
ఢిల్లీలో సెంట్రల్ పార్క్ దగ్గర నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సిద్ధమవుతోంది. అక్టోబర్ 16న నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది. సీజేపీని నిరోధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే, ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు కూడా రెడీ అవుతున్నారు.
కనాట్ ప్లేస్లో వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా నిరసనను చట్ట ప్రకారం నియంత్రించాలని పోలీసులను ఆదేశించాలంటూ ఓ వీధి వ్యాపారి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారణ జరిపింది. పండుగల సీజన్లో నిరసనల కారణంగా మరో వారాంతంలో వ్యాపారం నిలిచిపోతే, వ్యాపారులు, వీధి వ్యాపారులు రోడ్డున పడాల్సి వస్తుందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదించారు.
కాగా, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్ వద్ద జాతీయ జెండాలతో సమావేశం కావాలని దేశభక్తులకు సీజేపీ వ్యవస్థాపకుడు పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని ప్రేమించే దేశభక్తులందరూ తరలి రావాలని కోరారు.
జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కాదని మనం నిరూపించి చూపిద్దామని బుధవారం దీప్కే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఢిల్లీకి రాలేనివారు తమ ప్రాంతాల్లోనే ‘త్రివర్ణ పతాక యాత్రలు’నిర్వహించాలని కోరారు. త్రివర్ణ పతాకమే మన గర్వకారణమని చాటి చెప్పాలని సూచించారు. తాను జెండా ఎగురవేస్తానని చెప్పారు. ప్రభుత్వం తనను కూడా జైలుకు పంపవచ్చని దీప్కే అన్నారు.
ఇదీ చదవండి:ఒక్కరి కోసం సొంత దేశ ప్రజలతోనే మోదీ, షా యుద్ధం: దీప్కే
English Translation

The Cockroach Janata Party (CJP) is gearing up for protests near Central Park in Delhi. CJP has called for protests on October 16. It is known that the Delhi High Court refused to restrain the CJP. However, the police are also getting ready to control the agitations.
The court heard a public interest litigation filed by a street vendor seeking an order to the police to control the protest as per law so as not to disrupt business activities at Connaught Place. Senior counsel for the petitioner argued that if business is halted for another weekend due to the protests during the festive season, the traders and street vendors would have to be on the streets.
Thus, the patriots have called for a meeting with national flags at Central Park, Connaught Place, Delhi at 5 pm on 16th to protest against the jail sentence of Sourav Das and Ashutosh Ranka, who hoisted the tricolor flag. The founder of CJP called. All the patriots who love the tricolor flag have been asked to come.
Let us prove that hoisting the national flag is not a crime, Deepke posted on 'X' on Wednesday. Those who could not come to Delhi were asked to conduct 'Tricolor Pataka Yatras' in their own areas. He suggested that we should say that tricolor flag is our pride. He said he will hoist the flag. Deepke said the government may even send him to jail.
Read:Modi Shah waged war against own countrymen for one: Deepke