constitutional goals: రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరాలంటే...

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
డెబ్బై ఆరేళ్ల కిందట ఇదేరోజున రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఇండియా గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అప్పటికి నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక సామాజిక అసమానతలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. అవి సమసిపోయి సామాన్యుల జీవితాలు బాగుపడటమనేది సార్వత్రిక వయోజన ఓటు హక్కులోంచి ఉద్భవించే ప్రజాతంత్ర ప్రభుత్వాలతోనే సాధ్యపడుతుందని రాజ్యాంగ సభ సభ్యులు గట్టిగా విశ్వసించారు. అందుకుగానూ ఎన్నికల ప్రక్రియ లోపరహితం కావాలని వారు కోరుకున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగకపోతే సంవిధాన సౌధ పునాదులే దెబ్బతింటాయని ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హెచ్చరించారు. ప్రజలు తమ ఓటు హక్కును ఎవరికీ దాసోహం చేయకూడదని ఆయన హితవు పలికారు. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం ఎన్నికల పవిత్రతకు ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకూడదని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎలక్షన్లను పకడ్బందీగా నిర్వహించేందుకు స్వతంత్ర ఎన్నికల యంత్రాంగం ఏర్పాటుకు జాతినిర్మాతలు ఓటేశారు. జనజీవనంలో వారు ఆశించిన మార్పులు ఎంతవరకు సాకారమయ్యాయని చూస్తే ఆవేదనే మిగులుతుంది!
ప్రజాస్వామ్యమూ ఎన్నికలపై ఓ అంతర్జాతీయ సదస్సుకు తాజాగా దిల్లీ ఆతిథ్యమిచ్చింది. ఓటర్ల జాబితాలను పక్కాగా రూపొందించడం, ఎన్నికలను పారదర్శకంగా సక్రమంగా నిర్వహించడం, జనతంత్ర స్ఫూర్తిని కబళిస్తున్న తప్పుడు సమాచార వెల్లువను కట్టడి చేయడం వంటి తీర్మానాలను ఆ సదస్సులో పాల్గొన్న 40కి పైగా దేశాల ఎన్నికల నిర్వహణా యంత్రాంగాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దశాబ్దాల క్రితమే దేశీయంగా ధనవంతుల క్రీడాంగణంగా, ప్రలోభాల జాతరగా తయారైన ఎన్నికల ప్రక్రియను చక్కదిద్దడం అంత తేలికేమీ కాదన్నది చేదు నిజం! అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు ఆడుతున్న అరాచక క్రీడలో జాబితాల్లోంచి అర్హుల పేర్లు మాయమై బోగస్ ఓట్లు వచ్చి చేరుతుండటం జనస్వామ్య ప్రారబ్ధం. గతంలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంగా వేలాది నకిలీ ఓటర్ కార్డులు వెలుగు చూడటం దేశాన్ని దిగ్భ్రాంతపరిచింది. అప్పట్లో ఒకే డోర్ నంబర్‌తో పదికి పైగా ఓట్లు ఉన్న ఇళ్ల సంఖ్య ఏపీలో లక్షన్నరకు మించి తేలడమూ కలవరపరిచింది. పశ్చిమ్ బెంగాల్‌లోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో 389 మంది ఓటర్లకు తండ్రిగా ఒకరి పేరే ఉందని, మరోచోట 310 మందికి మరో వ్యక్తి నాన్నగా నమోదయ్యాడని కేంద్ర ఎన్నికల సంఘమే సుప్రీంకోర్టుకు ఇటీవల సమాచారమిచ్చింది. ప్రజాస్వామ్యం నామమాత్రంగా మిగలకూడదంటే తప్పుడు ఓట్లన్నింటినీ జాబితాల్లోంచి పూర్తిగా ఏరేయాలి. అర్హుల్లో ఏ ఒక్కరూ ఓటుహక్కుకు దూరం కాకుండా చూడాలి!
నీతీ నిజాయతీ ప్రజాసేవానురక్తి పుష్కలంగా ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేనివారు నేడు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం అసంభవంగా మారిపోయింది. 1999 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలన్నీ కలిసి వెచ్చించిన సొమ్ము రూ.9 వేల కోట్లు అయితే, గత సార్వత్రిక సమరంలో ఆ మొత్తం రూ.1.35 లక్షల కోట్లకు చేరినట్లు అంచనా! నల్లధనాన్ని వెదజల్లి ఓట్లు గుప్పిటపడుతున్నవారు ఆపై అంతకంతా సంపాదించే ధ్యేయంతో ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. దానివల్ల ప్రజా ప్రగతి కుంటుపడుతోంది. అసమానతలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో ధనస్వామ్యానికి అడ్డుకట్ట పడాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పదునుతేల్చాలి. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా ప్రచారమవుతున్న నకిలీ వార్తలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రహసనంగా మారుస్తున్నాయి. వాటి ముసుగులను తొలగిస్తూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అత్యవసరం!
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
constitutional goals: If constitutional goals are to be fulfilled...

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Twenty-six years ago on this day, India emerged as a republic with the coming into force of the Constitution. By then, illiteracy, unemployment, poverty and economic and social inequality plagued the country. The members of the Constituent Assembly strongly believed that their elimination and the improvement of the lives of the common people would only be possible with democratic governments emerging from universal adult suffrage. For that, they wanted the election process to be flawless. First Prime Minister Jawaharlal Nehru warned that if elections are not held in a free and fair manner, the foundations of the Constitution will be damaged. He said that people should not surrender their right to vote to anyone. Constitutional architect Dr. BR Ambedkar also emphasized that the sanctity of elections should not be disturbed under any circumstances. In this order, the nation builders voted for the establishment of an independent election mechanism to conduct the elections which are vital to democracy. Seeing how far the changes they expected in the life of the people have been realized, one can feel the pain!
Delhi has recently hosted an international conference on democracy and elections. The election management mechanisms of more than 40 countries participating in the conference unanimously approved the resolutions of preparing voter lists accurately, conducting elections in a transparent and fair manner, and curbing the flow of false information that is engulfing the spirit of democracy. It is a bitter truth that it is not so easy to fix the election process, which was made as a playground for the rich domestically and a fair of temptations decades ago! In the anarchic game where political parties are playing for power, the names of the deserving ones are disappearing from the lists and the bogus votes are pouring in. Earlier, during the Tirupati Lok Sabha by-election, thousands of fake voter cards came to light shocked the nation. At that time, the number of houses with more than ten votes with the same door number was more than one and a half lakh in AP. The Central Election Commission has recently informed the Supreme Court that in an assembly constituency in West Bengal, 389 voters have the same name as their father, while another person has been registered as the father of 310 voters elsewhere. If democracy is not to remain nominal, all false votes should be completely removed from the rolls. Anyone who is eligible should not be far away from the right to vote!
Despite the abundance of ethical and honest public service, today it has become impossible for those who do not have the financial means to contest the elections and win. In the 1999 Lok Sabha elections, the money spent by all the parties together was Rs. 9 thousand crores, but in the last general election, the amount is estimated to have reached Rs. 1.35 lakh crores! Those who spread black money and steal votes and then commit many illegalities with the intention of earning all that. Because of that, the progress of the people is retarded. Inequality is increasing. The Representation of the People Act should be strengthened to prevent money laundering in elections. During elections, fake news spread on social media is affecting public opinion and making democracy a farce. It is imperative to make special arrangements to remove their masks and inform the public of the facts from time to time!
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :