నమ్మకం కలిగించి.. నగలు కాజేసి

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Published : 19 Aug 2026 06:23 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఇంటి యజమానితో స్నేహంగా నటిస్తూ, ఆమె బాగోగులు చూసుకుంటూ అదనుచూసి ఆమెను ఏమార్చి భారీగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను చోరీచేసిన ఘటనలో నిందితులైన భార్యాభర్తల్ని ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు వివరాలను వెల్లడించారు. స్థానిక దేవుడిచెరువులో వేలాయుధం రమణమ్మ అనే 66 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుంటారు. ఆ ఇంటి కింది పోర్షన్‌లో బండారు వెంకటనారాయణ వరప్రసాద్, ఉప్పుతోళ్ల మహాలక్ష్మి అనే భార్యాభర్తలు అద్దెకు ఉంటారు. వీరిద్దరూ రమణమ్మతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఆమె బాగోగులు చూస్తుండేవారు. ఈ క్రమంలో చిత్తూరులో ఉండే రమణమ్మ కుమార్తె ఇటీవల తన బంగారు ఆభరణాలను బ్యాంకు లాకరులో పెట్టే నిమిత్తం ఒంగోలు తీసుకువచ్చి తన తల్లి వద్ద ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న భార్యాభర్తలు వృద్ధురాలిని ఏమార్చి టిఫిన్‌ కోసం, ప్రసాదం కోసం కిందికి పిలిచేవారు.

ఆ సమయంలో వరప్రసాద్‌ ఆమెకు కబుర్లు చెబుతుండగా ఏదో ఒకపని మీద బయటకు వెళ్తున్నాననే మిషతో మహాలక్ష్మి, రమణమ్మ నివాసంలోకి వెళ్లి బీరువాలో ఉన్న ఆభరణాలను అపహరించేది. తన ఇంట్లో ఆభరణాలు మాయమైనట్లు గుర్తించిన రమణమ్మ గత నెల 24వ తేదీన ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. కింది ఇంట్లో ఉన్న భార్యాభర్తలే ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. తన తల్లి మూడేళ్ల క్రితం మరణించిందని, అప్పట్లో చేసిన అప్పులతో బాధపడుతూ ఈ నేరానికి పాల్పడినట్లు వరప్రసాద్‌ అంగీకరించాడు.

ఈ కేసులో భార్యాభర్తల్ని అరెస్టుచేసి రూ.24.50 లక్షల విలువైన 175 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.రెండు లక్షల విలువైన 850 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కేసు ఛేదనలో క్రియాశీలకంగా పనిచేసిన ఒకటో పట్టణ సీఐ కె.వెంకటేశ్వరరావు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.కమలాకర్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. 

