TG News: ప్రజావాణిలో 74శాతం ఫిర్యాదులు పరిష్కరించాం: డిప్యూటీ సీఎం భట్టి

Eenadu icon
By Telangana News Team Published : 19 Dec 2025 18:21 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లల్లో ఇప్పటి వరకు 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించామని తెలిపారు. బేగంపేట ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి ఇన్‌ఛార్జి దివ్యదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారుల తమ అనుభవాల పంచుకున్నారు.

అంకితభావంతో సేవలు అందించి.. ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి, అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రజావాణికి స్పందన లేదని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆక్షేపించారు. ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారానికి దూరమైన విపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. తాము మరింత ముందుకు వెళ్తామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజావాణి విజయవంతం చేసిన చిన్నారెడ్డి, దివ్యాదేవరాజన్‌కు భట్టి అభినందనలు తెలిపారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

TG News: We solved 74 percent complaints in Prajavani: Deputy CM Bhatti

Eenadu icon
By Telangana News Team Published : 19 Dec 2025 18:21 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Hyderabad: In Indiramma's kingdom, public problems are solved by the state. Deputy Chief Minister Mallu Bhatti Vikramarka said that the government should be committed. He said that 74 percent of the complaints have been resolved so far within two years of Prajavani's launch. Bhatti was the Chief Guest at the 2nd Anniversary of State Level Prajavani held at Praja Bhavan, Begumpet. Ministers Ponnam Prabhakar, Jupalli Krishna Rao, State Planning Commission Vice President Chinnareddy, Prajavani Incharge Divya Devarajan and others participated in this program. Many beneficiaries shared their experiences in this program.

Officials who worked hard to resolve complaints by providing services with dedication were honored. On this occasion, Bhatti Vikramarka said that special software has been designed to solve many problems coming from different communities of the state and coordination with all the departments is being done. He objected that there was no response to the public and that the opposition was spreading misinformation. He assured that public problems will be solved no matter how much bad publicity is done. He said that no matter how many criticisms are made by the opposition, which is far from power, they will go further. He promised to work hard to make the resources of Telangana useful for the people. Bhatti congratulated Chinnareddy and Divyadevarajan for the success of Prajavani.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :