నట్స్‌ని ఎలా భద్రపరచాలో తెలుసా?

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌, పల్లీలు.. వంటి నట్స్‌ని కొంతమంది ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. అయితే ఫైబర్‌, ప్రొటీన్‌, ఐరన్‌, క్యాల్షియం, మంచి కొవ్వులు.. ఇలాంటి ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఈ నట్స్‌ని....

Eenadu icon
By Vasundhara Team Published : 09 Feb 2026 15:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌, పల్లీలు.. వంటి నట్స్‌ని కొంతమంది ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. అయితే ఫైబర్‌, ప్రొటీన్‌, ఐరన్‌, క్యాల్షియం, మంచి కొవ్వులు.. ఇలాంటి ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఈ నట్స్‌ని సరైన పద్ధతిలో నిల్వ చేసినప్పుడే వాటిలోని పోషకాలన్నీ తరిగిపోకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇందుకు కొన్ని చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఎందుకు పాడవుతాయి?
కొన్నిసార్లు నట్స్‌ కొని ఇంటికి తెచ్చిన కొన్నాళ్లకే పాడైపోతుంటాయి. వాటి నుంచి అదో రకమైన వాసన వస్తుంటుంది.. రుచిలోనూ తేడా కనిపిస్తుంది. ఇందుకు కారణం వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడమే అంటున్నారు నిపుణులు. సాధారణంగా జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌, పిస్తా.. వంటి పప్పు గింజల్లో నూనెలు, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. గాలి, వేడి, వెలుతురు వీటికి తగలడం వల్ల ఆక్సిడేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. ఫలితంగా అవి పాడైపోతాయి.. రుచిని కోల్పోతాయి.. వాటిలోని పోషకాలూ తరిగిపోతాయి. ఇక తేమ తగిలితే వీటిపై శిలీంధ్రాలూ వృద్ధి చెందుతాయి. కాబట్టి వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఎలా నిల్వ చేయాలంటే..?!
నట్స్‌ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. వాటిని నిల్వ చేసే క్రమంలో కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
* ఎక్కువ రోజులు ఉండేలా పప్పులు, ఉప్పు, కారం వంటి నిత్యావసరాల్ని గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయడం మనకు అలవాటే! ఈ చిట్కా నట్స్‌/డ్రైఫ్రూట్స్‌కీ వర్తిస్తుందంటున్నారు నిపుణులు. మనం ఎంచుకునేది గాజు సీసా అయినా ప్లాస్టిక్ జార్‌ అయినా మూత బిగుతుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా గాలి చొరబడని డబ్బాలో వీటిని నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
* కొంతమంది ప్యాకెట్లలోని నట్స్‌ని వాడి.. ఈ ప్యాకెట్స్‌ని అలాగే భద్రపరుస్తుంటారు. అయితే ఈ క్రమంలో వాటిలోకి గాలి చొరబడకుండా ఉండాలంటే సీలింగ్‌ క్లిప్స్‌ని ఉపయోగించాలి. అవసరమైనప్పుడు వీటిని తెరిచి, ఆపై తిరిగి అమర్చుకోవడం సులభమవుతుంది.
* నట్స్‌ని నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో అస్సలు ఉంచకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలనుకునే వారు.. చల్లగా, పొడిగా, చీకటిగా ఉండే ప్రదేశంలో వీటిని ఉంచాలి.
* కొంతమంది ఎక్కువ మొత్తంలో నట్స్‌ని కొని.. నెలల తరబడి ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారు వీటిని నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్‌ని వాడుకోవచ్చు. ఈ క్రమంలో గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే ఇవి కనీసం ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయంటున్నారు నిపుణులు. అదే ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే 9-12 నెలల పాటు తాజాగా ఉంటాయట! ఇక ఇందుకోసం ‘ఫ్రీజర్‌ సేఫ్‌ కంటెయినర్‌’ని ఉపయోగిస్తే మరీ మంచిదంటున్నారు. ఎందుకంటే దీనివల్ల ఆయా పదార్థాలు గడ్డ కట్టకుండా, వాటిపై ఐస్‌ పేరుకోకుండా ఉంటుంది. తద్వారా గాలి తగిలిన వెంటనే ఇవి పాడవకుండానూ ఉంటాయి.
* అలాగే ఫ్రిజ్‌లో ఉంచినా మసాలాలు, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలకు దూరంగా వీటిని భద్రపరచాలి. ఎందుకంటే ఆ వాసనను ఇవి పీల్చుకుంటాయి. తద్వారా అవి త్వరగా పాడవుతాయి. అందుకే గాజు జార్‌లో మూత బిగుతుగా పెట్టి ఫ్రిజ్‌లో పెట్టడం మేలంటున్నారు నిపుణులు.

* ఇక వీటిని ఫ్రిజ్‌లో నుంచి బయటికి తీసినా.. గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాకే జార్ మూత తెరవాలి. అప్పుడే బయటి గాలి, వేడి, తేమ.. వంటివి వెంటనే వాటికి తగలకుండా, తద్వారా అవి పాడవకుండా ఉంటాయట!
* కొన్నిసార్లు ముక్కలుగా చేసిన నట్స్‌ మిగిలిపోతుంటాయి. సాధారణ నట్స్‌తో పోల్చితే ఇవి త్వరగా పాడైపోతాయట! ఎందుకంటే ముక్కలు చేయడం/తరగడం వల్ల వీటి నుంచి నూనెలు బయటికి వచ్చి.. అవి గాలితో కలవడం వల్ల త్వరగా పాడవుతాయట!
* షెల్స్‌లో ఉన్న నట్స్‌ సాధారణ నట్స్ కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయట! ఎందుకంటే వాటికి గాలి, వేడి, తేమ తగలకపోవడమే కారణం. కాబట్టి ఎక్కువ మొత్తంలో నట్స్‌ కొనాలనుకునే వారు షెల్స్‌తో కూడినవే కొనడం మంచిది.
* ఎంత జాగ్రత్తగా భద్రపరిచినా.. నట్స్‌ తాజాగా ఉన్నాయా, లేదా అనే విషయం అప్పుడప్పుడూ చెక్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వాటి రంగు, రుచి మారినట్లుగా గుర్తిస్తే వాటిని వాడకపోవడమే ఉత్తమమట!
* ఇక నట్స్‌ని కొనే ముందు.. వాటి ప్యాకింగ్‌, గడువు తేదీల్ని లేబుల్‌పై ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడమూ ముఖ్యమే!

గడువు.. దేనికెంత?
ప్రతి పదార్థానికీ గడువు తేదీ ఉన్నట్లే.. నట్స్‌కీ ఎక్స్‌పైరీ ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఆయా రకాలు, నిల్వ చేసే విధానాన్ని బట్టి ఇవి ఎన్ని రోజులు తాజాగా ఉంటాయనే విషయం ఆధారపడి ఉంటుందట!
* నట్స్‌ అన్నింటిలోకెల్లా బాదం పప్పులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయట! ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఏడాది పాటు, ఫ్రిజ్‌లో/ఫ్రీజర్‌లో అయితే రెండేళ్లు.. అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయట!
* అదే వాల్‌నట్స్‌ గది ఉష్ణోగ్రత వద్ద – 3 నెలలు, ఫ్రిజ్‌లో - ఏడాది, ఫ్రీజర్‌లో - రెండేళ్లు తాజాగా ఉంటాయట!
* పల్లీలు గది ఉష్ణోగ్రత వద్ద – ఆరు నెలలు, ఫ్రిజ్‌లో - ఏడాది, ఫ్రీజర్‌లో - రెండేళ్ల పాటు పాడవకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. హేజల్‌నట్స్‌ గడువు తేదీ కూడా ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.
* జీడిపప్పు, పిస్తా పప్పు.. వంటివి గది ఉష్ణోగ్రత వద్ద – ఆరు నెలలు, ఫ్రిజ్‌లో - ఏడాది, ఫ్రీజర్‌లో - రెండేళ్ల పాటు తాజాగా ఉంటాయట!

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Do you know how to preserve nuts?

Some people buy nuts like cashews, almonds, pistachios, walnuts, almonds... in large quantities. But these nuts are full of nutrients like fiber, protein, iron, calcium, good fats...

Eenadu icon
By Vasundhara Team Published : 09 Feb 2026 15:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

Cashew, almond, Some people buy nuts like pistachios, walnuts, almonds, etc. in large quantities. However, experts say that these nuts, which are full of nutrients such as fiber, protein, iron, calcium, and good fats, are stored in the right way, so that all the nutrients in them are not depleted. Some tips are good for this. Let's find out..

Why do they spoil?
Sometimes nuts get spoiled within a few years of buying them and bringing them home. There is a certain smell coming from them.. There is also a difference in taste. Experts say that the reason for this is that they are not stored properly. Generally, pulses such as cashews, almonds, walnuts, pistachios are rich in oils and good fats. Oxidation process takes place due to exposure to air, heat and light. As a result they spoil.. lose their taste.. their nutrients are also depleted. And if they are exposed to moisture, fungi will grow on them. Experts say that it is important to store them properly.

How to store..?!
In order to keep nuts fresh for longer days.. Experts say that some tips should be followed while storing them.
* We have a habit of storing essentials like pulses, salt and pepper in airtight containers to last for a long time! Experts say this tip applies to nuts/dry fruits. Whether we choose a glass bottle or a plastic jar, make sure the lid is tight. If stored in an airtight container like this, they will stay fresh for a long time.
* Some people use the nuts in the packets.. and keep these packets intact. But in order to prevent air from entering them, sealing clips should be used. These are easy to open and then reassemble when needed.
* Nuts should never be kept in direct sunlight. Those who want to store it at room temperature should keep it in a cool, dry, dark place.
* Some people buy large quantities of nuts and use them for months. Such people can use refrigerator to store these. According to experts, these will stay fresh for at least six months if kept in an airtight container and kept in the fridge. If stored in the same freezer it will stay fresh for 9-12 months! For this, it is better to use a 'freezer safe container'. Because of this, the materials do not freeze and ice does not accumulate on them. So that they do not get damaged as soon as they are exposed to wind.
* They should also be kept in the fridge away from spices and strong smelling materials. Because they inhale that smell. So that they spoil quickly. That's why experts recommend putting the lid on the glass jar tightly and putting it in the fridge. should be opened. Just outside air, heat, humidity.. Such as not touching them immediately, so that they do not get damaged!
* Sometimes chopped nuts are left over. Compared to regular nuts, they spoil quickly! Because the oils come out of them due to shredding/crackling.. they spoil quickly due to contact with air!
* Nuts in shells last longer than regular nuts! Because they are not exposed to air, heat and humidity. So those who want to buy large quantities of nuts should buy the ones with shells.
* Experts say that no matter how carefully stored, it is good to check whether the nuts are fresh or not. In this order, it is best not to use them if you notice that their color and taste have changed!
* Before buying nuts.. it is important to double check their packaging and expiration dates on the label!

Expiration.. for what?
Just like every substance has an expiration date.. experts say that Nutsky has an expiration date. However, depending on the type and storage method, how many days they stay fresh depends!
* Of all the nuts, almonds stay fresh for the longest time! These will keep for a year at room temperature, two years in the fridge/freezer...even more!
* The same walnuts stay fresh at room temperature - 3 months, in the fridge - one year, in the freezer - two years!
* Experts say that palli will remain intact for six months at room temperature, one year in the fridge and two years in the freezer. It is said that the expiry date of hazelnuts is also the same.
* Cashew, pistachio.. Like at room temperature – six months, in fridge – one year, in freezer – two years!

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :