Mohammed Siraj: పండగలా దిగివచ్చాడు.. సిరాజ్ అంకితభావానికి హ్యాట్సాఫ్!

Eenadu icon
By Sports News Team Updated : 08 Feb 2026 18:03 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో క్రికెట్ సాధన చేస్తున్నాడు మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj). అప్పుడే అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది చేసింది టీమ్ ఇండియా ( Team India) మేనేజ్‌మెంట్‌. ప్రపంచకప్ ఆడాల్సిన హర్షిత్ రాణా గాయపడ్డాడని, తన స్థానంలో జట్టులోకి రావాలన్నది కాల్ సారాంశం. కొన్ని గంటల్లోనే ముంబయి విమానం ఎక్కేశాడు సిరాజ్. కట్ చేస్తే తర్వాతి రోజు రాత్రి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా యూఎస్‌ఏతో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగడమే కాదు.. 3 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మహ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం అన్నది ఎవ్వరూ ఊహించని విషయం. ఏడాదిన్నరకు పైగా టీ20 జట్టులోనే లేడు. చాలా కాలంగా జట్టు ఎంపికకు అతడిని పరిగణనలోకే తీసుకోవట్లేదు సెలక్టర్లు. టీమ్ ఇండియా తరఫున 45 టెస్టులు, 50 వన్డేలు ఆడి ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగిన సిరాజ్‌కు టీ20ల్లో మాత్రం పేలవ రికార్డు ఉంది. ప్రపంచకప్‌నకు ముందు అతను 16 టీ20లు ఆడి 32.28 సగటుతో 14 వికెట్లు మాత్రమే తీశాడు. టీ 20ల్లో పెద్దగా వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులిచ్చేస్తాడన్న ముద్ర పడిపోయింది అతడిపై. దీంతో అతడిని 2024 జులైలో శ్రీలంక పర్యటన తర్వాత టీ20 జట్టులోకే ఎంపిక చేయలేదు సెలక్టర్లు. బుమ్రా ( Jasprit Bumrah), అర్షదీప్ కాకుండా హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలకే ప్రాధాన్యం దక్కుతోంది. కానీ ప్రసిద్ధ్ చివరగా ఆడిన సిరీస్‌ల్లో పేలవ ప్రదర్శన చేయడంతో అతడిని పక్కన పెట్టేశారు. 

అనుకోకుండా తుది జట్టులోకి.. 

అయితే హర్షిత్ రాణా టోర్నీ ఆరంభానికి ఒక్క రోజు ముందు గాయపడడంతో అనూహ్యంగా సిరాజ్‌కు అవకాశం దక్కింది. కానీ.. ప్రత్యామ్నాయ బౌలర్‌గా ఎంచుకున్న సిరాజ్‌కు తుది జట్టులో చోటు కష్టమనే అనుకున్నారంతా. కానీ ప్రధాన పేసర్ బుమ్రా జ్వరం కారణంగా తొలి మ్యాచ్‌లో అందుబాటులో లేకుండా పోవడంతో అనుకోకుండా సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ 3 కీలక వికెట్లతో విజృంభించాడు సిరాజ్. 162 పరుగుల లక్ష్యం అంటే టీ20ల్లో పెద్ద కష్టమేమీ కాదు.

అమెరికా టాప్ ఆర్డర్ నిలబడితే ఛేదన సాధ్యమయ్యేదే. కానీ సిరాజ్ తన తొలి ఓవర్లోనే ప్రమాదకర ఆండ్రీస్ గాస్‌‌ను పెవిలియన్కు చేర్చాడు. తర్వాత తెలుగు కుర్రాడు సాయితేజ‌ను ఔట్ చేశాడు. మిడిలార్డర్లో ధాటిగా ఆడుతున్న శుభమ్ రంజానేకు కూడా చెక్ పెట్టి యుఎస్ఏ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. ఏడాదిన్నరగా టీ20 జట్టు ఛాయల్లోనే కనిపించని ఆటగాడు.. ఇప్పుడిలా టీ20 ప్రపంచకప్ ఆడడం, సత్తా చాటడం అనూహ్యం అనే చెప్పాలి.

గాయపడటం అరుదు!

మహ్మద్ సిరాజ్ అంటే అంకితభావానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఫాస్ట్ బౌలర్లు ఎంత సున్నితంగా తయారయ్యారో, ఫిట్‌నెస్ సమస్యలతో ఎలా సతమతం అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే చాలా సెలక్టివ్‌గా మ్యాచ్‌లు ఆడుతున్నారు. కానీ సిరాజ్ అలా కాదు. అతను గాయపడడం, విశ్రాంతి తీసుకోవడం అరుదు. టీ20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టడానికి ముందు అతడు హైదరాబాద్ తరఫున రెండు రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఆ జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధించి ఉంటే శుక్రవారం కూడా మ్యాచ్ ఆడుతూ ఉండేవాడు. రంజీ ట్రోఫీ కంటే ముందు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో, అంతకుముందు టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. టెస్టులు, వన్డేల్లో టీమ్‌ఇండియా కీలక బౌలర్‌గా ఉంటూ ఇలా మూడు ఫార్మాట్లలో దేశవాళీ క్రికెట్ ఆడుతున్నది ఒక్క సిరాజ్ మాత్రమే. రంజీ మ్యాచ్ అవ్వగానే విశ్రాంతి తీసుకోకుండా హైదరాబాద్‌లో సాధన చేస్తూ ఉన్నాడు సిరాజ్. అదీ అతడి నిబద్ధత. 

- ఈనాడు క్రీడా విభాగం
 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 15:18 IST

English Translation

Mohammed Siraj: Come down like a festival.. Hats off to Siraj for his dedication!

Eenadu icon
By Sports News Team Updated : 08 Feb 2026 18:03 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

Friday. Mohammed Siraj ( Mohammed Siraj) is practicing cricket at the police academy in Hyderabad. Just then he got a phone call. It was done by Team India ( Team India) management. The gist of the call was that Harshit Rana, who was supposed to play in the World Cup, was injured and had to replace him in the team. Siraj boarded the Mumbai flight within a few hours. If cut, he not only played in the first match that India played against the USA as part of the T20 World Cup the next night.. He played a key role in the team's victory with 3 wickets.

Mohammed Siraj playing in the T20 World Cup is something that no one expected. He was not in the T20 team for more than a year and a half. For a long time the selectors did not consider him for team selection. Siraj, who played 45 Tests and 50 ODIs for Team India and became one of the main bowlers, has a poor record in T20s. Before the World Cup, he played 16 T20Is and took only 14 wickets at an average of 32.28. Although he did not take many wickets in T20s, he got the impression that he runs freely. As a result, the selectors did not select him in the T20 team after the tour to Sri Lanka in July 2024. Apart from Bumrah ( Jasprit Bumrah), Arshadeep, Harshit Rana and Prasad Krishna are getting priority. But after poor performance in the last series played by Prasam, he was sidelined. 

Unexpectedly in the final team..

However, Harshit Rana was injured a day before the start of the tournament and unexpectedly Siraj got a chance. But... everyone thought that Siraj, who was chosen as a substitute bowler, would have a difficult time in the final team. But as the main pacer Bumrah was unavailable for the first match due to fever, Siraj unexpectedly got a place in the final team. Taking full advantage of this opportunity, Siraj exploded with 3 crucial wickets. A target of 162 runs is not a big challenge in T20s.

If America's top order stands, it is possible to break through. But Siraj took the dangerous Andres Gass to the pavilion in his first over. Then he dismissed the Telugu boy Saiteja. Shubham, who is playing hard in the middle order, also checked Ramzane and played a vital role in USA's defeat. A player who has not been seen in the shadow of the T20 team for a year and a half.. It must be said that he is playing in the T20 World Cup and showing his potential. It is understandable how sensitive fast bowlers have become these days and how they are plagued with fitness issues. That is why they are playing matches very selectively. But Siraj is not like that. He rarely gets injured and rests. He played two Ranji matches for Hyderabad before entering the T20 World Cup. Had the team qualified for the quarters, he would have played the match on Friday. Before the Ranji Trophy, he played in the domestic ODI tournament Vijay Hazare Trophy and earlier in the T20 tournament Mushtaq Ali Trophy. Being the key bowler of Team India in Tests and ODIs, only Siraj is playing domestic cricket in these three formats. As soon as the Ranji match was over, Siraj was practicing in Hyderabad without resting. That is his commitment. - Eenadu Sports Section rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 15:18 IST