పాదాల దుర్వాసన.. పోవాలంటే!

కాలమేదైనా కొంతమందికి పాదాల్లో చెమట రావడం సహజం! ముఖ్యంగా షూ, సాక్సులు ధరించినప్పుడు పాదాలకు గాలి తగలదు. ఫలితంగా దుర్వాసన రావడమే కాకుండా.. పాదాలు, గోళ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు....

Eenadu icon
By Vasundhara Team Published : 09 Feb 2026 15:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కాలమేదైనా కొంతమందికి పాదాల్లో చెమట రావడం సహజం! ముఖ్యంగా షూ, సాక్సులు ధరించినప్పుడు పాదాలకు గాలి తగలదు. ఫలితంగా దుర్వాసన రావడమే కాకుండా.. పాదాలు, గోళ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు.

బేకింగ్‌ సోడాతో..
పాదాలను శుభ్రం చేసుకోవడానికి బేకింగ్‌ సోడాని ఉపయోగించడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. దీనికోసం పావు బకెట్ గోరువెచ్చని నీటిలో చెంచా బేకింగ్‌ సోడా కలపాలి. ఈ మిశ్రమంలో పాదాలు మునిగేలా కొద్దిసేపు ఉంచాలి. బేకింగ్‌ సోడా ఉపయోగించడం వల్ల చెమటలోని పీహెచ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. ఫలితంగా దుర్వాసన రావడం తగ్గుతుంది. ఈ విధంగా వారం రోజుల పాటు రాత్రివేళల్లో క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అల్లంతో..
చిన్న అల్లం ముక్క తీసుకుని దాన్ని బరకగా దంచుకోవాలి. ఒక కప్పు వేడి నీళ్లు తీసుకొని అందులో ఈ అల్లం పేస్ట్‌ని వేసి 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి చల్లారనివ్వాలి. రోజూ పడుకునే ముందు ఈ మిశ్రమంతో పాదాలకు మృదువుగా మర్దన చేసుకోవాలి. కొద్ది రోజుల పాటు ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది.

నిమ్మరసంతో..
ఒక బేసిన్‌లో పావుకప్పు బేకింగ్‌ సోడా వేసి దానికి ఎనిమిది కప్పుల గోరువెచ్చని నీటిని జత చేయాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో పాదాలను 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత పొడి టవల్‌తో తుడుచుకుని పాదాలను ఆరబెట్టుకోవాలి.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Smelly feet.. to go away!

It is natural for some people to sweat in their feet at any time! Especially when wearing shoes and socks, the feet are exposed to wind. As a result, apart from bad smell, there is no chance of foot and nail infections. class="my-2">

  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
  • 1 min read

    It is normal for some people to have sweaty feet from time to time! Especially when wearing shoes and socks, the feet are exposed to wind. As a result, apart from bad smell, there is no chance of foot and nail infections. But experts say that this problem can be solved with some materials available at home.

    With baking soda..
    Using baking soda to clean the feet will give good results. For this, mix a spoonful of baking soda in a quarter bucket of warm water. Soak the feet in this mixture for a while. Using baking soda keeps the pH levels in sweat under control. As a result, bad odor is reduced. Doing this regularly at night for a week will give good results.

    With ginger..
    Take a small piece of ginger and chew it roughly. Take a cup of hot water and add this ginger paste in it and keep it for 10 to 15 minutes. Then strain the mixture and let it cool. Gently massage the feet with this mixture before going to bed. If you do this for a few days, you will see the result.

    With lemon juice..
    Add a quarter cup of baking soda to a basin and add eight cups of warm water to it. Add some lemon juice to this mixture and mix well. Keep the feet in this for 15 to 20 minutes. After that wipe your feet with a dry towel.

    ► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :