గంభీర్ దృష్టిలో అతడో ‘సర్వరోగ నివారిణి’!: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచకప్ ( ICC Mens T20 World Cup) సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ( Team India) 76 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) భారత కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) నిర్ణయాలను తప్పుబట్టాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను ( Axar Patel) జట్టులోంచి తప్పించి మరీ వాషింగ్టన్ సుందర్‌ను ( Washington Sundar) ఆడించడాన్ని ప్రశ్నించాడు. గౌతమ్ గంభీర్.. వాషింగ్టన్ సుందర్‌ను అన్ని సమస్యలను పరిష్కరించే సర్వరోగనివారణి అనుకుంటున్నాడని సంజయ్ మంజ్రేకర్ ఎగతాళి చేశాడు.
‘ఆయుర్వేదంలో కొన్ని మందులను తలనొప్పికి, కడుపు నొప్పికి కూడా సర్వరోగ నివారిణిలా వాడతారు. అయితే గౌతమ్ గంభీర్ సైతం.. అన్ని సమస్యలకు ఒకే పరిష్కారంలా వాషింగ్టన్ సుందర్‌ను చూస్తున్నాడు. బ్యాటింగ్‌లో సమస్యా.. వాషింగ్టన్ సుందర్! బౌలింగ్‌లో ఇబ్బందా.. వాషింగ్టన్ సుందర్! అంటున్నారు. అతడిని ఏకంగా అయిదో స్థానానికి ప్రమోట్ చేశారు. అతడి తర్వాతే రింకు సింగ్, హార్దిక్ పాండ్యను ( Hardik Pandya) బ్యాటింగ్‌కు పంపారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తంచేశాడు.
‘ఫాస్ట్ బౌలింగ్ విషయాన్ని పక్కనపెట్టి.. స్లో బాల్స్‌ను ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేయండి. భారత బ్యాటర్లు స్లో బాల్స్, స్పిన్నర్లను ఆడలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ నెమ్మదిగా వచ్చే బంతుల విషయంలో ఇబ్బంది పడుతున్నాడు’ అని సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించాడు.
వైస్ కెప్టెన్‌ను ఎవరైనా జట్టులోంచి తప్పిస్తారా?: కృష్ణమాచారి శ్రీకాంత్
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌పటేల్‌ను భారత జట్టు నుంచి తప్పించడాన్ని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) తప్పుపట్టాడు. ఏకంగా వైస్ కెప్టెన్‌ను ఇలా పక్కనపెట్టి ప్రయోగాలు చేయడమేంటని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను అతడు ప్రశ్నించాడు. ‘గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసేది అతడే కదా. ఇలాంటి వ్యూహాలతో ముందుకుసాగితే నష్టం తప్పదు. మిగతా జట్లు ఆడే మ్యాచ్‌ల ఫలితాల మీద ఇప్పుడు మనం ఆధారపడే పరిస్థితికి వచ్చాం. ఓటమి తర్వాత గంభీర్, సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav) మాట్లాడుకున్నారు. అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించిన తర్వాత వీరు మాట్లాడుకోవడానికి ఇంకేముంది?’ అని శ్రీకాంత్.. కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
- అరరే.. ఈ టీమ్‌ఇండియాకు ఏమైంది?
‘ప్రధాన కోచ్‌గా గంభీర్ ఉన్నాడు. అతడి చుట్టూ ఇతర కోచింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా సాధారణ నిర్ణయాలు తీసుకోలేరా? వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను ఎవరైనా జట్టు నుంచి తప్పిస్తారా? ఇంతకుముందు శుభ్‌మన్ గిల్ ( Shubman Gill) విషయంలోనూ ఇలాగే చేశారు. ఇకపై టీ20లలో జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే వైస్ కెప్టెన్లుగా ఉన్నవారినే జట్టు నుంచి బయటకు పంపుతున్నట్లు కనిపిస్తోంది’ అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఐపీఎల్.. లఖ్‌నవూపై ఆర్సీబీ ఘనవిజయం ఐపీఎల్ 2026లో భాగంగా ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
- ముంబయి ఇండియన్స్‌కు బ్యాడ్‌న్యూస్..? Rohit Sharma: ముంబయి ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్..!
- ప్లేయర్లపై కాదు.. అంపైర్లకు జరిమానా విధించాలి: ఎంసీసీ హెడ్ స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఆలస్యమైతే కెప్టెన్లపై జరిమానా విధించడం సరైంది కాదని ఎంసీసీ హెడ్ స్టీవార్ట్ అభిప్రాయపడ్డారు. అంపైర్లకు విధించాలని సూచించారు.
- నూర్ సూపర్ స్పెల్ వెనుక ధోని సూచనలు: సీఎస్‌కే బౌలింగ్ కోచ్ ధోని మైదానంలోకి దిగకపోయినా.. సహచరుల్లో స్ఫూర్తి నింపడంలో ముందుంటాడు. కోల్‌కతాపై అద్భుత ప్రదర్శన చేసిన నూర్‌కూ ఇలాగే కీలక సూచనలు ఇచ్చాడు.
