India Seniors Bypass Gambhir Seek Clarity From BCCI Over ODI Future: Report

గంభీర్‌- రోహిత్‌- కోహ్లి (ఫైల్‌ ఫొటో)

అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌తో టీమిండియా వన్డే ప్రపంచకప్‌-2027 సన్నాహకాలు మొదలుకానున్నాయి. గిల్‌ సేన స్వదేశంలో అఫ్గన్‌తో మూడు వన్డేలు ఆడేందుకు సన్నద్ధమైంది. గాయం కారణంగా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సైతం కాలు నొప్పితో దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

మరోవైపు.. లెజెండరీ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన దిగ్గజ ద్వయం రోహిత్‌- కోహ్లి వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

గంభీర్‌, అగార్కర్‌ విముఖత?
వన్డే ప్రపంచకప్‌-2027 ఆడటమే లక్ష్యంగా రో-కో ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వరల్డ్‌కప్‌ ఆడే విషయంలో రో-కో తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్‌ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు.

తలవంచను
అయితే, ఇందుకు కోహ్లి ఇటీవలే గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే.. అందుకు తాను తలవంచనని చెప్పేశాడు. డ్రెసింగ్‌రూమ్‌లో తన అవసరం లేదనుకుంటే తన గురించి చర్చే అనవసరం అని పేర్కొన్నాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో రో-కో భవితవ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించాయి. సీనియర్‌ ఆటగాళ్లు గంభీర్‌, అగార్కర్‌లను కాదని యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.

గంభీర్‌తో మాకు సంబంధం లేదు
‘‘జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్‌ గిల్‌ ప్రతీ విషయంలో డ్రెసింగ్‌రూమ్‌ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్టు, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్‌ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు.

అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. వన్డే వరల్డ్‌కప్‌ సన్నాహకాలు మొదలైపోయాయి. గంభీర్‌- గిల్‌ ఇకపై మరి కాస్త కఠినంగా ఉండవచ్చు. డ్రెసింగ్‌రూమ్‌లో తన ఐడియాలను బలంగా వినిపించవచ్చు.

చాలా ఏళ్లుగా అత్యంత గొప్పగా.. సేవలు అందిస్తున్న సీనియర్లు వచ్చే పదహారు నెలల్లో జట్టులో తమ పాత్ర ఏమిటన్న అంశం గురించి గంభీర్‌తో కాకుండా నేరుగా యాజమాన్యంతో చర్చిస్తున్నారు. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 

చదవండి: వాళ్లకే దిక్కులేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?


English Translation
India Seniors Bypass Gambhir Seek Clarity From BCCI Over ODI Future: Report

Gambhir-Rohit- Kohli (file photo)

Team India's ODI World Cup-2027 preparations will begin with the series against Afghanistan. Gil Sena is all set to play three ODIs against Afghanistan at home. While legendary batsman Virat Kohli is away from this series due to injury, all-rounder Hardik Pandya is also out with leg pain. On the other hand, the recovery of legendary opener Rohit Sharma from injury and achieving full fitness has become a positive for Team India. Meanwhile, it is known that the iconic duo Rohit-Kohli, who have already said goodbye to international T20 and Tests, are continuing in ODIs.

Gambir and Agarkar are reluctant?
Ro-Co is moving forward with the goal of playing ODI World Cup-2027. However, head coach Gautam Gambhir and chief selector Ajit Agarkar are not willing towards them. Agarkar has already publicly announced that Ro-Co has not given them any assurance about playing the World Cup. However, Kohli has recently given a firm counter to this. He said that if he was repeatedly pressed to prove himself, he would not give in. He stated that if he is not needed in the dressing room, then there is no need to talk about him.

In the background of these developments, the discussion about the future of Ro-Ko started once again. In this order, the BCCI sources spoke to the Times of India and revealed sensational things. The senior players stated that they are in direct contact with the management and not Gambhir and Agarkar. Captain Gill needs to make his voice heard in the dressing room on all matters. Like in Test and T20 formats, Madiri Gambhir is not interfering much in the matter of ODI team.

But now the situation has changed a bit. Preparations for ODI World Cup have started. Gambhir-Gill may be a bit tougher from now on. He can voice his ideas strongly in the dressing room.

The seniors, who have been serving the best for many years, are discussing their role in the team in the next sixteen months directly with the management, not with Gambhir. BCCI sources stated that they want to clarify their future. 

Read: They don't care.. How will they select him?