అజ్ఞానాన్ని రూపుమాపాలి!

Eenadu icon
By Editorial Team Published : 07 Feb 2026 03:58 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.

తప్పునకు మరో తప్పు తమ్ముడన్నట్లు ఈ అజ్ఞానం బంధువులు ఎక్కడ చూసినా ఉంటారు. ఇది యోగ్యత లేనివాళ్లని సింహాసనాలు ఎక్కించి రాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. జనాలను పావులను చేసి ఆడుకుంటుంది. అందరూ జ్ఞానవంతులు అయితే చెడ్డ పాలకులను ఎందుకు నెత్తిమీద పెట్టుకుని ఊరేగుతారు? వాళ్లని దించడానికి అష్టకష్టాలు ఎందుకు పడతారు? అజ్ఞానం దుర్యోధనుడికి గురువు. కంసుడికి మామ. రాక్షసులను, రాక్షసుల్లాంటి మనుషులను నడిపించేది అజ్ఞానమే. దాన్ని లేకుండా చేయడం ఎలా? అది సాధ్యపడదు. అందరూ విద్యావేత్తలు, పండితులు, జ్ఞానులు, యోగులు కాలేరు. జ్ఞానం ఎంత సనాతనమో అజ్ఞానం కూడా ఆనాటిదే అని వేదాలు చెబుతున్నాయి. ఈ రెండింటి మధ్య పోరాటమే జీవితం. అయితే చూస్తూ చూస్తూ అజ్ఞానాన్ని పెంచి పోషించకూడదు. ఎక్కడ ఉన్నా, దాన్ని రూపుమాపాలి.
ఒక్కోసారి తెలిసిన వాడికంటే తెలియనివాడే ఎక్కువగా సుఖపడతాడు. అలాగని అందరూ అజ్ఞానంతో ప్రవర్తిస్తే లోకం ఏమవుతుంది? మసక చీకట్లో తాడు పాములా కనిపిస్తుంది. దానిమీద దీపపు వెలుగు ప్రసరిస్తే అది తాడని తెలుస్తుంది. అజ్ఞానం తొలగాలంటే విజ్ఞాన వెలుగులు విస్తరించాలి. అవిద్య పోవాలంటే ఆత్మవిద్య కావాలి. అందరికి అది అందిరాదు స్వానుభవంతో సంపాదించుకునే బ్రహ్మజ్ఞాన సిద్ధి కలగదు. కాబట్టి తనకున్న అజ్ఞానం తనకు తెలిస్తే చాలు. అందుకే సోక్రటీస్‌ ‘నాకేమీ తెలియదన్న విషయం తెలిసింద’ని చెబుతాడు. 

అజ్ఞానం పోగొట్టడానికి సరైన జ్ఞానం సరైన సమయంలో రావాలి. లేదా అజ్ఞానం పెరగకుండా చూడాలి. కౌరవులు నూరుగురు అజ్ఞానం వెంట నడిచారు. దుర్యోధనుడి వల్ల నాశనమై పోయారు. పాండవులు అయిదుగురు జ్ఞానం వెంట నడిచారు. శ్రీకృష్ణుడి రక్షణ పొందారు. విజయం సాధించారు. సర్వ అనర్థాలకు కారణం అజ్ఞానం. సర్వ శుభాలకు, సుఖ సంతోషాలకు కారణం విజ్ఞానం. అన్నివైపుల నుంచి గొప్ప ఆలోచనలు, అద్భుతమైన జ్ఞానం వచ్చుగాక! అని రుగ్వేదం అందుకే చెబుతోంది.

సత్సాంగత్యంలో జ్ఞానం ఉంటుంది. దుస్సాంగత్యంలో అజ్ఞానం ఉంటుంది. అందులో తాత్కాలికమైన హాయి లభిస్తుంది. జ్ఞానంలో శాశ్వతమైన ఆనందం ఉంటుంది. దాన్ని లోకానికి అందించాలంటే- చీడపురుగుల మీద క్రిమిసంహారక మందులు చల్లినట్లు, అజ్ఞానం మీద జ్ఞానాన్ని వర్షంలా కురిపించాలి. 

చెడు దావానలంలా వ్యాపిస్తుంది. మంచి చెవిని చేరకముందే చెడు ఇల్లు కట్టేస్తుంది. అజ్ఞానం ఊళ్లకి ఊళ్లనే తగలబెడుతుంది. గురు రూపంలో దైవం సరైన మార్గంలో నడిపించి, అజ్ఞానం ఆట కట్టిస్తాడు. ఎవరికి వాళ్లు బాధ్యత తీసుకుని ఎక్కడ అజ్ఞానం, అధర్మం, అసత్యం పేరుకున్నా వాటిని నిరసించాలి, ఎదిరించాలి, రూపుమాపాలి. బ్రహ్మసత్యం జగన్మిధ్య అనే వాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ముందు ఈ సాధారణ స్థాయిలో ప్రాథమికమైన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Ignorance must be eradicated!

Eenadu icon
By Editorial Team Published : 07 Feb 2026 03:58 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ThatDishankara said ignorance is different. This ignorance is not that. This ignorance that reigns all over is the cause of iniquity and injustice. It disintegrates the kingdom by enthroning the unworthy. Plays with people. If everyone is wise then why do they scalp bad rulers? Why do they go to great lengths to bring them down? Ignorance was Duryodhana's teacher. Uncle of Kamsa. Ignorance drives demons and demon-like men. How to do without it? It is not possible. Not all can be academics, scholars, sages, yogis. The Vedas say that ignorance is as old as knowledge. Life is a struggle between these two. However, ignorance should not be nurtured by watching. Wherever it is, shape it.
A stranger is more comfortable than a known one. So what will happen to the world if everyone behaves in ignorance? In the dim darkness the rope looks like a snake. If the light of a lamp shines on it, it will be known that it has hit. If ignorance is to be removed, the light of knowledge must be spread. Self-education is necessary to be uneducated. Everyone does not get it, the siddhi of brahma-jnana which is acquired by self-knowledge does not come. So it is enough for him to know his ignorance. That's why Socrates says 'I know what I know nothing about'. 

The right knowledge should come at the right time to eradicate ignorance. Or we should see that ignorance does not increase. A hundred Kauravas followed ignorance. They were destroyed by Duryodhana. The five Pandavas followed knowledge. Got the protection of Lord Krishna. Succeeded. Ignorance is the cause of all misery. Knowledge is the cause of all auspiciousness and happiness. May great ideas and wonderful knowledge come from all sides! That is why the Rugveda says.

There is wisdom in satsangatya. Misfortune consists of ignorance. It provides temporary comfort. There is eternal happiness in knowledge. To impart it to the world- like spraying pesticides on vermin, raining knowledge on ignorance. 

Evil spreads like wildfire. Evil builds a house before it reaches the good ear. Ignorance burns villages. God in the form of Guru guides the right path and destroys the game of ignorance. They should take responsibility and wherever there is ignorance, iniquity and falsehood, they should be protested, opposed and eradicated. In order to experience the phrase Brahmasatyam Jaganmidhya, one has to remove this basic ignorance at the general level.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :