నగరాల వెతలు తీర్చే మార్గమిదీ!

Eenadu icon
By Editorial News Team Published : 09 Jan 2026 04:11 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

భారతావని ప్రగతి రథాన్ని ముందుకు నడిపిస్తున్నవి నగరాలే. దేశ జీడీపీలో 63శాతం వాటినుంచే సమకూరుతోంది. వచ్చే పాతికేళ్లలో ఆ వాటా 75శాతం కానుందని అంచనా. స్టార్టప్‌లూ నవకల్పనలకు నెలవులుగా, లెక్కకుమిక్కిలి వ్యాపారాలకు ప్రధాన కేంద్రాలుగా వర్ధిల్లుతున్న నగరాలు పల్లెపట్టుల నుంచి ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి. జోరందుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలూ వలసలకు తగినట్లే పట్టణభారతంలో నిర్మాణాలూ విపరీతమవుతున్నాయి. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) తాజా అధ్యయనం ప్రకారం, 2000-2022 సంవత్సరాల మధ్యలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిర్మాణ ప్రాంత వైశాల్యం 293 చదరపు కిలోమీటర్ల నుంచి 425 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. వేగవంతమైన పట్టణీకరణకు వరద నీటిపారుదల వ్యవస్థల అధ్వాన నిర్వహణ తోడు కావడంతో కుండపోత వానల సమయంలో భాగ్యనగర జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అధిక వర్షపాతాన్ని తట్టుకునే ఏర్పాట్లు కొరవడటంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 39శాతం జనావాసాలకు తీవ్రస్థాయి వరద ముప్పు పొంచిఉందని, మరో 24శాతం ప్రాంతాలు ఓ మోస్తరు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ‘టిస్‌’ వెల్లడించింది. హైదరాబాద్‌ అనేముంది... చెరువులూ మురుగుకాల్వల ఆక్రమణలు, అక్రమ కట్టడాల మూలంగా ఏపీ, తెలంగాణల్లోని పలు పట్టణాలు తరచూ నీట మునుగుతున్నాయి. జనాన్ని కట్టుబట్టలతో నిలబెట్టి కన్నీటి సంద్రంలో ముంచేస్తున్నాయి! 

జనాభా అవసరాలకు అనుగుణంగా నాలాలను విస్తరించకపోవడం, ఉన్నవాటిలోనూ పూడికలు తీయకపోవడం లాంటి కారణాలతో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి చోట్ల వానాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప తదితరాల్లోనూ మురుగు, వర్షపు నీటి ప్రవాహ మార్గాల బాగుసేత పనులు సకాలంలో జరగట్లేదంటూ కథనాలు వెలువడ్డాయి. దీనికి తోడు స్థానిక నీటి వనరుల కబ్జాలు నగరాలకు ప్రాణసంకటమవుతున్నాయి. బుడమేరు ఆక్రమణపాలుకావడంతోనే పదహారు నెలల కిందట విజయవాడలో పలు ప్రాంతాలు జలవిలయంలో చిక్కుకున్నాయి. దేశవ్యాప్తంగా 5,161 పట్టణ ప్రాంతాలు వరదల బారినపడే ప్రమాదముందని సర్కారీ నివేదికలే హెచ్చరిస్తున్నాయి. ప్రణాళికారహిత పట్టణాభివృద్ధితో పెనుసమస్యలు అనేకం చుట్టుముడుతున్నా యంత్రాంగంలో కదలిక లేకపోవడమే జనభారత ప్రారబ్ధం!

దేశీయ పట్టణాల్లో జనాభా గడచిన అరవై ఏళ్లలో ఆరు రెట్లు పెరిగింది. 2020లో 48కోట్లుగా ఉన్న నగరభారత జనసంఖ్య 2050 నాటికి 95కోట్లను మించిపోనుంది. 1985-2015 మధ్యలో నిర్మాణ కార్యకలాపాల ఉద్ధృతి వల్ల భారతీయ నగరాల్లో వరద ప్రమాద పీడిత జనావాసాలు 102శాతం అధికమయ్యాయి. దానివల్ల దేశం ఏడాదికి 400కోట్ల డాలర్ల సంపదను కోల్పోతోంది. సరైన నివారణ చర్యలు చేపట్టకపోతే 2070నాటికి ఆ వార్షిక నష్టం 3వేల కోట్ల డాలర్లకు చేరుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ప్రపంచబ్యాంకు గ్రూప్‌ నిరుడు వెలువరించిన నివేదిక లెక్కగట్టింది. ఇతర దేశాలతో పోలిస్తే చాలాతక్కువగా ఇండియాలో పట్టణ మౌలికవసతులు, సేవలకు జీడీపీలో 0.70శాతం సొమ్మునే వెచ్చిస్తున్నారని అది పెదవి విరిచింది.  2050 నాటికి 2.4లక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెడితేనే ప్రకృతి వైపరీత్యాలను దీటుగా ఎదుర్కొనే సత్తా భారతదేశ నగరాలకు సిద్ధిస్తుందని అంచనా వేసింది. ఆమేరకు నిధులు సమకూర్చుకుంటూ టౌన్‌ప్లానర్ల కొరతను తీర్చడం, జలవనరుల ఆక్రమణలూ పురపాలక సంఘాల్లోని అవినీతిని అరికట్టడంలో ప్రభుత్వాలు నెగ్గుకురావాలి. అప్పుడే సుస్థిరాభివృద్ధి, ఆహ్లాదకర జీవనాలకు పట్టణ భారతం ఆలవాలమవుతుంది!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


English Translation

How to find cities!

Eenadu icon
By Editorial News Team Published : 09 Jan 2026 04:11 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Cities are driving the chariot of progress. They account for 63 percent of the country's GDP. It is estimated that the share will be 75 percent in the coming years. Thrive as hubs for startups and innovations and hubs for innumerable businesses, cities attract many people from rural areas. Construction in urban India is booming to match the booming economic activity and migration. According to a latest study by the Tata Institute of Social Sciences (TIS), the built-up area in Greater Hyderabad has increased from 293 square kilometers to 425 square kilometers between the years 2000-2022. Due to rapid urbanization coupled with poor management of flood irrigation systems, life in Bhagyanagar becomes chaotic during torrential rains. Due to the lack of arrangements to cope with heavy rainfall, 39 percent of the population in the GHMC area is facing severe flood threat, while another 24 percent areas are facing a moderate risk. There is Hyderabad... Many towns in AP and Telangana are often submerged due to encroachment of ponds and sewers and illegal constructions. The crowd is kept in tears! 

Due to reasons such as non-expansion of canals to meet population needs and non-removal of existing ones, low-lying areas in places like Warangal, Karimnagar, Nizamabad, Khammam are getting waterlogged during monsoons. In Visakhapatnam, Guntur, Ongole, Nellore, Kadapa, etc., there have been reports that the work of improving the sewage and rainwater channels has not been done on time. In addition to this, encroachment of local water resources is becoming a threat to cities. Sixteen months ago, several areas in Vijayawada were trapped in waterlogging due to the occupation of Budameru. Government reports warn that 5,161 urban areas are at risk of flooding across the country. Unplanned urban development has many major problems, but lack of movement in the system is the cause of India's population! The population of urban India, which was 48 crore in 2020, will exceed 95 crore by 2050. Between 1985-2015, the flood-prone population in Indian cities increased by 102 percent due to the boom in construction activities. Because of that, the country is losing 400 crores of wealth per year. A report released by the World Bank Group under the leadership of the Union Urban Development Department has calculated that if proper preventive measures are not taken, the annual loss will reach 3 trillion dollars by 2070. It said that India spends only 0.70 percent of GDP on urban infrastructure and services, which is very low compared to other countries.  It is estimated that by 2050, India's cities will be able to withstand natural calamities only by investing 2.4 trillion dollars. In addition, governments should step up their efforts in solving the shortage of town planners by providing funds, and curbing the encroachment of water resources and corruption in the municipal bodies. Only then will urban India get accustomed to sustainable development and pleasant living!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this regard.