
Uttam Kumar reddy: భారాస... జలద్రోహి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో నీటి వినియోగం విషయంలో తెలంగాణకు గత పాలకులే మరణశాసనం రాశారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బేసిన్‌లోని 66%జలాలను ఏపీకి ఇవ్వాలని 2015 నుంచి 2020 వరకు గత పాలకులు అంగీకరిస్తూ వచ్చారన్నారు. ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకునే వరకు తెలంగాణకు 34% జలాలు సరిపోతాయని 2020లో అంగీకరించారని వెల్లడించారు. కృష్ణా బేసిన్ అంశాలపై శనివారం శాసనసభలో ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ‘‘కృష్ణా, గోదావరి బేసిన్లలో మొత్తం లభ్యత ఉన్న 1,050 టీఎంసీల్లో 763 టీఎంసీలు తెలంగాణకే ఇవ్వాలని ఇప్పుడు బ్రిజేశ్ ట్రైబ్యునల్ ముందు శాస్త్రీయంగా వాదనలు వినిపిస్తున్నాం. వచ్చే ఏడాదిలోగా ట్రైబ్యునల్ తుది తీర్పు రాబోతోంది. కాళేశ్వరానికి రూ.89,794 కోట్లు ఖర్చు చేసిన భారాస.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27,513 కోట్లే వెచ్చించి అన్యాయం చేసింది. పదేళ్ల భారాస పాలనలో రూ.17.72 లక్షల కోట్ల బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ.1.83 లక్షల కోట్లు కేటాయించినా ఒక్క ఎకరా కొత్త ఆయకట్టుకు నీరివ్వలేకపోయారు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు 75.2% వెచ్చించిన భారాస.. కృష్ణా బేసిన్‌కు మాత్రం 24.8% ఖర్చు చేసింది. మేము అధికారం చేపట్టేనాటికి గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.40 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు నీటిపారుదల రంగానికి చెందినవే. కృష్ణా బేసిన్, పాలమూరు పథకాలపై అనుమానాలు వ్యక్తం చేసిన కేసీఆర్ సభలో చర్చకు రాకపోవడం దురదృష్టకరం.
90% పనులు చేసినట్లు భారాస అవాస్తవ ప్రచారం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు తీరని అన్యాయం చేసిందే భారాస ప్రభుత్వం. ఈ పథకానికి 2015లో రూ.35,200 కోట్ల నిర్మాణ వ్యయంతో జీవో ఇచ్చి.. ఏడేళ్ల తర్వాత కేంద్ర జల సంఘానికి డీపీఆర్ సమర్పించారు. అప్పటికి ప్రాజెక్టు వ్యయం రూ.55,086 కోట్లుగా చూపారు. ఆలోపు రూ.26,262 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుకు పర్యావరణ, కేంద్ర జల సంఘం అనుమతులు తీసుకురాలేకపోయారు. భూసేకరణలో భాగంగా 39,017 ఎకరాలను సేకరించకుండా పెండింగ్‌లో పెట్టారు. పదేళ్లలో 30-35% పనులు మాత్రమే చేసి 90% పూర్తి చేశామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి(ఈసీ) కోసం నిర్వహించాల్సిన బహిరంగ విచారణను ఎండలున్నాయని చెప్పి రెండుసార్లు వాయిదా వేసిన ఘనత భారాసకే దక్కుతుంది. తీవ్రజాప్యం కారణంగా ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లకు పైగా పెరిగింది. మేం ఈసీని సాధిస్తాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భారాస 11.5% వడ్డీతో రుణం తీసుకొస్తే మేం అధికారంలోకి వచ్చిన తర్వాతే 7% వడ్డీకి రీషెడ్యూల్ చేయించాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.7 వేల కోట్లు వ్యయం చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2 నుంచి 3 టీఎంసీలకు పెంచిన భారాస.. పాలమూరును మాత్రం 2 నుంచి 1.5 టీఎంసీలకు తగ్గించింది. 2013లో ఉమ్మడి ప్రభుత్వం జూరాల వద్ద పాలమూరు పథకాన్ని ప్రారంభిస్తే.. భారాస ప్రభుత్వం మాత్రం శ్రీశైలానికి మార్చి తీవ్ర అన్యాయం చేసింది. భారాస పదేళ్లలో రూ.7,469.38 కోట్లు ఖర్చు చేస్తే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడులాంటి కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు పూర్తయి 8.65 లక్షల కొత్త ఆయకట్టు ఏర్పడేది. రాబోయే మూడేళ్లలో ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయడంతోపాటు 90 టీఎంసీల నీటితో ఒరిజినల్ షేప్‌లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో వినియోగించడంలో భారాస విఫలమైంది. జూరాల కాంప్లెక్స్ నుంచి తెలంగాణకు ఏడాదికి 65.04 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. కానీ భారాస సగటున 41.48 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంది.
హరీశ్‌రావు అబద్ధాల ప్రచారం:కేంద్ర జలమండలి కార్యాలయంలో ఒక విభాగం నుంచి మరో విభాగానికి రాసుకున్న అంతర్గత లేఖను చూపి ఇదే పోలవరం-నల్లమలసాగర్‌కు కేంద్ర జలమండలి ఇచ్చిన అనుమతి అని హరీశ్‌రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. భారాస అధికారంలో ఉన్నప్పుడే కేంద్రం రెండుసార్లు ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపింది. భారాస నేతలు చేసిన చారిత్రక తప్పిదాలను మేం సరిచేస్తున్నాం’’ అని ఉత్తమ్ వివరించారు.
శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి, తాను పర్యటిస్తామని, సదర్‌మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతో పాటు చనాఖా-కోర్ట ప్రాజెక్టును సందర్శించి సమీక్ష నిర్వహిస్తామని ఉత్తమ్ తెలిపారు. చనాఖా-కోర్ట కోసం రూ.70 కోట్లు విడుదల చేశామన్నారు.
తెలంగాణ ఏర్పడకముందు కృష్ణా జలాల్లో ఏపీకి రోజుకు 4.47 టీఎంసీలు వెళ్లేవి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భారాస పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. 2019 జూన్ 28న, 2020 జనవరి 13న కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి ప్రగతిభవన్‌లో సమీక్షలు నిర్వహించి ఏపీకి మేలు జరిగేలా చేశారు. భారాస పదేళ్ల పాలనలో ఏపీకి రోజుకు 13.17 టీఎంసీలు వెళ్లే పరిస్థితి నెలకొంది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని ఆపించాం. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.4.15 కోట్లు కేటాయించాం. కృష్ణా బేసిన్‌లో నీటి వాటాలకు సంబంధించి 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రం ఇస్తే చాలని నాడు భారాస ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాసిచ్చింది. మేం 555 టీఎంసీలు కేటాయించాలని బ్రిజేష్ ట్రైబ్యునల్‌ను అడిగాం. 2024 ఫిబ్రవరిలో, గతేడాది జనవరిలో ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించాం. ట్రైబ్యునల్ ఎదుట కాంగ్రెస్ సమర్థంగా వాదిస్తోందని గతేడాది నవంబరు 19న ఏపీ ప్రభుత్వానికి జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- హంగ్‌లు చేజారొద్దు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ‘చే’జిక్కించుకునేలా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులకు మార్గదర్శనం చేసినట్లు తెలిసింది.
- కరీంనగర్‌లో పవర్‌గేమ్! నగరపాలికల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్, భాజపాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.
- ఫార్ములా ఈ-రేస్ కేసులో పస లేదు ఫార్ములా ఈ-రేస్ కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని ఏసీబీ అధికారులు ఇప్పటికే సీఎంకు పలుమార్లు చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.
- రూ.లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్ది వాటిని వర్తమాన అవసరాలకు తగ్గట్టు పునర్నిర్మించడానికి రూ.లక్ష కోట్ల ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- గుడెబల్లూర్-మహబూబ్‌నగర్ వరకు 4 వరుసలుగా ఎన్‌హెచ్-167 తెలంగాణ, కర్ణాటక సరిహద్దు సమీప ప్రాంతం గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఉన్న ఎన్‌హెచ్-167ని 80 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
- అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు డీవోపీటీ అనుమతి ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూశాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) అనుమతిచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.
- బలాలు.. తారుమారు ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటలు గడవక ముందే హంగ్ ఏర్పడ్డ పురపాలికలు, కార్పొరేషన్లలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.
- ఓటు హక్కున్న పురపాలిక, నగరపాలికల్లోనే ఎక్స్ అఫీషియో నమోదుకు అవకాశం శాసనమండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు తమకు ఓటుహక్కున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో మాత్రమే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
- ఉత్కంఠ రేపి.. భాజపా ఖాతాలోకి.. మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థలో ఓ డివిజన్ ఫలితం ఉత్కంఠ రేపింది. కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా శుక్రవారం అర్ధరాత్రి వరకు 59 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి.
- ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణం మాటేమిటి! ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం పనులపై సందిగ్ధత నెలకొంది. ఈ పనులను కేంద్రం చేపడుతుందా.. లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్తుందా.. అనేదానిపై స్పష్టత రావడం లేదు.
- ‘శత శాతం’ భవతి! ‘ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులందరూ ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.
- గొలుసుకట్టులా ప్రశ్నపత్రాల లీకేజీ..! ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ)లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వర్సిటీ అంతర్గత విచారణ, సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
- కాంగ్రెస్ ఖాతాలో వడ్డేపల్లి జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరింది.
- 93 చోట్ల కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు రాష్ట్రంలోని 123 చోట్ల జరిగిన పురపాలిక, నగరపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 39.8 శాతంతో 15,05,006 ఓట్లు సాధించింది.
- ఇది తిరుగు వసూళ్లపర్వం! ఓ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఓటర్లకు నగదుతోపాటు చీరలను పంచిపెట్టినా ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
- ఒకటో తరగతి నుంచి ఒకటే ఉద్యోగం వరకు.. ఇద్దరిదీ ఒకటే ఊరు.. ఒకటే బడి.. ఒకే కళాశాల.. ఉద్యోగమూ ఒకే శాఖలో.. ప్రస్తుతం కొలువూ కలిసిమెలిసే.
- రాష్ట్ర ప్రజలకు సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
- అంధుల ఏఐజోడు రాత్రుళ్లు కాసేపు కరెంటు పోతే ఇబ్బందిపడతాం. రోజూ తిరిగే ఇల్లు అయినా చీకట్లో నాలుగు అడుగులైనా వేయలేం.
- ఇది కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజల విజయం తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌లకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
- రూ.2,750 కోట్లతో వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న వికారాబాద్-కృష్ణా ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రైల్వేబోర్డుకు చేరింది.
English Translation

Uttam Kumar reddy: Bharasa... Traitor

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Today, Hyderabad: State Irrigation Minister Uttam Kumar Reddy has criticized that Telangana's previous rulers have written the death warrant regarding water usage in the Krishna basin. He said that from 2015 to 2020, the previous rulers agreed to give 66% of the water in the basin to AP. It has been revealed that in 2020 it was agreed that 34% of water will be sufficient for Telangana until the decision of the tribunal is taken. He gave a power point presentation on Krishna Basin issues in the Legislative Assembly on Saturday. "We are now making scientific arguments before the Brijesh Tribunal to give 763 TMC to Telangana out of the total 1,050 TMC available in the Krishna and Godavari basins. The final verdict of the tribunal is coming within the next year. Bharata, which spent Rs.89,794 crores on Kaleswaram, committed injustice by spending only Rs.27,513 crores on Palamuru-Ranga Reddy project. During the ten years of Bharata's rule, Rs.1.83 lakh crore was allocated for the irrigation sector in the budget of Rs.17.72 lakh crore, but not a single acre of new Ayakattu could be irrigated. India has spent 75.2% on projects in the Godavari basin and 24.8% on the Krishna basin. When we came to power, out of Rs.40 thousand crore owed by the previous government, Rs.10 thousand crore belonged to the irrigation sector. It is unfortunate that KCR, who expressed doubts about the Krishna Basin and Palamuru projects, did not come to the discussion in the House.
Bharasa's false propaganda that 90% of the work has been done
The government of Bharasa has done extreme injustice to the Palamuru-Rangareddy lift project. This scheme was given life in 2015 with a construction cost of Rs.35,200 crore. After seven years, the DPR was submitted to the Central Water Board. By that time the cost of the project was shown as Rs.55,086 crore. Rs.26,262 crores have been spent so far. The project could not get approvals from the Environment and Central Water Board. As part of land acquisition, 39,017 acres were left pending without acquisition. Falsehoods are spreading that only 30-35% of the work has been done in ten years and 90% has been completed. India is credited with twice postponing the public hearing for environmental clearance (EC) for the project due to bad weather. Due to severe delay, the cost of the project has now increased to over Rs.80 thousand crores. We will make it easy. For the construction of this project, if India took a loan at 11.5% interest, we rescheduled it to 7% interest only after we came to power. After the formation of our government, we have spent Rs.7 thousand crores. Bharata increased the capacity of Kaleswaram project from 2 to 3 TMC, but reduced Palamuru from 2 to 1.5 TMC. In 2013, the joint government started the Palamuru scheme at Jurala. If India spends Rs.7,469.38 crore in ten years, all the projects in Krishna basin like Kalvakurti, Bhima, Nettempadu will be completed and 8.65 lakh new ayakattu will be created. In the next three years, we will complete all the projects and complete the Palamuru-Ranga Reddy project in its original shape with 90 TMC of water. India has failed to fully utilize the water allotted to Telangana. Telangana has 65.04 TMC of water allocation per year from Jurala complex. But India consumed only 41.48 TMC on an average.
Harish Rao's propaganda of lies:Harish Rao is propagating lies that this is the permission given by the Central Water Board to Polavaram-Nallamalasagar by showing an internal letter written from one department to another in the office of the Central Water Board. The Center has sent back the DPR of this project twice when Bharasa was in power. Uttam explained that we are correcting the historical mistakes made by the leaders of India.
Uttam said that CM Revanth Reddy will visit the joint Adilabad district after the session of the Legislative Assembly, and will visit the Chanakha-Korta project along with the inauguration of the Sadarmat barrage and conduct a review. It is said that Rs.70 crores have been released for Chanakha-Korta.
Before the formation of Telangana, 4.47 TMCs of Krishna waters used to flow to AP per day. After the emergence of Telangana, severe injustice was done to the state during the rule of Bharasa. On June 28, 2019 and January 13, 2020, KCR and Jaganmohan Reddy conducted reviews at Pragati Bhavan and made AP better. During the ten years of Bharasa's rule, 13.17 TMC per day went to AP. Only after we came to power did we stop the work on the Rayalaseema lift scheme. We have allocated Rs.4.15 crores for setting up telemetry system at Pothireddypadu Head Regulator. Regarding the water shares in the Krishna basin, the Indian government has written that out of 811 TMC, only 299 TMC should be given to Telangana. We have asked the Brijesh Tribunal to allocate 555 TMCs. In February 2024, arguments were heard before the tribunal in January last year. Jaganmohan Reddy wrote a letter to the AP government on November 19 last year that the Congress is effectively arguing before the tribunal. us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
Note:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
It is known that CM Revanth Reddy has given guidance to the ministers to go ahead with an armed strategy to 'capture' the municipalities and corporations that have become hung.