Aamir Khan: అలా విడుదలై ఉంటే.. ‘ధురంధర్‌’ కలెక్షన్లు ఇంకా పెరిగేవి: ఆమిర్‌ఖాన్‌

Eenadu icon
By Entertainment Team Published : 08 Feb 2026 16:59 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్‌’ (Dhurandhar) బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 1300+ కోట్ల కలెక్షన్ల (Dhurandhar Collections)తో రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ఇంకా ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితమై ఉంటే.. మరిన్ని వసూళ్లు రాబట్టేదని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ పలు జిల్లాల్లో థియేటర్లు లేవని, వాటి సంఖ్య పెరిగినప్పుడే ఇండస్ట్రీలో మార్పొస్తుందని పేర్కొంటూ రీసెంట్‌ హిట్‌ ‘ధురంధర్‌’ను ఉదాహరణగా చెప్పారు. 5 వేలకుపైగా స్క్రీన్లలో ప్రదర్శితమైన ఈ చిత్రం 15 వేల థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే వసూళ్లు ఇంకా పెరిగేవి అని అన్నారు.

  • ఓటీటీలోనూ అదరగొడుతున్న ‘ధురంధర్’.. పాక్‌లో నెం.1

భారత్‌తో మరిన్ని థియేటర్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమిర్‌ వ్యాఖ్యానించారు. ‘‘చైనాలో దాదాపు లక్ష స్క్రీన్లు ఉంటే.. మన వద్ద 9 వేలకుపైగా ఉన్నాయి. చైనాలో విడుదలయ్యే సినిమాలకు మంచి బిజినెస్‌ జరుగుతోంది. గతేడాది విడుదలైన చైనీస్‌ మూవీ ‘నె ఝా 2’ సినిమా కలెక్షన్లు 2+ బిలియన్‌ డాలర్లు (18వేల కోట్లు+). భారత్‌లో ‘ధురంధర్‌’ వసూళ్లు 115 మిలియన్ డాలర్లు (రూ.1000+ కోట్లు)’’ అని అన్నారు. థియేటర్ల గురించి ఆమిర్‌ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. భారత్‌లో థియేటర్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని గత ఇంటర్వ్యూల్లోనూ పేర్కొన్నారు.

‘ధురంధర్‌’లాంటి సినిమాలు ఎన్ని?: ఎగ్జిబిటర్‌

ఆమిర్‌ కామెంట్లపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదికి చెందిన ఓ ఎగ్జిబిటర్‌ స్పందిస్తూ.. ‘ధురంధర్‌’లాంటి సినిమాలు ఏడాదికి ఎన్ని విడుదలవుతున్నాయో గ్రహించాలన్నారు. నిజంగానే థియేటర్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని, కానీ అంతకన్నా ముఖ్యంగా ఆ స్థాయిలో సినిమాలు రావాలన్నారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Aamir Khan: Had it been released.. 'Dhurandhar' collections would have increased further: Aamir Khan

Eenadu icon
By Entertainment Team Published : 08 Feb 2026 16:59 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Internet Desk: It is known that Ranveer Singh starrer 'Dhurandhar' was a huge success at the box office. This movie set a record with 1300+ crore collections (Dhurandhar Collections). Popular Bollywood actor Aamir Khan believes that if this movie had been shown in more screens, it would have earned more. Stating that there are still no theaters in many districts, it will change the industry only when their number increases and he cited the recent hit 'Dhurandhar' as an example. He said that if this film, which was shown in more than 5 thousand screens, had been released in 15 thousand theaters, the collections would have increased even more.

  • Dhurandhar, which is also popular in OTT... No.1 in Pakistan

Aamir commented that there is a need to make more theaters available with India. "If there are about one lakh screens in China, we have more than 9 thousand. Movies released in China are doing good business. Last year's Chinese movie 'Ne Jha 2' had a movie collection of 2+ billion dollars (18 thousand crores+). "Dhurandhar's collection in India is 115 million dollars (Rs. 1000+ crores)," he said. This is not the first time that Aamir has spoken about theatres. It has been mentioned in previous interviews that there is a need to increase the number of theaters in India.

How many movies like 'Dhurandhar'?: Exhibitor

Aamir's comments are being divided on social media. An exhibitor from the north responded.. He wants to understand how many films like 'Dhurandhar' are released every year. There is a real need to increase the number of theaters, but more importantly, movies should come at that level.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :