయుర్దాయం రాబోయే ఏళ్లలో రక్షణ, పొదుపు, పదవీ విరమణ పాలసీలకు మంచి గిరాకీని సృష్టిస్తాయని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.దొరైస్వామి తెలిపారు.
- జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు రూ.1,99,853 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇవి 14.8% అధికం.
- సుభాష్ చంద్రకు షాక్ మీడియా దిగ్గజం, ఎస్సెల్ గ్రూపు ఛైర్మన్ సుభాష్ చంద్ర తన ఆస్తులను బదిలీ చేయకుండా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆంక్షలు విధించింది.
- వాహన విక్రయాలు అదుర్స్ మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు నమోదు చేసిన బలమైన వృద్ధి కారణంగా ఆగస్టులో మన దేశంలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు సుమారు 35 శాతం పెరిగి 4.5 లక్షలకు చేరాయి.
- యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతల స్వీకరణ ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థ యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టారు. 15 ఏళ్లుగా ఈ బాధ్యతలను టిమ్ కుక్ నిర్వహిస్తూ వచ్చారు. ఆయన హయాంలో ఐఫోన్లకు అపారమైన ప్రజాదరణ కారణంగా యాపిల్ విలువ 4.6 ట్రిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది.
- పెరిగిన పెట్రోల్, డీజిల్ విక్రయాలు అస్థిరమైన రుతుపవనాల వర్షాల కారణంగా రైతులు, వాహనదార్ల నుంచి ఇంధన గిరాకీ పెరగడంతో, ఆగస్టులో మన దేశంలోని 3 ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థల పెట్రోల్, డీజిల్ విక్రయాలు భారీగా పెరిగాయి.
- సంక్షిప్త వార్తలు(4) బాంబే క్రీమరీ బ్రాండ్తో ఐస్క్రీమ్ మార్కెట్లోకి రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ అడుగుపెట్టింది. స్వచ్ఛమైన డెయిరీ క్రీమ్తో తయారుచేసే కోన్స్, కప్స్, టబ్స్, బార్స్ వంటి ఉత్పత్తులను రూ.10 ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
- 5 ఏళ్ల కనిష్ఠానికి తయారీ రంగ వృద్ధి మార్కెట్లో బలహీనమైన డిమాండ్ కారణంగా భారత తయారీ రంగ వృద్ధి రేటు ఆగస్టులో అయిదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.
- రికార్డు స్థాయికి చేరువలో యూపీఐ లావాదేవీలు ఆగస్టులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.29.8 లక్షల కోట్లుగా నమోదైందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది.