T20 World Cup: సూర్య కుమార్ తన ఫామ్‌లోకి వచ్చాడు.. ఆ పరుగులు ప్రత్యేకం: రవిచంద్రన్ అశ్విన్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా యూఎస్‌ఏతో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav) జట్టును ఓటమి నుంచి కాపాడాడు. కష్ట సమయంలో తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి.. 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొత్తం భారత జట్టు స్కోర్‌లో 52 శాతం పరుగులు సూర్య బ్యాట్ నుంచే రావడం విశేషం. భారత్ 77/6 స్థితి నుంచి 161 పరుగులకు చేరడంలో, జట్టు విజయం సాధించడంలో సూర్య కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin) సూర్య ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు. గతేడాది నిరాశాజనక ఫామ్ తర్వాత సూర్య.. తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని కొనియాడాడు. సూర్య.. వికెట్ల వెనుక నుంచి పరుగులు రాబట్టడం ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాడు.
తన యూట్యూబ్ ఛానల్ ‘యాష్ కి బాత్’ కార్యక్రమంలో అశ్విన్ మాట్లాడాడు. ‘‘మొదట అమెరికా జట్టును అభినందించాల్సిందే. వాంఖడే స్టేడియం లాంటి సాధారణ బ్యాటింగ్‌కు అనుకూలమైన మైదానంలోనూ ఆ జట్టు బౌలర్లు సరైన ప్రణాళికతో వచ్చారు. షాడ్లీ వేగంగా బంతులు వేయలేదు. కానీ, కట్టర్లు.. వేరియంట్స్‌తో బౌలింగ్ చేశాడు. సూర్య కోసం ప్రత్యేక ప్రణాళికతో బౌలింగ్ చేసినట్లు అర్థమవుతుంది.
సూర్య క్రీజులోకి వచ్చాక మొదట ఆచితూచి ఆడాడు. పరుగులు తీసేందుకు కొంత ఇబ్బంది పడ్డాడు. 31 బంతుల్లో 45 పరుగులు చేయగలిగాడు. డెత్ ఓవర్లలో విజృంభించి.. 16 బంతుల్లోనే 38 పరుగులు రాబట్టాడు. అమెరికా జట్టులో ఉత్తమ బౌలరైన సౌరభ్ నేత్రావల్కర్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సూర్య చేసిన పరుగుల్లో 37 శాతం స్కోర్ వికెట్ల వెనుక నుంచే రావడం విశేషం. ఇది నిజమైన 360 డిగ్రీ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్. గతంలో కొన్ని జట్లు ఆ ఏరియాలోనే సూర్యని కట్టడి చేశాయి. కానీ, ఈ మ్యాచ్‌లో అతడు సమయం తీసుకున్నా.. మంచి ఫామ్‌లోకి వచ్చాడు. కెప్టెన్‌గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’’అని అశ్విన్ తెలిపాడు.
- నాకు కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే.. : సూర్యకుమార్ యాదవ్
సూర్య బ్యాటింగ్ పక్కన పెడితే.. భారత జట్టుకు ఈ మ్యాచ్ ఒక హెచ్చరికగా నిలుస్తుందని అశ్విన్ వ్యాఖ్యానించాడు. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం ఆందోళనకర విషయమన్నాడు. 2, 3 వికెట్లు పడిన తర్వాత కూడా భారత్.. పిచ్‌ను సరిగా అర్థం చేసుకోలేదని అన్నాడు. ఇది సాధారణ వాంఖడే పిచ్ కాదని ముందే గ్రహించి ఉంటే వికెట్లు కాపాడుకుంటూ చివర్లో దూకుడుగా ఆడేవారని, అలా చేసి ఉంటే మరో 20-30 పరుగులు వచ్చేవని అభిప్రాయపడ్డాడు. 161 పరుగులు కూడా డిఫెండ్ చేయగలిగే స్కోరేనని, శనివారం రాత్రి భారత్ అదే చేసిందని చెప్పాడు.
మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు. గతేడాది తనకు చాలా కష్టంగా గడిచిందని చెప్పాడు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత కొంతకాలం క్రికెట్ నుంచి మానసికంగా దూరంగా ఉండటం.. తను మళ్లీ ఫామ్‌లోకి రావడానికి దోహదపడిందని తెలిపాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
T20 World Cup: Surya Kumar returns to his form.. those runs are special: Ravichandran Ashwin

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: Suryakumar Yadav ( Suryakumar Yadav) saved the team from defeat in the T20 World Cup match against USA on Saturday night. He batted in his own style at a difficult time. He remained unbeaten with 84 runs off 49 balls. It is remarkable that 52 percent of the Indian team's score came from Surya's bat. Surya played a key role in helping India reach 161 runs from 77/6 and the team's victory. After the match, former Indian spinner Ravichandran Ashwin ( Ravichandran Ashwin) praised Surya's innings. After last year's disappointing form, Surya.. has come back to form. Surya said that scoring runs from behind the wickets was a special attraction in this match.
Ashwin spoke on his YouTube channel 'Ash Ki Baat'. "First of all, the American team should be congratulated. The team's bowlers came up with the right plan even on a ground that is conducive to normal batting like the Wankhede Stadium. Shadley did not bowl fast. But, he bowled with cutters.. variants. It is understood that he bowled with a special plan for Surya.
When Surya came to the crease, he played first. He had some trouble getting runs. He scored 45 runs in 31 balls. Exploding in the death overs, he scored 38 runs in just 16 balls. He bravely faced Saurabh Netrawalkar, the best bowler in the American team. It is remarkable that 37 percent of the runs scored by Surya came from behind the wickets. This is a true 360 degree batting masterclass. In the past, some teams have built Surya in that area. But, in this match he took time.. he came in good form. Ashwin said that he played an excellent innings as the captain.
- What coach Gautam Gambhir told me... : Suryakumar Yadav
Aside from Surya's batting...Ashwin commented that this match will be a warning for the Indian team. Losing four wickets in the Powerplay itself is a matter of concern. He said that even after losing 2 and 3 wickets, India did not understand the pitch properly. He believes that if he had realized earlier that this was not a normal Wankhede pitch, he would have saved the wickets and played aggressively at the end, if he had done that, he would have scored another 20-30 runs. He said that 161 runs is a score that can be defended and that is what India did on Saturday night.
Surya spoke after the match. He said that last year was very difficult for him. He said that being mentally away from cricket for some time after the South Africa series helped him to get back in shape. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :