AP High Court: సతీష్‌కుమార్ అసహజ మరణం కేసును మేమే పర్యవేక్షిస్తాం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, అమరావతి: తిరుమల శ్రీవారి పరకామణిలో కానుకల చోరీ ఘటనపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదుచేసిన ఏవీఎస్‌వో (అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్) వై.సతీష్‌కుమార్ అసహజ మరణంపై సీఐడీ దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అభియోగపత్రం దాఖలు చేసేవరకూ కేసును తామే పర్యవేక్షిస్తామని తేల్చిచెప్పింది. ఏసీబీ దాఖలుచేసిన నివేదికల ప్రకారం పరకామణిలో చోరీకి పాల్పడిన సీవీ రవికుమార్ ప్రభుత్వోద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని స్పష్టంచేసింది. ఆయనపై ఉద్దేశపూర్వకంగానే ఐపీసీ 409 (ప్రభుత్వోద్యోగి నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడటం) సెక్షన్ నమోదు చేయలేదంది. ఏసీబీ నివేదిక ప్రకారం రవికుమార్, ఆయన కుటుంబానికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని పేర్కొంది.
చోరీ కేసును నిర్వీర్యం చేసేందుకు నిందితుడు రవికుమార్ తదితరులతో తితిదే అప్పటి అధికారుల, పోలీసులు కుమ్మక్కయ్యారని పునరుద్ఘాటించింది. నిందితుడు రవికుమార్ తితిదేకి ఇచ్చిన ఆస్తులను స్వీకరించే విషయంలోనూ తితిదే అధికారులు, బోర్డు సభ్యులు నిబంధనలను పాటించలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించి ఈ అంశాల విషయంలో ‘చట్ట నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలి’ అని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు, తితిదేకి స్పష్టంచేసింది. దర్యాప్తు తీరుపై సంతృప్తి వ్యక్తంచేసింది. సంబంధిత అధికారులను అభినందించింది.
- మరోవైపు పరకామణిలో కానుకలు లెక్కించేందుకు స్వచ్ఛందంగా వచ్చే భక్తులను అమానవీయ రీతిలో తనిఖీ చేయడాన్ని నిలిపివేయాలని కోర్టు చేసిన సూచనకు తితిదే ఈవో సానుకూలంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. కానుకల లెక్కింపునకు టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న కోర్టు సూచనను పాటించడం సాధ్యం కాదని ఈవో నివేదికలో పేర్కొనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. లెక్కింపు ప్రక్రియలో మర్యాదపూర్వక విధానాన్ని అనుసరించే ఆలోచనలతో ముందుకురావాలని ఈవోకు సూచించింది. అందుకు మరికొంత సమయం ఇస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
- గురువారం జరిగిన విచారణలో ఈవో తరఫు న్యాయవాది శ్రీనివాసబాబా వాదనలు వినిపిస్తూ.. ‘టేబుళ్లను ఏర్పాటుచేసి కానుకలను లెక్కించాలని న్యాయస్థానం చేసిన సూచనను అనుసరించడం సాధ్యం కాదు. ఆర టన్ను బరువున్న హుండీని టేబుల్‌పై బోర్లించడం సురక్షితం కాదు. రోజూ పరకామణిలో 300 మంది భక్తులు కానుకలను లెక్కిస్తారు. వారందరికీ టేబుళ్లు ఏర్పాటుచేయడం సాధ్యం కాదు. తితిదేలో ప్రస్తుత విధానాల్లో మార్పులు తేవాలంటే ఆగమశాస్త్ర పండితులు, తితిదే బోర్డు సభ్యుల ఆమోదం తప్పనిసరి. ఈవో ఒక్కరే నిర్ణయించలేరు. బోర్డులో ఎలాంటి సభ్యులున్నారో మీకు (కోర్టుకు) తెలిసిందే. కోర్టు చేసిన సూచనలను శాశ్వత ప్రణాళిక(ప్లాన్-బి)లో అమలు చేసేందుకు ఈవో చర్యలు తీసుకుంటారు’ అన్నారు. ఈ వాదనలపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. కోర్టు సూచనలను పట్టించుకోకుండా సంప్రదాయాలను సాకుగా చూపుతారా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కానుకలను కింద పోసి, తొక్కుతూ నడవడం సంప్రదాయమా? అని మండిపడ్డారు. లెక్కింపులో అనుసరిస్తున్న ప్రస్తుత విధానం సరైంది కాదన్నారు.
సీఐడీ విచారణతో పాటు తన ఆస్తుల విషయంలో దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ దాఖలుచేసిన అప్పీల్‌పై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ఏదో ఉందని పేర్కొంది. రూ.15 కోట్ల ఆస్తులు తితిదేకి సరెండర్ చేసి మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దుకునేందుకు జరిగిన ప్రయత్నం కేసు కదా అని గుర్తుచేసింది. ప్రస్తుతం రవికుమార్ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం గరువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
రవికుమార్ అప్పీల్‌తో పాటు చోరీ కేసును రాజీ చేస్తూ లోక్ అదాలత్ జారీచేసిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే విషయంపై నమోదుచేసిన సుమోటో వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన విచారణలో రవికుమార్ తరఫు సీనియర్ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు జరపాలని, కేసు నమోదు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారన్నారు. రవికుమార్‌పై తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్నారు. ఇది చిన్న చోరీ కేసని తెలిపారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 04:16 ISTEnglish Translation
AP High Court: We will monitor Satish Kumar's unnatural death case

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Eenadu, Amaravati: Tirumala Srivari The High Court revealed that the CID's investigation into the unnatural death of AVSO (Assistant Vigilance Security Officer) Y. Satish Kumar, who had complained to the police about the gift theft incident in Parakamani, had come to light. In this context, it has been decided that they will monitor the case till the filing of the charge sheet. According to the reports filed by the ACB, it has been clarified that CV Ravikumar, who committed theft in Parakamani, falls under the definition of a government employee. Section 409 of the IPC (criminal breach of trust by a public servant) was deliberately not registered against him. According to the ACB report, it has been stated that Ravikumar and his family have assets beyond their income.
Tithide reiterated that the then officials and the police colluded with the accused Ravikumar and others to defeat the theft case. It has also objected that the officials and board members of Thithide did not follow the rules in receiving the properties given to the accused Ravikumar Thithide. The Supreme Court ordered the DGs of CID and ACB to 'proceed according to the provisions of the law' in these matters. It was made clear to the superiors and Titi that departmental action should be taken against those who violated the rules. Satisfied with the manner of investigation. Appreciated the concerned officials.
- On the other hand, Thithide Evo expressed displeasure over the court's suggestion to stop inhumane checking of devotees who come voluntarily to count donations at Parakamani. The EO expressed its deep displeasure over the statement in the report that it is not possible to follow the court's instruction to set up tables for counting the gifts. It asked the EVO to come up with ideas to follow a civil procedure in the counting process. Giving some more time, the hearing was adjourned to 31st of this month. High Court Judge Justice Gannamaneni Ramakrishna Prasad gave an order to this effect on Thursday.
- In the hearing held on Thursday, Srinivasababa, a lawyer for Evo, argued. It is not safe to roll a six-ton hundi on a table. 300 devotees count the gifts in Parakamani every day. It is not possible to arrange tables for all of them. In order to make changes in the current policies in Tithide, the approval of the Agamashastra scholars and the members of the Tithide board is mandatory. Evo alone cannot decide. You (the court) know what kind of members are on the board. The EO will take steps to implement the suggestions made by the court in the permanent plan (Plan-B)'' he said. The judge reacted strongly to these arguments. Do you use tradition as an excuse to ignore court instructions? He commented bitterly. Is it traditional to walk around trampling down the gifts? They were angry. He said that the current procedure followed in the calculation is not correct.
Thursday, the bench heard the appeal filed by Ravikumar, the accused in the theft case in Parakamani, challenging the order given by the single judge directing the ACB to conduct an investigation into his assets along with the CID investigation. It is said that there is something in this affair. It reminded that the case was an attempt to settle the whole matter by surrendering Rs.15 crore assets to Titi. It has been clarified that interim orders cannot be given in Ravikumar's case at present. The hearing was adjourned to 29th of this month. A bench consisting of Chief Justice Dhiraj Singh Thakur and Justice R. Raghunandan Rao gave an order to this effect on Thursday.
It is known that the bench is conducting a hearing on the Sumoto lawsuit filed on the issue of determining the legality of the order issued by the Lok Adalat compromising the theft case along with Ravikumar's appeal. C. Nageswara Rao, the senior advocate for Ravikumar in the hearing held on Thursday, said that the single judge has issued orders to conduct an investigation and register a case. Requested to refrain from taking hasty action against Ravikumar. They want to stay the orders of the single judge. This is petty theft Kesani said.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 04:16 IST