ప్రేమ వివాహం విషయంలో దారుణ హత్య!

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 19 Aug 2026 09:04 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ధర్మసాగర్, న్యూస్‌టుడే: జనగామ జిల్లా చిల్పూర్‌కు చెందిన పోలు వెంకటేశ్వర్లు (45) హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌ ఊర చెరువు శివారులో సోమవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. కాజీపేట సీఐ శ్యాంసుందర్‌ తెలిపిన వివరాల మేరకు పోలు వెంకటేశ్వర్లు, రాజమణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు రమ్య, వారి పక్కింటి అంబటి పరమేశ్వర్‌ కొడుకు వినయ్‌ని 2022లో ప్రేమ వివాహం చేసుకుంది. 2023లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంలో వెంకటేశ్వర్లు (వెంకన్న)కు, వినయ్‌ తండ్రి పరమేశ్వర్‌కు మధ్య పలుమార్లు పంచాయితీలు జరిగాయి. ఒకసారి పెద్ద మనుషుల సమక్షంలోనే పరమేశ్వర్‌ బ్లేడ్‌తో వెంకటేశ్వర్లు మెడను కోయడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఇలా వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సోమవారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా చిల్పూర్‌కు చెందిన దామెర సంపత్‌ వచ్చి ఈ గొడవ గురించి మాట్లాడుదామని, పరమేశ్వర్‌ తీసుకురమ్మన్నాడని వెంకన్నను బయటకు తీసుకెళ్లాడు. రాత్రి 11:30 గంటలవుతున్నా అతను రాకపోయేసరికి మృతుడి భార్య రాజమణి సంపత్‌ ఇంటికెళ్లి చూసేసరికి అక్కడ లేకపోవడంతో ఆయనకు ఫోన్‌ చేసి అడగ్గా మాట్లాడిన తర్వాత గ్రామ పంచాయతీ వద్ద ద్విచక్ర వాహనంపై దింపి వచ్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రాంపూర్‌కు చెందిన చిలుముల వెంకటస్వామి చిల్పూర్‌కు చెందిన కొందరికి ఫోన్‌ చేసి రాంపూర్‌ చెరువు శివారులోని మడేలయ్య గుడి వద్ద అంబటి పరమేష్, పోలు వెంకటేశ్వర్లును కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ముందస్తు పథకం ప్రకారమే అంబటి పరమేశ్వర్, సంపత్‌ కలిసి వెంకటేశ్వర్లును కత్తితో గొంతు కోసి, తలపై కొట్టి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, కాజీపేట సీఐ శ్యాంసుందర్, ధర్మసాగర్‌ ఎస్సై దిలీప్, క్లూస్‌ టీం వచ్చి పరిశీలించారు. రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి పంపించారు.   

నిందితులు ఎందరు..? 

హత్య జరిగిన ఘటనను పరిశీలిస్తే ఒకరి వల్ల జరిగింది కాదని, కనీసం ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య రాజమణి మాత్రం ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఒకరు ఉన్నట్లు సమాచారం. రఘునాథ్‌పల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో చిల్పూర్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

► Read latest Warangal Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 09:04 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • గ్యాస్ రీఫిల్.. జేబుల్ ఫుల్ [ 15-10-2026] జనగామ జిల్లాలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరి స్తుండటంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు.
  • వారధి నిర్మించి.. కష్టాలు తీర్చండి [ 15-10-2026] మండలంలోని పడిగాపురం ఆదివాసీ గిరిజనులు తమ గ్రామానికి రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 500మంది నివసించే ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు.
  • వైద్య సేవల్లో జాప్యం.. ప్రాణాలతో చెలగాటం [ 15-10-2026] ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వచ్చిన రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో జిల్లా ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి సిఫార్సు చేసి చేతులు దులుపుకొంటున్నారు. 
  • డిజిటల్ టోకరా! నకిలీ స్క్రీన్‌ షాట్‌తో మోసం [ 15-10-2026] వరంగల్‌ లక్ష్మీపురం మార్కెట్‌ ప్రాంతంలోని ఓ హోల్‌సేల్‌ పండ్ల దుకాణంలో కొద్దిరోజులుగా ఫేక్‌ యూపీఐ పేమెంట్స్‌ స్క్రీన్‌ షాట్స్‌తో పండ్ల వ్యాపారిని బురిడీ కొట్టించాడు.
  • సంచలన కేసులో ఇద్దరి అరెస్టు [ 15-10-2026] జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జడల అశోక్‌ మృతికేసులో ప్రధాన నిందితులిద్దరిని కాటారం సర్కిల్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగార్జునరావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బుధవారం వెల్లడించారు.
  • భద్రకాళి ఆలయ ట్రస్ట్‌ బోర్డు నియామకం [ 15-10-2026] ఓరుగల్లు శ్రీభద్రకాళి దేవస్థానానికి 12 మంది సభ్యులతో ట్రస్ట్‌ బోర్డును నియమిస్తూ.. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు జీవో నంబరు 634 జారీ చేశారు.
  • బంగారం అమ్ముతానని రూ.5.50 లక్షలతో ఉడాయింపు [ 15-10-2026] బంగారాన్ని అమ్ముతానని చెప్పి ఓ మోసగాడు రూ.5.50 లక్షలతో ఉడాయించిన సంఘటన బుధవారం వరంగల్‌ జిల్లా నర్సంపేటలో వెలుగు చూసింది. సీˆఐ శ్రీనివాస్‌ తెలిపిన ప్రకారం వివరాలు..
  • నీటి గుంటలో పడి బాలుడి మృత్యువాత [ 15-10-2026] బతుకమ్మ, దసరా పండగల వేళ ఆ ఇంట్లో విషాదం అలుముకొంది.. కొన్నేళ్ల కిందట.. జన్మించిన ఆరు నెలలకే పసిపాప మృతి చెందగా ఆ బాధను దిగమింగుకొని కొడుకు  ఉన్నాడనే ధైర్యంతో జీవిస్తున్నారు.
  • భారం తగ్గితేనే. బొగ్గుకు భవిష్యత్తు [ 15-10-2026] సింగరేణిలో రోజురోజుకూ బొగ్గు ఉత్పత్తి వ్యయం పెరుగుతుండటం సంస్థకు పెద్ద సవాలుగా మారింది. ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్డ్‌్స, మహారాష్ట్రలోని వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ కంటే సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు ధర ఎక్కువగా ఉంది.
  • సిద్దెంకి కుర్రోడు.. రేసింగ్‌లో దూకుడు [ 15-10-2026] రయ్‌ రయ్‌ మంటూ బైక్‌పై దూసుకెళ్లడమంటే యువతకు ఎంతో ఇష్టం. ఇక బైక్‌ రేసు మాటంటే వారిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఈ ఆసక్తే ఓ యువకుడిని జాతీయస్థాయిలో ఛాంపియన్‌గా నిలిపింది.
  • వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త ఛైర్మన్లు [ 15-10-2026] జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా (పీఏసీఎస్‌)లకు కొత్త ఛైర్మన్లు రానున్నారు. ప్రభుత్వం నామినేటెడ్‌ విధానంలో పాలకవర్గాలను నియమిస్తున్న క్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫార్సులతో అధ్యక్ష, డైరెక్టర్ల స్థానాలను అధికారులు భర్తీ చేస్తున్నారు.
  • నేటి నుంచే టోల్ వసూలు [ 15-10-2026] వరంగల్‌-కరీంనగర్‌  నూతన జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-563)పై వాహనాల రాకపోకలు ప్రారంభం కావడంతో టోల్‌ వసూల్‌ చేయడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు సిద్ధమయ్యారు.
  • తహసీల్దార్ సీటుపైనే కూలిన సీలింగ్.. తప్పిన ప్రమాదం [ 14-10-2026] తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం పెను ప్రమాదం తప్పింది.
  • ఎంజీఎంలో తీరనున్న క్యూ కష్టాలు [ 14-10-2026] ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ (ఔట్‌ పేషంట్‌) కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండే క్యూ కష్టాల నుంచి ఉపశమనం లభించనుంది. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) లో భాగంగా నేషనల్‌ హెల్త్‌ అథారిటీ,
  • తల్వార్లు తిప్పుతున్నారు! నగరంలో యువకుల హల్‌చల్‌ [ 14-10-2026] వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో యువత అదుపు తప్పుతోంది. రాత్రిపూట శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రహదారిపై పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో యువకులు తల్వార్లతో హల్‌చల్‌ చేస్తున్నారు.
  • వెల్‌నెస్ సేవల్లో వెలితి [ 14-10-2026] ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులు, పింఛనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య కార్డు ఆధారంగా వైద్యసేవలు పొందేందుకు 2017లో అప్పటి ప్రభుత్వం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ‘వెల్‌నెస్‌’ కేంద్రం ఏర్పాటు చేసింది.
  • పేరు ఒకరిది.. ఇల్లు మరొకరికి! [ 14-10-2026] పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు నాయకులు, అధికారులు స్వార్థంతో అక్రమాలకు తెరలేపుతున్నారు.
  • సిబ్బంది సమ్మె బాట.. వైద్య సేవలకు తంటా [ 14-10-2026] డిమాండ్ల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో జిల్లాలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తాయి. వైద్యారోగ్యశాఖలో కీలకంగా విధులు నిర్వర్తించే ఎన్‌హెచ్‌ఎంలు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఆ ప్రభావం రోగులపై పడుతోంది.
  • మత్తులో జోగుతున్నారు [ 14-10-2026] మన్యంలో గుడుంబా గుప్పుమంటోంది. ప్రజలు తాగి మత్తులో జోగుతుంటే.. ఎక్సైజ్‌ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు. డబ్బు సంపాదన కోసం గ్రామాల్లో పలువురు అడ్డదారులు తొక్కుతున్నారు.
  • ఉద్యోగులు లేరు.. ఉన్నవారు మోయలేరు [ 14-10-2026] జిల్లాలో వివిధ వ్యవసాయ మార్కెట్లల్లో అవసరమైన ఉద్యోగులు లేక పోవడంతో మార్కెట్‌ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్కెట్ల నిర్వహణకు ఉద్యోగుల పోస్టులు మంజూరు చేసినప్పటికీ అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం లేదు.
  • పెరుగుతున్న విద్యుత్తు వినియోగం [ 14-10-2026] ‘ఎల్‌నివో ప్రభావంతో గత మూడు నెలలుగా జిల్లా విద్యుత్తు వినియోగం తీవ్రంగా పెరిగింది. వినియోగదారులు విద్యుత్తును సాధ్యమైనంత మేరకు పొదుపుగా వాడుకోవాలని’ విద్యుత్తు శాఖ ఎస్‌ఈ ఎన్‌.సదానందం కోరారు.
  • వేయి స్తంభాల ఆలయాభివృద్ధికి ప్రత్యేక చర్యలు [ 14-10-2026] హనుమకొండలోని రుద్రేశ్వర వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, స్థానిక కలెక్టర్‌తో సంప్రదించి ఆలయం చుట్టూ అభివృద్ధి పనులు ప్రారంభించేలా చూస్తామని దేవాదాయ,
  • పోలీసు బందోబస్తుతో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు [ 14-10-2026] చేతికి అందివచ్చిన పంటను ధ్వంసం చేయొద్దని పరకాల మండలం పోచారం గ్రామ రైతులు రెవెన్యూ, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అధికారులను వేడుకున్నా వినకుండా పోలీసుల బందోబస్తు మధ్య పొక్లెయిన్‌తో పంటలను తొలగించి రోడ్డు పనులు చేపట్టారు.
  • భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య [ 14-10-2026] భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపర్తి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రాజేందర్‌ తెలిపిన వివరాల మేరకు..
  • బాలికపై అఘాయిత్యం [ 14-10-2026] హనుమకొండ ఠాణా పరిధిలో ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఠాణా పరిధిలోని బాలికను నగర శివారుల్లోని రిసార్ట్‌కు తీసుకెళ్లిన ఓ బాలుడు అత్యాచారం చేశాడు.

English Translation

Translation pending...