అమ్మకి కావాలి రెండేళ్లు..!

దగ్గర వయసున్న అంటే... రెండేళ్లలోపు వయసు తేడా ఉన్న అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఒకే రకమైన అవుట్‌ఫిట్స్‌ ధరించి కనిపిస్తే... అరే చూడ్డానికి భలే ముద్దుగా ఉన్నారే అనుకుంటాం.

Eenadu icon
By Vasundhara Team Published : 22 Feb 2026 02:42 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

గ్గర వయసున్న అంటే... రెండేళ్లలోపు వయసు తేడా ఉన్న అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఒకే రకమైన అవుట్‌ఫిట్స్‌ ధరించి కనిపిస్తే... అరే చూడ్డానికి భలే ముద్దుగా ఉన్నారే అనుకుంటాం. అంతేనా ఒకరికొకరు తోడుంటారు, కలిసి పెరుగుతారు, ఇద్దరి చదువులు ఒకేసారి పూర్తైపోతాయి. అప్పుడు నీకు బోలెడు తీరిక దొరుకుతుంది. అంటూ ఇంట్లో పెద్దవాళ్ల సలహాలూ చాలానే వినిపిస్తాయి. దీన్నే ‘టూ అండర్‌ టూ’ పద్ధతిగా పిలుస్తున్నారు నిపుణులు. చూడ్డానికీ, వినడానికీ ఇది భాగానే ఉన్నప్పటికీ తల్లికి మాత్రం అంతమంచిది కాదంటున్నారు.

మొదటికాన్పు అయిన తరవాత మహిళలు శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి దాదాపు రెండేళ్లు సమయం పడుతుందట. అంతేకాదు, వాళ్ల కటి భాగం కోలుకోవడానికీ, హార్మోన్లు తిరిగి సాధారణ స్థితికి రావడానికీ, నిద్రవేళలు గాడిలో పడటానికీ కొంతమందికి రెండు నుంచి ఐదేళ్లు కూడా పడుతోందని చెబుతున్నాయి అధ్యయనాలు. అందుకే రెండేళ్లలోపు ఇద్దరు పిల్లలున్న అమ్మలు నిద్రలేమి, శారీరక శ్రమ పెరిగి తొందరగా అలసిపోతున్నారని చెబుతున్నారు. కొందరిలో కార్టిసాల్‌ ఉత్పత్తి ఎక్కువై ఒత్తిడి పెరుగుతుందట. బరువు పెరగడంతోపాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

ఇలా మొదటి శిశువు పుట్టిన పద్దెనిమిది నెలలలోపు మళ్లీ ప్రెగ్నెంట్‌ అయితే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో, నెలలు నిండకుండా పుట్టే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ ఒక నివేదికలో వెల్లడించింది. అందుకే మొదటికాన్పు తరవాత రెండో బిడ్డను ప్లాన్‌ చేసుకుంటే కనీసం రెండేళ్ల వ్యవధి పాటించమంటోంది. అప్పుడే తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Amma needs two years..!

Close age means... If we see sisters and brothers with age difference of less than two years wearing the same outfits... Oh, we think they are cute to look at.

Eenadu icon
By Vasundhara Team Published : 22 Feb 2026 02:42 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Det's age means... If sisters and brothers with age difference of less than two years are seen wearing the same outfits... we think they are cute to look at. Even so, they support each other, grow up together, and both of them complete their studies at the same time. Then you will have a lot of fun. The advice of the elders in the house is heard a lot. Experts call this as 'two under two' method. Although it is good to see and hear, it is not so good for the mother.

After giving birth for the first time, it takes about two years for women to recover physically and mentally. Moreover, studies show that it takes some people two to five years for their pelvis to recover, hormones to return to normal, and sleep patterns to fall into a groove. That's why it is said that mothers with two children under the age of two are getting tired early due to lack of sleep and increased physical activity. In some, cortisol production increases and stress increases. Weight gain and immunity decreases.

Thus, if the first child is pregnant again within eighteen months of birth, there are chances that the unborn child will be born with low weight and premature birth, WHO revealed in a report. That's why if you plan to have a second child after the first birth, you should wait at least two years. Experts say that only mother and child will be healthy.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :