త్రికరణశుద్ధిగా...

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఓఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న శిష్యుడికి త్రికరణ శుద్ధి అంటే ఏంటన్న సందేహం వచ్చింది. నేరుగా వెళ్లి గురువును అడిగేశాడు. మనసు, మాట, చేత ఒకటవ్వడమే త్రికరణ శుద్ధి అంటే అని చెప్పారు గురువు. వివరించమని అడిగాడు శిష్యుడు. ‘నువ్వు పైకి గురువుగారూ, మీ మూలంగానే జ్ఞానాన్ని పొందుతున్నానంటావు. లోలోపల ఇంకా ఎంతకాలం ఈ చాకిరీ చేయించుకుంటాడో అనుకుంటావు. గురువుకు సేవలు చేయడమే నీ కర్తవ్యమన్నట్లు ప్రవర్తిస్తావు... అంటే నీ మనసులో ఉన్నదొకటి, నాకు చెప్పేదొకటి, చేస్తున్నట్లు కనిపించేది ఇంకొకటి. దీన్ని త్రికరణ శుద్ధి లేకపోవడం అంటారు. ఉండటం అంటే ఏంటో నువ్వే అర్థం చేసుకో’ అని గురువు అనడంతో శిష్యుడికి విషయం బోధపడింది.
ఒక్కమాటలో చెప్పాలంటే త్రికరణ శుద్ధి అంటే అంతఃకరణం శుభ్రంగా ఉండటమే. మనసు స్వచ్ఛంగా ఉంటే మాట మధురమవుతుంది. అది ఎదుటివారి మన్ననలను అందుకుంటుంది. ఇక్కడ కొంతమంది పొరపాటు పడే అంశం ఒకటుంది. ఒక వ్యక్తి నేరం చేయాలనుకుంటాడు, ఫలానా నేరం చేస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తాడు. మూడూ ఒకటయ్యాయని దాన్ని త్రికరణ శుద్ధి అనరు. అది త్రికరణ ఐక్యం మాత్రమే కానీ, శుద్ధి కాదు. మనసు, కర్మ,వాక్కు అనే మూడూ పాపరహితంగా సద్భావంతో కలిసినప్పుడే అది త్రికరణ శుద్ధి అవుతుంది. త్రికరణాలు ఎప్పుడూ ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు.
మన ఆలోచనలే మాటలవ్వాలి, మాటలు చేతలవ్వాలి. అవి ఎల్లవేళలా సమాజానికి మేలు చేయాలి. మనిషి వ్యక్తిత్వపరంగా పరిణతి సాధించాలన్నా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలన్నా, సమాజంలో ఆదర్శపౌరుడిగా నిలబడాలన్నా, జీవితంలో శాంతీ సౌఖ్యం పొందాలన్నా... ఈ త్రికరణ శుద్ధి తప్పనిసరి.
వార్షిక పరీక్షల్లో ఓ విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లోనూ ఎనభైల్లో మార్కులు వచ్చాయి, ఒక్క దాంట్లో మాత్రం పదే వచ్చాయి. కాబట్టి ఆ అబ్బాయి ఫెయిలైనట్లేనంటారు కొంతమంది విద్యార్థులు. అన్ని సబ్జెక్టులూ మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి పాస్ చేసి పై తరగతికి పంపొచ్చంటారు మరికొంతమంది. ఇరువర్గాల వాదన విన్న గురువు ఇలా చెప్పారు... ‘ఒక్క విషపు చుక్క కలిసినా బిందెడు పాలు పనికి రాకుండా పోతాయి. అలాగే సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాలంటే మన వ్యక్తిత్వంలో చిన్న మరక కూడా ఉండకూడదు. అలాగే అన్ని విభాగాల్లోనూ సమాన ప్రతిభ చూపినప్పుడే విద్యార్థి రాణిస్తాడు. ఏ ఒక్కదాంట్లో విఫలమైనా అది సమగ్రమైన విజ్ఞానం అవదు’. త్రికరణశుద్ధిగా శ్రమించినప్పుడే అలాంటి జ్ఞానం అలవడుతుంది.
కొందరికి గొప్ప ఆలోచనలుంటాయి. వాటి గురించి అద్భుతంగా ప్రసంగిస్తారు. కానీ ఒక్కటీ ఆచరించరు. అలాంటివారు ఎప్పటికీ విజేతలు కాలేరు. మనసా, వాచా, కర్మణా తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించారు కాబట్టే గాంధీజీ మహాత్ముడయ్యారు. వ్యక్తిగత, సామాజిక, ఆధ్యాత్మిక జీవితాల్లో త్రికరణ శుద్ధిలేని పనులేవీ స్థిరమైన విజయాలు పొందలేవు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Trinity...

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

OFor a disciple who is studying in an ashram, the triple purification means There was a doubt. He went straight and asked the Guru. The Guru said that the union of mind, word and deed is the triple purification. The disciple asked to explain. 'You are the supreme teacher, you are getting knowledge from your own source. Inside you think how much longer will he do this job. You act as if it is your duty to serve the Guru... That is what you think is one thing, what you say to me is one thing, what you appear to be doing is another. This is called lack of ternary purification. The teacher taught the subject to the disciple as he said, 'You yourself understand what it means to be.'
In a word, Trikarana Shuddhi means to keep the inner body clean. If the mind is pure, the speech will be sweet. It receives forgiveness from others. Here is one point where some people get it wrong. A person wants to commit a crime, not only says that he will commit a certain crime but also shows it by doing it. When all three become one, it is not called trinity purification. It is only triune union, not purification. It becomes trinity purification only when mind, action and speech are sinlessly united with good will. Trinity should never contradict Dharma.
Our thoughts should become words and words should become actions. They should always benefit society. Whether a person wants to mature personally, develop self-confidence, stand as an ideal citizen in the society, get peace and comfort in life... This triple purification is mandatory.
In the annual examinations, a student gets marks in the eighties in all subjects, but only in one subject. So some students say that boy is a failure. He got good marks in all the subjects so he can pass and send him to the upper class. After hearing the arguments of both sides, the Guru said... 'Even if a single drop of poison comes together, the milk of Bindedu will become ineffective. Also, if we want to get a good name in the society, there should not be even a small stain in our personality. Also, a student excels only when he shows equal talent in all the disciplines. It is not comprehensive knowledge if it fails in any one of them'. Such knowledge is acquired only when one works diligently.
Some people have great ideas. They speak wonderfully about them. But not one is practiced. Such people can never be winners. Gandhiji became a Mahatma because he practiced the principles of Manasa, Vacha and Karmana that he believed in. No work without trinity purification can achieve permanent success in personal, social and spiritual life.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :