DRDO: వందల కి.మీ. దూరం చిన్నబోతుంది!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 26 Jan 2026 06:55 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, కర్నూలు: సముద్రంపై సుదూరంగా ఉన్న శత్రు దేశాల యుద్ధనౌకలను తుత్తునియలు చేసేందుకు సిద్ధం చేసిన దేశ తొలి లాంగ్‌రేంజ్‌ యాంటీ షిప్‌ హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ మిసైల్‌ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం) మొదటిసారి కనిపించనుంది. దిల్లీలో సోమవారం జరగనున్న గణతంత్ర వేడుకల కవాతులో దీనిని ప్రదర్శిస్తారు. ఈ క్షిపణి పరిధి 1500 కి.మీ. కాగా గంటకు 6,100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లేబొరేటరీలో అభివృద్ధి చేసిన ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎంను 2024 నవంబర్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇందులో విజయం సాధించడంతో మరో రెండేళ్లలో సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.

  • సముద్రజలాల్లో వేగంగా ప్రయాణించే యుద్ధనౌకలను ఈ క్షిపణి కచ్చితంగా గుర్తించి 100 శాతం ధ్వంసం చేస్తుంది. 
  • హైపర్‌సోనిక్‌ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణిని శత్రుదేశ యుద్ధనౌక గుర్తించేలోపే పని ముగిసిపోతుంది. ఇందుకోసం ఏరో డైనమిక్‌ డిజైన్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
  • ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎంను ప్రత్యేకంగా తయారుచేసిన మొబైల్‌ లాంఛర్‌ నుంచి ప్రయోగిస్తారు.
  • ‘బూస్ట్‌ అండ్‌ గ్లైడ్‌’ సాంకేతికతను దీనికి వినియోగించారు. ప్రయోగించిన మరుక్షణమే గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది.
  • భూ ఉపరితలాలపై ఉన్న లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదిస్తుంది.
  • శత్రుదేశ రాడార్లు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు దీని రాకను గుర్తించలేవు.
  • ఎలాంటి యుద్ధనౌకలనైనా క్షణాల్లో ధ్వంసం చేస్తుంది.
  • అతితక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తూ లక్ష్యాలను చేరుకోగలగడం దీనికున్న మరో ప్రత్యేకత. అన్ని రకాల పేలోడ్‌లనూ మోసుకెళ్లగలదు.

డీఆర్‌డీవో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లుగా తెలుగువారైన ఎ.ప్రసాద్‌గౌడ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన ఆయన.. 30 సంవత్సరాల కిందట డీఆర్‌డీవోలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

హైపర్‌సోనిక్‌ క్షిపణులతో సుదూరంలోని లక్ష్యాలను మరింత వేగంగా, అత్యంత కచ్చితత్వంతో ఛేదించవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాయుసేన, పదాతి దళాల అవసరాలకు వీలుగా ఉండేలా మరిన్ని రకాల క్షిపణి వ్యవస్థలను తీర్చిదిద్దుతున్నాం.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 06:51 IST

English Translation

DRDO: Hundreds of km. The distance is getting smaller!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 26 Jan 2026 06:55 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Today, Kurnool: Country's first long-range missile prepared to engage warships of enemy countries far away at sea The Anti-Ship Hypersonic Glide Missile (LRASHM) will make its debut. It will be displayed at the Republic Day Parade in Delhi on Monday. The range of this missile is 1500 km. It travels at a speed of 6,100 km per hour. LRASHM, developed at the Advanced Systems Laboratory, Hyderabad, was experimentally tested in November 2024. With the success of this, it will be introduced in the army in the next two years.

  • This missile can accurately identify and destroy 100 percent of warships traveling fast in sea waters. 
  • This missile travels at hypersonic speed and the mission is over before an enemy warship can detect it. Specially designed with aero dynamic design for this purpose.
  • LRASHM is launched from a specially prepared mobile launcher.
  • Boost and Glide technology is used for this. The moment it is launched, it rushes at maximum speed.
  • It easily destroys the targets on the ground surfaces.
  • Enemy radars and air defense systems cannot detect its arrival.
  • It destroys any warships in seconds.
  • It can reach the targets while traveling at a very low altitude. It can carry all types of payloads.

A. Prasad Goud, who is a Telugu, has been acting as the director of this project which has been taken up by DRDO. Hailing from Don, Nandyala district.. He joined DRDO less than 30 years ago and rose step by step to reach higher level. Missiles can engage long range targets faster and with greater accuracy. Using this knowledge we are developing more types of missile systems to meet the needs of air force and infantry forces.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 06:51 IST