రంగుల మిఠాయిలు.. తినాలంటే గుబులు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

అరవిందనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: బేకరీకి వెళ్తే ఆకట్టుకునే రంగుల కేకులను చూస్తూ ఇట్టే కొని తినాలనిపిస్తుంది.. చేసే తీరు.. వాడే రంగులను చూస్తే అమ్మో అనాల్సిందే.. ఆకట్టుకునేందుకు అడ్డదిడ్డంగా రంగులు, రసాయనాలు వాడుతున్నారు. వంటకు ఒకసారి వాడిన నూనెను మళ్లీ, మళ్లీ వాడుతున్నారు. డ్రై ఫ్రూట్ హల్వా, స్టాబ్రెర్రీ కేకు తయారీలో నాసిరకం సరకులు వాడుతున్నారు. నగరంలో పలు బేకరీలు, మిఠాయి దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీలో నిర్వాహకుల నిర్లక్ష్యం, పలు లోపాలు వెలుగు చూశాయి.
తనిఖీలు..
నగరంలో బుచ్చయ్య స్వీట్స్, స్వగృహ, బెంగళూరు బేకరీ, ప్రసాద్ బేకరీ, బన్నీ రాయల్ బేకరీ, సిటీ బేకరీ, యూనివర్సల్ బేకరీలో బుధవారం జరిపిన ఆకస్మిక తనిఖీలో పలు లోపాలు గుర్తించామని ఉమ్మడి అనంతపురం జిల్లా ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలరు దేవరాజ్ తెలిపారు.
నిబంధనలు ఇలా:వంట గదుల్లో శుచి, శుభ్రత మెరుగుపరచుకోవాలి. ఐఎస్‌ఐ అనుమతి కలిగిన రంగులే వాడాలి. నాణ్యత కలిగిన సరకులు బ్రాండెడ్ వస్తువులనే వినియోగించాలని లోపాలు గుర్తించిన దుకాణదారులకు తాఖీదులు జారీ చేశామని వివరించారు.
ఏమి గుర్తించారు
- ఒకసారి వాడిన నూనె నల్లగా మాడిపోయినా మళ్లీ ప్రమాదకర రీతిలో వాడుతున్నారు.
- అధిక మోతాదులో కేకులు, మిఠాయిల్లో ఫుడ్ కలర్ వినియోగిస్తున్నారు.
- నాణ్యత లోపించిన పదార్థాల వినియోగం.
నాణ్యత పరీక్షకు : స్వగృహ బేకరీ:డ్రై ఫ్రూట్ హల్వా, బెంగళూరు బేకరీలో కేకులు, ప్రసాద్ బేకరీలో పాలతో తయారు చేసిన మిఠాయిలు, బన్నీ రాయల్ బేకరీలో స్ట్రా బెర్రీ కేకు
కఠిన చర్యలు తప్పవు..
అనుమతి కలిగిన రంగులు, నాణ్యత కలిగిన సరకులు, వంట గదుల్లో శుచి, శుభ్రత మెరుగుపరచుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలరు దేవరాజ్ తెలిపారు.
► Read latest Anantapur Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అనుచరుడి కబ్జా.. ఆక్రమణలో దర్జా! [ 18-02-2026] అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఖాళీగా ఉన్న ప్రైవేట్ భూములను అమాంతం మింగేస్తున్నారు. ఓవైపు వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నారు.
- అన్నీతానై.. అన్నదానం [ 18-02-2026] ఆయన వ్యాపారవేత్త, డాక్టరేట్ అందుకున్నారు.. నిత్యం అన్నదానం చేయాలన్న తపన ఆయనను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపింది. కర్ణాటక శ్రీక్షేత్రం కైవారం తాత గురుసేవకుడిగా హిందూపురం పట్టణానికి చెందిన డాక్టర్ రవిశంకర్.
- దివ్యాంగులే.. అసాధ్యులు [ 18-02-2026] చీకటిని తిడుతూ కూర్చునేకంటే చిరుదీపం వెలిగిస్తే జీవితమే ప్రకాశవంతం అవుతుంది. వైకల్యం ఉందని కుంగిపోకుండా నమ్మకం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అడుగులేశారు ఆ దివ్యాంగులు.
- అంతుచిక్కని నీటి లెక్కలు [ 18-02-2026] పీఏబీఆర్ కుడి కాలువ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. ఈ కాలువ మొదట్లో 2 కి.మీ వద్ద 630 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా.
- ఎప్పుడు వస్తారో.. ఎక్కడికి వెళ్తారో! [ 18-02-2026] అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులపై పర్యవేక్షణను అధికారులు గాలికొదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. రోజువారీగా కళాశాలకు వస్తున్నారా.. లేదా...
- భార్య కాపురానికి రాలేదని... పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం [ 18-02-2026] రాయదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయం ఎదుట వడ్రవన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు చౌడప్ప మంగళవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
- కుమారుడిపై దాడి.. అడ్డుకోబోయి తల్లి మృతి [ 18-02-2026] కొడుకుపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన తల్లి తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. నాలుగో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు.. గౌసియా (56) కుమారుడు ఇమ్రాన్.
- పవన విద్యుదుత్పత్తిలో మేటి.. సౌరశక్తిలో లేదు సాటి! [ 18-02-2026] పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లా దూసుకుపోతోంది. రాష్ట్రంలో సుమారు 70 వేల మెగావాట్ల సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉండగా..
- సోనాక్షి సత్తా [ 18-02-2026] హిందూపురం పట్టణానికి చెందిన సోనాక్షి చిన్న వయసులోనే అందనంత ఎత్తుకు ఎదిగింది. రెండో తరగతిలోనే జిమ్నాస్టిక్స్‌పై మక్కువ చూపింది. క్రమంగా అదే పట్టుదలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు సొంతం చేసుకుంది.