రేడియో ముచ్చట్లు!

Eenadu icon
By Editorial Team Published : 25 Feb 2026 02:07 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

కొన్ని మాధ్యమాలు కేవలం సమాచారాన్ని అందించవు, అవి సమాజాల గుండెచప్పుడుగా మారతాయి. అలాంటివాటిలో రేడియో ఒకటి. ఇది మన సామూహిక వినికిడి సంస్కృతికి  నిదర్శనం. ఒకప్పుడు ఒకే రేడియో గ్రామపంచాయతీ నుంచి మైక్‌ ద్వారా ఊరంతా వినిపించేది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 93 శాతం ప్రజలను చేరగల సామర్థ్యం ఉన్న ఈ మాధ్యమం, నేటి డిజిటల్‌ యుగంలో కూడా తన స్థానాన్ని కోల్పోలేదు. అన్ని తరాలవారినీ అలరించగలగడం రేడియో ప్రత్యేకత.

చాలామంది దినచర్యలో రేడియో ఒక భాగం. టెలివిజన్‌లో 24 గంటల ప్రసారాలు మొదలయ్యేవరకూ రేడియోది ఏకఛత్రాధిపత్యమంటే అతిశయోక్తి కాదు. అందులో ప్రసారమయ్యే కార్యక్రమాల సమయాన్ని బట్టి పనులు చేసుకునే అలవాటు ఎందరికో ఉండేది. టీవీ, ఆ తర్వాత మొబైల్‌ వచ్చి ఈ షెడ్యూల్‌ను దెబ్బతీసినా ఇప్పటికీ కారులో వెళ్తూ రేడియో వినేవాళ్లకు కొదవ లేదు. ప్రసార మాధ్యమాలు ఎన్ని ఉన్నా రేడియో శ్రోతలకు  ఒకలాంటి అంతర్గత శాంతినిస్తుంది. సమయాన్ని గౌరవించడం, ప్రశాంతంగా వినడం నేర్పిస్తుంది. మాట్లాడే ముందు వినడం ముఖ్యమని చెబుతుంది. వినడమంటే అర్థం చేసుకోవడం, విభిన్న స్వరాలకు స్థానం ఇవ్వడం. ఈ వినికిడి సంస్కృతి బలంగా ఉన్నప్పుడే, సామాజిక సంభాషణలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు, దేన్నయినా చూసేటప్పుడు మనిషి నిష్క్రియాపరుడవుతాడు. కళ్లప్పగించి చూడటం తప్ప మరేమీ చేయలేడు. అదే వినేటప్పుడు చురుగ్గా, అప్రమత్తంగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూనే వింటున్న సమాచారానికి దృశ్యాన్ని ఊహించుకుంటాడు. ఈ స్వేచ్ఛే రేడియోను ప్రత్యేకంగా నిలబెడుతుంది.

రేడియో ఒక సమానత్వ వేదిక. చదువు, సంపద, వయసు... ఇవేవీ శ్రోతగా మారడానికి అడ్డంకులు కావు. ఎన్ని ఇంచులు, ఎంత క్లారిటీ, ఏ కంపెనీ... ఇవన్నీ అప్రస్తుతం. రిక్షావాలాకైనా, లగ్జరీ కారులో అయినా అదే రేడియో. అదే ఆనందం. అదే నమ్మకం. ఒకప్పుడు వాతావరణ సమాచారానికి, పాడీ పంటా తాలూకు సలహాలకు, మార్కెట్‌ ధరలు తెలుసుకోవడానికి... పల్లెటూళ్లలో రేడియోపైనే ఆధారపడేవాళ్లు. పొలంలో ఓ చెట్టుకింద పెట్టో, వెదురుగుంజకు కట్టో రేడియో వింటూ పొలం పనులు చేసుకునే రైతుల దృశ్యం సుపరిచితం. ఉరుకుల పరుగుల నగరజీవితంలోనూ రేడియో ఒక నిదానాన్ని నేర్పుతుంది. అది మనల్ని తొందరపెట్టదు, మనమూ దాన్ని తొందరపెట్టలేం. రేడియోలో మాటకి విలువెక్కువ. ఎందుకంటే దాంట్లో ముఖాలు కనిపించవు. అందుకే ఆచితూచి పదాలను వాడతారు. హాస్యం సున్నితంగా ఉండాలి, విమర్శ సమతూకంగా ఉండాలి, సమాచారం కచ్చితంగా ఉండాలి. ఈ నైతిక క్రమశిక్షణే రేడియోను నమ్మదగిన మాధ్యమంగా నిలబెట్టింది. సంగీత ప్రసారాల్లో కూడా ఇదే లోతు కనిపిస్తుంది. రేడియోలో మనకు నచ్చిన ప్లేలిస్ట్‌ ఉండదు, వాళ్లు వేసిన పాటలే వినాలి. అయినా సరే, లేటెస్ట్‌ హిట్స్‌ మధ్యలో అనుకోకుండా ఒక ఆపాత మధురం వినిపిస్తుంది. మనసును ఆనందడోలికల్లో విహరింప జేస్తుంది. అందుకే చాలా మందికి రేడియో ఒక నోస్టాల్జియా!

భయం ఉన్నచోట న్యాయం ఉండలేదు. విధేయమైన న్యాయవ్యవస్థ, అంతరాత్మను అణచి పెట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సమాజం... నియంతృత్వానికి సూచనలు. న్యాయస్థానాలు సత్యానికి కట్టుబడి తమ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. రూల్‌ ఆఫ్‌ లాని పణంగా పెట్టకూడదు. 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


English Translation

Radio love!

Eenadu icon
By Editorial Team Published : 25 Feb 2026 02:07 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

Some media do not just provide information, they become the heartbeat of societies. Radio is one such thing. This is a testament to our collective listening culture. Once upon a time, the whole town could be heard through a microphone from a single radio village panchayat. This medium, which is capable of reaching almost 93 percent of people worldwide, has not lost its place even in today's digital age. Radio is unique in being able to entertain all generations.

Radio is a part of daily life for many people. It is no exaggeration to say that radio was monopolized until 24-hour broadcasting began on television. Many people had the habit of doing things according to the time of the programs that were aired. TV and later mobiles disrupted this schedule but still there is nothing for those who listen to the radio while driving. Radio listeners have the same inner peace regardless of the number of broadcast media. Teaches respect for time and calm listening. It says that it is important to listen before speaking. Listening is understanding, giving place to different voices. When this listening culture is strong, social interactions are healthy. Moreover, man becomes passive while looking at anything. He can do nothing but stare. He is active and alert while listening to the same. He visualizes the information he hears while doing his work. This freedom is what makes radio unique.

Radio is an egalitarian platform. Education, wealth, age... none of these are barriers to becoming a listener. How many inches, how much clarity, which company... all these are irrelevant. The radio is the same whether in a rickshaw or a luxury car. That's happiness. That's the belief. Once upon a time, people used to rely on radio for weather information, advice for padi panta taluk, market prices... in villages. The scene of farmers working in the field while listening to the radio under a tree or cut a reed is familiar. Radio teaches a slowness even in the city life of Urukula Run. It does not rush us, nor can we rush it. Words are worthless on the radio. Because there are no faces in it. That is why the words are used. Humor should be sensitive, criticism balanced, information accurate. It is this moral discipline that makes radio a reliable medium. The same depth is seen in music broadcasts. The radio doesn't have a playlist we like, we have to listen to the songs they play. However, in the midst of the latest hits, an unexpected melody is heard. Makes the mind wander in bliss. That is why radio is a nostalgia for many people!

Where there is fear there is no justice. A subservient judiciary, a stifling society unable to suppress the conscience...points to dictatorship. Courts must uphold their dignity by adhering to the truth. Do not risk the rule off.  href="https://x.com/eenadulivenews/" target="_blank" rel="noopener">Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this regard.