ఆలోచిద్దాం... స్నేహం చేద్దాం!
ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనమంతా ఒక్కటే... సోదరీమణులమే. ఒకరికొకరం సాయం చేసుకోవాలి. సమస్యల పట్ల అవగాహన పెంచుకుని, పరిష్కరించుకోవాలి. సాధికారత దిశగా అడుగులేయాలి.

- A
- A+
- A++

ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనమంతా ఒక్కటే... సోదరీమణులమే. ఒకరికొకరం సాయం చేసుకోవాలి. సమస్యల పట్ల అవగాహన పెంచుకుని, పరిష్కరించుకోవాలి. సాధికారత దిశగా అడుగులేయాలి. విరాళాలు సేకరించడం, సేవ చేయడం... వంటి కార్యక్రమాల్లో భాగం కావాలి అంటోంది ‘వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్’. అందుకోసం ఏటా ఒక థీమ్‌తో ‘వరల్డ్ థింకింగ్ డే’ను ఫిబ్రవరి 22న జరుపుతోంది. అలా ఈ ఏడాది ‘మన స్నేహం’ అన్నదాన్ని థీమ్‌గా ఎంపిక చేసుకుంది.
కాలచక్రం బుల్లెట్ రైలుతో పోటీపడుతోంది. రెప్ప మూసి తెరిచేలోగా రోజులు కరిగిపోతున్నాయి. ఎంతైనా ఏఐ ప్రపంచం కదా. అప్‌డేట్ కాకపోతే వెనకబడిపోతాం. ఇది సాంకేతికతకే కాదు. స్నేహబంధానికీ వర్తిస్తుంది. లేదంటే నేస్తాల్ని పోగొట్టుకుంటాం.
మేహన, మేఘన ప్రాణ స్నేహితులు. చదువు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు... ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ. భౌతికంగా దూరంగా ఉన్నా ఆరునెలలకో ఏడాదికో కలిసినప్పుడు అదే ఆప్యాయత. కానీ ఈమధ్యే... ఏదో మార్పు. కలిసినప్పుడూ ఎవరి ఆలోచనలు వాళ్లవి. మాట్లాడుకున్నా పెదాలపై పూతలే... ఆనాటి స్నేహంలో ఎక్కడో అపశృతి...
‘ఒక వీడ్కోలు... కొత్త హలోకి దారితీస్తుంద’ని ‘ది అల్కెమిస్ట్’ రచయిత పాలో కొయిలో అన్నట్లు పాత స్నేహం కీబోర్డు ఫోన్‌లా బోరుకొట్టి ఉండొచ్చు... కొత్త పరిచయాలు స్మార్ట్‌ఫోన్‌లా ఆకర్షిస్తుండొచ్చు. అలాగని దీన్ని తప్పుపట్టలేం. ఎందుకంటే కొన్ని స్నేహాలు కాలంతోపాటు వెనక్కెళ్లిపోతాయి. ఇది సహజం... పరిణామ సూత్రం. సమయం, ప్రాధాన్యతలు, ఆసక్తులు, విలువలు వేరయినప్పుడు బంధాలూ వేరవుతాయి. ఒక దశకే పరిమితమై అక్కడితో ఆగిపోతాయి. అలాగని కొత్త పరిచయాల్నైనా స్నేహంగా మలచుకోగలుగుతున్నామా అన్నది... ఆలోచించాల్సిందే!

ఈమధ్య స్నేహితులనేకాదు, అక్కచెల్లెళ్లు, బంధువుల మధ్యా ఏదో అడ్డగీత. కనిపించని శూన్యం... స్పందన లోపించిన హృదయాలు, భావం లేని మాటలు... ఎందుకిలా? ఏం కొన్నారు, ఎలా జీవిస్తున్నాం... వీటిని మించిన మాటల్లేవా, తీపి జ్ఞాపకాలెటుపోయాయి? ఒక్కసారి టైమ్ మెషీనెక్కి వెనక్కెళితే ఎంత బాగుంటుందో... అని ఏ ఒక్కరికీ అనిపించడం లేదెందుకని? వీళ్లే కాదు, మిలీనియల్స్, జెన్ జీల్లోనూ ఇదే ధోరణి. హాయ్, హలో, వాట్సప్, వావ్‌లతోనే సరి.
‘మనసు భారాన్ని పంచుకోవడానికి ఇద్దరు స్నేహితులైనా మిగిలున్నారా’ అనుకునే రోజొకటి వస్తుంది అన్నదాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అందుకే బాగా థింక్ చేయండి. అలాగని ఆలోచిస్తూనే ఉండిపోకండి. నెట్‌వర్క్ పెంచుకోండి. అందరితో స్నేహం చేయండి సంతోషంగా ఉండండి అంటున్నారు గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్ సభ్యులు.
‘ఎంత సంపాదించాం అన్నది కాదు, ఫేస్‌బుక్‌లోనో ఇన్‌స్టాలోనో ఎంతమంది ఫాలో అవుతున్నారనేదీ కాదు. మనకంటూ కష్టం వస్తే ఒక్క క్షణం వెనకాముందూ ఆలోచించకుండా పరుగెత్తుకొచ్చే ప్రాణ స్నేహితులు ఒక్కరైనా ఉండాలి’ అని అనుకుంటాం కదా. మరి మనమూ అలాగే ఉంటున్నామా అన్నదీ ఆలోచించండి. అలాంటి స్నేహితులు మీకున్నా మీరూ అలాగే ఉన్నా గుండెలమీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోవచ్చు... అది ఆరోగ్యాన్నీ ఆయుష్షునీ పెంచుతుంది. అలా లేరనుకుంటే ఈ రోజునుంచే జీవన శైలిని మార్చుకోవాల్సిందే. లేకపోతే ఏదోక దశలో ఒంటరితనం వెతుక్కుంటూ వస్తుంది.
అందుకే మరి... ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని థింక్ చేద్దాం! సరిహద్దులూ సంస్కృతులతో సంబంధం లేకుండా చేయీ చేయీ కలుపుదాం. స్నేహంగా ఉందాం... స్నేహాన్ని పంచుదాం... సమస్యలకీ స్పందిద్దాం!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్ ప్రతినిధులు 1926 నాటి సమావేశంలో తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక రోజు ఉండాలనుకున్నారు. దానికే ‘థింకింగ్ డే’గా పేరు పెట్టడంతోపాటు బాయ్ స్కౌట్ ఉద్యమ స్థాపకులైన లార్డ్ పావెల్, ఆయన భార్య వరల్డ్ చీఫ్ గైడ్ ఒలావ్ పావెల్ ఇద్దరి పుట్టినరోజూ అయిన ఫిబ్రవరి 22ను ఎంపికచేశారు. అలా మొదలైన ఈ థింకింగ్ డేకి నేటికి వందేళ్లు. ఈ గైడ్స్ అండ్ స్కౌట్స్ సంస్థకు అలా మొత్తం ఐదు కేంద్రాలు ఉండగా అందులో ఒకటి మనదేశంలో ‘సంగం’ పేరుతో పుణెలో ఉంది.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Let's think... let's be friends!
No matter where we are in the world we are all one... sisters. We should help each other. Raise awareness of problems and solve them. Step towards empowerment.

- A
- A+
- A++

No matter where in the world we are all one... sisters. We should help each other. Raise awareness of problems and solve them. Step towards empowerment. "World Association of Girl Guides and Girl Scouts" says to be a part of activities like collecting donations, serving... For that, 'World Thinking Day' is celebrated on February 22 with a theme every year. So this year it has chosen 'Mana Sneham' as its theme.
Kalachakram is competing with bullet train. The days are melting away in the blink of an eye. It's a world of AI. If we don't update, we will be left behind. It's not just technology. The same applies to friendship. Otherwise we will lose our friends.
Mehana and Meghana are best friends. Study, marriage, job, children... they are busy in their lives. Even if you are physically apart, it is the same affection when you meet for six months or a year. But recently... something has changed. Everyone's thoughts are theirs when they meet. Even if you talk, there are sores on the lips... Somewhere in the friendship of the day...
'A farewell... leads to a new hello' As the author of 'The Alchemist' Paolo Coilo said, the old friendship may be as boring as a keyboard phone... New acquaintances may attract like a smartphone. It cannot be faulted. Because some friendships fade away with time. It's natural... the principle of evolution. When time, priorities, interests and values diverge, relationships diverge. They are limited to one stage and stop there. So, whether we are able to make new acquaintances into friendship... we have to think!

There is something between friends, sisters and relatives. The invisible void... unresponsive hearts, senseless words... why? What have we bought, how are we living... Are there no words beyond these, sweet memories? Why doesn't anyone feel how good it would be to go back to the time machine? Not only them, Millennials and Gen Z also have the same trend. Hi, Hello, Whatsapp and Wow are fine.
Nobody thinks about the day when they think, 'Do you have two friends left to share the burden of your mind?' So think carefully. Don't keep thinking like that. Grow a network. Make friends with everyone and be happy, say members of Girl Guides and Girl Scouts.
'It's not about how much you earn, it's not about how many people follow you on Facebook or Instagram. We think that we should have at least one best friend who rushes without thinking back for a moment when we are in trouble. And think if we are the same. Whether you have such friends or not, you can sleep comfortably on your heart... it increases health and longevity. If you don't want that, you have to change your lifestyle from today. Otherwise, at some stage, loneliness will come.
That's why... let's take this matter seriously and think! Let's join hands regardless of borders and cultures. Let's be friends... let's share friendship... Let's respond to problems!
Representatives of Girl Guides and Girl Scouts from around the world wanted to stay for one day at the 1926 convention to advance their movement. It was named as 'Thinking Day' and February 22 was chosen as the birthday of Lord Powell, the founder of the Boy Scout movement, and his wife World Chief Guide Olav Powell. It is one hundred years since this Thinking Day started like that. This Guides and Scouts organization has a total of five centers and one of them is in Pune named as 'Sangam' in our country. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :