Chandrababu: దేవరపల్లి ఘటన.. బాధ్యులపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

అమరావతి: పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమ బాలుర వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ).. అధికారులతో సమీక్ష నిర్వహించారు. 92 మంది విద్యార్ధులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించటంతో హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు సీఎంకు వివరించారు.
నిన్న ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత విద్యార్ధులు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్టు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా అధ్యయనం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హాస్టల్ లోని మిగిలిన విద్యార్ధులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి డయేరియా లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించినట్టు చెప్పారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఆహార పదార్ధాల, నీటి నమూనాలు కూడా సేకరించామన్నారు. ఘటనపై విచారణ జరిపేందుకు జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీని కూడా నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రంపచోడవరం ఏరియా అస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిపై తనకు నివేదించాలన్నారు. ఘటనపై రేపటి లోగా పూర్తి నివేదికను అందజేయాలని కలెక్టర్‌ను అదేశించారు. ఘటనకు కారకులపై శాఖా పరమైన చర్యలతో పాటు, అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Chandrababu: Devarapalli incident.. CM Chandrababu orders action against those responsible

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Amaravati: Polavaram District Chief Minister Chandrababu (Chandrababu) conducted a review with the officials on the incident of students falling ill in the Devarapalli Ashram boys' dormitory in Rampachodavaram. Officials explained to the CM that 92 students were rushed to Maredumilli and Rampachodavaram area hospitals due to symptoms of vomiting, stomach ache, fever and diarrhea. It is said that their health condition has deteriorated at present. The officials explained to the Chief Minister that immediately after the incident, they went to inspect the hostel and studied the conditions there. He said that the rest of the students in the hostel were also conducted medical examinations and those who had symptoms of diarrhea were treated. Apart from setting up a special medical camp, food and water samples were also collected. The officials told the Chief Minister that a joint inspection committee has also been appointed to investigate the incident. The CM directed to continuously monitor the health condition of the students undergoing treatment at the Rampachodavaram Area Hospital. He should report to him on the health condition of the students from time to time. The Collector was directed to submit a complete report on the incident by tomorrow. Apart from taking departmental action against the perpetrators of the incident, the CM also ordered to take criminal action if necessary. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :