ఎవరు గొప్ప?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
పరమేశ్వరుడి ‘డమరుకం’ నుంచి సంగీతం ఆవిర్భవించింది. శ్రవణ శుభగమైన ఆ సంగీతకళను లోకానికి అందించి పునీతం చేయాలని మహేశ్వరుడు సంకల్పించాడు. అదే సమయంలో తుంబురుడు, నారదుడు పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చారు. ఆ సంగీత విద్యను తమకు నేర్పాలని అర్థించారు. అర్ధనారీశ్వరుడు అంగీకరించాడు.
తుంబురుడు సంగీతం నేర్చుకుని దేవలోకంలో ప్రచారం సాగించాడు. నారదుడు భూలోకంలో సంచారం చేస్తూ సంగీత కళను పరివ్యాప్తం చేయసాగాడు. కొంతకాలం గడిచింది. కాకతాళీయంగా వారిద్దరూ ఓసారి కలిశారు. సంగీతంలో నేను నిష్ణాతుణ్ని అంటే నేను గొప్పవాణ్ని అని వాదోపవాదాలు మొదలయ్యాయి. తీర్పు కోసం సరస్వతీదేవి దగ్గరికి వెళ్లారు. ‘ఇద్దరూ ప్రవీణులే’ అంటూ తప్పించుకుందామె. శివుడి చెంతకు వెళ్లి తమ కలహాన్ని తీర్చమని కోరారు. శివుడూ నొప్పింపక, తానొవ్వక తప్పించుకున్నాడు.అప్పుడిక పార్వతీదేవిని ఆశ్రయించారు. ‘మీరు ఆంజనేయుణ్ని అడగండి. ఆయన గొప్ప సంగీత విద్వన్మణి!’ అని సలహా ఇచ్చిందామె.
తుంబుర నారదులు వింధ్య పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న హనుమను చేరి, ‘పవనసుతా! మమ్మల్ని పరీక్షించి మా ఇద్దరిలో గొప్ప ప్రతిభాశాలి ఎవరో చెప్పాలి’ అని కోరారు. ‘మీ వీణలు ఇవ్వండి ముందు’ అన్నాడు వాయుసుతుడు. తుంబురుడు తన ‘కళావతి’ని, నారదుడు ‘మహతి’ని హనుమకు ఇచ్చి ఎదుట కూర్చున్నారు. మారుతి తన సుమధుర స్వరంతో గానం చేయడం మొదలుపెట్టాడు. తుంబుర నారదులు ఆ మధుర మనోహర ఆలాపనను వింటూ పరవశులైపోయారు. తన అపూర్వ గానమాధుర్యానికి అక్కడి కొండరాళ్లన్నీ కరిగి నీరై ప్రవహిస్తుంటే హనుమ హఠాత్తుగా గానం ఆపేసి, చేతిలోని రెండు వీణలను ప్రవాహంలోకి విసిరేశాడు. గానం ఆగిపోగానే ఆ నీళ్లన్నీ రాళ్లుగా మారాయి. తుంబుర నారదులు అవాక్కయ్యారు. ‘అయ్యో, మా వీణలేవీ?’ అని వాపోయారు. ‘మీరిద్దరూ మీ సంగీతంతో రాళ్లను నీళ్లుగా మార్చి, వీణలు తీసుకుని పోవచ్చు’ అన్నాడు హనుమంతుడు. తుంబురుడు గానం చేశాడు. రాళ్లు రాళ్లుగానే ఉన్నాయి. తెల్లమొహం వేసి, అలసి పాడటం మానేశాడు. నారదుడూ స్వరం సవరించాడు. రాళ్లలో మార్పులేదు. మళ్లీ హనుమ గానం చేసి రాళ్లను నీళ్లుగా మార్చి వీణలు బయటికి తీసి వారికిచ్చాడు. ‘ఏ విద్యలోనైనా అహంకారం పనికిరాదు. గర్వం పతనానికి నాంది. నిజానికి మీరిద్దరూ సమానులే. మీ విధులను మీరు నిర్వర్తించండి’ అన్నాడు. హనుమకు నమస్కరించి తుంబుర నారదులు తమ వీణలతో తిరుగుముఖం పట్టారు. ‘నేనే గొప్పవాణ్ని’ అన్న అహంకారం ఎక్కువైతే ఎవరికైనా భంగపాటు తప్పదని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation

Among humans there is no one else than me. It is natural to have conflicts. But it is surprising that Munus, Mahapurushas and Devas also fall under their influence and later repent.
Music originated from Parameshwar's 'Damarukam'. Lord Maheshwar decided to present and sanctify the art of music which is pleasant to hear. At the same time, Tumburu and Narada came to see Lord. They understood that music education should be taught to them. Ardhanarishwar agreed.
Tumburu learned music and spread the word in Devaloka. Narada roamed the earth spreading the art of music. It's been a while. Coincidentally they both met once. Arguments started that I am an expert in music which means I am great. He went to Saraswati Devi for judgment. Let's escape by saying 'both are skilled'. They asked Lord Shiva to settle their dispute. Shiva escaped without pain and then sought refuge with Goddess Parvati. 'You ask Anjaneyu. He is a great musician!', she advised.
Tumbura Narada joined Hanuman, who was doing penance in the Vindhya Mountains, and said, 'Pavanasuta! He asked them to test us and tell us who is the most talented of the two of us. 'Give me your veenas first' said Vayusuta. Tumburu gave his 'Kalavati' and Narada gave 'Mahati' to Hanuma and sat in front. Maruti started singing in his sweet voice. Tumbura Naradas were enraptured listening to that sweet and lovely song. Hanuma suddenly stopped singing and threw the two veenas in his hand into the stream when all the rocks were melting and flowing down to the river. When the singing stopped, all the water turned into stones. The Tumbura Naradas were taken aback. 'Oh, not even our harps?' Hanuman said, 'Both of you can turn stones into water with your music and take veenas.' Tumburu sang. Stones are still stones. White-faced, tired, he stopped singing. Narada changed his voice. There is no change in the stones. Again Hanuma sang and turned the stones into water and took out the harps and gave them to them. Arrogance is useless in any education. Pride is the beginning of a fall. Actually you both are same. Do your duties' he said. The Tumbura Naradas turned back with their veenas bowing to Hanuma. This story shows that if the pride of 'I am great' is too much, then someone will be disturbed.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :