Bengaluru: భార్య హత్యకు.. బిహార్లో శిక్షణ

Eenadu icon
By Karnataka News Desk Published : 04 Jan 2026 07:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ‘భువనేశ్వరితో చాన్నాళ్లుగా వేగలోకపోయా. ఆమె తీరుతో విసిగి వేసారి చివరికి కడతేర్చాలనుకున్నా. ఆ క్రమంలోనే తుపాకీ ఎలా ఉపయోగించాలో శిక్షణ పొందా’నని ఆ భర్త బాలమురుగన్‌ చెబుతుంటే విస్తుపోవడం పోలీసు అధికారుల వంతైంది. డిసెంబరు 24న భువనేశ్వరి హత్య నగరాన్ని కుదిపేసింది. కేసు దర్యాప్తు వేళ కీలకమైన విషయాలు వెలుగు చూశాయి. ‘నాకు దూరమైంది. అంతటితో ఊరుకోక మరొకడికి చేరువైంది. ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నా. కడతేర్చడమే మిగిలింది. అందుకే తుపాకీ కాల్చడంలో శిక్షణ పొందా’ అంటూ కేసు దర్యాప్తు చేస్తున్న మాగడి రోడ్డు ఠాణా అధికారులకు మురుగన్‌ వివరించాడు. ‘వెస్ట్‌ ఆఫ్‌ కార్డ్‌’ రహదారిలో ఉంటోన్న భువనేశ్వరిని కడతేర్చడానికి తుపాకీ కొనుగోలు చేయాలని మురుగన్‌ మూడు సార్లు బిహార్‌కు వెళ్లాడట. అక్కడ రెండుసార్లు దళారుల చేతుల్లో మోసపోయి డబ్బు పొగొట్టుకున్నాడు.

మూడోసారి బిహార్‌కు వెళ్లి ‘సరైన వ్యక్తుల’ను కలుసుకుని, నగదు చెల్లించి రెండు ఆయుధాలు కొనుగోలు చేశాడని పోలీసు దర్యాప్తులో తేలింది. ‘వాటిని కొన్నా. పేల్చడం నాకు రాకపోవడంతో పక్షం రోజులు అక్కడే ఉండి తుపాకీ ఎలా కాల్చాలో శిక్షణ పొందా. బెంగళూరుకు తిరిగి వచ్చాక తుపాకీ ఉపయోగించడంలో తడబడతాననే భయంతో తమిళనాడుకు చెందిన సుపారీ కిల్లర్‌తో ఒప్పందం చేసుకున్నా. ఆ వ్యక్తికి రూ.1.50 లక్షలు, ఆ తుపాకీ ఇచ్చా. ఆ కిల్లర్‌ కొద్ది రోజులు ఆమె కదలికలనున గమనించినా హత్యచేయలేక వెనక్కివెళ్లిపోయాడు. ఇక నేనే కాల్చేద్దామని ప్రయత్నించినా కాలేదు. మళ్లీ ఆ సుపారీ హంతకుడిని బతిమాలి రప్పించా. ఈసారి అతడి గురి తప్పలేదు. గుండ్లు ఆమె శరీరంలోకి దూసుకుపోయాయి. అంతా.. నేనే చంపానని అనుకున్నారు. ఆ వ్యక్తి ఎటు పారిపోయాడో నాకు తెలియదు’ అంటూ పోలీసులకు వివరించాడు. మురుగన్‌ అందించిన సమాచారంతో హంతకుడి వేట మళ్లీ మొదలుపెట్టామని సంబంధిత అధికారులు వెల్లడించారు. 

► Read latest Karnataka Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విదేశీ పర్యటన మర్మమేమిటో? [ 17-02-2026] రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై చర్చ కొనసాగుతుండగానే ఎమ్మెల్యేల బృందం విదేశీ పర్యటన ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణంగా మంత్రులకు విదేశీ పర్యటన కొత్తేమీ కాకున్నా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా విదేశాలకు వెళ్లటం..
  • సుబ్బారెడ్డి ఎన్నిక చెల్లదు [ 17-02-2026] చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి ఎమ్మెల్యే ఎస్‌ఎస్‌ సుబ్బారెడ్డి ఎన్నిక చెల్లదని ఉన్నత న్యాయస్థానం సోమవారం ప్రకటించింది. ఇదే సమయంలో ఆ ఎన్నికల్లో ఓడి, రెండో స్థానంలో నిలిచిన భాజపా అభ్యర్థి సి.మునిరాజు ఎన్నికైనట్లు ప్రకటించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.
  • ‘జేఈఈ మెయిన్స్‌’లో సాయితేజం! [ 17-02-2026] బెంగళూరుకు చెందిన ఎ.విష్ణుసాయి తేజ జేఈఈ మెయిన్స్‌ సెషన్స్‌-1 పేపర్‌-1 పరీక్షలో దేశంలో 14వ ర్యాంకు సాధించాడు! విష్ణు సాయి తేజ 99.99 పర్సంటైల్‌తో రాణించాడు
  • ప్రాణం తీసిన చెట్టుకొమ్మ [ 17-02-2026] జీవాలకు ఆకుల కోసం అడవిలో చెట్టెక్కి కొమ్మలు నరుకుతున్న సమయంలో మర్మాంగానికి కొమ్మ తగిలి హేమంత్‌ (27) అనే యువకుడు మరణించాడు.
  • ప్రేమించలేదని.. బీరు సీసాతో దాడి [ 17-02-2026] తన ప్రేమను అంగీకరించడం లేదని ఒక యువతి (23)పై స్వరూప్‌ (26) అనే యువకుడు బీరు సీసా పగులగొట్టి పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం మణిపాల్‌ ఆసుపత్రిలో చేర్పించారు.
  • న్యాయాలయాలకు బాంబు బెదిరింపు [ 17-02-2026] మడికేరి, దావణగెరె జిల్లా న్యాయస్థానాలు, ధార్వాడ హైకోర్టు కార్యాలయాల్లో బాంబులు పెట్టామని వచ్చిన ఈ-మెయిల్‌ కలకలాన్ని సృష్టించింది.
  • ఓరబ్బీ.. ఇది బ్యాడగి డబ్బీ! [ 17-02-2026] బ్యాడగి రకం మిరపకు చక్కని ధర లభిస్తోంది. ‘బ్యాడగి డబ్బీ’ రకం మిరప క్వింటాల్‌ రూ.89 వేల ధర పలికింది. ‘బ్యాడగి కడ్డి’ రకం మిరప క్వింటాల్‌ రూ.69 వేల ధర పలికింది.
  • సాకేత్‌ను గుర్తించేందుకు అమెరికా పయనం [ 17-02-2026] అమెరికా బర్కిలీ సమీపంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేస్తూ అనుమానాస్పదంగా కన్నుమూసిన సాకేత్‌ (22) మృతదేహాన్ని ఇక్కడకు తీసుకువచ్చే అవకాశం తక్కువని ఎమ్మెల్సీ, కర్ణాటకలోని ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఉపాధ్యక్షురాలు ఆరతి కృష్ణ విచారం వ్యక్తం చేశారు.

English Translation

Bengaluru: Training for wife murder.. in Bihar

Eenadu icon
By Karnataka News Desk Published : 04 Jan 2026 07:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Bangalore (Yaswantapura), NewsToday : Bhuvaneshwari has been fast for four years. Tired of her behavior, Vesari eventually wanted to kill her. It was up to the police officers to get upset when the husband Balamurugan said that he was trained in how to use the gun in that order. Bhubaneswari's assassination on December 24 shook the city. During the investigation of the case, important things came to light. "I'm lost. Not satisfied with all that, she reached out to someone else. Decided to tell her wisdom anyway. The only thing left is to do it. Murugan explained to the officials of Magadi Road police station, who are investigating the case, that he got training in shooting a gun. Murugan went to Bihar three times to buy a gun to kill Bhuvaneswari who was staying on the 'West of Card' road. Twice he was duped by brokers and lost money there.

The third time he went to Bihar and met the 'right people', paid cash and bought two weapons, according to police investigation. Buy them. As I did not know how to shoot, I stayed there for a fortnight and was trained in how to fire a gun. Supari from Tamil Nadu made a deal with the killer after fearing that he would hesitate to use a gun after returning to Bengaluru. 1.50 lakhs to that person and give that gun. The killer observed her movements for a few days but was unable to kill and went back. I couldn't even try to burn myself. Let's bring that supari killer to Batimali again. This time he did not miss his target. The shells hit her body. Everything.. They thought I had killed them. "I don't know where that person ran away," he explained to the police. According to the information provided by Murugan, the hunt for the killer has started again. 

► Read latest Karnataka Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

more

  • What is the secret of foreign travel? [ 17-02-2026] While the discussion on the change of leadership in the state continues, the foreign tour of a group of MLAs is attracting interest. Generally speaking, foreign travel is nothing new for ministers, tens of MLAs are going abroad en masse.
  • Subbareddy's election is invalid [ 17-02-2026] The High Court on Monday declared that the election of Chikkaballapura district Bagepalli MLA SS Subbareddy was invalid. At the same time, the judge refused to declare the election of C. Muniraju, the BJP candidate who lost the election and came second.
  • Saitejam in 'JEE Mains' [ 17-02-2026] A. Vishnusai Teja from Bangalore secured 14th rank in the country in JEE Mains Sessions-1 Paper-1 exam! Vishnu Sai Teja scores with 99.99 percentile
  • Tree branch that took life [ 17-02-2026] A young man named Hemant (27) died when he was hit by a branch while he was cutting branches of a tree in the forest for leaves.
  • Hemant (27) died. 17-02-2026] A youth named Swaroop (26) smashed a beer bottle and stabbed a young woman (23) for not accepting his love. The seriously injured victim was admitted to Manipal Hospital for treatment.
  • Courts bomb threat [ 17-02-2026] An e-mail that received bombs in Madikeri, Davanagere District Courts and Dharwada High Court offices has created a commotion. [ 17-02-2026] Badagi variety of chilli is fetching good price. A quintal of 'Badagi Dabbi' type of chili fetched Rs.89,000. A quintal of 'Byadagi Kaddi' chillies fetched a price of Rs.69 thousand. 17-02-2026] Aarti Krishna, MLC, vice-president of Karnataka's NRI Forum expressed regret that the body of Saket (22), who died suspiciously while doing MS at the University of California, near Berkeley, America, is unlikely to be brought here.