Food Noise: పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్ నాయిస్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఆకలి వేస్తే భోజనం చేస్తాం. అనుకోకుండా మంచి ఫుడ్ కనిపిస్తే జిహ్వ కోరికని తీర్చేస్తాం. అయితేే ఎంత తిన్నా ఒక మోతాదు వరకే! కానీ కొంత మందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు ఆరగించినా ఇంకా ఏం తినాలా? ఎప్పుడు తినాలా?అని ఆలోచిస్తుంటారు. ఆకలి వేయకపోయినా మనసులో అవే ఆలోచనలు. దీనినే ‘ఫుడ్ నాయిస్’ అంటున్నారు. మానసిక ఒత్తిళ్లు, భావోద్వేగాల వల్ల జీవనశైలిలో వచ్చే మార్పు ఇది అని నిపుణులు చెబుతున్నారు. దీన్ని నియంత్రించుకోలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఎలా గుర్తించాలి?
కడుపు నిండిన భావన. అయినా ఇంకేం తినాలి?అని ఆలోచన. అల్పాహారం తింటూనే మధ్యాహ్నం ఏం తింటే బాగుంటుందనీ, లంచ్ చేస్తూ సాయంత్రం స్నాక్స్ గురించి, ఆ తర్వాత రాత్రి భోజనం గురించి ఇలా మనసంతా ఎప్పుడూ ఫుడ్ గురించే! ఖాళీగా ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు.. సందర్భం ఏదయినా సరే, ఆహారం తింటూ ఊరట పొందుతుంటారు. డైట్‌లో ఉందామనీ అనుకుంటారు. ప్రయత్నం ప్రారంభిస్తారు. చిత్రంగా.. మామూలు రోజుల్లో కంటే మరింత ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది. ఇవన్నీ ఫుడ్ నాయిస్‌కు సంకేతాలని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకొస్తుంది?
- చాలా మంది బరువు పెరగకూడదని, ఫిట్‌నెస్ పేరుతో ఆహారంపై ఆంక్షలు పెట్టుకుంటారు. ‘అవి తినకూడదు’, ‘వీటి జోలికి వెళ్లకూడదు’ అని అనుకుంటారు. ఇలాంటప్పుడే ఫుడ్‌పై ఆలోచనలు మరింత పెరుగుతాయి. నియంత్రించుకోవడం కష్టమవుతుంది
- భావోద్వేగాలకు గురైనప్పుడు, మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు కొంతమందిలో ఏదైనా ఆహారం తినాలనే ఆలోచన వస్తుంటుంది. అలాంటి వారిలో ఒంటరితనం, ఆందోళన, కోపం, బాధ వంటివి ఫుడ్ నాయిస్‌ను పెంచుతాయి.
- సరైన నిద్ర లేకపోతే మెదడు ఉపశమనాన్ని కోరుకుంటుంది. ఈ క్రమంలో ఆలోచనలు ఆహారంపైకి మళ్లుతాయి. తినగానే మెదడు తక్షణ ఆనందాన్ని పొందుతుంది.
- హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆకలి లేకపోయినా ఏదయినా తినాలనిపిస్తుంది. చాలా మంది దీన్ని గుర్తించకలేక తినేస్తుంటారు.
- సోషల్‌మీడియాలో ఫుడ్ వ్లాగ్ వీడియోలు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో ఉండే ఫుడ్‌ను పరిచయం చేస్తూ వ్లాగర్లు వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఆ వీడియోలు, ప్రకటనలు చూసి నోరూరుతుంది.
ఆకలిని గుర్తించడం కష్టమే
ఆహారం మితంగా తింటే అమృతం, అతిగా తింటే విషం.. అంటుంటారు. ఫుడ్ నాయిస్ ప్రభావంతో అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. శరీరంలోకి కొవ్వు పెరిగి ఊబకాయం వచ్చే అవకాశముంది. నిజమైన ఆకలి ఏదో గుర్తించడం కష్టమవుతుంది. బయట ఫుడ్‌స్టాల్స్‌లో పరిశుభ్రత ప్రశ్నార్థకమే. కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థతకు గురయ్యే ప్రమాదముంది.
ఎలా నియంత్రించాలి?
- స్వయంగా లేదా వైద్యుల సాయంతో శరీరాన్ని అర్థం చేసుకోవాలి. అది ఇచ్చే సంకేతాలను గమనించాలి. నిజంగా ఆకలవుతోందా?భావోద్వేగాల కారణంగా అలా అనిపిస్తోందా అని ఒకటి రెండు సార్లు ప్రశ్నించుకోవాలి.
- ఫుడ్ నాయిస్‌ను నియంత్రించాలని పూర్తిగా నోరు కట్టేసుకోవద్దు. ఏ ఆహారాన్నీ దూరం పెట్టొద్దు. ఏది తిన్నా మితంగా, పోషక విలువలున్న వాటిని తినడం మంచిది.
- రోజూ వేళకు నిద్రపోవాలి. తగినంత నిద్ర తప్పనిసరి. వ్యాయామం చేయాలి. తరచూ మంచినీరు తాగాలి.
- తినే సమయంలో మల్టీటాస్క్‌లు అవసరమా! ఫోన్ వాడకుండా, టీవీ చూడకుండా తినే ఆహారంపైనే దృష్టి పెట్టాలి. రుచి, వాసనను ఆస్వాదిస్తూ భోంచేయాలి.
- ఒత్తిడి, ఒంటరితనం వల్ల ఏదో ఒకటి తినాలపిస్తుంది. వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేయకుండా.. కాసేపు నడవండి, కొన్ని క్షణాలు ధ్యానం చేయండి, కాసేపు సంగీతం వినండి. అయినా ఆకలి తీరకపోతే అప్పుడు జంక్‌ఫుడ్ కాకుండా పోషకాలనందించే ఆహారం తీసుకోండి
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ప్రేమికుల రోజు సరదాలా?ఖర్చే లేకుండా రొమాంటిక్ అనుభవాలు పొందొచ్చు! ప్రేమికుల రోజు.. కేవలం ప్రేమ జంటలే కాదు, భార్యాభర్తలూ చేసుకోదగ్గ వేడుక. సాధరణంగా ఈ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
- టెండర్లపై ‘ఏఐ’ నిఘా.. అక్రమాలు, సిండికేట్‌లు ఇకపై కుదరవు! రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సహా అభివృద్ధి పనులు.. ఇలా ప్రభుత్వంలో ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులకు టెండర్లు తప్పనిసరి.
- విహారయాత్ర సరే.. బడ్జెట్ మాటేంటి? నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం కష్టమే. అయితే, చేసే ఖర్చుల్లోనే కొంత మొత్తం పొదుపు చేస్తే విహారానికి బడ్జెట్ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికి ఏం చేయాలంటే..
- వద్దన్నా వస్తున్నారు.. యూరప్‌లో ట్రావెల్ ఓవర్‌క్రౌడింగ్! చాలా దేశాల ప్రభుత్వాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. మా దేశంలో పర్యటించాలని ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.
- ‘మని’ ద్వీపకల్పం.. అక్కడ అంతా ఒకే సమూహం గ్రీసులో ఉన్న ఓ మానవ సమూహం తరతరాలుగా అనేక దాడులను ఎదుర్కొని నిలిచింది.
- పిల్లల్ని కనబోతున్నారా.. మరి వీటి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకున్న యువజంటలతో బంధువులు అనే మొదటి మాట..‘పిల్లల్ని ఎప్పుడు కంటారు? తొందరగా కనేయండి’అని. వైవాహిక జీవితానికి తల్లిదండ్రులు అనే హోదానే పరిపూర్ణత ఇస్తుందని సమాజం నమ్ముతుంది.
- మాటలెందుకు? మీమ్స్ ఉండగా.. జెన్ జీ లైఫ్‌స్టైల్ ఇదీ! ఎవరైనా బొద్దుగా ఉన్న వ్యక్తి తారసపడితే ‘ఒడియమ్మా బంటీ’ అంటున్నారు.. ఏదైనా పనిని ఆశ్చర్యపరిచేలా వేగంగా చేసినా, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించినా ‘ఫ్లాష్‌మ్యాన్’ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటారా? ఇటీవల సోషల్‌మీడియాలో ట్రెండ్ అయినా మీమ్స్ అవి.
- టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్ తెలిసుండాలి! అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి.
- జిప్ కోడింగ్.. గల్లీ దాటని ప్రేమ! గతంలో ప్రేమ కోసం సప్తసాగారాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరమున్నా మొబైల్‌లో మాట్లాడుతూ, వీడియో కాల్స్‌తో నెట్టుకొస్తున్న లాంగ్ డిస్టెన్స్ ప్రేమలనూ చూస్తున్నాం. కానీ, ఇప్పుడు కాలంతోపాటు యువత ఆలోచనలూ మారుతున్నాయి.
- గ్రీన్‌లాండ్‌లో స్థలాన్ని కొనలేం.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి! గ్రీన్‌లాండ్.. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి భూచట్టాల ప్రకారం.. భూమి అనేది ఇక్కడి ప్రజల సామూహిక వనరు. అందుకే, వ్యక్తిగతంగా ఎవరికీ యాజమాన్య హక్కులుండవు.
- నదిలో బంగారం.. అదే వారికి జీవనాధారం! హరియాణాలోని యమునానగర్ జిల్లాలో బోలి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు.. జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదీలో బంగారం ఉంది.
- ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల.. వృద్ధుల కోసం వినూత్న ఆలోచన! చందంకి.. గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామం. అన్ని ఊర్లలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇళ్లు, గుడి, బడి అన్ని ఉంటాయి. కానీ, ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
- ఇజ్రాయెల్ ఆర్మీలో అందమైన భామలు! Israeli Army: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. అత్యాధునిక ఆయుధ, సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సొంతం.
- ఇతరుల్ని అర్థం చేసుకునేవారు ఇలా ఉంటారట! మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మరికొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ, చాలా కొంత మందికే ఇతరులను పూర్తిగా చదవగలిగే సామర్థ్యం ఉంటుంది.
- ఈ ఆలయంలో మొక్కుకుంటే జుట్టు రాలదట! ఏ దేవాలయానికి వెళ్లినా సుఖఃసంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, సంపద పెరగాలని దేవుళ్లకు ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే, జపాన్‌లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, జుట్టు సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు.
- ఎగిరే గాలిపటం.. మెరుగయ్యే జీవనం! గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం సంప్రదాయం, సరదా మాత్రమే కాదు.. మనుషులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాదు, ఎన్నో లాభాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే! కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తనకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనలోని అలవాట్లు, ఆలోచన తీరు, మనస్తత్వాలే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
- అనగనగా ఓ గ్రామం.. అక్కడ ఒకే ఒక్క ఇల్లు! నిర్మానుష్య ప్రాంతంలో కాసేపు ఉండాలంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది, కనుచూపుమేరలో మనుషులే కనిపించని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివసిస్తోంది.
- బరువు తగ్గాలా? డైట్‌లో ట్రెండ్స్ ఇవీ..! బరువు తగ్గాలన్నా, శారీరకంగా ఫిట్ ఉండాలన్నా వ్యాయామం తప్పక చేయాల్సిందే. అయితే, డైట్ పాటిస్తూ కూడా బరువును నియంత్రణలో ఉంచుకునే వీలుంది. దీంతో వ్యాయామం కుదరని చాలా మంది డైట్ పాటిస్తున్నారు.
- 10 వేల అడుగులా? 45 నిమిషాల వ్యాయామమా? ఏది ఉత్తమం! మన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే వ్యాయామం చాలా అవసరం. ప్రతి రోజు 10 వేల అడుగులు నడవాలి లేదా 45 నిమిషాల వ్యాయామం చేయాలని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి వచ్చే అనుమానం.. ఈ రెండింట్లో ఏది చేస్తే మేలు అని.