అసలు సవాలు ఇప్పుడు..

Eenadu icon
By Sports News Desk Updated : 22 Feb 2026 11:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

గ్రూప్‌ దశలో కాస్త సవాలు ఎదురైనా అంతిమంగా టీమ్‌ఇండియాదే పైచేయి. పాకిస్థాన్‌ సహా ఏ జట్టూ భారత్‌ను అడ్డుకోలేకపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అజేయంగా సూపర్‌-8లోకి అడుగు పెట్టింది. కానీ ఇక్కడి నుంచి మాత్రం ప్రయాణం అంత సాఫీగా ఉండకపోవచ్చు. ఏ ప్రత్యర్థితోనైనా పోరు కఠినమే. అందులోనూ ఈ దశలో తొలి మ్యాచ్‌ దక్షిణాఫ్రికాతో. గ్రూప్‌ దశలో భారత్‌ను మించి ఆధిపత్యం చలాయించిన జట్టది. కాబట్టి సూపర్‌-8లో శుభారంభం చేయాలంటే సూర్యసేన తమ ఆటను టాప్‌ గేర్‌లోకి తీసుకెళ్లాల్సిందే. 

టీ20ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌కు అసలైన సవాల్‌! సూపర్‌ ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను ఆదివారం సూపర్‌-8 మ్యాచ్‌లో ఢీకొనబోతోంది టీమ్‌ఇండియా. భారత్‌ లాగే గ్రూప్‌ దశను నాలుగు విజయాలతో ముగించింది సఫారీ జట్టు. రెండు నెలల ముందు భారత్‌లో టీ20 సిరీస్‌ ఆడడం ఆ జట్టుకు అతి పెద్ద సానుకూలత. ఆ సిరీస్‌లో 1-3తో ఓడినప్పటికీ.. ఆతిథ్య జట్టుకు గట్టి పోటీనే ఇచ్చింది దక్షిణాఫ్రికా. ఆ సిరీస్‌ అనుభవంతోనే టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో ఆ జట్టు అదరగొట్టింది. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచినప్పటికీ.. భారత్‌ ఆట సాధికారికంగా సాగలేదు. నమీబియాతో మినహా మ్యాచ్‌ల్లో తడబాటు తప్పలేదు. జోరుమీదున్న సఫారీలపై నెగ్గాలంటే భారత్‌ తన అత్యుత్తమ ఆటను ఆడాల్సిందే.

అభిషేక్‌ ఇప్పుడైనా?:ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన అభిషేక్‌ శర్మ.. గ్రూప్‌ దశ అంతా అసలు ఖాతానే తెరవడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అనారోగ్యంతో నమీబియా మ్యాచ్‌ ఆడని అతను.. మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌటయ్యాడు. మరి సూపర్‌-8 నుంచి అయినా అతను అసలు ఆటను బయటికి తీస్తాడేమో అని అభిమానులు ఆశతో ఉన్నారు. అతడి ఓపెనింగ్‌ భాగస్వామి ఇషాన్‌ కిషన్‌ మాత్రం జోరుమీదున్నాడు. పాక్‌పై విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన అతడిపై మంచి అంచనాలున్నాయి. మూడో నంబర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ.. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికీ.. స్ట్రైక్‌ రేట్‌ అతడికి సమస్యగా మారింది. అతను మరింత ధాటిగా ఆడాల్సిన అవసరముంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ అమెరికాపై విలువైన ఇన్నింగ్స్‌ ఆడాక ఇబ్బంది పడుతున్నాడు. తన సహజ శైలిలో చెలరేగలేకపోతున్నాడు. హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె లయలోనే ఉన్నారు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టింది వీళ్లే. రింకుకు పెద్దగా అవకాశాలు రాలేదు. అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలమైనప్పటికీ.. ప్రధానంగా పేసర్ల మీదే ఆశలు పెట్టుకుంది దక్షిణాఫ్రికా. రబాడ, యాన్సెన్, ఎంగిడి, బోష్‌లతో ఆ జట్టు పేస్‌ విభాగం ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. స్పిన్‌లో ఆ జట్టు బలహీనమే. కేశవ్‌ మహరాజ్‌ భారత బ్యాటర్లను అడ్డుకోగలడా అన్నది సందేహమే. అతడికి కెప్టెన్‌ మార్‌క్రమ్‌ పార్ట్‌టైం స్పిన్‌తో సహకారం అందిస్తాడు.

ప్రమాదకర లైనప్‌:దక్షిణాఫ్రికాకు ఎంతో లోతైన, ప్రమాదకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. ఆ జట్టు ప్రధాన బ్యాటర్లందరూ ఫామ్‌లో ఉన్నారు. మార్‌క్రమ్, డికాక్‌లతో స్థిరమైన ఓపెనర్లు ఆ జట్టు సొంతం. తర్వాత రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్‌లతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు తిరుగులేదు. 7, 8 స్థానాల్లో ఆడే బోష్, యాన్సెన్‌ సైతం బ్యాటుతో చెలరేగగలరు. డికాక్, బ్రెవిస్‌ లాంటి బ్యాటర్లను త్వరగా పెవిలియన్‌ చేర్చకపోతే కష్టమే. గ్రూప్‌ దశలో ఉత్తమ ప్రదర్శన చేసిన భారత బౌలర్లు.. ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి. కొత్త బంతితో అదరగొడుతున్న బుమ్రా.. టాప్‌ఆర్డర్‌కు కళ్లెం వేయాల్సిన అవసరముంది. పేస్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్, దూబె కొన్ని ఓవర్లు పంచుకుంటారు. నిలకడగా రాణిస్తున్న అక్షర్, వరుణ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అహ్మదాబాద్‌లో.. బలమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ విభాగానికి సవాలు విసురుతారేమో చూడాలి. పిచ్‌ను బట్టి మూడో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ను లేదా రెండో పేసర్‌గా అర్ష్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకుంటారు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. నెదర్లాండ్స్‌తో భారత్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ బంతి బాగా తిరిగింది. డచ్‌ స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్‌ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అనంతరం వరుణ్, అక్షర్‌ అదరగొట్టారు. కొంచెం మందకొడిగా ఉన్న ఈ పిచ్‌పై బంతి బ్యాట్‌ మీదికి రాక బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆదివారం కూడా పిచ్‌ అలాగే ఉండొచ్చని అంచనా. కానీ రెండు జట్లకూ బలమైన బ్యాటింగ్‌ విభాగాలున్న నేపథ్యంలో స్పిన్నర్లను కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే పెద్ద స్కోర్లే నమోదయ్యే అవకాశాలున్నాయి.

దక్షిణాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌ ముంగిట టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు గట్టి దెబ్బ తాకింది. శనివారం ప్రాక్టీస్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్య కొట్టిన షాట్‌ కాలికి బలంగా తాకడంతో అతను బాధతో విలవిలలాడుతూ కింద పడుకున్నాడు. తర్వాత లేచి నడిచే ప్రయత్నం చేసినా.. అడుగులు తడబడ్డాయి. గాయం తీవ్రత ఎంత అన్నది తెలియరాలేదు. టోర్నీలో అతను ఒకే మ్యాచ్‌ ఆడాడు. అమెరికాతో ఆరంభ పోరుకు జ్వరం వల్ల బుమ్రా అందుబాటులో లేకపోవడంతో సిరాజ్‌ తుది జట్టులో ఆడాడు. 3 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హర్షిత్‌ రాణా టోర్నీ ఆరంభానికి ఒక్క రోజు ముందు గాయపడితే.. అతడి స్థానంలో సిరాజ్‌ జట్టులోకి వచ్చాడు.

భారత్‌:అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), హార్దిక్, దూబె, రింకు, అక్షర్, కుల్‌దీప్‌/అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్‌; దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బోష్, యాన్సెన్, కేశవ్, రబాడ, ఎంగిడి. 

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడిన మ్యాచ్‌లు. అయిదుసార్లు నెగ్గి, రెండు మ్యాచ్‌లు ఓడింది.

భారత్, దక్షిణాఫ్రికా తలపడ్డ టీ20లు. 21 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలవగా.. 13 సార్లు దక్షిణాఫ్రికా నెగ్గింది. ఒక మ్యాచ్‌ టై అయింది. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 02:34 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జూన్‌ 14న పాక్‌తో భారత్‌ ఢీ జూన్‌ 14న పాకిస్థాన్‌తో పోరుతో భారత జట్టు మహిళల టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ వేటను ఆరంభించనుంది. ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీ షెడ్యూలును ఐసీసీ.. మంగళవారం ప్రకటించింది.
  • సెమీస్‌లో ఇంగ్లాండ్‌ ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. సూపర్‌ 8లో వరుసగా రెండో విజయంతో టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కెప్టెన్‌ బ్రూక్‌ సూపర్‌ శతకం సాధించిన వేళ.. ఆసక్తికర పోరులో పాకిస్థాన్‌ను ఇంగ్లాండ్‌ మట్టికరిపించింది.
  • సచిన్‌ను ఔటివ్వడం తప్పే అది భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌. ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేసన్‌ గిలెస్పీ బంతి సచిన్‌ తెందుల్కర్‌ ప్యాడ్లకు చాలా ఎత్తులో తగిలింది. గిలెస్పీ, అతడి సహచరులు గట్టిగా అప్పీలు చేయడంతో దిగ్గజ అంపైర్‌ స్టీవ్‌ బక్నర్‌.. సచిన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు.
  • జట్టును వీడిన రింకు! టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకు సింగ్‌ గురువారం జింబాబ్వేతో టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 మ్యాచ్‌కు అనుమానంగా మారాడు. కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా అతడు జట్టును వీడినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
  • భారత్‌కే పంచ్‌ ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌ సాధించిన ఉత్సాహంలో వన్డేల్లోనూ బోణీ కొట్టాలనుకున్న భారత మహిళల జట్టుకు పంచ్‌! మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన హర్మన్‌ప్రీత్‌ బృందం..
  • బోణీ ఎవరిదో? టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర సమరానికి వేళైంది. సూపర్‌-8లో ఇంకా గెలుపు ఖాతా తెరవని శ్రీలంక, న్యూజిలాండ్‌ బుధవారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ పోరులో గెలవడం శ్రీలంకకు తప్పనిసరి.
  • జమ్మూకశ్మీర్‌ 284/2 కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్‌ అదరగొడుతోంది. మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు జమ్మూకశ్మీర్‌ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది.
  • సంక్షిప్త వార్తలు (2) అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ (ఇంగ్లాండ్‌) ఆ జట్టుకు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ జట్టు సూపర్‌-8కు అర్హత సాధించకపోవడంతో అతడు కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు.
  • అక్షర్‌ ఆడుతున్నట్లే.. దక్షిణాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌కు ఫామ్‌లో ఉన్న స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను పక్కన పెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు యాజమాన్యం.. జింబాబ్వేతో తర్వాతి పోరుకు అతణ్ని తుది జట్టులోకి తీసుకోవడం లాంఛనంగా కనిపిస్తోంది.

English Translation

The real challenge is now..

Eenadu icon
By Sports News Desk Updated : 22 Feb 2026 11:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

In the end, Team India faced some challenges in the group stage. the upper hand No team including Pakistan could stop India. The defending champion enters the Super-8s unbeaten. But the journey may not be so smooth from here. The fight against any opponent is tough. The first match at this stage is against South Africa. The team that dominated India in the group stage. So Suryasena will have to take their game into top gear to make a good start in the Super-8. 

Team India is going to face South Africa, who are in super form, in the Super-8 match on Sunday. Like India, the Safari team finished the group stage with four wins. Playing the T20 series in India two months ago is the biggest positive for the team. Despite losing the series by 1-3, South Africa gave a tough competition to the host team. With the experience of that series, the team won the T20 World Cup group stage. Despite being undefeated in the group stage, India's game did not go well. Except against Namibia, there was no hesitation in the matches. India will have to play their best game if they want to win against the strong Safaris.

Abhishek now?:Abhishek Sharma, who entered the T20 World Cup with many expectations. He did not play the Namibia match due to illness. And the fans are hoping that even from Super-8 he will bring out the original game. His opening partner Ishan Kishan is in full swing. There are good expectations on him who won the team with a destructive innings against Pakistan. The number three batsman Tilak Verma.. Although he is playing remarkable innings.. strike rate has become a problem for him. He needs to play harder. Captain Suryakumar is struggling after playing a valuable innings against America. He is unable to perform in his natural style. Hardik Pandya and Shivam Dubey are in rhythm. It was they who scored a huge score for the team in the last league match. Rinku did not get many opportunities. Although Ahmedabad's pitch is favorable for spin, South Africa is mainly hoping for pacers. With Rabada, Jansen, Engidi and Bosh, the team's pace department looks much better. The team is weak in spin. It is doubtful whether Keshav Maharaj can stop the Indian batsmen. He will be supported by captain Markram with part-time spin.

Offensive line-up:South Africa have a very deep and offensive batting line-up. All the main batsmen of the team are in form. The team has stable openers with Markram and de Kock. Then South Africa with Rickelton, Brevis, Stubbs and Miller did not return to bat. Bosh and Jansen, who play at 7 and 8 positions, can also explode with the bat. It will be difficult if batters like De Kock and Brevis are not included in the pavilion soon. Indian bowlers who performed best in the group stage.. Let's see how they will perform in this match. Bumrah, who is enjoying himself with the new ball.. The top order needs to be looked at. Pace all-rounders Hardik and Dube will share some overs. Akshar and Varun, who are performing consistently, in Ahmedabad, which is suitable for spinners. It remains to be seen whether they will challenge the strong South African batting line-up. Depending on the pitch, either Kuldeep as the third spinner or Arshdeep as the second pacer will be included in the final team.

The Narendra Modi Stadium in Ahmedabad is very suitable for spinners. In India's last league match against the Netherlands, the ball turned well. Dutch spinner Aryan Dutt gave 19 runs in 4 overs and took 2 wickets. After that, Varun and Akshar got excited. The batsmen had trouble getting the ball on the bat on this pitch which was a bit sluggish. The pitch is expected to remain the same on Sunday as well. But in the background of strong batting departments of both the teams, if the spinners are played a little carefully, there are chances of getting big scores.

Team India pacer ahead of Super-8 match against South Africa. Mohammad Siraj was hit hard. During practice on Saturday, Hardik Pandya's shot hit him hard on the leg and he lay down writhing in pain. After trying to get up and walk, the steps faltered. The extent of the injury is not known. He played only one match in the tournament. Siraj played in the final team as Bumrah was unavailable for the opening match against America due to fever. He played a vital role in the team's victory with 3 wickets. If Harshit Rana was injured a day before the start of the tournament, Siraj came in his place.

India:Abhishek, Ishan, Tilak, Suryakumar (captain), Hardik, Dube, Rinku, Akshar, Kuldeep/Arshdeep, Bumrah, Varun; South Africa: Markrum (capt), de Kock, Rickelton, Brevis, Miller, Stubbs, Bosh, Jansen, Keshav, Rabada, Ngidi. 

The matches played by India against South Africa in the T20 World Cup. They have won five times and lost two matches.

T20s between India and South Africa. While India won 21 matches, South Africa won 13 times. One match was tied. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 02:34 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • India vs Pakistan on June 14 The Indian team will begin their hunt for the Women's T20 World Cup title against Pakistan on June 14. The ICC has announced the schedule of this tournament hosted by England on Tuesday.
  • England in the semis England was shocked. With their second consecutive victory in the Super 8, they advanced to the T20 World Cup semifinals. England defeated Pakistan in an interesting match when captain Brooke scored a super century. It is a test match between India and Australia. Aussie fast bowler Jason Gillespie's ball hit Sachin Tendulkar's pads very high. As Gillespie and his colleagues strongly appealed, legendary umpire Steve Buckner dismissed Sachin as lbw.
  • Rinku who left the team! Team India's middle order batsman Rinku Singh has become a doubt for the T20 World Cup Super-8 match against Zimbabwe on Thursday. BCCI sources said he left the team due to a family emergency.
  • Bharatke Punch In the excitement of winning the T20 series in Australia, punch to the Indian women's team who wanted to hit the bone in ODIs! Harmanpreet's team failed to bat in the first match of the three ODI series on Tuesday..
  • Who is Boni? The T20 World Cup has become an interesting battle. Sri Lanka and New Zealand, who are yet to open a winning account in the Super-8, will decide their fate on Wednesday. Sri Lanka must win this match to keep their semis hopes alive.
  • Jammu kashmir 284/2 Jammu and Kashmir will host Karnataka in the Ranji Trophy final. In this match which started on Tuesday, Jammu and Kashmir completely dominated the first day.
  • Brief News (2) Coach Jonathan Trott (England) who played a key role in the growth of Afghanistan cricket bid farewell to the team. In the T20 World Cup, he resigned from the post of coach after the Afghan team did not qualify for the Super-8.
  • As Akshar was playing.. The Indian team management, who faced severe criticism by leaving the in-form spinner Akshar Patel aside for the Super-8 match against South Africa. Looks like.