Nadeem Khan: అత్యాచారం కేసు.. ‘ధురంధర్‌’ నటుడు అరెస్ట్‌

Eenadu icon
By Entertainment Team Updated : 26 Jan 2026 17:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముంబయి: అత్యాచారం కేసులో ‘ధురంధర్‌’ నటుడు నదీమ్‌ ఖాన్‌ (Nadeem Khan) అరెస్టు అయ్యాడు. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాల్వానీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 41 ఏళ్ల ఓ మహిళ నమీద్‌ ఖాన్‌ ఇంట్లో 2015 నుంచి పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని అతడు నమ్మించాడు. వివాహం గురించి ఎన్నిసార్లు అడిగినా నదీమ్‌ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. నదీమ్‌ పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మహిళ ఆరోపణలు ధ్రువీకరించామని, ఈ మేరకు అరెస్టు చేశామని ఓ పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు.

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నదీమ్‌ కెరీర్‌ ‘ధురంధర్‌’తో మలుపు తిరిగింది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో, అందులో నటించిన వారందరికీ మంచి పేరొచ్చింది. ఈ సినిమాలో.. అక్షయ్‌ ఖన్నా (రహమాన్‌ డకైత్‌) వంట మనిషిగా నటించారు నదీమ్‌. ఆయన కీలక పాత్ర పోషించిన ‘వధ్‌ 2’ ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతోంది. ‘మిమి’, ‘వధ్‌’ తదితర చిత్రాల్లో నటించారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 17:35 IST

English Translation

Nadeem Khan: Rape case.. 'Dhurandhar' actor arrested

Eenadu icon
By Entertainment Team Updated : 26 Jan 2026 17:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Mumbai: 'Dhuran' actor Nadeem Khan in rape case (Nadeem Khan) was arrested. He was arrested by the Malvani police on the complaint filed by the maid. According to the police, a 41-year-old woman has been working at Nameed Khan's house since 2015. He believed that he would get married. No matter how many times Nadeem was asked about the marriage, she approached the police because she did not get a positive response. She stated in her complaint that Nadeem had raped her several times. A police officer revealed to the media that the woman's allegations have been confirmed and she has been arrested to this effect. It is known that this movie, made with Ranveer Singh as the hero, received great success at the box office. As a result, all those who acted in it got a good name. Nadeem acted as Akshay Khanna's (Rahman Dakait) cook in this movie. 'Vadh 2' in which he played a key role is getting ready for release on February 6. Acted in films like 'Mimi', 'Vadh'.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 17:35 IST