Loneliness: ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే!

Eenadu icon
By Features Team Updated : 09 Jan 2026 15:01 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తమకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మన అలవాట్లు, ఆలోచనా తీరు, మనస్తత్వమే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒంటరినని భావించే వారిలో ఈ లక్షణాలు ఉంటాయంటున్నారు. 

ఎవరితోనూ చెప్పరు

చాలా మంది తమ భావోద్వేగాలను ఎవరితోనూ పంచుకోకుండా లోలోపలే దాచేసుకుంటారు. తమను ప్రేమగా చూసుకునే కుటుంబసభ్యులు, స్నేహితులతోనూ వారి భావాలను పంచుకోరు. ఇలా చేస్తే ఎదుటివారు ‘నాపై ఇష్టం/నమ్మకం లేదేమో.. అందుకే ఏమీ చెప్పట్లేదు’ అనుకుంటారు. క్రమంగా దూరమవుతారు.

చెప్పకుండానే అర్థం చేసుకోవాలంటారు

‘నన్ను పట్టించుకుంటే, నా ఫీలింగ్స్‌ గురించి చెప్పకపోయినా అర్థం చేసుకో’అని భావిస్తారు. అన్నివేళలా చెప్పకుండా ఎవరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. కోరుకున్నట్లు స్పందించలేకపోవచ్చు. దీంతో నిరాశ, నిస్పృహలే ఎదురవుతాయి. అపార్థాలు మొదలవుతాయి. ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదని, ఒంటరినైపోయానని ఫీలవుతారు.    

గొడవయితే మౌనం

బంధాల్లో కొన్నిసార్లు అసౌకర్యం తప్పదు. మొహమాటాలు, గొడవలు, భావోద్వేగాల్లో వైరుధ్యం సహజమే. అయితే, ఒంటరిగా మిగిలిపోయేవారు వీటిని ఎదుర్కోవడానికి భయపడతారు. మాట్లాడి పరిష్కరించుకునే అవకాశం ఉన్నా మౌనంగా ఉండిపోతారు. దీంతో బంధాలు బీటలువారడం, క్రమంగా దూరం పెరగడం జరుగుతాయి. 

అన్నీ తమ గురించే

ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు నాకూ అలాగే జరిగింది అంటూ.. గతంలోకి వెళ్లి తన గురించే చెప్పుకొంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటివాళ్లు తాము చెప్పింది వినిపించుకోలేదని భావిస్తారు. తమ మాటలకు గౌరవం ఇవ్వట్లేదని అనుకుంటారు. దీంతో మాట్లాడటం మానేస్తారు.

స్పందనపై అతి ఆలోచన

ఎవరైనా ఏదైనా మాట అన్నా, మెసేజ్‌ ద్వారా స్పందించినా.. వాటి గురించే అతిగా ఆలోచించడం, అన్న మాటల్ని పలు విధాలుగా విశ్లేషించడం, ప్రతికూల ఫలితాలనే ఊహించుకోవడం చేస్తుంటారు. దీని వల్ల అనుమానాలు పెరిగి.. బంధాలు దెబ్బతింటాయి. ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందన్నట్లుగా భావించి ఎదుటివారిని దూరం చేసుకుంటారు.  

నిజాయితీగా లేకపోవడం

కొంతమంది ఎదుటివారు బాధపడకూడదని, గొడవలు జరగకూడదని నిజాలు దాచేసి.. మౌనంగా ఉండిపోతారు. అయితే, చెప్పనంత మాత్రాన అవి కనుమరుగవవు. మనిషిలో అసహనాన్ని పెంచుతాయి. ప్రశాంతతనివ్వవు. మాట్లాడితే వచ్చే గొడవల కన్నా ఈ మౌనం బంధాల మధ్య మరింత దూరాన్ని సృష్టిస్తుంది.  

ఒంటరితనం నా తలరాత అనుకోవడం

కొన్ని నమ్మకాలు మనిషి ప్రవర్తనను మార్చేస్తాయి. ‘నేను ఎప్పుడూ ఒంటరిగా మిగిలిపోతాను’అనే నమ్మకం కూడా ఆ కోవలోకే వస్తుంది. కొందరు నా తలరాత ఇంతే అనుకుంటూ ఎవరితోనూ కలవరు. ఎదుటివాళ్లు దూరం పెడతారమోనని, ముందుగానే వీరే దూరంగా ఉండిపోతారు.

ఏం చేయాలి?

పైన పేర్కొన్నవన్నీ ఎదుటి వ్యక్తుల వల్ల వచ్చిన ఒంటరితనం కాదు.. తప్పుడు భావనలు, అలవాట్లతో చేజేతులా తెచ్చుకునే పరిస్థితి. దీనిపై అవగాహన పెంచుకొని, జీవనశైలి, అలవాట్లలో మార్పులు చేసుకుంటే.. పరిస్థితులు మారే అవకాశాలున్నాయి. 

  • మొదట తమ గురించి ఎదుటివాళ్లు ఏం అనుకుంటారనే ఆలోచనను పక్కన పెట్టాలి. లోపలి భావాలను నమ్మకమైన వ్యక్తులకు తెలియజేయాలి. స్నేహితుల్ని, కుటుంబసభ్యుల్ని పలకరించి మాట్లాడాలి. వారితో మాట్లాడితే ఒంటరిననే ఆలోచన రాదు. 
  • సరిపడా నిద్ర, పౌష్టికాహారం, వ్యాయామం రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. ఇవీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుతాయి. స్నేహితులతో కలిసి జిమ్‌కు, వాకింగ్‌కు వెళ్తే బంధం మరింత పెరుగుతుంది. 
  • ఖాళీగా ఉంటే ఒంటరిననే భావనే వస్తుంది. ఆ అవకాశం రానివ్వొద్దు. అలాంటి సమయంలో నచ్చిన పుస్తకం చదవడం, సంగీతం వినడం, గార్డెనింగ్‌ ఇలా ఏదో ఒక పనిలో నిమగ్నమైతే సరి.
  • నలుగురి మధ్య ఉండటం, నలుగురితో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. క్లబ్‌, క్లాస్‌, వాలంటీర్‌గా పనిచేయడం, ఆన్‌లైన్‌ కమ్యూనిటీ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి. అభిప్రాయాలను ఏ బెరుకు లేకుండా చెప్పాలి. 
  • కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి భోజనం చేయడం, షికారుకు వెళ్లడం వంటివి చేస్తుండాలి. అప్పుడు, వీళ్లంతా నా కోసం ఉన్నారనే భావన కలుగుతుంది. ఒంటరిననే ఆలోచన దూరమవుతుంది.
  • అవసరమైతే మానసిక వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మానసిక చికిత్స తీసుకోవడం అనేది బలహీనత కాదు. మంచి భవిష్యత్తు కోసం తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయంగా భావించాలి.
► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 11:30 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ప్రేమికుల రోజు సరదాలా?ఖర్చే లేకుండా రొమాంటిక్‌ అనుభవాలు పొందొచ్చు! ప్రేమికుల రోజు.. కేవలం ప్రేమ జంటలే కాదు, భార్యాభర్తలూ చేసుకోదగ్గ వేడుక. సాధరణంగా ఈ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
  • టెండర్లపై ‘ఏఐ’ నిఘా.. అక్రమాలు, సిండికేట్‌లు ఇకపై కుదరవు! రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సహా అభివృద్ధి పనులు.. ఇలా ప్రభుత్వంలో ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులకు టెండర్లు తప్పనిసరి.
  • విహారయాత్ర సరే.. బడ్జెట్‌ మాటేంటి? నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించడం కష్టమే. అయితే, చేసే ఖర్చుల్లోనే కొంత మొత్తం పొదుపు చేస్తే విహారానికి బడ్జెట్‌ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికి ఏం చేయాలంటే..
  • వద్దన్నా వస్తున్నారు.. యూరప్‌లో ట్రావెల్‌ ఓవర్‌క్రౌడింగ్‌! చాలా దేశాల ప్రభుత్వాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. మా దేశంలో పర్యటించాలని ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. 
  • ‘మని’ ద్వీపకల్పం.. అక్కడ అంతా ఒకే సమూహం గ్రీసులో ఉన్న ఓ మానవ సమూహం తరతరాలుగా అనేక దాడులను ఎదుర్కొని నిలిచింది.
  • పిల్లల్ని కనబోతున్నారా.. మరి వీటి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకున్న యువజంటలతో బంధువులు అనే మొదటి మాట..‘పిల్లల్ని ఎప్పుడు కంటారు? తొందరగా కనేయండి’అని. వైవాహిక జీవితానికి తల్లిదండ్రులు అనే హోదానే పరిపూర్ణత ఇస్తుందని సమాజం నమ్ముతుంది.
  • మాటలెందుకు? మీమ్స్‌ ఉండగా.. జెన్‌ జీ లైఫ్‌స్టైల్‌ ఇదీ! ఎవరైనా బొద్దుగా ఉన్న వ్యక్తి తారసపడితే ‘ఒడియమ్మా బంటీ’ అంటున్నారు.. ఏదైనా పనిని ఆశ్చర్యపరిచేలా వేగంగా చేసినా, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించినా ‘ఫ్లాష్‌మ్యాన్‌’ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటారా? ఇటీవల సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అయినా మీమ్స్‌ అవి.
  • టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్‌ తెలిసుండాలి! అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి.
  • జిప్ కోడింగ్.. గల్లీ దాటని ప్రేమ! గతంలో ప్రేమ కోసం సప్తసాగారాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరమున్నా మొబైల్‌లో మాట్లాడుతూ, వీడియో కాల్స్‌తో నెట్టుకొస్తున్న లాంగ్‌ డిస్టెన్స్‌ ప్రేమలనూ చూస్తున్నాం. కానీ, ఇప్పుడు కాలంతోపాటు యువత ఆలోచనలూ మారుతున్నాయి.
  • గ్రీన్‌లాండ్‌లో స్థలాన్ని కొనలేం.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి! గ్రీన్‌లాండ్‌.. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి భూచట్టాల ప్రకారం.. భూమి అనేది ఇక్కడి ప్రజల సామూహిక వనరు. అందుకే, వ్యక్తిగతంగా ఎవరికీ యాజమాన్య హక్కులుండవు.
  • నదిలో బంగారం.. అదే వారికి జీవనాధారం! హరియాణాలోని యమునానగర్‌ జిల్లాలో బోలి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు.. జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదీలో బంగారం ఉంది.
  • ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల.. వృద్ధుల కోసం వినూత్న ఆలోచన! చందంకి.. గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామం. అన్ని ఊర్లలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇళ్లు, గుడి, బడి అన్ని ఉంటాయి. కానీ, ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
  • పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్‌ నాయిస్‌ ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్‌ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.
  • ఇజ్రాయెల్‌ ఆర్మీలో అందమైన భామలు! Israeli Army: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్‌ ఒకటి. అత్యాధునిక ఆయుధ, సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (IDF) సొంతం.
  • ఇతరుల్ని అర్థం చేసుకునేవారు ఇలా ఉంటారట! మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మరికొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ, చాలా కొంత మందికే ఇతరులను పూర్తిగా చదవగలిగే సామర్థ్యం ఉంటుంది.
  • ఈ ఆలయంలో మొక్కుకుంటే జుట్టు రాలదట! ఏ దేవాలయానికి వెళ్లినా సుఖఃసంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, సంపద పెరగాలని దేవుళ్లకు ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే, జపాన్‌లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, జుట్టు సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు.
  • ఎగిరే గాలిపటం.. మెరుగయ్యే జీవనం! గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం సంప్రదాయం, సరదా మాత్రమే కాదు.. మనుషులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాదు, ఎన్నో లాభాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • అనగనగా ఓ గ్రామం.. అక్కడ ఒకే ఒక్క ఇల్లు! నిర్మానుష్య ప్రాంతంలో కాసేపు ఉండాలంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది, కనుచూపుమేరలో మనుషులే కనిపించని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివసిస్తోంది.
  • బరువు తగ్గాలా? డైట్‌లో ట్రెండ్స్‌ ఇవీ..! బరువు తగ్గాలన్నా, శారీరకంగా ఫిట్‌ ఉండాలన్నా వ్యాయామం తప్పక చేయాల్సిందే. అయితే, డైట్‌ పాటిస్తూ కూడా బరువును నియంత్రణలో ఉంచుకునే వీలుంది. దీంతో వ్యాయామం కుదరని చాలా మంది డైట్‌ పాటిస్తున్నారు.
  • 10 వేల అడుగులా? 45 నిమిషాల వ్యాయామమా? ఏది ఉత్తమం! మన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే వ్యాయామం చాలా అవసరం. ప్రతి రోజు 10 వేల అడుగులు నడవాలి లేదా 45 నిమిషాల వ్యాయామం చేయాలని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి వచ్చే అనుమానం.. ఈ రెండింట్లో ఏది చేస్తే మేలు అని.