జన ‘గణ’ మన అధినాయిక జయహో

త్రివిధ దళాల్లో మహిళా నాయకత్వం పెరుగుతోంది. కవాతుల్లో పాల్గొంటూ, సేనల్ని నడిపిస్తూ... దేశ రక్షణలో నారీ భేరి మోగిస్తున్నారు.

Eenadu icon
By Vasundhara Team Updated : 26 Jan 2026 01:14 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
18 min read

త్రివిధ దళాల్లో మహిళా నాయకత్వం పెరుగుతోంది. కవాతుల్లో పాల్గొంటూ, సేనల్ని నడిపిస్తూ... దేశ రక్షణలో నారీ భేరి మోగిస్తున్నారు. విధి నిర్వహణలో, వ్యవసాయంలో అహర్నిశలూ శ్రమిస్తూ సామాన్య మహిళలూ అసామాన్య ప్రతిభను కనబరుస్తూ... దేశ ప్రగతిలో నారీశక్తిని చాటుతున్నారు. తమ సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే గౌరవాన్ని పొందారీ మహిళలు. కళలు, ప్రజాసేవ, వైద్యం... ఏ రంగంలో ఉన్నా తమ పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తూ అక్కడ సమూల మార్పు తెస్తున్నారు మహిళలు. అందుకు ఉదాహరణే గణతంత్ర దినోత్సవం వేళ విరిసిన ఈ పద్మాలు...

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామం ఖైర్‌డాట్వా. ఇక్కడ ఇప్పపువ్వు లడ్డూలు తయారుచేస్తున్నశాంతాబాయికి రాష్ట్రపతి భవన్‌ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.

క్తహీనతతో బాధపడుతున్న ఆదివాసీ చిన్నారులకు ప్రొటీన్, విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఇప్పపువ్వుతో చేసిన తినుబండారాలు అందించాలన్నారు వైద్యులు. దీంతో ఐటీడీఏ అధికారులు గతేడాది ఖైర్‌డాట్వాకు వచ్చి పెందోర్‌ శాంతాబాయికి లడ్డూల తయారీపై శిక్షణ ఇప్పించారు. తర్వాత గ్రామంలో లడ్డూల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు ఆమె. మహిళా సంఘానికి చెందిన మరో 12 మందికీ తయారీని నేర్పించారు. 5 కిలోల ఇప్పపువ్వు, 2 కిలోల నువ్వులు, 40గ్రాముల చొప్పున బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పు, యాలకులు, రెండు కిలోల బెల్లం, కిలో చక్కెర, రెండు కిలోల వేరుసెనగలను మిక్సీ చేస్తారు. వీటన్నింటినీ నెయ్యిలో వేయించి చేతితోనే లడ్డూలు తయారుచేసేవారు. గతేడాది ఆగస్టులో జిల్లా కలెక్టర్‌ రాజర్షీషా చొరవతో మహిళా సంఘానికి ఇందిరా క్రాంతిపథం ద్వారా రూ.5 లక్షల రుణం మంజూరైంది. ప్రస్తుతం యంత్రాలతో లడ్డూలు తయారు చేస్తున్నారు. వీటిని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో అందిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లోనూ విక్రయిస్తున్నారు. ‘ఆదివాసీల లడ్డూలకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో గర్వంగా ఉంది. రాష్ట్రపతి భవనానికి లడ్డూల్ని తీసుకువెళ్తున్నా. దీన్నో అదృష్టంగా భావిస్తున్నా. పోషకాలు కలిగిన ఈ లడ్డూలను అధికారులు గుర్తించి ప్రాచుర్యం కలిగించడం సంతోషకరం’ అని చెబుతారు శాంతాబాయి.

మైసూర్‌ మల్లిక, బ్లాక్, రెడ్‌ రైస్‌... తదితర దేశీ వరి వంగడాలను సేంద్రియ విధానంలో పండిస్తున్నారుయర్రు స్వాతి. ప్రకృతి సాగు ఆమెకు ఆర్థిక బలాన్ని చేకూర్చడమే కాదు, రాష్ట్రపతితో తేనేటి విందులో పాల్గొనే గౌరవాన్నీ అందించింది.

గుంటూరు జిల్లా, అత్తోటకు చెందిన స్వాతి డిగ్రీ చేశారు. 2016లో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన స్వాతి... తర్వాత కోలుకున్నారు. దాంతో ఆమెకు ఆరోగ్య స్పృహ మరింత పెరిగింది. పొదుపు సంఘాల మహిళలకు ప్రకృతి వ్యవసాయ విభాగం వాళ్లు సేంద్రియ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులకు హాజరయ్యారు. ‘అనేక అనారోగ్యాలకు రసాయనాలే కారణం, సహజ సాగుతో ఆ సమస్యను నివారించి భూమి నిస్సారంగా మారడాన్ని నియంత్రించవచ్చ’న్న మాటలతో, క్షేత్ర స్థాయి పర్యటనలతో స్ఫూర్తిపొందారు. భర్త సత్యనారాయణ ప్రోత్సాహంతో 2017లో తమకున్న రెండు ఎకరాల్లో ప్రకృతి సాగుకు సిద్ధమయ్యారు. అందుకు దేశీ వరి రకాలనే ఎంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రోత్సాహం అందడంతో మరో 18 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. ఈమె సాగు విధానాల్ని తెలుసుకునేందుకు సుదూర ప్రాంతాల రైతులు వస్తుంటారు. గతేడాది అక్టోబరులో దిల్లీలో జరిగిన సేంద్రియ సాగు సదస్సులో ప్రధాని మోదీ నుంచి అభినందనలు పొందారు స్వాతి. అక్కడ ‘పార్టిసిపేటెడ్‌ గ్యారంటీ సర్టిఫికెట్ (పీˆజీసీ)’ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. దీంతో సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సులభంగా లభిస్తుంది. తాజాగా గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు. ‘రైతులందరూ ఈ విధానాన్ని అవలంబిస్తే ఇటు ప్రజలకూ అటు భూమాతకూ ఎంతో మేలు’ అని వివరిస్తారు స్వాతి.

కొన్ని పాటలు కొందరు తప్ప వేరెవరు పాడినా... ప్రేక్షకుల మనసు దోచుకోలేవు. ఎందు కంటే... పాటలు మనల్ని అలరించడమే కాదు, ఒక థెరపీలానూ పనిచేస్తాయి. అలా తన మధురమైన గాత్రంతో అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు బాలీవుడ్‌ ప్రముఖ గాయనిఅల్కా యాగ్నిక్‌.

‘చమ్మా... చమ్మా’, ‘ఏక్‌... దో... తీన్‌’ అంటూ నాటి అభిమానుల్ని ఉర్రూతలు ఊగించినా... ‘అగర్‌ తుమ్‌ సాత్‌ హో’ అంటూ నేటి తరాన్ని ఆకట్టుకున్నా ఆమెకే సొంతం. అల్కా గాత్ర సామర్థ్యం, బహుముఖ ప్రజ్ఞ, శాస్త్రీయ సంగీతానికి ఆమె అందించిన సేవల్ని ప్రశంసించని వాళ్లు లేరు. ఈ సేవలకు గానూ పద్మభూషణ్‌ని అందుకున్నారీమె. అయితే ఈ రంగంలో ఆమె ప్రవేశం అంత సులభంగా జరగలేదు. కోల్‌కతాలో పుట్టి పెరిగారీమె. అమ్మ శుభ, శాస్త్రీయ సంగీత కళాకారిణి. అల్కాకు నాలుగేళ్లు ఉన్నప్పట్నుంచే సంగీతం నేర్పడం మొదలుపెట్టారు శుభ. ఆరేళ్లప్పుడే ఆల్‌ ఇండియా రేడియోలో పాటలు పాడించారు. విన్నవారంతా మంత్రముగ్ధులై... ‘సినీరంగంలో అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది’ అన్నారట. దాంతో అల్కాను తీసుకుని ముంబయికి వచ్చారు శుభ. అసలు సవాళ్లు మొదలైంది అక్కడ్నుంచే. ‘గొంతు బాగుంది కానీ, గాయనిగా పరిచయం చేయడానికి ఈమెకు ఇంకా వయసుంద’ని చెప్పేవారట. అలా ఎన్నో విఫలయత్నాల తర్వాత... 14ఏళ్ల వయసులో తొలిసారిగా సినిమాలో పాడారు అల్కా. అది మొదలు ఆమె వెనుదిరగలేదు. ఇప్పటివరకూ 25 భాషల్లో దాదాపు 22వేల పాటల్ని పాడారీమె. బాలీవుడ్‌ మహిళా విభాగంలో లతామంగేష్కర్, ఆశా భోస్లే తర్వాత అత్యధిక సోలో సాంగ్స్‌ పాడిన గాయని అల్కానే. పాత పద్ధతులు, బాణీలే పాడతాను అంటూ గిరిగీసుకోలేదీమె. బీటీఎస్, టేలర్‌ స్విఫ్ట్‌ వంటి బ్యాండ్‌లతోనూ పోటీ పడి... యూట్యూబ్‌లో అత్యధికంగా స్ట్రీమింగ్‌ అయిన గాయనిగా గ్లోబల్‌ ర్యాంకునూ సాధించారు అల్కా.

‘మీ పాప మంచి నృత్యకారిణి అవుతుందేమోనమ్మా’ అన్నారట డాక్టర్‌...దీపికా రెడ్డిపుట్టినప్పుడు. ఆ మాట నిజం చేస్తూ నిజంగానే కూచిపూడిలో తనదైన ముద్ర వేశారు దీపిక. దేశవిదేశాల్లో గుర్తింపు సాధించిన ఆమె కళారంగంలో తన కృషికి గుర్తింపుగా తాజాగా పద్మశ్రీకి ఎంపికయ్యారు.

ల్లి కూడా శాస్త్రీయ నృత్యకారిణి. దీంతో దీపిక కూడా నాట్యంవైపు ఆకర్షితురాలయ్యారు. ఆరేళ్ల వయసులోనే నేర్చుకోవడం మొదలుపెట్టారు. 11ఏళ్ల వయసులోనే ప్రదర్శనలూ ఇవ్వడం ప్రారంభించారీమె. చిన్నవయసులోనే అరంగేట్రం కూడా చేశారు. అయితే నేర్చుకున్నది మాత్రం కూచిపూడి. మొదట సుమతి కౌశల్‌ దగ్గర నాట్యంలో ఓనమాలు దిద్దిన ఆమె వెంపటి చిన సత్యం శిష్యరికంలో మరింత రాటుదేలారు. పెళ్లయ్యాకా నాట్యాన్ని వదల్లేదు. దేశీయంగా ఖజురహో, కోణార్క్, హంపి... వంటి ఎన్నో

చరిత్రాత్మక ప్రాంతాల్లోనే కాదు... జర్మనీ, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, రష్యా, జపాన్‌... ఇలా ఎన్నో దేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించారు. శివ సతీయం, శాంతి జీవనం, స్త్రీ త్రయం వంటి డ్యాన్స్‌- డ్రామాలనీ కంపోజ్‌ చేశారు. అయిదు పదుల వయసు దాటినా ప్రదర్శనలిచ్చారు. అయోధ్య రామమందిరం, తాజా మహా కుంభమేళాల్లోనూ నర్తించారు. కూచిపూడి కళాకారిణిగా తనకంటూ గుర్తింపు సాధించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్న, తెలంగాణ రాష్ట్ర అవార్డు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ వంటి పురస్కారాలెన్నో అందుకున్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి ఛైర్‌పర్సన్‌గానూ పనిచేశారు. కూచిపూడి నృత్యాన్ని తరవాతి తరాలకీ అందించాలని భావించిన ఆమె 2000వ సంవత్సరంలో ‘దీపాంజలి’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. అన్ని వర్గాలవారికీ శాస్త్రీయ నృత్యాన్ని అందుబాటులోకి తెచ్చి, ఎంతోమందిని నృత్యకారులుగానూ తీర్చిదిద్దారు. ఇప్పుడు తన శిష్యులు దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తున్నారు. నృత్యం మన సంస్కృతిలో భాగం. దాని ద్వారానూ సమాజాన్ని తీర్చిదిద్దొచ్చు అని నమ్ముతారీమె.

సామాజికాంశాలతో...

కూచిపూడి నాకు ఓ కళ కాదు.. భగవంతుడికి చేసే ఆరాధన. ఈ కళను భావితరాలకు అందించడమే కాదు... దీని వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తున్నా. పద్మశ్రీ అవార్డు ఆ కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. వెంపటి చినసత్యంగారు నేర్పిన మెలకువలే నేనీ రంగంలో మరింత గొప్పగా రాణించేలా చేశాయి. అమ్మ కూడా నృత్య కళాకారిణే. 1961లో రవీంద్ర భారతి ప్రారంభోత్సవ సమయంలో చిత్రాంగద బ్యాలే చేసింది తను. నేనూ 11ఏళ్ల వయసులో ఆ వేదిక మీదే రంగ ప్రవేశం చేశా. ఆ కార్యక్రమానికి హాజరైన అక్కినేని నాగేశ్వరరావుగారు నేను కూచిపూడి నృత్యానికి టార్చ్‌బేరర్‌గా నిలుస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ మాట సార్థకమైందని అంతా అంటుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది.

ఈ కళ భవిష్యత్తు తరాలకూ చేరువ కావాలనే ఆలోచనతో కూచిపూడి నృత్యాన్ని కేవలం పౌరాణిక, ఇతిహాస ఇతివృత్తాల మీదే కాదు... పర్యావరణం, మహిళా సమస్యలు, సహజ రంగులు, తెలుగు రాష్ట్రాల కళలు వంటివెన్నో చూపించడానికీ ప్రయత్నిస్తున్నాం. నా తల్లిదండ్రులతో పాటు నా భర్త శ్యామ్‌గోపాల్, పిల్లలు శ్లోక, అభినవ్‌ల ప్రోత్సాహం ఎంతో!

చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పండే యాపిల్‌ని...ఎడారి ప్రాంతంలో పెంచడం సాధ్యమేనా అనేది మనందరి ప్రశ్న అయితే, దాన్ని సుసాధ్యం చేసి చూపించారు రాజస్థాన్‌కి చెందిన రైతుసంతోష్‌ దేవి. ఈ కృషికి గుర్తింపుగానే రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నారు.

ది ఏళ్ల కష్టానికి దక్కిన గౌరవం అంటారామె. సంతోష్‌ దేవి ఖేదర్‌ది రాజస్థాన్‌లోని బెరి. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తితో 2008లో ఆమె ఇటువైపు వచ్చారు. భర్త ఉద్యోగానికీ, పిల్లలు స్కూలుకీ వెళ్లాక ఆమె పొలం పనులు మొదలుపెట్టేవారు. రకరకాల ప్రయోగాలూ చేసేవారు. ఆ అనుభవమే ఆమెకు యాపిల్‌ పండించాలన్న ఆలోచన కలిగించింది. ఇందుకోసం హిమాచల్‌ ప్రదేశ్‌కి చెందిన ఓ రైతు అభివృద్ధి చేసిన ప్రత్యేక యాపిల్‌ రకాన్ని ఎంచుకున్నారు. ఆ సమయంలో ఆమెను చూసి అంతా అధిక ఉషోగ్రతలు నమోదయ్యే చోట అసాధ్యమని కొట్టిపారేశారు. కానీ, తాను మాత్రం అవేవీ పట్టించుకోలేదు. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి  ఆవుమూత్రం, వేప, ఉమ్మెత్త... లాంటివి వాడి సొంతంగా ఎరువులు తయారు చేసుకునేవారు. జీవామృతం, పంచగవ్య లాంటివి వాడేవారు. నీటికొరతను అధిగమించడానికి డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిని ఎంచుకున్నారు. ఇవన్నీ ఫలించాయి. రెండో ఏడాది నుంచే కాపు మొదలైంది. ఎటువంటి రసాయనాలూ వాడకుండా సహజంగా పండించడంతో మంచి ధర కూడా పలుకుతోంది. దాంతో అదే వ్యాపారంగా మలుచుకున్నారామె. వీటితో పాటు దానిమ్మ, బత్తాయి, నిమ్మ, సపోటాలనూ పండిస్తున్నారు. ఎకరం భూమిలో పండ్లతోటలు సాగు చేస్తుండగా, మరో అరెకరంలో నర్సరీని ఏర్పాటు చేశారు. ఏటా లక్షల రూపాయలు ఆదాయన్ని అందుకుంటున్నారు. ఔత్సాహికులకు సేంద్రియ సాగులో శిక్షణా అందిస్తున్నారు.

పోరాటం, కృతనిశ్చయం, ఆత్మవిశ్వాసాలకు ఓ రూపం ఇవ్వమంటే కెప్టెన్‌హంసజా శర్మని చూపించొచ్చేమో! సైన్యంలోకి రావడానికీ, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికీ ఆమె చేసిన కృషి ఎంతో. కాబట్టే, గణతంత్ర దినోత్సవం నాడు ఏవియేషన్‌ స్క్వాడ్రన్‌ని ముందుండి నడిపే అవకాశాన్ని అందుకున్నారామె.

‘నీతో నువ్వు కఠినంగా ఉండు’... హంసజాని చిన్నప్పట్నుంచీ ఎక్కువ ఆకర్షించిన వాక్యమిది. స్కూల్లో పరిచయమైన దీన్ని తను జీవితాంతం పాటిస్తూనే ఉన్నారు. కాబట్టే, తను కోరుకున్న రంగంలోకి అడుగుపెట్టగలిగారామె. హంసజాది జమ్మూ. చుట్టూ ఎన్నో ఆకర్షణలున్నా... ఆమెను ఆకట్టుకున్నది మాత్రం సైన్యం. అమ్మాయివి, కష్టమని ఎవరైనా అన్నా... ‘అవును అమ్మాయినే! అయితేనేం రెక్కలు కట్టుకుని ఎగురుతూ దేశాన్ని రక్షిస్తా. నాకు ఆ బలముంది’ అని సమాధానమిచ్చేవారట. కాబట్టే, తిరస్కరణలు ఎన్ని ఎదురైనా తలవంచలేదామె. అర్హత సాధించాకా అనారోగ్యం అడ్డుపడింది. అయినా సర్జరీ చేయించుకుని మరీ నాసిక్‌లోని కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో అడుగుపెట్టారు. టాపర్‌గా నిలిచి బెస్ట్‌ కంబాట్‌ ఏవియేటర్లు అందుకునే ‘సిల్వర్‌ చీతా ట్రోఫీ’ని గెలిచారు. దాన్ని పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. రుద్ర ఆర్మ్‌డ్‌ హెలికాప్టర్‌ని నడిపిన తొలి భారతీయ మహిళ హంసజా. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నిర్వహిస్తోన్న ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎయిర్‌ లాస్‌ కోర్సునీ చేశారు. ఆ పట్టా అందుకున్న తొలి వ్యక్తి కూడా కెప్టెన్‌ హంసజానే. ఆ పట్టుదల, ధైర్యంతోనే తాజాగా గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఆర్మీ ఏవియేషన్‌ నాయకత్వం వహించే అవకాశం అందుకున్నారు. 251 మందితో కూడిన బృందాన్ని ముందుండి నడిపించనున్నారామె. ఒంటరి తల్లి పెంపకంలో పెరిగారు హంసజా. జర్నలిస్ట్‌ అయిన తల్లి నుంచే ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ వంటివి తనకు అలవడ్డాయంటారామె. కాబట్టే, అమ్మాయిలు అరుదుగా ఉండే రంగంలోకి అడుగుపెట్టగలిగా అంటారు హంసజా. ఈమె విజయాల్ని సైన్యంలో నారీశక్తికి చిహ్నంగా అభివర్ణిస్తున్నారంతా.

రిపబ్లిక్‌ పరేడ్‌లో ఎంతోమంది మహిళలు దళాలను నడిపించారు. కానీ అసిస్టెంట్‌ కమాండెంట్‌సిమ్రన్‌బాలా మాత్రం చరిత్ర సృష్టించారు. ‘ఆల్‌ మేల్‌ సీఆర్‌పీఎఫ్‌ కంటింజెంట్‌’ను ముందుండి నడిపించనున్నారామె. ఆ ఘనత సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గానూ నిలిచారు.

26ఏళ్ల సిమ్రన్‌ బాలాది జమ్మూ కశ్మీర్‌లోని నౌషెరా. సరిహద్దు ఊరది. సైనికులు, వాళ్ల విధులు, పాటించే క్రమశిక్షణ వంటివెన్నో ఆమెను ఆకర్షించాయి. దీంతో సైన్యంలోకి రావాలని కలలు కన్నారు. 2023లో యూపీఎస్‌సీ... సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పరీక్ష రాసి, తొలి ప్రయత్నంలోనే ర్యాంకును సాధించారు. ఆ ఏడాది తన రాష్ట్రం నుంచి అర్హత సాధించిన ఏకైక మహిళ సిమ్రన్‌. తన ఊరి నుంచి ఆఫీసరైన తొలి మహిళ. దీంతో అక్కడి యువతకు స్ఫూర్తిగానూ నిలిచారామె. తాజాగా కర్తవ్యపథ్‌లో సీఆర్‌పీఎఫ్‌ దళాన్ని నడిపించే అవకాశాన్ని అందుకున్నారు. 140 మంది బృందమది. మొత్తం పురుషులే. ఇలా ఒక మహిళా ఆఫీసర్‌ ఇంతమంది మగవాళ్లని నడిపించడం దేశ చరిత్రలోనే తొలిసారి. దీంతో ఆమె పేరు మారుమోగుతోంది. ఆమె ఆత్మవిశ్వాసం, కచ్చితత్వం, కంటింజెంట్‌ని కమాండ్‌ చేయగల నైపుణ్యం అన్నీ పై అధికారులను ఆకర్షించాయి. దీంతో సిమ్రన్‌కి ఈ అవకాశమొచ్చింది. తన ప్రతిభతో ఈ అవకాశాన్ని అందుకున్నారామె. ఒక యువ మహిళా ఆఫీసర్‌... ఇలా నాయకత్వం వహించడం, దళాన్ని ధైర్యంగా ముందుకు నడిపించడం సైన్యంలో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోందన్న దానికి ఉదాహరణగా చెబుతున్నారంతా. అధికారిణులూ సైన్యంలో అందరితో సమాన పాత్ర పోషిస్తూ సత్తా చాటగలరనడానికి సంకేతంగానూ చెబుతున్నారు.

మార్చింగ్‌ కంటింజెంట్లలో, యుద్ధ విమానాలకు సారథులుగా, బ్యాండ్‌లో వాద్యాలను మోగిస్తూ... తమదైన ముద్ర వేస్తున్నారు మహిళా అధికారిణులు. వీళ్లందరికీ  భిన్నంగా ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సహాయకురాలిగా వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌అక్షిత ధన్‌కర్‌.

‘రిపబ్లిక్‌ డే పరేడ్‌లో భాగం అవ్వడం నా చిన్ననాటి కల. నాన్న ఎప్పుడూ దేశభక్తి గాథలు చెబుతుండేవారు. గణతంత్ర దినోత్సవ కవాతులో ఆయన పాల్గొన్నారు కూడా. ఆయన్ని చూసే... నేను ఏదో ఒక రోజు దీనిలో పాల్గొనాలి అనుకున్నా. కానీ, వైమానిక దళంలో చేరిన అనతి కాలంలోనే ఈ అవకాశం వస్తుందని ఊహించలేదంటారు అక్షిత. ఈమె హరియాణలోని కాస్నీ గ్రామంలో పుట్టారు. దేశానికి ఎందరో వీరుల్ని అందించిన కేంద్రపాలిత ప్రాంతం జాట్‌లో పెరిగారీమె. ఈ నేపథ్యమే దేశసేవపై ఆమెకు మక్కువను పెంచింది. అయితే సైన్యంలోకి వెళ్లాలన్న సంకల్పం ఏర్పడింది మాత్రం... కాలేజీ రోజుల్లోనేనట. ‘దిల్లీలోని శ్రీ గురు తేజ్‌ బహదూర్‌ ఖల్సా కాలేజీలో చదువుతున్నపుడు ఎన్‌సీసీలో భాగం అయ్యా. అక్కడ నేర్పిన క్రమశిక్షణ, దేశభక్తి పాఠాలే సైన్యంలో భాగం కావాలన్న ఆలోచనల్ని పెంచాయంటారామె. చదువు పూర్తయ్యాక అర్హత పరీక్ష రాసి పాసై 2023లో వైమానిక దళంలో చేరారు అక్షిత. అప్పట్నుంచి అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో తనదైన శైలిలో రాణించారు. పదోన్నతులూ పొందారు. ఇవన్నీ కర్తవ్య పథ్‌పై రాష్ట్రపతితో కలిసి వేదికను పంచుకునే అవకాశాన్ని కల్పించాయి. ఈ బాధ్యతలు అందుకున్న తొలి మహిళ ఈమే కావడం విశేషం.

నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టిన వారితోపాటు తల్లిపాలు దొరక్క తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్నారులెందరో. డా.ఆర్మిడా ఫెర్నాండెజ్‌తన కెరియర్‌లో ఇలాంటి వాళ్లెందరినో చూశారు. ఆమె ముంబయిలోని లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌(సియోన్‌) ఆసుపత్రిలో నియోనాటాలజిస్ట్‌గా పనిచేసేవారు. 1977లో ఆర్మిడా ఆ విభాగ బాధ్యతల్ని తీసుకున్నారు. ఎలాగైనా శిశు మరణాలను తగ్గించాలని అనుకున్నారు. కారణాలు అన్వేషిస్తున్నప్పుడు- నెలలు నిండకుండా చనిపోతున్న పిల్లలు డబ్బా పాలు తాగడం వల్ల ఓ రకమైన ఇన్ఫెక్షన్‌ బారిన పడుతున్నారని గుర్తించారామె. దానికి పరిష్కారం తల్లిపాలే... కానీ, అవి అందరికీ అందడంలేదు. దాంతో హ్యూమన్‌

మిల్క్‌ బ్యాంక్‌ ఏర్పాటు అవసరమని భావించారు. అదే సమయంలో యూకేలో ఫెలోషిప్‌ చేయడానికి వెళ్లిన ఆమె... ఆక్స్‌ఫర్డ్, బర్మింగ్‌హామ్‌ల్లో విజయవంతంగా నడుస్తోన్న తల్లిపాల బ్యాంకులను పరిశీలించారు. ఆ వివరాలు తెలుసుకుని తిరిగొచ్చాక తాను పనిచేస్తోన్న ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. ఇది దేశంలోనే కాదు... ఆసియాలోనే మొదటి తల్లిపాల బ్యాంకు. ఆమె చేసిన ఈ ప్రయత్నం ఫలించింది. క్రమంగా ఆసుపత్రిలో శిశు మరణాల రేటుని గణనీయంగా తగ్గించడానికి సాయపడింది. ఆపై 1999లో సొసైటీ ఫర్‌ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్‌ అండ్‌ హెల్త్‌ యాక్షన్‌(స్నేహ) పేరుతో ఎన్జీవోని ఏర్పాటుచేశారు. ఇది పట్టణ ప్రాంత మురికివాడల్లోని తల్లీ పిల్లల ఆరోగ్యానికి కృషి చేస్తోంది. కెరియర్‌ నుంచి పదవీ విరమణ తీసుకున్నాక... క్యాన్సర్‌ బారిన పడ్డ కూతుర్ని కోల్పోయారామె. తన జ్ఞాపకార్థం ‘రోమిలా పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌’ని ఏర్పాటుచేసి జీవిత చరమాంకంలో తీవ్ర అనారోగ్యాల బారిన పడిన వృద్ధులకు సేవలందిస్తున్నారు. దశాబ్దాలుగా శిశు సంరక్షణ, ప్రజారోగ్య విభాగాల్లో ఆమె అందిస్తోన్న సేవలకు గుర్తింపుగానే పద్మశ్రీ అవార్డు వరించిందీమెను.

కలి లేని ప్రపంచాన్ని చూడాలి అంటారు ఎస్‌.జి.సుశీలమ్మ. అందుకే ‘సుమంగళి సేవా ఆశ్రమం’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి అనాథలకు ఉచిత విద్య, ఆదరణలేని వృద్ధులకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అనాథలకు అమ్మా, నాన్న అన్నీ తానే అవుతున్నారు. వందమంది పిల్లలకీ, 400కు పైగా మహిళలకీ ఆశ్రయం కల్పిస్తున్నారు. 174 అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభించి చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్‌ క్లినిక్‌ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేశారు. రోజూ 800 మందికి ఉచిత భోజనం సరఫరా చేస్తున్నారు సుశీలమ్మ. అందుకే అంతా ఆమెను ‘కర్ణాటక మదర్‌ థెరెసా’ అని పిలుచుకుంటారు. కర్ణాటకలోని మారుమూల గ్రామంలో పుట్టిపెరిగారీమె. అమ్మానాన్నలు చెన్నమ్మ, గణేశప్ప. పద్నాలుగుమంది సంతానంలో ఈమె ఒకరు. నాన్నది నేత పని. సంపాదన అంతంత మాత్రమే. పేదరికం కారణంగా సరైన తిండి లేక చిన్నతనంలోనే నలుగురు తోడబుట్టినవాళ్లని పోగొట్టుకున్నారీమె. తరవాత వీళ్ల కుటుంబం బెంగళూరుకి వలస వచ్చింది.

కానీ, తండ్రి మరణం కుటుంబాన్ని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కుటుంబ పోషణకోసం ఆమె అన్నయ్యలు చదువు మానేసి వ్యాపారం చేశారు. సుశీలమ్మ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. ఒకరోజు ఉచితంగా అందించే పుస్తకాలు ఆలస్యం అయ్యాయట. ఆ క్షణం తన చదువు ఆగిపోయిందనుకున్నారట. అందుకే తనలా పేదరికంతో ఇబ్బంది పడే విద్యార్థులకు సహాయం చేయాలనుకున్నారు. బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం వచ్చాక సుశీలమ్మ తన జీతంలో కొంతమొత్తాన్ని విద్యార్థుల చదువుకు వినియోగించేవారు. ‘1975లో ముగ్గురు అనాథలు ఆశ్రయం కావాలంటూ వచ్చారు. వాళ్లకి ఎలాగయినా సాయం చేయాలనుకున్నా. అప్పుడు నా చేతిలో ఉన్నది రూ.15 మాత్రమే. కానీ ధైర్యంగా ముందడుగు వేశా. ఎం.కాంతమ్మ నేనూ కలిసి ‘సుమంగళి సేవాశ్రమం’ స్థాపించాం’ అంటారీమె. దాదాపు ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న సుశీలమ్మ ఆశ్రమ నిర్వహణ కోసం తొలిరోజుల్లో కూలీగా మూటలు కూడా మోశారు. ఆశ్రమంలో ఉన్నవారి కడుపు నింపేందుకు ఎన్నోసార్లు పస్తులున్నారట కూడా. ఆ సేవల్ని మెచ్చి ఇప్పటికే దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్, గ్రామ జ్యోతితో సహా మరెన్నో అవార్డులూ రాగా తాజాగా పద్మశ్రీ వరించిందీమెను.

‘పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది’ అన్నది బుధరీ తాతీకి చక్కగా సరిపోతుంది. ఈమెది ఛత్తీస్‌గఢ్, దంతేవాడలోని హిరానార్‌ గ్రామంలోని గిరిజన కుటుంబం. చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడంతో తల్లిదండ్రులు ఐదేళ్ల వయసులోనే దివ్య జీవన సంఘ్‌ గుమ్మార్గుండా ఆశ్రమంలో చేర్చారట. తరవాత అక్కడే దీక్ష తీసుకుని

నాలుగు దశాబ్దాలుగా గిరిజన సంక్షేమానికే అంకితమయ్యారీమె. హిరానార్, దంతేవాడ... వంటి నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలతోపాటు దక్షిణ బస్తర్‌ వంటి వెనకబడ్డ ప్రాంతాల్లో మహిళల అభివృద్ధికీ వృద్ధుల సేవకీ కృషిచేస్తున్నారు. కుట్టుపనిలో శిక్షణ ఇప్పించడంతోపాటు బాలికలకు విద్యను అందించే సాహసం చేశారు. ఆమె వల్లే సుమారు ఆరు వందల మంది మహిళలు ఆర్థిక స్వావలంబన పొందారు. టైలర్లుగా, ఉపాధ్యాయినులుగా, నర్సులుగా తాము ఉపాధి పొందడమే కాదు, మరెందరో గిరిజనులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆల్‌ ఇండియా వనవాసి కళ్యాణ్‌ ఆశ్రమంతో కలిసి హిరానార్‌లో శంఖనీ మహిళల ఉత్థాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులోని మహిళా సహాయక బృందం గురుకులాల్లోని పిల్లల బాగోగులు చూడటంతోపాటు ఆరోగ్యం, పోషకాహారం పట్ల గిరిజన స్త్రీలకి అవగాహనా కల్పిస్తోంది. బాల్యవివాహాల్నీ అడ్డుకుంటోంది. వృద్ధులకోసం ఆశ్రమాన్నీ నిర్వహిస్తున్నారు బుధరీ.  

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 01:03 IST

English Translation

Jana 'Gana' Mana Adhinayaka Jayaho

Women leadership is growing in the three forces. Participating in parades, leading the army... they are ringing the bell in the defense of the country.

Eenadu icon
By Vasundhara Team Updated : 26 Jan 2026 01:14 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
18 min read

Women leadership is increasing in the three forces. Participating in parades, leading the army... they are ringing the bell in the defense of the country. Ordinary women are showing extraordinary talent in performing duties and working hard in agriculture... they are showing the power of women in the progress of the country. In recognition of their services, the women will be honored to participate in this year's Republic Day celebrations. Arts, public service, medicine... in any field, women are bringing radical change by doing justice to their role one hundred percent. An example of that is these lotus blossoms on Republic Day...

A remote tribal village in Narnoor mandal of Adilabad district. Khairdatwa. Santabai, who is making Ippapuvu laddoos here, received a special invitation from the Rashtrapati Bhavan. The doctors want to provide food made from Ippapuvu which is rich in protein and vitamin-C to the adivasi children suffering from anemia. With this, ITDA officials came to Khairdatwa last year and trained Pendor Santabai on making laddoos. Later she set up a brownies manufacturing center in the village. Another 12 people from the women's group were also taught to prepare. 5 kg of jaggery, 2 kg of sesame seeds, 40 grams of almonds, raisins, cashew nuts, cardamom, two kg of jaggery, one kg of sugar and two kg of peanuts are mixed. All these were fried in ghee and made into brownies by hand. In August last year, on the initiative of District Collector Rajarsheesha, a loan of Rs. 5 lakh was sanctioned to the women's association through Indira Krantipath. Currently they are making brownies with machines. These are offered in Kasturba Vidyalayas and Ashram Schools in the joint Adilabad district. It is also sold in Hyderabad, Warangal, Karimnagar and other areas. I am proud that the adivasi laddus have been recognized at the national level. Taking brownies to the President's House. Do you think this is lucky? It is good that the authorities have recognized and popularized these nutritious brownies,' says Shanthabai. Vangadas are grown organically by Yarru Swathi. Cultivation of nature not only gave her financial strength, but also gave her the honor of participating in the dinner with the President. Swati suffered a brain stroke in 2016 and later recovered. That made her more health conscious. They attended the awareness seminars on organic farming conducted by the nature agriculture department for the women of the savings societies. He was inspired by field level visits with the words that 'Chemicals are the cause of many diseases, natural cultivation can prevent that problem and control the land becoming shallow'. With the encouragement of her husband Satyanarayan, in 2017, they got ready for nature cultivation in their two acres. Desi rice varieties were chosen for that. Another 18 acres were taken on lease with the encouragement of the Nature Agriculture Department. Farmers from distant areas come to know her cultivation methods. Swati received congratulations from Prime Minister Modi at the organic farming conference held in Delhi in October last year. There they received the 'Participated Guarantee Certificate (PGC)' certificate. This makes marketing of organic products easy. He recently received an invitation to the At Home program organized at Rashtrapati Bhavan on Republic Day. Swati explains that if all the farmers adopt this method, it will be very good for the people and the mother earth. Can't steal. More than that... songs not only entertain us but also act as a therapy. Bollywood popular singer Alka Yagnik has gained immense popularity with her melodious voice. She thrilled the fans of yesteryears with 'Chamma... Chamma', 'Ek... Do... Teen', but it is she who has impressed today's generation with 'Agar Tum Saath Ho'. own There is no one who does not appreciate Alka's vocal ability, versatility and her contribution to classical music. He received the Padma Bhushan for these services. But her entry into this field was not easy. Born and brought up in Kolkata. Amma Shuba is a classical musician. Shubha started teaching Alka music when she was four years old. At the age of six, he sang songs on All India Radio. All those who heard it were enchanted... They said, 'The girl will have a good future in cinema'. So Shuba took Alka and came to Mumbai. The real challenges started from there. They say, 'Gontu has a good voice, but she is still too old to introduce herself as a singer'. After many failed attempts... Alka sang in a movie for the first time at the age of 14. From then on she did not turn back. So far he has sung about 22 thousand songs in 25 languages. Alkane is the singer who has sung the most solo songs after Latamangeshkar and Asha Bhosle in Bollywood female category. I don't shy away from saying that I will sing old ways and songs. Competing with bands like BTS and Taylor Swift...Alka has also achieved the global rank as the most streamed singer on YouTube. I will become a good dancer,' said the doctor...When Deepika Reddywas born. Keeping that word true, Deepika has really made her mark in Kuchipudi. She has been recognized abroad and has recently been selected for the Padma Shri in recognition of her work in the field of arts.

Mother is also a classical dancer. Due to this, Deepika also got attracted towards dance. He started learning at the age of six. He started performing at the age of 11. He also made his debut at a young age. But what was learned was Kuchipudi. At first, she excelled in dance under Sumathi Kaushal, followed by Satyam's apprenticeship. She did not give up dancing until she got married. Not only in historical places such as Khajuraho, Konark, Hampi...

, but also in many countries like Germany, South Korea, Thailand, Russia, Japan... Conducted workshops and seminars. He also composed dance-dramas like Siva Satiyam, Shanti Jeevanam and Stri Tryam. He performed even after the age of five and ten. Danced in the Ayodhya Ram Mandir and the latest Maha Kumbh Mela. She has established herself as a Kuchipudi artist. In this sequence, he received many awards like Kala Ratna from Andhra Pradesh Government, Telangana State Award and prestigious Sangeet Natak Akademi from the Central Government. He also served as the Chairperson of Telangana Sangeet Natak Academy. In the year 2000, she started an organization named 'Deepanjali', thinking of imparting Kuchipudi dance to the next generation. Classical dance was made available to all classes and many were trained as dancers. Now his disciples are performing in foreign countries. Dance is part of our culture. Let us believe that society can be shaped through it.

With social aspects...

Kuchipudi is not an art for me.. Worship of God. Not only to pass on this art to posterity... I am trying my best to spread its glory to the world. I think the Padma Shri award is an honor for that effort. The lessons taught by Vempati Chinasatyangaru made me excel in the field even more. Amma is also a dancer. In 1961, he performed the Chitrangada ballet during the inauguration of Rabindra Bharati. I also made my debut on that stage at the age of 11. Akkineni Nageswara Rao who attended the program said that I will be the torchbearer of Kuchipudi dance. Now I feel very proud when everyone says that the word has come true.

With the idea that this art should reach the future generations, we are trying to show Kuchipudi dance not only on mythological and epic themes... environment, women's issues, natural colors, arts of Telugu states. My parents along with my husband Shyamgopal, children Shloka and Abhinav are very encouraging!

Is it possible to grow apple in cold climate...desert area? However, it was made possible by Santosh Devi, a farmer from Rajasthan. In recognition of this effort, he received a special invitation from the President. Santhosh Devi Khedar is from Beri, Rajasthan. She came here in 2008 with interest in organic farming. After her husband went to work and children went to school, she started working on the farm. They used to do various experiments. That experience gave her the idea to grow apples. For this, a special apple variety developed by a farmer from Himachal Pradesh was selected. Seeing her at that time, everything was dismissed as impossible in a place with high temperatures. But he didn't care about it. He used to make his own fertilizers like cow urine, neem, ummetta etc. to make the plants grow healthy. Jivamrita and Panchagavya were used. Drip irrigation method was chosen to overcome water scarcity. All this has paid off. Harvesting started from the second year. As it is cultivated naturally without using any chemicals, it also fetches a good price. So it turned into a business. Along with these, pomegranate, sweet potato, lime and sapota are also cultivated. Fruit orchards are being cultivated on one acre of land, and a nursery has been set up on another one and a half acres. Annually earning lakhs of rupees. The aspirants are being trained in organic cultivation.

CaptainHamsaja gives form to struggle, determination and self-belief. Sharma can be shown! She has put in a lot of effort to get into the army and get an identity for herself. So, did you get the chance to lead the Aviation Squadron on Republic Day.

'Be tough with yourself'... was a phrase that fascinated Hamsaja from childhood. He was introduced to this in school and continued to follow it throughout his life. So, he was able to enter the field he wanted. Hamsajadi Jammu. Although there are many attractions around... but the one that impressed her was the army. Someone said that girls are difficult... 'Yes girl! But let's fly with wings and protect the country. They replied that I have that strength. So, don't give up no matter how many rejections you face. Illness prevented me from qualifying. However, after undergoing surgery, he joined the Combat Army Aviation Training School in Nashik. He stood as the topper and won the 'Silver Cheetah Trophy' awarded to the best combat aviators. She made history as the first woman to get it. Hamsaja is the first Indian woman to pilot a Rudra armed helicopter. Air Traffic Management and Air Loss Course conducted by Air Force Academy. Captain Hamsajan was the first person to receive that title. With that perseverance and courage, he got the opportunity to lead the Army Aviation in the latest Republic Day Parade. Who will lead the team of 251 people. Hamsaja was brought up by a single mother. She said that she got used to self-confidence and discipline from her mother, who is a journalist. Hence, Hamsaja is said to have been able to enter a field where girls are rare. Her achievements are described as a symbol of women's power in the army. But Assistant Commandant Simran Bala created history. Who will lead the 'All Male CRPF Contingent'? She became the first woman officer to achieve that feat.

26year-old Simran Baladi of Nowshera, Jammu and Kashmir. Border town. Soldiers, their duties and the discipline they followed attracted her. With this, he dreamed of joining the army. In 2023, he wrote the UPSC... Central Armed Police Forces exam and achieved the rank in the first attempt. Simran was the only woman to qualify from her state that year. She was the first woman to become an officer from her hometown. This has inspired the youth there. He recently got the opportunity to lead the CRPF force on a mission. A group of 140 people. All men. This is the first time in the history of the country that a woman officer is leading so many men. Because of this, her name is changing. Her confidence, precision and ability to command a contingent all attracted the superiors. This gave Simran this opportunity. He received this opportunity with his talent. A young woman officer... leading and leading the troop bravely is an example of the growing importance of women in the army. It is also said to be a sign that female officers can play an equal role with everyone else in the army and show their strength. Women officers are making their mark by ringing the bell. Unlike all of them, Flight Lieutenant Akshita Dhankar got the opportunity to act as an assistant to President Draupadi Murmu in the Republic Day Parade. It was my childhood dream to be a part of the Republic Day Parade. Dad always used to tell patriotic stories. He also participated in the Republic Day Parade. Seeing him... I thought I would participate in it one day. But, Akshitha said, she did not expect this opportunity to come before Anathi joined the Air Force. She was born in Kasni village of Haryana. The Union Territory of Jat, which has given so many heroes to the nation, grew up in Perigarim. This background made her passionate about national service. But the decision to join the army was made... during college days. I became a part of NCC while studying at Shri Guru Tej Bahadur Khalsa College in Delhi. It is said that the lessons of discipline and patriotism taught there made people want to join the army. After completion of education, Akshitha cleared the eligibility test and joined the Air Force in 2023. Since then he excelled in the administration department in his own style. Got promoted. All these provided an opportunity to share the dais with the President on the path of duty. It is remarkable that she is the first woman to receive this responsibility. Dr. Armida Fernandes has seen many such people in his career. She worked as a neonatologist at Lokamanya Tilak Municipal General (Sion) Hospital, Mumbai. In 1977, Armida took charge of that department. They wanted to reduce infant mortality anyway. While searching for the causes - it was found that the babies who died prematurely were suffering from some kind of infection due to drinking canned milk. Breast milk is the solution...but not everyone gets it. With that human

establishment of milk bank was felt necessary. At the same time, she went to do a fellowship in the UK... and examined the successfully running breast milk banks in Oxford and Birmingham. When he came back after knowing the details, he was arranged in the premises of the hospital where he was working. It is the first breast milk bank not only in the country but also in Asia. Her efforts paid off. It has gradually helped to significantly reduce the infant mortality rate in the hospital. Then in 1999 an NGO named Society for Nutrition, Education and Health Action (Sneha) was formed. It works for maternal and child health in urban slums. After retiring from the career, she lost her daughter to cancer. In his memory, the 'Romila Palliative Care Center' has been set up to serve the elderly who are suffering from serious illnesses at the end of their lives. The Padma Shri award was given to her in recognition of her services in the fields of child care and public health for decades. S.G. Sushilamma. That is why a charity called 'Sumangali Seva Ashram' has been established to provide free education to orphans, shelter for the elderly and women. The mother and father of the orphans are becoming all by themselves. A hundred children and more than 400 women are being sheltered. 174 Anganwadi centers have been started and are providing nutrition to the children. Primary health centers were established through mobile clinics in rural areas. Sushilamma provides free meals to 800 people daily. That's why everyone calls her 'Mother Teresa of Karnataka'. Puttiperigarime in a remote village in Karnataka. Grandparents Chennamma and Ganeshappa. She is one of fourteen children. My work is weaving. Earnings are limited. He lost four siblings at an early age due to poverty and lack of proper food. Later their family migrated to Bangalore.
But, the father's death put the family in more financial trouble. Her elder brothers dropped out of school and went into business to support the family. Sushilamma studied in government schools. One day free books are late. At that moment, he thought that his studies had stopped. That's why he wanted to help students who were struggling with poverty like him. After getting a job in BHEL, Sushilamma used to use part of her salary for the education of students. In 1975, three orphans came seeking shelter. I want to help them in any way I can. Then I had only Rs.15 in my hand. But boldly stepped forward. M. Kanthamma and I established 'Sumangali Sevashram' together' she said. Sushilamma, who has been serving for almost five decades, also carried bundles as a laborer in the early days for the maintenance of the ashram. They also have many times to fill the stomachs of the people in the Ashram. In appreciation of those services, Durgabai Deshmukh and Grama Jyoti have already received many other awards, and recently Padma Shri has been awarded to her. ``Perfumes'' suits Budhari Tathi well. She is a tribal family from Hiranar village in Dantewada, Chhattisgarh. Being inclined towards spirituality from childhood, his parents admitted him to the Divya Jeevan Sangh Gummargunda ashram at the age of five. Later, he took initiation there and dedicated himself to tribal welfare for four decades. In Naxal-affected areas like Hiranar, Dantewada, etc., as well as in backward areas like South Bastar, they are working for the development of women and the service of the elderly. He ventured to provide education to girls along with training in sewing. Because of her, about six hundred women became financially independent. Not only are they employed as tailors, teachers and nurses, but they are also an inspiration to other tribals. Sankhani Women's Upliftment Center at Hiranar in collaboration with All India Vanavasi Kalyan Ashram. The women's support group in this is looking after the welfare of the children in the Gurukuls and also educating the tribal women about health and nutrition. Prevents child marriages. Budhari runs all the ashrams for the elderly.  

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 01:03 IST