
సాక్షి,న్యూఢిల్లీ:అర్హులైన వారు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్–ఎస్ఎస్ఆర్) చేపట్టనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్ల నమోదు ప్రక్రియను మెరుగుపరచడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
ఓటర్ల జాబితాలను ఎప్పటికప్పుడు సరిచేయడం ఎన్నికల సంఘం చేపట్టే సాధారణ ప్రక్రియలో భాగం. కొత్తగా ఓటు హక్కు పొందినవారు తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు, జాబితాల్లోని వివరాల్లో తప్పులను సరిచేసుకునేందుకు ఇటువంటి సవరణలు అవకాశం కల్పిస్తాయి. ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా ఓటర్ల జాబితాల్లో పేర్ల నమోదు, వ్యక్తిగత వివరాల సవరణ, అర్హత కోల్పోయిన లేదా మరణించిన ఓటర్లకు సంబంధించిన వివరాల పరిశీలన వంటి అంశాలు ఉంటాయి.
ఈ రాష్ట్రాల్లో ఎస్ఎస్ఆర్:అస్సాం, అండమాన్-నికోబార్, గోవా, బిహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మణిపూర్, పుదుచ్చేరి, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్.
ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాలు, ఇటీవల పూర్తైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఎస్ఆర్ షెడ్యూల్ను తర్వాత ఎస్ఎస్ఆర్ను ప్రకటిస్తామని పేర్కొంది. పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీల పదవీకాలం 2027లో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు
English Translation

Sakshi, New Delhi:Eligible The Election Commission of India has announced that a special summary revision (SSR) will be carried out in 17 states and Union Territories to facilitate the process of registering names in the voter list. The main objective of this program is to improve the process of voter registration and to enable everyone who is eligible to exercise their right to vote.
Regulation of voter lists from time to time is part of the regular process of the Election Commission. Such amendments will enable new voters to register their names and correct errors in particulars in the lists. As part of the special brief revision, entries of names in voter lists, correction of personal details, verification of details of disqualified or deceased voters are included. Rajasthan, Tamil Nadu, Uttar Pradesh, Uttarakhand, West Bengal.
States where SIR process is ongoing, recently completed states and Union Territories SSR schedule will be announced later. This decision assumes importance in the context of the tenure of Punjab, Uttar Pradesh, Manipur, Goa and Uttarakhand Assemblies ending in 2027.
Read:Significant step forward on India-US trade agreement