► Read latest Prakasam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మోగింది .. సమరభేరి [ 15-10-2026] స్థానిక యుద్ధం మొదలైంది.. రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటన వెలువరించడంతో శంఖం పూరించినట్లయింది. రోజుల వ్యవధిలో పురపాలక, ప్రాదేశిక ఎన్నికలు పూర్తికానున్నాయి.
  • జనసేనకే మొగ్గు [ 15-10-2026] ఒంగోలు మేయరు స్థానాన్ని అనూహ్యంగా జనసేన పార్టీకి కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెదేపా, జనసేన, భాజపా పక్షాల నుంచి మేయరు స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు వెల్లడైంది.
  • అడిగేదెవరు... అమ్మేస్తాం [ 15-10-2026] ఒకటి కాదు...పది కాదు..వంద ఎకరాలకుపైగా అన్యాక్రాంతమైంది. కబ్జాపర్వమే కాదు.. విక్రయాలూ యథేచ్ఛగా సాగిపోతున్నాయి. రూ.కోట్ల విలువైన చెరువు భూమి పరులపరమవుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
  • ఇక స్థానిక సంగ్రామం [ 15-10-2026] పురపాలక, మండల, జిల్లా ప్రజాపరిషత్తు, పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ షెడ్యూల్‌ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
  • కొత్త మాస్టార్లు వస్తారండి! [ 15-10-2026] టీచర్‌ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు డీఎస్సీ పోస్టుల ప్రకటన ఆశాజనకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండో విడత డీఎస్సీ నిర్వహించబోతున్నారు.
  • అర్థం చేసుకోండి.. మేం మార్చలేం! [ 15-10-2026] జడ్పీటీసీ, ఎంపీపీ సీటు రిజర్వేషన్లలో కొన్ని మార్పులు చేయకుంటే స్థానికంగా ఇబ్బందులు వస్తాయని, మార్చాల్సిన అవసరం ఉందని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుబట్టారు.
  • సమస్య అంతర్గతం.. నిర్లక్ష్యం బహిర్గతం [ 15-10-2026] రహదారులు అభివృద్ధికి చిహ్నాలు. ఇవి బాగా ఉన్న ప్రాంతాలు ప్రత్యేకతను చాటుకుంటాయి. జనాభాతో త్వరగా విస్తరిస్తాయి. పేరుకు జిల్లా కేంద్రమైనా ఒంగోలు నగరంలో మాత్రం చాలా ప్రాంతాల్లో దారులు అధ్వానంగా ఉన్నాయి.
  • చెత్త శుద్ధి ఖర్చు రూ.20 కోట్లు! [ 15-10-2026] ఒంగోలు నగరంలోని డంపింగ్‌ యార్డులో కొండలా పేరుకుపోయిన చెత్తను దశలవారీగా ప్రాసెసింగ్‌ చేయడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేస్తోంది.
  • సమరం మొదలు [ 15-10-2026] స్థానిక సంస్థల సమరానికి నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం ప్రకటన విడుదల చేయడంతో మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ (ప్రవర్తనా నియమావళి) అమల్లోకి వచ్చింది.
  • అతివలకే.. అగ్రతాంబూలం [ 15-10-2026] మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఆవిర్భావం... నూతన జిల్లా పరిషత్తు ఏర్పాటు కావడం... అంతలోనే స్థానిక సమరానికి తెర లేవడంతో అంతటా ఆసక్తి నెలకొంది.
  • దర్శిలో అమృత్ 2.0 పథకానికి శంకుస్థాపన [ 14-10-2026] దర్శి పట్టణంలో అమృత్ 2.0 పథకానికి తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి శంకుస్థాపన చేశారు.
  • ఛైర్మన్‌ సీటు.. మా ఇంట్లో వాళ్లకు.. [ 14-10-2026] పురపాలక సంఘానికి ప్రత్యక్ష ఎన్నిక కావడం, అన్నిచోట్లా ఓసీ జనరల్‌కు అవకాశం రావడంతో అధికార పక్షంలో పోటీపడే వారి సంఖ్య భారీగా ఉంది. ప్రధానంగా వ్యాపార వర్గాలతో పాటు రాజకీయ ఉద్ధండులు ఛైర్మన్‌ పదవికి ఆసక్తి చూపుతున్నారు.
  • బలమున్నోడిదే భూమి [ 14-10-2026] మార్కాపురం పట్టణంలో వెలసిన శ్రీ, భూ సమేత లక్ష్మీ చెన్నకేశస్వామి దేవస్థానానికి చారిత్రకంగా ఎంత ప్రాధాన్యం ఉందో అంతే విలువైన మాన్యం భూములూ ఉన్నాయి. వీటిలో నాలుగో వంతు మాత్రమే ఆలయం ఆధీనంలో ఉండగా మిగతావి అన్యాక్రాంతమయ్యాయి.
  • వీరికే జడ్పీ పీఠం [ 14-10-2026] ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కీలకమైన జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ పదవుల రిజర్వేషన్లను మంగళవారం రాత్రి ప్రకటించారు. ప్రకాశం జిల్లా పరిషత్తు ఎస్సీ వర్గానికి దక్కింది. తొలిసారిగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ఛైర్మన్‌ పదవి జనరల్‌కు కేటాయించారు. దీంతో రెండు జిల్లాల్లో పోటీ రసవత్తరంగా మారనుంది.
  • తీరంలో ఆగని ఘోరం [ 14-10-2026] ఆహ్లాదకరంగా ఉండాల్సిన తీరప్రాంత భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దీంతో పర్యావరణ సహజస్థితి దెబ్బతింటోంది. గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లోని సముద్రతీరం ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆక్రమణదారులకు అడ్డూఅదుపూ లేదు.
  • ముప్పుందన్నా.. ముప్పై అడుగులు తవ్వేశారు [ 14-10-2026] మూగ జీవాలు చనిపోతున్నా, ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా..కాసులే పరమావధిగా అద్దంకి ప్రాంతంలో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. భూములు కొనుగోలు చేసి మరీ గుల్ల చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారగణం చూస్తాం.. చేస్తాం..
  • బస్సు దిగిన తర్వాత ఏమైంది? [ 14-10-2026] ఈ నెల తొమ్మిదో తేదీ.. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయం. యువతీయువకులు ఇద్దరూ ఒంగోలు త్రోవగుంట వద్ద బస్సు దిగారు. అక్కడి నుంచి కాలినడకన కిమ్స్‌ అండర్‌పాస్‌ దిశగా నడుచుకుంటూ వెళ్తున్నారు.
  • ఫ్రిజ్‌లో మాంసం ఎన్నాళ్లదో? [ 14-10-2026] స్థానిక అద్దంకి బస్టాండ్‌లోని బిలాల్‌ హోటల్‌లో ఆహార భద్రతా అధికారులు సోమవారం రాత్రి తనిఖీ నిర్వహించి కొన్ని లోపాలను గుర్తించారు. ఐపీఎం డైరెక్టర్‌ అరుణ్‌బాబు నేతృత్వంలో స్థానిక ఆహార భద్రత అధికారులు అక్కడ ఆహార పదార్థాలను పరిశీలించారు.
  • ఉన్నా లేనట్టు... అంతా కనికట్టు [ 14-10-2026] రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్‌ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా... ఆ వివరాలు తొక్కిపెట్టి అసలు ఆ దస్త్రాలే లేవని ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తున్నారు. వారు సైతం వాటినే చూసి విచారణ మమ అనిపిస్తుండడంతో అసలు భూబాగోతం వెలుగులోకి రావడం లేదు.
  • చీకటి మార్గాలు.. దోపిడీ దొంగల అడ్డాలు [ 14-10-2026] కందుకూరు మండలం పలుకూరుకు చెందిన విశ్రాంత వీఆర్‌వో దంపతులు వారం రోజుల క్రితం ద్విచక్రవాహనం పై వెళ్తుండగా.. మహదేవపురం-పలుకూరు మార్గం మధ్యలో వారిని ఇద్దరు యువకులు వాహనంతో ఢీ కొట్టారు. మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు.
  • భక్తుల కళ్లల్లో మట్టి కొడుతున్నారు [ 14-10-2026] పెద్ద దోర్నాల - శ్రీశైలం ఘాట్‌లో చేపడుతున్న రహదారి మరమ్మతులు భక్తుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. నల్లమల సిగన వెలసిన శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.