సరస్వతి కాళికాదేవిలా మారితే...!

- A
- A+
- A++

ప్రతి అమ్మాయి ఒక సరస్వతిలా ఉండదు. అవసరమైతే కాళికలా కూడా మారుతుందంటూ తనదైన శైలిలో హెచ్చరించింది ఓ యువతి. ఆమె ఎందుకలా చెప్పింది? అసలు సరస్వతి ఎవరు? కాళిలా మారి కన్నెర్రజేయాల్సిన అవసరం ఎవరికి, ఎందుకొచ్చిందో తెలియాలంటే ‘సరస్వతి’ చూడాల్సిందే. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి దోస డైరీస్ పతాకంపై నిర్మించారు. ఈటీవీ విన్ సమర్పిస్తోంది. ప్రియమణి, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. హై కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని డిజిటల్ వేదికల్లో కథానాయకుడు నాని, శనివారం నిర్వహించిన వేడుకలో దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ ‘‘మహిళా ప్రధానమైన సినిమా అని సందేశం ఇచ్చినట్టుగా ఉండదు ఈ చిత్రం. థ్రిల్లింగ్‌గా సాగుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. తెలుగులో నటిగా నన్ను పునః పరిచయం చేసి రెండో జీవితాన్నిచ్చారు గోపీచంద్ మలినేని. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదిగేందుకు అందరూ మరింతగా సహకారం అందించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. వేదికపై వరలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘‘నేను తీసిన ‘క్రాక్’లో జయమ్మ పాత్రని పోషించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని చూసి మా ప్రకాశం జిల్లా వాసులంతా షాక్ అయ్యారు. జయమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనుకున్నారు. సావిత్రి, శారదలా మంచి నటి వరలక్ష్మి. ఆమె ‘సరస్వతి’ కథని చెప్పిన విధానంతో నేను ఆశ్చర్యపోయా. థియేటర్లో ఈ సినిమా చూసి అందరూ షాక్ అవుతారు. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ‘‘నాణ్యతలో రాజీపడకుండానే వేగంగా ఈ సినిమాని పూర్తి చేశారు వరలక్ష్మి. మంచి నటులు, స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. గీత ఆర్ట్స్ విడుదల చేస్తున్న ఈ సినిమాతో దర్శకురాలిగానూ వరలక్ష్మికి మంచి పేరొస్తుంది’’ అన్నారు. ఈటీవీ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ ‘‘ఒక లక్ష్మి... సరస్వతిని ఎలా చూపిస్తుందో అలాంటి సినిమానే ఇది. మా సంస్థ నుంచి దర్శకులుగా పరిచయమైనవాళ్లలో వరలక్ష్మి తొమ్మిదో వ్యక్తి. ఈ సినిమాతో దర్శకురాలిగా కూడా బిజీ అవుతారని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పూజా శరత్‌కుమార్‌తోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అక్షయ్ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి: మృణాల్ ఠాకూర్ శరీరాకృతి ఎలా ఉన్నప్పటికీ.. ముందుగా మనల్ని మనం గౌరవించుకుంటే ఇతరులు కూడా విలువిస్తారంటోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.
- వందశాతం థియేటర్ అనుభవాన్నిచ్చే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ‘‘థియేటర్ అనుభవమే అసలు సిసలైన సినిమా వినోదం. వేరే ఎక్కడ చూసినా అంత ఆనందం రాదు. థియేటర్‌నే లక్ష్యంగా చేసుకుని మొదలుపెట్టిన ఈ సినిమాని అక్కడే విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ నటుడు శివాజీ.
- కథల ఎంపికే కారణమైనా కానీ...! చిన్న సినిమాలతో మెరుస్తూ... విజయానికి కేరాఫ్‌గా నిలుస్తున్న కథానాయిక నయన్ సారిక. ‘గం గం గణేశా’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ‘క’, ‘ఆయ్’ సినిమాలతో ప్రేక్షకులకు మరింతగా చేరువైంది.
- మణిరత్నం సినిమాలో సాయిపల్లవి? అటు హిందీలోనూ... ఇటు దక్షిణాదిలోనూ అవకాశాల్ని అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు కథానాయిక సాయిపల్లవి. ప్రస్తుతం నటిస్తున్నవే కాకుండా,
- జడలు రో.. హడలు రో ‘‘సవారీకి దొరుకు బిడ్డా.. శవాలే లేస్తాయ్ బిడ్డా.. జడలు రో.. హడలు రో’’ అంటూ సవాల్ విసురుతున్నాడు జడల్. మరి అతనెవరు.. తను సవాల్ చేస్తోంది ఎవరినీ తెలియాలంటే ‘ది ప్యారడైజ్’ చూడాల్సిందే.
- ‘ది కేరళ స్టోరీ 2’ని ముందు మాకు చూపించండి ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ 2’ సినిమా ట్రైలర్‌లో కేరళను తప్పుగా చూపించారని, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాలున్నాయని సామాజికమాధ్యమాల వేదికగా చర్చానీయాంశమైంది.
- సంక్షిప్త వార్తలు (4) ‘‘బ్యాండ్ మేళం’ చిత్ర కథలోని సంఘర్షణ చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ అందర్నీ కట్టిపడేస్తుంది’’ అంటున్నారు కోన వెంకట్.
English Translation
If Saraswati turned like Kalikadevi...!

- A
- A+
- A++

A girl is not like a Saraswati. A young woman warned in her own style that if necessary, she will become like Kalika. Why did she say that? Who is Saraswati? You have to watch 'Saraswati' to know who and why it is necessary to become like Kali. Popular actress Varalakshmi Sarathkumar is playing a key role and directed by herself. Produced under the banner of Dosa Diaries along with his sister Pooja Sarath Kumar. Presented by ETV WIN. Priyamani, Prakashraj and others played key roles. Made as a high concept thriller, the film is hitting the screens on March 6. On this occasion, the trailer of this movie was released on digital platforms by protagonist Nani and director Gopichand Malineni in a ceremony held on Saturday. On this occasion, Varalakshmi Sarathkumar said, "This film does not give a message that it is a woman-led film. It is thrilling and entertains the audience. Gopichand Malineni reintroduced me as an actress in Telugu and gave me a second life. He is happy to come to this ceremony. Everyone wants to contribute more to the growth of women in the film industry," he said. Varalakshmi was emotional on stage. Gopichand Malineni said, "All the people of our Prakasam district were shocked to see Varalakshmi Sarathkumar who played the role of Jayamma in my film 'Crack'. They thought Jayamma would be like this. Varalakshmi is a good actress like Savitri and Saradala. I was amazed by the way she told the story of 'Saraswati'. Everyone will be shocked to see this movie in the theater. This is a movie that every parent should watch," he said. Producer Bunny Vas said, "Varalakshmi has completed this film quickly without compromising on quality. Made with good actors and screenplay. Varalakshmi will be well known as a director with this film released by Geetha Arts. ETV Business Head Saikrishna said, "This is such a movie that shows one Lakshmi... Saraswati. Varalakshmi is the ninth person to be introduced as a director from our company. I want you to be busy as a director with this film. Producer Pooja Sarathkumar and other film crew participated in this program.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Akshay's words gave me courage: Mrinal Thakur Regardless of body type. Heroine Mrinal Thakur says that if we respect ourselves first, others will also value us. "The theater experience is the real entertainment of cinema. You won't get such joy anywhere else. I am happy that this film which started targeting theater is being released there," said veteran actor Shivaji.
- The choice of stories is the reason but... Nayan Sarika, the heroine who shines with short films... is standing as a carafe of success. She was introduced to the Telugu screen with 'Gam Gam Ganesha' and got closer to the audience with the films 'Ka' and 'Ai'.
- Sai Pallavi in Mani Ratnam's film? Heroine Sai Pallavi is busy getting opportunities both in Hindi and South. Apart from currently acting,
- Hadalu Ro..Hadalu Ro Jadal is throwing a challenge saying "Saviari Doruku Bidda.. Shawale Lestayi Bidda.. Jadalu Ro.. Hadalu Ro". And who is he.. He is challenging, to know who he is, you have to watch 'The Paradise'.
- Show us 'The Kerala Story 2' first. The recently released trailer of the movie 'The Kerala Story 2' has been the subject of discussion on the social media platform saying that Kerala has been misrepresented and there are elements that lead to communal tensions.
- Brief News (4) The conflict in the story of 'Band Melam' is very new. Kona Venkat says that the climax binds everyone.