justice: న్యాయ నిరాకరణా? నాశనమా?

Eenadu icon
By Editorial Team Published : 08 Feb 2026 02:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

‘న్యాయ రథచక్రాలు ఒక్కోసారి నెమ్మదిగా కదులుతుంటాయి’ అంటారు బ్రిటిష్‌ మానవ హక్కుల కార్యకర్త, రచయిత టెర్రీ వెయిట్‌. మన దేశంలోనైతే వాటికీ నత్తలకూ పోటీపెడితే- నిమ్మళంగా నడిచే ఆ గుల్లపురుగులే గమ్యానికి త్వరగా చేరతాయి! ఎక్కడో అరుదుగా కాదు- ప్రతిచోటా ప్రతిసారీ న్యాయ వితరణలో కంటే నత్త నడకలోనే వేగమెక్కువ అనే నిట్టూర్పులు జనంలోంచి వినపడుతుంటాయి. జీవించే హక్కులో అంతర్భాగమైన సత్వర న్యాయం సుదూర స్వప్నంగా మిగిలిపోతున్న దయనీయావస్థలో- మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్షగా పరిణమిస్తుంటుందని సుప్రీంకోర్టు మూడేళ్ల క్రితం ఆవేదనాత్మకంగా వ్యాఖ్యానించింది. అందులో అతిశయోక్తి ఏమీ లేదని ధర్మోదేవి అనే ఓ అభాగ్యురాలి జీవితగాథ నిరూపిస్తుంది. సీఆర్‌పీఎఫ్‌లో పనిచేసే ఆమె భర్త 1962 ఇండో-చైనా యుద్ధంలో వీరమరణం పొందారు. ఆయన భార్య ధర్మోదేవికి 1966 వరకు పింఛను ఇచ్చిన యంత్రాంగం ఆ తరవాత హఠాత్తుగా దాన్ని నిలిపేసింది. దానిపై ఆమె అదే ఏడాదిలో పంజాబ్‌-హరియాణా హైకోర్టును ఆశ్రయిస్తే- పెన్షన్‌ను పునరుద్ధరించాలంటూ 2022లో తీర్పు వచ్చింది. 56 ఏళ్ల పాటు చట్టబద్ధమైన హక్కును కోల్పోయిన బాధితురాలికి దీంతో న్యాయం జరిగినట్లేనా? ‘లేదు’! ఎందుకంటే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇటీవల హెచ్చరించినట్లు- ‘న్యాయ వితరణలో ఆలస్యం కావడమంటే న్యాయాన్ని నిరాకరించడం మాత్రమే కాదు, నాశనం చేయడం కూడా’! 

వ్యక్తిత్వాలకు అడుగడుగునా శల్యపరీక్షలు చేసే మన సమాజంలో అకారణంగా నింద మోస్తూ నాలుగు రోజులు బతకడమే కష్టం. అలాంటిది నలభై ఏళ్లుగా జనం కళ్లకు నేరగాడిగా కనపడాల్సి రావడమెంత దుర్భరం? తన నిర్దోషిత్వాన్ని గుర్తిస్తూ కోర్టు ఇచ్చే తీర్పుకోసం వందేళ్ల వయసులో కళ్లు కాయలుకాచేలా ఎదురుచూడటమెంత నరకం? ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ధనీరామ్‌ తన జీవన సంధ్యా సమయంలో ఈ వేదనంతా అనుభవించాడు. 1982 నాటి ఓ హత్య కేసులో అతను దోషి అని చెప్పి ట్రయల్‌ కోర్టు 1984లో జీవిత ఖైదు విధించింది. దానిపై ధనీరామ్‌ దాఖలు చేసిన అప్పీలుపై అలహాబాద్‌ హైకోర్టు కొద్దిరోజుల క్రితమే తీర్పిచ్చింది. ధనీరామ్‌ నిర్దోషి అని 42ఏళ్ల తరవాత తేల్చింది. న్యాయదేవత దయకు నోచుకునే సరికి కొంతమంది అమాయకుల జీవితాలు ఇలా తెల్లారిపోతుంటే- మరోవైపు, నిజంగా నేరాలు చేసినవారు దండనల నుంచి తప్పించుకుని పైలాపచ్చీసుగా బతికేస్తున్నారు. అదే ఉత్తర్‌ప్రదేశ్‌లో అదే 1982లో ఒక వ్యక్తి తన భార్యను చంపేశాడని కేసు నమోదైతే 1984లో ట్రయల్‌ కోర్టు దాన్ని కొట్టేసింది. దానిపై ప్రభుత్వం ఆనాడు అప్పీలుకు వెళ్తే, నిరుడు అక్టోబరులో ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ వ్యక్తి హత్య చేశాడని నిర్ధారించిన హైకోర్టు అతనికి జీవితఖైదు విధించింది. రెండు వారాల్లో లొంగిపొమ్మని ఆదేశాలిచ్చింది. 28 సంవత్సరాల ప్రాయంలో హేయ నేరానికి పాల్పడిన వ్యక్తికి 71 ఏళ్ల వయసులో శిక్ష పడిందంటే- అది దండన ఎలా అవుతుంది? 1997లో ఇరవై రూపాయలు లంచం తీసుకున్నాడని అహ్మదాబాద్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. 2004లో జిల్లా కోర్టులో అతనికి మూడేళ్ల శిక్ష పడింది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన విచారణ తరవాత గుజరాత్‌ హైకోర్టు ఆ కానిస్టేబుల్‌ను మొన్న నాలుగో తేదీన నిర్దోషిగా ప్రకటించింది. తన జీవితంపై పడిన మరక తొలగిపోయిందంటూ భావోద్వేగానికి గురైన ఆ మాజీ పోలీసు ఆ రోజు రాత్రే కన్నుమూశాడు. కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ఇలా చెప్పుకొంటూ వెళ్తే దేశవ్యాప్తంగా ఎన్నెన్నో కేసులు... సంవత్సరాల తరబడిగా పేరుకుపోయిన ఆ వ్యాజ్యాల గుట్టల కింద రాజ్యాంగ నిర్దేశమైన సత్వర న్యాయ భావన నలిగిపోతోంది. నిస్సహాయ జనభారతం దాన్ని చూస్తూ, వ్యవస్థలపై విశ్వాసాన్ని హరించే నిర్వేదంలో మునిగిపోతోంది! 

జాతీయ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా కిందిస్థాయి కోర్టుల్లో 4.81 కోట్ల కేసులు మోక్షంకోసం ఎదురుచూస్తున్నాయి. హైకోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య 63.56 లక్షలకు చేరితే- సుప్రీంకోర్టులో అది దాదాపు 93వేలుగా లెక్కతేలుతోంది. అపరిష్కృత వ్యాజ్యాలు ఇంతగా పోగుపడటానికి న్యాయమూర్తులు కారణం కారని, వ్యవస్థలోనే లోపముందన్నది కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు మాట! ఆ తప్పే ఎక్కడ ఎవరి వల్ల జరుగుతోంది? ఇందుకు సమాధానం- ‘ప్రభుత్వాధికారుల నియామకాలు చేపట్టినంతగా న్యాయమూర్తులను నియమించరు’ అన్న మాజీ సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి విమర్శలో దొరుకుతుంది! అమెరికాలో ప్రతి పది లక్షల మందికి సగటున 150 మంది, యూరోప్‌లో 220 మంది జడ్జిలు పనిచేస్తున్నారు. చైనాలోనైతే మూడొందల మందికి పైగా ఉన్నారు. మరి మన పుణ్యభారతంలో? పది లక్షల జనాభాకు కనీసం యాభై మంది న్యాయమూర్తులు ఉండాలని లా కమిషన్‌ ఎప్పుడో 1987లో సిఫార్సు చేస్తే- ఇప్పటికీ అందులో సగానికి కూడా చేరుకోలేదు మనం! ప్రస్తుతం ప్రతి పది లక్షల మంది భారతీయులకు 22 మంది న్యాయమూర్తులే అందుబాటులో ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీ నాటికి దేశీయంగా పాతిక హైకోర్టుల్లో మంజూరైన 847 జడ్జి పోస్టుల్లో 308 ఖాళీగా కనపడుతున్నాయి. కింది స్థాయి కోర్టుల్లో 25,895 మంది న్యాయాధికారులను నియమించాల్సి ఉంటే- 4867 పోస్టులు భర్తీ కాలేదు. దీనికితోడు మౌలిక సదుపాయాల కొరత, వాయిదాల సంస్కృతి వంటివి పెచ్చుమీరుతున్నప్పుడు ఇక వేగంగా న్యాయ నిర్ణయాలు ఎలా వెలువడుతాయి? పౌరహక్కులు సురక్షితమెలా అవుతాయి? ప్రజలందరికీ న్యాయం చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చిన నాయకులే దీనికి జవాబు చెప్పాలి! 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

justice: denial of justice? Destruction?

