విరోష్‌ పెళ్లి సందడి.. స్టార్స్‌ ఫాలో అవుతోన్న అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్‌ తెలుసా..?

Eenadu icon
By Entertainment Team Updated : 06 Apr 2026 10:00 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా రష్మిక, విజయ్‌ దేవరకొండ (Rashmika Mandanna-Vijay Deverakonda) పెళ్లి సందడే కనిపిస్తోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వేదికగా వివాహ బంధంలో అడుగుపెట్టనున్న విరోష్‌ జంట.. నో ఫోన్ పాలసీని కఠినంగా అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ట్రెండ్‌ వీరితోనే మొదలైంది కాదు. ఈ వెడ్డింగ్ ప్రైవసీ అంశం విరుష్క వివాహవేళ ఎక్కువగా వైరల్ అయింది. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలూ ఇదే ఫాలో అయ్యారు. ఇంతకీ స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్‌ గురించి తెలుసా..?

వివాహాలకు వచ్చే అతిథులు తమ ఫోన్లను అప్పగించాలని, లేదంటే స్విచ్ఛాఫ్ చేయాలని వధూవరులు ముందుగానే కోరతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టడానికి లేదు. ముందువరుసలో కూర్చొని ఫోన్లలో ఆ వేడుకను క్లిక్‌మనిపించడాలు ఉండవు. వివాహానికి సంబంధించిన చిత్రాలను ఆ జంటే షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫొటోలు పంచుకోవడం ఉండదు. ఈ కాన్సెప్ట్‌నే అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్‌గా (Unplugged Weddings) చెప్తున్నారు. జీవితంలో ముఖ్యమైన వేడుకను ప్రైవేట్‌గా తనవారి మధ్య జరుపుకోవాలని పెళ్లికుమారుడు-పెళ్లి కుమార్తె భావించడమే ఇందుకు కారణం. ఆ ఉద్వేగ క్షణాలకు ఫోన్ లైట్లు ఒక అంతరాయంగా మారకూడదని జంటలు భావిస్తున్నాయని వెడ్డింగ్ ప్లానర్లు వివరిస్తున్నారు. మరోవైపు ఫొటోగ్రాఫర్లు అందమైన ఫొటోలను బంధించే క్రమంలో ఎలాంటి అవాంతరాలను ఇష్టపడటం లేదు. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక సంప్రదాయంగా మారిపోయింది.

ఈ వెడ్డింగ్ ప్రైవసీ ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది అనుష్క-విరాట్ కోహ్లీ వివాహం సమయంలోనే. వారిద్దరు 2017, డిసెంబర్ 11న ఇటలీ వేదికగా ఒక్కటయ్యారు. విరుష్క తమ ఫొటోలను షేర్ చేసేవరకు ఆ వివాహం ఎంతో రహస్యంగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు, 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణవీర్‌ కూడా నో ఫోన్ పాలసీని పాటించారు. అతిథులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని కూడా వారు కోరారు. ఇక, ప్రియాంక చోప్రా-నిక్ జోనస్, కత్రినాకైఫ్‌-విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌-రణ్‌బీర్ కపూర్ కూడా ఇలాంటి గోప్యతనే అనుసరించారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Feb 2026 00:06 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కుమారుడి కోసమే విరామం..: విక్రాంత్‌ మాస్సే బాలీవుడ్‌ నటుడు విక్రాంత్‌ 2024లో సినిమాలకు విరామం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
  • నటులంతా నటిస్తూనే చనిపోవాలని కోరుకుంటారు: మమ్ముట్టి మలయాళ అగ్రహీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ కలిసి సందడి చేయబోతున్న చిత్రం ‘పేట్రియాట్‌’.
  • బ్లాక్‌బస్టర్‌కు నీకంటే ఎవరూ అర్హులు కారు: సమంత కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో ‘డెకాయిట్‌’ సందడి కనిపిస్తోంది.
  • మరో వివాదంలో ‘ధురంధర్ 2’.. పాటపై కోర్టును ఆశ్రయించిన నిర్మాణ సంస్థ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోన్న రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ను వరుస కాపీరైట్‌ వివాదాలు వెంటాడుతున్నాయి.
  • ‘కాక్‌టెయిల్‌ 2’ గ్యాంగ్‌ను కలవండి! ‘ప్రేక్షకులారా.. ఇది కాస్త గందరగోళంగా అనిపించినా.. మా అందమైన ‘కాక్‌టెయిల్‌’ గ్యాంగ్‌ను ఓసారి కలవండి’ అని అంటోంది రష్మిక.
  • ‘పెద్ది’ రేసులోకి మరో నాయిక? రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలోని  ప్రత్యేకగీతాన్ని త్వరలోనే తెరకెక్కించ నున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు ఊపందుకున్నాయి.
  • అల్లు అర్జున్‌ చిత్రం... రాకా అల్లు అర్జున్‌ - అట్లీ కలయికలో రూపొందుతున్న సినిమాకి ‘రాకా’ అనే పేరుని ఖరారు చేశారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న భారతీయ ప్రతిష్ఠాత్మకమైన సినిమాల్లో ఇదొకటి. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయిక.
  • ప్రణాళిక ప్రకారమే అంతా ఎన్టీఆర్‌ కథానాయకుడిగా... ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా  ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోందని తెలిపింది నిర్మాణ సంస్థ.
  • పుట్టినరోజు ప్రత్యేకం అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘లెనిన్‌’ జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ని బుధవారం విడుదల చేసింది చిత్రబృందం.
  • ఉత్తమ నటుడు నాగచైతన్య ఉత్తమ నటుడిగా, ఉత్తమ నటిగా గద్దర్‌ పురస్కారాల్ని అందుకున్న కథానాయకుడు నాగచైతన్య, కథానాయిక రష్మిక ఇండియన్‌ నేషనల్‌ సినీ అకాడమీ (ఐ.ఎన్‌.సి.ఎ) పురస్కారాల్లోనూ విజేతలుగా నిలిచారు.
  • రికార్డు కొట్టిన షేర్‌ ఆయా షేర్‌... అంటూ నాని చేసిన సందడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ‘ది ప్యారడైజ్‌’లోని ఈ పాట విడుదల కాగానే మార్మోగిపోయింది.
  • సంక్షిప్త వార్తలు (4) టెలివిజన్‌లో మనం ఆస్వాదించిన భావోద్వేగాలు, డ్రామాని యాప్‌లోకి తీసుకు రావడమే తమ లక్ష్యం అనీ... ఋతురాగాలుతోపాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ధారావాహికలు, మరికొన్ని తెలుగు షోలను ‘చాయ్‌ షాట్స్‌’తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు శరత్‌చంద్ర.
  • ఆ థియేటర్లలో మా సినిమాలు ప్రదర్శించబోం: ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ పర్సంటేజీ విధానంపై సినిమా ప్రదర్శనల విషయంలో ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.
  • ‘డెకాయిట్‌’ ప్రమోషన్స్‌లో ‘ధురంధర్‌’ నటుడు.. నవ్వులే నవ్వులు ‘ధురంధర్‌’ నటుడు రాకేశ్‌ బేడీ ‘డెకాయిట్‌’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.
  • పవన్‌ కల్యాణ్‌ను కలిసిన బాబీ.. ఆ సినిమా కోసమేనా? పవన్‌ కల్యాణ్‌ను దర్శకుడు బాబీ కలిశారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు.
  • ‘ధురంధర్‌’ దర్శకుడికి బాంబే హైకోర్టులో ఊరట డైరెక్టర్‌ సంతోశ్‌కుమార్‌ చేసిన ఆరోపణలపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన ‘ధురంధర్‌’ దర్శకుడు ఆదిత్యధర్‌ (Aditya Dhar)కు స్వల్ప ఊరట దక్కింది.
  • శతాబ్దాల నాటి రహస్య అన్వేషణ కోసం.. వారణాసి కథ ఇదేనా? మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ ట్రైమ్‌ ట్రావెల్‌ మూవీ ‘వారణాసి’.
  • అంచనాలు పెంచిన టైటిల్‌ పోస్టర్‌.. ‘రాకా’ అంటే ఏంటి? అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాకి ‘రాకా’ అనే టైటిల్‌ ఖరారైంది. మరి దానర్థం ఏంటి..?
  • ‘జన నాయగన్‌’పై ప్రశ్న.. రజనీకాంత్‌ ఏమన్నారంటే? విజయ్‌ హీరోగా నటించిన సినిమా ‘జన నాయగన్‌’. ఈ సినిమా విడుదల ఆలస్యంకావడంపై రజనీకాంత్‌కు ప్రశ్న ఎదురైంది.
  • రణ్‌వీర్‌ నా లక్కీఛార్మ్‌.. మృణాల్‌ ఠాకూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ తన లక్కీ ఛార్మ్‌ అని మృణాల్‌ ఠాకూర్‌ అన్నారు.