కాస్త ఆగుదాం
పండుగలంటే మనకి కొత్త ప్రారంభాలే! అందుకే ప్రతిదీ కొత్తగా కొనాలని ప్రయత్నిస్తుంటాం. కేవలం దుస్తులు, పూజ సామగ్రికే పరిమితం అవుతామా ఏంటి? దీపాలు, డెకార్ అంటూ జాబితాలోకి చేరేవి ఎన్నని? పైగా ఆకర్షించే ఆఫర్లు ఈ సమయంలోనే వచ్చేస్తాయి.

- A
- A+
- A++

పండుగలు అంటేనే సందడి. దానికి తగ్గట్టు షాపింగులు సరేసరి. దుస్తుల దగ్గర్నుంచి మొదలవుతుంది. బడ్జెట్ని పెంచుతూ జాబితా పెరుగుతూ పోతుంది. కానీ.. ఆగండి. నిజంగా అవి అవసరమేనా?
పండుగలంటే మనకి కొత్త ప్రారంభాలే! అందుకే ప్రతిదీ కొత్తగా కొనాలని ప్రయత్నిస్తుంటాం. కేవలం దుస్తులు, పూజ సామగ్రికే పరిమితం అవుతామా ఏంటి? దీపాలు, డెకార్ అంటూ జాబితాలోకి చేరేవి ఎన్నని? పైగా ఆకర్షించే ఆఫర్లు ఈ సమయంలోనే వచ్చేస్తాయి. భారీ డిస్కౌంట్లు, తక్కువ ధరకే దొరుకుతుంటాయి. తరవాత మళ్లీ దొరుకుతాయో లేదో ఈ ఆఫర్ మళ్లీ వస్తుందో లేదోనన్న భయం. ఇంకేం, చకచకా కార్టులోకి కొట్టేస్తాం. ఇవి చాలవన్నట్లు సోషల్మీడియా తెరిస్తే చాలు. ‘మా ఇంటి పూజకి ఇవి కొన్నాను’, దీంతో పని సులువంటూ దొరికే సలహాలు బోలెడు. కొత్తగా కనిపిస్తూ, పని సులువు చేస్తోంటే మనసు మనకీ అవసరమే అని సలహానిస్తుంది. అలా అవీ ఇంటికి చేరతాయి. షాపింగ్ చేస్తోంటే మనసుకు ఆనందం. డోపమైన్ మాయ! అదింకా విడుదలవుతుంది. కొనేలా ప్రేరేపిస్తుంది. ఇక, పక్కవారితో పోలికలు సరేసరి. వెరసి, మనం గమనించేలోగా జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది.
ఏమా నష్టం?
ఇలా కొంటూ పోవడం వల్ల ముందు బడ్జెట్కి గండిపడుతుంది. తరవాతి నెలల్లో ఇబ్బందులు పడాలి. ఆరోజు ఇంటిని అందంగా తీర్చిదిద్దాలని ఏవేవో కొంటాం. అవన్నీ చేరేది చాలావరకూ చెత్తలోకే! దీనివల్ల పర్యావరణానికి నష్టం. వీటిలో చాలావరకూ రీసైక్లింగ్ కూడా కావు. పోనీ మళ్లీ మళ్లీ వాడేవే కొన్నారనుకున్నా... ఏటా ఏదో ఒకటి కొత్తది చేరుతోంటే ఇల్లు నిండటం మినహా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అదీ ఒత్తిడికి కారణమవుతుంది. అన్నీ చకచకా అవుతున్నాయని ఫీలవుతాం కానీ... ఈ క్రమంలో పిల్లల సాయం తీసుకోవడం, కలిసి పనిచేయడం వంటి అనుభూతులన్నీ దూరమవుతాయి.
కాబట్టి...
- కొనేముందు ఇంట్లో ఏమున్నాయో చెక్ చేయండి. మరీ అత్యవసరం అంటే తప్ప కొనొద్దు. ఏదైనా నచ్చితే ఒకరోజంతా ఆగండి. తరవాతా కావాలనిపిస్తేనే కొనాలి.
- తరవాత పనికొస్తాయని ఇల్లంతా నింపుతూ పోవద్దు. ఒకటి కొంటున్నామంటే పాతది పక్కకి వెళ్లాల్సిందే. తీసేయండి లేదంటే ఎవరికైనా ఇచ్చేయండి. తరవాతే కొనండి.
- మనం పండుగ చేసుకునేది మనకోసం, మనవాళ్లకోసం. ఎవరికోసమో ఎవరినో మెప్పించాలనో అనవసర ఖర్చులు పెట్టొద్దు. ముందు ఇంట్లో ఏమున్నాయో చూసుకోండి. వాటినే కొత్తగా ఎలా ఉపయోగించొచ్చో ఆలోచించండి. ఇంట్లోవాళ్లనీ భాగం చేస్తే కొత్త ఆలోచనలు బోలెడొస్తాయి.
- గతంలో చక్కగా ఉన్నదాంట్లోనే ఇంటిని తీర్చిదిద్దుకునేవారు. మీరూ అలాగే ప్రయత్నించండి. సహజంగా తాజాపూలు, ఆకులతో ఎలా చేసుకోవచ్చో ఆలోచించండి. ‘జీరో వేస్ట్’ లక్ష్యంగా ప్రయత్నించండి. మీ సృజనాత్మకత బయటపడటమేనా? ప్రకృతికీ మేలు.
English Translation
Let's stop for a while
Festivals are new beginnings for us! That's why we try to buy everything new. Shall we limit ourselves to just clothing and puja materials? How many things are included in the list of lamps and decor? More attractive offers will come at this time.

- A
- A+
- A++

Festivals mean noise. According to that, shopping is okay. It starts from the dress. The list grows as the budget increases. But.. wait. Are they really necessary? That's why we try to buy everything new. Shall we limit ourselves to just clothing and puja materials? How many things are included in the list of lamps and decor? More attractive offers come at this time. Huge discounts are available at low prices. The fear is whether this offer will come again or not. What's more, let's hit the cart. As if these are enough, it is enough to open social media. 'I bought these for my house pooja', there are lots of suggestions that make work easier. Looking new and making things easier, the mind advises us that we need it. So they reach home. Shopping brings joy to the mind. Dopamine magic! It will be released. Induces to buy. Also, comparisons with others are okay. After all, before we notice, all the loss will be done.
What is the loss?
Due to buying like this, the previous budget will be affected. There will be difficulties in the following months. We buy things to beautify the house that day. Most of them end up in the trash! This causes damage to the environment. Most of these are not even recycling. Even if you want to buy a used one again and again... Is adding something new every year doing anything other than filling the house? That causes stress. We feel that everything is getting smooth but... in this process all the feelings like taking help of children and working together are lost.
So...
- Check what is in the house before buying. Don't buy unless absolutely necessary. If you like something, wait for a day. Buy only if you want to use it later.
- Don't keep stuffing it all over the house to use it later. If you are buying one, the old one has to go aside. Take it or give it to someone else. Then buy it.
- What we celebrate is for ourselves and our grandchildren. Do not spend unnecessary expenses to please someone. Check what's in the house first. Think about how you can use them in a new way. If the people of the house are also part of it, many new ideas will emerge. Try the same. Think how you can do it naturally with fresh flowers and leaves. Try to aim for 'Zero Waste'. Is your creativity unleashed? Nature is good.