- నా శరీరంలో ఇప్పటికీ ఆ అవశేషాలు: కుమార సంగక్కర పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన తమ జట్టుపై 2009లో ఉగ్రదాడి జరిగిన ఘటనను తాజాగా కుమార సంగక్కర గుర్తు చేసుకున్నాడు.
- రోహిత్ శర్మ గాయంపై తాజా అప్‌డేట్..! రోహిత్ శర్మ గాయంపై అప్‌డేట్ వచ్చింది. కండరాలు పట్టేయడంతో ఆర్సీబీతో జరిగిన బ్యాటింగ్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే.
- మయాంక్‌పై అప్‌డేట్.. రహానేకు ఫైన్.. నల్ల రిబ్బన్లతో ప్లేయర్స్ చెపాక్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే అద్భుత విజయం.. కోల్‌కతా కెప్టెన్‌కు జరిమానా.. లఖ్‌నవూ స్టార్ పేసర్ మాయంక్ యాదవ్‌పై అప్‌డేట్‌తో ఐపీఎల్ విశేషాలు ఇవీ..
- సాకులు చెప్పం.. నాతో సహా మెరుగుపడాల్సిందే: రుతురాజ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఓ విషయంలో మాత్రం ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ఆ జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ కూడా వెల్లడించాడు.
- చెన్నై.. మళ్లీ కొట్టింది హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్-19ను పేలవంగా ఆరంభించిన చెన్నై సూపర్‌కింగ్స్.. కొంచెం ఆలస్యంగా జోరందుకుంది. గత మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించిన సీఎస్కే.. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అలవోకగా గెలిచింది.
- షూ కూడా కొనలేని స్థితి నుంచి.. మొన్నటి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత రాత్రికి రాత్రి స్టార్లు అయిపోయారు.. ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్. ఈ ఇద్దరూ తలో నాలుగు వికెట్లతో రాయల్స్ ఓటమిని శాసించారు. ప్రఫుల్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ నడ్డి విరిస్తే.
- ఆయుష్ అదరహో.. కొంతకాలంగా ఆ యువ షట్లర్ తన నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మంచి భవిష్యత్తున్న వర్ధమాన ఆటగాడిగా భారత బ్యాడ్మింటన్ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ప్రదర్శనతో అతడి పేరు మార్మోగుతోంది.
- సూర్య భవితవ్యంపై చర్చ కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను విజయపథంలో నడిపించినప్పటికీ బ్యాటుతో పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
- ఐర్లాండ్ పర్యటనకు వైభవ్! ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్న వైభవ్.. జూన్ 26న ప్రారంభంకానున్న ఐర్లాండ్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
- ఉత్తమ ప్లేయర్లుగా అభిషేక్, దీప్తి 2026 విజ్డెన్ అవార్డుల్లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. మొత్తం 9 పురస్కారాల్లో ఏడు భారత క్రికెటర్లకు లభించాయి. భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా ఎంపికవగా..
- టైటిల్‌కు చేరువలో వైశాలి క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న వైశాలి టైటిల్‌కు చేరువైంది. అగ్రస్థానంలో ఉన్న ఆమె ఆఖరి రౌండ్లో నెగ్గితే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం పోటీపడే అవకాశం లభిస్తుంది.
- సంక్షిప్త వార్తలు(3) సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శ్రీలంక పేసర్ దిల్షాన్ మదుశంక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమైన ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ స్థానంలో ఎడమచేతి వాటం బౌలర్ మదుశంకను జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్ మంగళవారం ప్రకటించింది.
- బోల్ట్‌ను మించిన వేగం పరుగు అనగానే గుర్తుకొచ్చే పేరు.. ఉసేన్ బోల్ట్. ఓ దశాబ్దం పాటు ప్రపంచ అథ్లెటిక్స్‌లో అతను సాధించిన ఆధిపత్యం ఒక చరిత్ర. అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేయడమే కాదు.. భవిష్యత్తులో బద్దలు కావేమో అనిపించే స్థాయి రికార్డులు నెలకొల్పిన ఘనుడతడు.
English Translation
He is a 'panacea' in Gambhir's eyes!: Former Team India cricketer

- A
- A+
- A++

Internet Desk: Short Team India (Team India) scored 76 runs in the match against South Africa as part of the ICC Mens T20 World Cup) Super-8. It is known that the defeat was by a margin. In this background, the former cricketer of Team India Sanjay Manjrekar (Sanjay Manjrekar) criticized the decisions of Indian coach Gautam Gambhir ( Gautam Gambhir). The vice-captain questioned the omission of Axar Patel ( Axar Patel) from the team and playing Washington Sundar ( Washington Sundar). Gautam Gambhir.. Sanjay Manjrekar made fun of Washington Sundar for thinking he is a panacea to solve all problems.
In Ayurveda some medicines are used as panacea for headache and stomach ache. But Gautam Gambhir also sees Washington Sundar as a solution to all problems. Is there a problem in batting.. Washington Sundar! Trouble in bowling.. Washington Sundar! They say. He was promoted to the fifth position. After him, Rinku Singh and Hardik Pandya (Hardik Pandya) were sent to bat. Sanjay Manjrekar expressed his anger that this is not the right method.
'Keep aside fast bowling..practice how to play slow balls. Indian batsmen are unable to play slow balls and spinners. Sanjay Manjrekar analysed, especially the captain is having trouble with slow balls.
Would anyone drop the vice-captain from the team?: Krishnamachari Srikanth
The former Indian cricketer Krishnamachari Srikkanth blamed Akshar Patel for dropping him from the Indian team in the match against South Africa. He asked Gautam Gambhir, the head coach of the Indian cricket team, that the vice-captain was kept aside like this and experimented. I don't understand what Gautam Gambhir is doing. He is the one who selects the playing eleven. Going forward with such strategies is inevitable. Now we have come to a situation where we depend on the results of matches played by other teams. Gambhir and Suryakumar Yadav ( Suryakumar Yadav) spoke after the defeat. After removing Akshar Patel from the team, what else do they have to talk about?', said Srikanth.
- Oh no.. what happened to this team India?
Gambhir is the head coach. He has other coaching staff around him. Can't they all make simple decisions? Will anyone drop Akshar Patel who is the vice captain from the team? Earlier this was done in the case of Shubman Gill ( Shubman Gill). No one wants to be the vice-captain of the team in T20s anymore. Because it seems that only those who are vice-captains are being sent out of the team,' opined Srikanth.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- IPL.. RCB's big win over Lucknow As part of IPL 2026, Royal Challengers Bangalore won by 5 wickets in the match against Lucknow Supergiants at M.Chinnaswamy Stadium.
- Bad news for Mumbai Indians..? Rohit Sharma: Bad news for Mumbai Indians fans..!
- Not for players.. Umpires should be fined: MCC head MCC head Stewart is of the opinion that it is not right to penalize the captains if the match is delayed due to slow over rate. Advised to impose on umpires.
- Dhoni's instructions behind Noor's super spell: CSK bowling coach Even if Dhoni doesn't get on the field, he takes the lead in inspiring his teammates. Noor, who performed brilliantly against Kolkata, also gave key pointers.
- I still have those remnants in my body: Kumar Sangakkara Kumar Sangakkara recently recalled the terrorist attack in 2009 on his team that went on a tour to Pakistan.
- Latest update on Rohit Sharma's injury..! An update on Rohit Sharma's injury. It is known that he pulled out in the middle of the batting against RCB due to muscle strain.
- Update on Mayank.. Fine for Rahane.. Players with black ribbons CSK's amazing victory over KKR in Chepauk.. Kolkata captain fined.. Here are the highlights of IPL with an update on Lucknow star pacer Mayank Yadav..
- No excuses.. Must improve including me: Ruthuraj Chennai Super Kings, who won against Kolkata Knight Riders, still need to work on one thing. The team's captain Ruthuraj Gaikwad also revealed the same thing.
- Chennai.. struck again. Chennai Super Kings, who started the IPL-19 poorly with a hat-trick of defeats, made a late start. CSK, who defeated Delhi Capitals in the last match, won against Kolkata Knight Riders on Tuesday.
- From the position of not even being able to buy a shoe.. After Sunrisers Hyderabad and Rajasthan Royals match yesterday, Praful Hinge and Saqib Hussain became stars overnight. These two ruled the defeat of the Royals with four wickets each. If Praful took four wickets in the beginning, Rajasthan would be in trouble.
- Ayush Adaraho.. The young shuttler has been impressing with his consistent performances for some time now. He has gained recognition in Indian badminton circles as an upcoming player with a bright future. His name is buzzing with his recent performance in the Asian Championships.
- Discussion on Surya's future Suryakumar Yadav's future has become questionable in the context of his poor performance with the bat, despite leading Team India to victory in the T20 World Cup as a captain. Vaibhav, who is playing brilliant innings for Rajasthan Royals in this IPL.. It seems that he will make his debut in international cricket through the tour of Ireland which will start on June 26.
- Abhishek and Deepti are the best players. Indian cricketers have shown their strength in 2026 Wisden Awards. Seven of the total 9 awards were given to Indian cricketers. Deepti Sharma, who played a key role in the Indian women's team winning the ODI World Cup, was selected as the best female cricketer.
- Vaisali is close to the title Vaishali, who is performing brilliantly in the Candidates Chess Tournament, is close to the title. If she wins the final round at the top, she will get a chance to compete for the world championship.
- News in Brief(3) Sri Lankan pacer Dilshan Madushanka has been selected for the Sunrisers Hyderabad team. Sunrisers announced on Tuesday that left-arm bowler Madushanka has been brought into the team to replace England pacer Brydon Carrs, who was ruled out for the season due to injury.
- Speed beyond Bolt Usain Bolt is a name that comes to mind when it comes to running. His decade of dominance in world athletics is history. He not only broke all the records that existed till then.