Eenadu icon
By Editorial Team Published : 08 Feb 2026 02:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

'The wheels of justice move slowly at times' says British human rights activist and writer Terry Waite. If we compete with snails in our country - those snails that run smoothly will reach their destination quickly! Not infrequently somewhere - everywhere every time sighs are heard from the people that the snail's pace is faster than the delivery of justice. Three years ago, the Supreme Court poignantly commented that our criminal justice system has become a punishment in a pathetic situation where speedy justice, which is an integral part of the right to life, remains a distant dream. The life story of an unfortunate girl named Dharmodevi proves that there is nothing exaggerated about it. Her husband, who served in the CRPF, was martyred in the 1962 Indo-China war. The mechanism which gave pension to his wife Dharmodevi till 1966 then suddenly stopped it. If she approaches the Punjab-Haryana High Court in the same year, the pension will be restored in 2022. Is this justice for the victim who has been deprived of her legal rights for 56 years? 'No'! Because, as the Chief Justice of India, Justice Suryakant recently warned - 'Delay in the dispensation of justice is not only denial of justice, but also destruction'! 

In our society where personalities are scrutinized at every step, it is difficult to survive for four days bearing the brunt of blame. How bad is it that such a person has to appear as a criminal in the eyes of the people for forty years? What is the hell of waiting for the verdict of the court recognizing his innocence at the age of 100 years? Dhaniram from Uttar Pradesh experienced all this agony in the twilight of his life. A trial court convicted him in a 1982 murder case and sentenced him to life imprisonment in 1984. The Allahabad High Court ruled on the appeal filed by Dhaniram a few days ago. It was concluded after 42 years that Dhaniram was innocent. While the lives of some innocent people are turned white by the mercy of God - on the other hand, those who have committed crimes escape punishment and live happily ever after. In the same Uttar Pradesh in 1982, a case was registered that a man had killed his wife, but in 1984 the trial court struck it down. If the government went to appeal on that day, the order was issued in October. The High Court found the man guilty of murder and sentenced him to life imprisonment. He ordered to surrender within two weeks. If a person who commits a heinous crime at the age of 28 is punished at the age of 71 - how is that punishment? In 1997, a case was registered against a constable from Ahmedabad for accepting a bribe of twenty rupees. He was sentenced to three years in the district court in 2004. After more than two decades of trial, the Gujarat High Court acquitted the constable on the fourth day. The ex-policeman who was emotional that the stain on his life was removed, passed away that night. If the blindfolded justice deity is saying this as a witness, many cases across the country... under the piles of lawsuits that have accumulated over the years, the concept of speedy justice as prescribed by the Constitution is being crushed. The helpless people of India are watching it and drowning in the despair of losing faith in the system! 

If the number of pending cases in the High Courts reaches 63.56 lakh, it is calculated to be around 93 thousand in the Supreme Court. Union Minister Kiran Rijiju said that judges are not the reason for the pile up of unresolved cases, there is a flaw in the system itself! Where is the mistake being made by whom? The answer to this can be found in the criticism of former CJI Justice Ranjan Gogoi who said, 'Judges are not appointed as much as government officials are appointed'! There are an average of 150 judges per ten million people in America and 220 in Europe. There are more than three-quarters of people in China. And in our holy India? In 1987, the Law Commission recommended that there should be at least 50 judges per 10 lakh population - still we have not reached even half of it! At present there are only 22 judges available for every ten lakh Indians. As of the 1st of this month, 308 of the 847 judge posts sanctioned in the domestic High Courts are vacant. Out of 25,895 judicial officers to be appointed in the lower level courts, 4867 posts are not filled. In addition to this, when there is a lack of infrastructure and a growing culture of procrastination, how can legal decisions be delivered quickly? How can civil rights be secured? Leaders who came into office after swearing on the constitution to do justice to all people should answer this! 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :