
టీ20 ప్రపంచకప్-2026టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉంది. గ్రూప్-ఎ నుంచి అమెరికా, నమీబియా వంటి పసికూనలపై గెలుపొందిన భారత్.. చివరగా దాయాది పాకిస్తాన్‌ను మట్టికరిపించిది.
‘చిరకాల ప్రత్యర్థి’ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి.. లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు అర్హత సాధించింది. ఇక గ్రూప్-ఎలో భాగంగా నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బుధవారం రాత్రి (ఫిబ్రవరి 18) మరో పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.
అభిషేక్ శర్మ డకౌట్ అయినా..
కాగా ఇప్పటికే సూపర్-8కు చేరిన తరుణంలో నెదర్లాండ్స్‌తో ఆడే తుదిజట్టులో భారత్ మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్‌గా అభిషేక్ శర్మ (0,0) రెండు మ్యాచ్‌లు ఆడి డకౌట్ అయినా.. అతడిని కొనసాగించడం ఖాయమే. దీంతో మరోసారి సంజూ శాంసన్‌కు మొండిచేయి తప్పదు.
ఇక ఇప్పటికే ఓపెనర్‌గా ఇరగదీస్తూ.. పాక్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ స్థానానికి ఢోకా లేదు. సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కొనసాగటం లాంఛనమే.
బుమ్రాకు రెస్ట్.. అతడిపై వేటు
అయితే, పాక్‌తో మ్యాచ్ ఆడిన ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు నెదర్లాండ్స్ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ రావడం పక్కా. అదే విధంగా.. కుల్దీప్ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులో ఆడించే యోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు సమాచారం.
కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు గాయపడిన వాషీ.. నమీబియాతో మ్యాచ్ నుంచి అందుబాటులోకి వచ్చాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ అతడి విషయంలో మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకోలేదు. అయితే, నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో ఆడించి తదుపరి మ్యాచ్‌లకు అతడిని సన్నద్ధం చేయనున్నట్లు సమాచారం.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్.
English Translation

T20 World Cup-2026 Defending champion Team India is on a roll with a hat-trick of wins in the tournament. After winning against the girls like America and Namibia from Group-A, India finally thrashed their cousin Pakistan.
After defeating the 'old rival' by 61 runs, they qualified for Super-8 with one more match left in the league stage. And as part of Group-A, Team India will face another newcomer Netherlands on Wednesday night (February 18) in the titular match. The venue for this is the Narendra Modi Stadium in Ahmedabad.
Even if Abhishek Sharma is out..
There is a possibility that India will make changes in the final team to play against the Netherlands when they have already reached the Super-8. Even though Abhishek Sharma (0,0) played two matches as an opener and was ducked, it is certain that he will continue. Once again, Sanju Samson will have to be stubborn.
Ishan Kishan, who played a key role in India's victory over Pakistan, is already playing as an opener. It is symbolic that Tilak Verma, Shivam Dubey, Hardik Pandya, Rinku Singh, Akshar Patel and Varun Chakraborty will continue in this team under the captaincy of Suryakumar. There is a possibility to rest from the Netherlands match. If that happens, Arshdeep Singh will definitely replace him. Similarly, it is reported that the management is thinking of playing Washington Sundar in the final team, excluding Kuldeep Yadav.
Vashi, who was injured before the T20 World Cup tournament, was available from the match against Namibia. Despite achieving full fitness, the management did not take any risk in his case. However, it is reported that he will play in the nominal match against the Netherlands and prepare him for the next matches.
India's final squad for the match against the Netherlands (estimated)
Ishan Kishan (wicket keeper), Abhishek Sharma, Tilak Verma, Suryakumar Yadav, Hardik Pandya, Shivam Dubey, Rinku Singh, Akshar Patel, Varun Chakraborty, Washington Sundar, Arshdeep Singh.