అది తీరని కలగానే ఉండిపోయింది.. భారతీరాజా మృతిపై ప్రముఖుల సంతాపం

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) నేడు తుదిశ్వాస విడిచారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు అంటూ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
‘‘సహజంగా, ఎక్కడా రాజీపడకుండా సినిమా కథను చెప్పే విషయంలో ఒక విప్లవం సృష్టించిన మార్గదర్శి భారతీరాజా గారు. మర్చిపోలేని విధంగా ఆయన తెరపైకి తెచ్చిన గ్రామీణ కథలు, వాస్తవితక ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయి. సినీ ఇండస్ట్రీ ఆయన అసాధారణ కృషి, పనితీరును స్మరించుకోవడం గొప్ప గౌరవం’’ -దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి
‘‘భారతీయ సినిమా రంగం ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను సినిమాగా మలచి మనకు అందించారు భారతీరాజా. ఆయన చిత్రాలు కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయాయి. ఎన్నో తరాల్లో స్ఫూర్తి నింపాయి. ఎన్నో గొప్ప పురస్కారాలు అందుకున్న ఆయన సినిమా రంగానికి చేసిన సేవ అపారమైనది. ‘ఆరాధన’ చిత్రంలో ఆయన దర్శకత్వంలో నటించే అదృష్టం నాకు దక్కింది. సినిమాపై ఆయనకు ఉన్న అంకితభావం నాలోనూ స్ఫూర్తి నింపింది. ఆయన మన మధ్య లేకపోయినా తన గొప్ప చిత్రాల రూపంలో ఎప్పటికీ మన మధ్యే ఉంటారు’’ - చిరంజీవి

‘‘ప్రముఖ దర్శకులు భారతీరాజా కన్నుమూశారనితెలిసి చింతించాను (Bharathiraja Passed Away). ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతీరాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ - పవన్ కల్యాణ్ ( Pawan Kalyan)
‘‘నిశ్శబ్దంలో సత్యాన్ని చూపిన దర్శకుడు భారతీరాజా. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రకృతిని అందంగా చూపారు. ‘తుడరుమ్’ చిత్రంలో ఆయనతో స్క్రీన్ పంచుకోవడం నేను ఎప్పటికీ పదిలపరుచుకునే గౌరవం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన లేని తీర్చలేనిది’’ - మోహన్‌లాల్

‘‘భారతీరాజా సర్.. మీరు లేని లోటు తీర్చలేనిది. మాపై మీరు చూపిన ప్రేమకి, మాలో మీరు నింపిన స్ఫూర్తికి, ఎన్నో గొప్ప సినిమాలను అందించినందుకు.. అన్నింటికీ ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ - ప్రకాశ్ రాజ్
‘‘భారతీరాజా గారి మరణం తీవ్ర విచారకరం. ఆయన ఓ దిగ్గజం, ఆయన దార్శనికత, కథ చెప్పే విధానంతో పాటు భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయి. నేటి దర్శకులు, నటులకే కాదు, రాబోయే తరాలకు ఆయన సినిమాలు స్ఫూర్తి. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ -అల్లు అర్జున్
‘‘మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు భారతీరాజా ఇక మన మధ్య లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రసీమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచాయి. భవిష్యత్తులో రానున్న సినిమాలకు ఆయన చిత్రాలు ఓ నిఘంటువులా ఉంటాయి. ప్రతి సినిమా ప్రేమికుడి కోసం ఆయన ఒక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో చూపిస్తూ ఒక సినిమా చేద్దామని ఆయన ఎప్పుడూ అనేవారు. ఆ కల ఇక తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ - ఖుష్బూ
‘‘గొప్ప గొప్ప నటులను దర్శకత్వం వహించిన వ్యక్తి భారతీ రాజా. ‘సీతాకోక చిలుక’ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు మంచి నటీనటులను పరిచయం చేశారు. దర్శకుడు లేనిదే నటులు లేరు. కథ, అందులోని పాత్రలకు ఎవరి సరిపోతారో గొప్పగా అంచనా వేయగల వ్యక్తి. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో మంచి షాట్స్ తీశారు. ‘సీతాకోక చిలుక’ నా ఏడో సినిమా. కొంచెం హుషారుగా ఉండే పిల్లాడు కావాలనగానే నాకు కాల్ వచ్చింది. వెళ్లిన అరగంటకే ఆ పాత్రకు నన్ను ఓకే చేశారు. ‘సీతాకోక చిలుక’ పాటలు ఎప్పుడు విన్నా హృద్యంగా అనిపిస్తాయి. ఒక నటుడిగా నేను ఇన్ని సినిమాలు చేశానంటే అది భారతీరాజా భిక్షే.’’ - నటుడు అలీ
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 09:09 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రివ్యూ: ‘సింగ్ గీతం’.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం కొత్త మూవీ ఎలా ఉంది? లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన వైవిధ్యమైన కథా చిత్రం ‘సింగ్ గీతం’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది ఎలాంటి వినోదాన్ని పంచింది?(Sing Geetham Movie Review)
- విజయ్ సేతుపతి-పూరి ‘స్లమ్‌డాగ్’.. టీజర్ మేకింగ్ చూశారా? విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ (SlumDog - 33 Temple Road).
- ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తా: రాఘవ లారెన్స్ Raghava Lawrence: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు.
- నాని చిత్రంలో రుక్మిణి? ‘సప్త సాగరాలు దాటి’, ‘కాంతార 2’ లాంటి విజయవంతమైన చిత్రాలతో దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రుక్మిణీ వసంత్. ప్రస్తుతం ఆమె చేతుల్లో యశ్ ‘టాక్సిక్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ లాంటి భారీ చిత్రాలున్న సంగతి తెలిసిందే.
- చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అప్పుడే! ‘‘నేను ఎప్పుడూ నా సామర్థ్యానికి మించిన స్థాయిలోనే పనిచేశా. కానీ ఒకానొక సమయంలో అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింద’’ని అంటోంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. కథానాయికగానే కాకుండా దర్శకురాలిగా కూడా సత్తా చాటుతోంది. ఇటీవల ‘భారత్ భాగ్య విధాత’లో నటించింది.
- అస్సాం అమ్మాయిని కదా అందుకే సవాల్ ‘‘బలమైన భావోద్వేగాలతో నిండిన చక్కటి కుటుంబ కథా చిత్రం ‘కొత్త మలుపు’’ అంది కథానాయిక భైరవి. ఈ టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ సినిమా తన సినీ ప్రయాణానికి ఓ కొత్త మలుపులా నిలుస్తుందని నమ్మకంతో చెబుతోంది.
- అలా అంటే కుర్చీలోనే కూర్చునేవాణ్ని ! ‘‘ఈతరం ప్రేక్షకులకు సింగీతం శ్రీనివాసరావు అందిస్తున్న కానుక ‘సింగ్ గీతం’’ అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇలాంటి చిత్రం ఇంత వరకు రాలేదని.. మరో 10ఏళ్ల తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చేశామని తెలిపారు.
- బంగారం.. రాకకు సిద్ధం ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది నటి సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని నందినీ రెడ్డి తెరకెక్కించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు నిర్మించారు.
- మనల్ని ప్రేమలో పడేలా చేసే జంట హృదయాల్లోకి చొచ్చుకెళ్లే ఓ మంచి ప్రేమకథతో ‘దీవాన’ తెరకెక్కిందన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఆయనతోపాటు కథానాయకుడు విష్వక్‌సేన్, నిర్మాత ధీరజ్ మొగిలినేని ముఖ్య అతిథులుగా గురువారం హైదరాబాద్‌లో ‘దీవాన’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరిగింది.
- కడలినే శాసించేవాడు.. విశాల్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘మకుటం’. ఆర్బీ చౌదరి నిర్మాత. దుషార విజయన్, అంజలి కథానాయికలు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
- టెన్షన్ ఔట్.. నవ్వులకు ‘వెల్‌కమ్’ అడవిలో ఒక నకిలీ సినిమాను తన తోటి నటులతో కలిసి చిత్రీకరిస్తున్నారు అక్షయ్ కుమార్. మొదట్లో వారంతా తన సహ నటులే అని భావించినప్పటికీ.. తర్వాత వారంతా బందిపోట్లని తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ సినిమా చూడాల్సిందే.
- ‘జైలర్ 2’లో అతిథిగా హృతిక్ రోషన్? టైగర్ కా హుకూం.. అంటూ ‘జైలర్’ చిత్రంతో తనదైన స్టైల్‌లో అలరించారు రజనీకాంత్. దీనికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించింది చిత్రబృందం.
- సంక్షిప్త వార్తలు (3) పవన్ మహావీర్ కథానాయకుడిగా... శివాల ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి’. వర్షిక, సుహానా కథానాయికలు. సుమన్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత కీలక పాత్రధారులు.
- పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ2’ అప్‌డేట్..! పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా సుజీత్‌దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ (They Call Him OG).
- అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు హీరోయిన్ తల్లి.. నవ్వులు పంచిన అక్షయ్ వెండితెరపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) యాక్షన్‌తో ఎంత మెప్పిస్తారో, కామెడీతోనూ అంతే నవ్వులు పంచుతారు.
- తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన భీష్మాచార్యుడు: సింగ్ గీతంపై చిరు పోస్ట్ తెలుగు సినిమా పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు భీష్మాచార్యుడని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
- సింగర్ జిమ్ లక్ష్యంగా బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు దిల్లీలోని పశ్చిమ్ విహార్‌లో 24హెచ్‌ఎస్ ఫిట్‌నెస్ వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
- ‘ధురంధర్’లో ఆ అంశాలు నచ్చాయి: పవన్ కల్యాణ్ ప్రశంసలు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘ధురంధర్’.
- దిగ్గజ దర్శకుడు భారతీరాజాకు ప్రధాని మోదీ నివాళి దర్శకుడు భారతీరాజా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
- డబ్బులు తీసుకొని ప్రచారం చేయట్లేదు.. ఆరోపణలపై నటి స్పందన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌పై దర్శకుడు సంజీవ్ మేగోటి ఇటీవల చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
English Translation
It remained a dream.. Celebrities mourn the death of Bharathiraja

- A
- A+
- A++

The legendary director of Tamil Internet: Bharathiraja breathed his last today. Celebrities are mourning the death of him who produced many super hit films as a huge loss to the industry. Remembering the relationship with him, they are posting on social media.
''Bhartiraja was a pioneer who created a revolution in telling the story of the film without compromising anywhere. The rural stories and reality that he brought to the screen in an unforgettable way will remain alive forever. It is a great honor for the film industry to remember his extraordinary efforts and performance" - Director S.S. Rajamouli
''Indian cinema has lost a great director. Bharathiraja has given us the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love and the emotions of common people in a film. His pictures have remained in the hearts of crores of people. Many generations have been inspired. He has received many great awards and his service to the film industry is immense. I was lucky enough to act in the film 'Aradhana' directed by him. His dedication towards cinema inspired me too. Even if he is not with us, he will always be with us in the form of his great paintings'' - Chiranjeevi

''A prominent I was saddened to know that director Bharathiraja passed away (Bharathiraja Passed Away). I pray to God that his soul rest in peace. Directed in Telugu, Seethakochiluka is still evergreen. The songs and scenes of the film pleased the audience. Made a movie 'Aaradhana' with elder brother Chiranjeevi. In it, the song 'Are what happened...' became very popular. My deepest condolences to Bharathiraja's family'' - Pawan Kalyan (Pawan Kalyan)
''Bhartiraja is a director who showed the truth in silence. Nature is beautifully shown in every frame. Sharing the screen with him in 'Tudarum' is an honor I will cherish forever. May his soul rest in peace. His legacy will continue to inspire generations. Without him is irreparable'' - Mohanlal

'' Bharathiraja sir.. the deficit without you is irreparable. Thank you for the love you showed us, the inspiration you instilled in us, for giving us so many great movies.. Thank you for everything. May your soul rest in peace'' - Prakash Raj
''Death of Bharati Raja is deeply saddened. He was a giant, his vision, his style of story telling and his services to Indian cinema will remain forever. His films are an inspiration not only to today's directors and actors, but to generations to come. Deepest condolences to his family members, relatives and fans'' -Allu Arjun
''I am deeply shocked to know that our beloved director Bharti Raja is no longer with us. His death is a great loss to Tamil cinema. His films have become a benchmark. His films are like a dictionary for future movies. He left a great legacy for every movie lover. He always said let's make a film showing me with two braids. That dream remains a dream. Praying for his soul to rest in peace'' - Khushboo
''Bharti Raja is a director of great actors. Good actors were introduced to the Telugu film industry through 'Sitakoka Chiluka'. Without a director, there are no actors. He is a person who has a great ability to judge who is suitable for the story and the characters in it. Good shots were taken in the days when technology was not available. 'Butterfly' is my seventh film. I got a call when I wanted a little smart kid. After half an hour, I was accepted for the role. The songs of 'Sitakoka Chiluka' always feel heartfelt. As an actor I have done so many movies, it is Bhartiraja Bhikshe.'' - Actor Ali
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 09:09 IST
Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Review: 'Sing Geetham'.. How is the new movie of legendary director Singeetham? 'Sing Geetham' is a diverse story film directed by legendary director Singeetham Srinivasa Rao. How is this movie that has recently come to the audience? (Sing Geetham Movie Review)
- Vijay Sethupathi-Puri 'Slumdog'.. Have you seen the making of the teaser? Vijay Sethupathi is the hero of director Puri Jagannath's film 'SlumDog: 33 Temple Road' (SlumDog - 33 Temple Road).
- If people approve, he will enter politics: Raghava Lawrence Raghava Lawrence: Renowned choreographer, director and actor Raghava Lawrence made a key announcement.
- Rukmini in Nani? Actress Rukmini Vasanth has gained recognition not only in the South but also in the North with successful films like 'Saptha Sagara Dathi' and 'Kantara 2'. It is known that she has huge films like Yash's 'Toxic' and NTR's 'Dragon' in her hands. "I have always worked beyond my capacity. But at one point I had to wait for opportunities," says Bollywood actress Kangana Ranaut. She is not only a heroine but also a director. Recently acted in 'Bharat Bhagya Vidhata'. "'Kotta Varna' is a good family story film full of strong emotions," says heroine Bhairavi. As per this title, she confidently says that this film will be a new turning point in her film journey. Director Nag Ashwin said that Srinivasa Rao's gift to other audiences is 'Sing Geetam'. He said that such a film has not come so far.. He said that he made this film with the intention of talking about it even after another 10 years.
- Bangaram.. ready for arrival. Actress Samantha is preparing to entertain the audience with the film 'Ma Inti Bangaram'. Nandini Reddy directed this movie in which she played the lead role. Produced by Raj Nidimoru, Samantha and Himank Duvvur under Tralala Moving Pictures banner.
- A couple that makes us fall in love. Famous producer Allu Aravind said that 'Deewana' has been opened with a good love story that penetrates into hearts. Along with him, protagonist Vishvaksen and producer Dheeraj Mogileni were the chief guests at the trailer launch ceremony of 'Deewana' in Hyderabad on Thursday. RB Chaudhary is the producer. Dushara Vijayan and Anjali are the heroines. The film, which is currently in its final stages, will hit the screens in July.
- Tension out.. Welcome to laughter. Akshay Kumar is shooting a fake movie in the jungle with his co-stars. Although initially he thinks that they are all his co-actors, later it turns out that they are all bandits. And what happened after that? To know that, you have to watch the movie 'Welcome to the Jungle'.
- Hrithik Roshan as a guest in 'Jailor 2'? Rajinikanth entertained in his own style with the movie 'Jailor' saying Tiger Ka Hukum.. 'Jailor 2' will be made as a sequel to this. Nelson Dilip Kumar is directing. The team has recently revealed that the shooting has been completed.
- News in Brief (3) Pawan Mahaveer in the lead... the movie 'Amma... I want that boy' is being directed by Shivala Prabhakar. Varshika and Suhana are the heroines. Suman, Rao Ramesh, Rajeev Kanakala, Sathyakrishna, Sujatha are the key actors.
- Good news for Pawan Kalyan fans.. 'OG2' update..! 'They Call Him OG' is a gangster drama directed by Sujeeth with Pawan Kalyan as the protagonist.
- Then the heroine.. now the heroine's mother.. Akshay who spread laughter On the silver screen, Bollywood actor Akshay Kumar entertains as much with action as he does with comedy.
- He is Bhishmacharya for the Telugu film industry: A short post on Singh's song. Top hero Chiranjeevi said that Srinivasa Rao Bhishmacharya is the song of Telugu film industry.
- Bishnoi gang firing on singer Jim A shooting incident took place at 24HS Fitness in Delhi's Paschim Vihar.
- Liked those elements in 'Dhurandhar': Pawan Kalyan praises Recently, the film 'Dhurandhar', which has received a super hit in the industry.
- Prime Minister Modi pays tribute to legendary director Bharathi Raja. Prime Minister Narendra Modi has expressed deep sorrow over the death of director Bharathi Raja. It is known that director Sanjeev Megoti's recent allegations against actress Varalakshmi Sarathkumar have led to a heated debate.